ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

KABAB SPECIAL VEGETABLE KABAB


వెజిటేబుల్ కబాబ్

కావలసిన పదార్థాలు:
కూరగాయలు (క్యాబేజీ, బీన్స్‌, క్యారెట్)- 2 cups సన్నగా తరిగిన
ఉడికించిన బంగాళ దుంప – 1,
పన్నీర్ – 50 grms
అల్లం, వెలుల్లు – 1 tbsp
పచ్చిమిరపకాయలు – 4
మైదాపిండి – 1 cup
శెనగ పిండి – 1 cup
మిరియాల పొడి – 1tsp‌,
అజినమోటో – 1/2 tsp
బ్రెడ్‌ పొడి – 1/2 cup
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. కూరగాయల ముక్కలకు బంగాళ దుంప, మిరియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు, అజినమోటో చేర్చి అలాగే బ్రెడ్‌ పొడిని కూడా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని ఉండలు చేసి, పొడుగ్గా సాగదీసి, పన్నీర్‌ను నింపాలి. శెనగ పిండి, మైదాపిండిలో నీరు చేర్చి, గరిట జారుగా కలుపుకోవాలి.
3. కబాబ్‌లను ఈ తోపులో ముంచి మరుగుతున్న నూనెలో వేయించాలి. బయటికి తీసి, సగానికి గాటు పెట్టి, మళ్లీ వేయించాలి. నచ్చిన సాస్‌తో సర్వ్ చేయవచ్చు.