ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MERMAID TELUGU POETRY


మత్స్యకన్య

మరువం ఉష ప్రారంభించిన జలపుష్పాభిషేకానికి నావంతుగా ఓ తుమ్మిపువ్వు సమర్పిస్తున్నాను. చలాకీ చేపపిల్ల , అమాయకపు ఆడపిల్ల ఒకటే అనే నా భావవ్యక్తీకరణ ఇది..





అదిగదిగో చేపపిల్ల
తుళ్లి తుళ్లి తిరిగేను
ఇదిగిదిగో ఈ చిట్టితల్లి
కేరింతలతో పరుగులెత్తేను

విశాలమైన సాగరానికి భయపడి
అమ్మ వెనకాలే భయంభయంగా
ఈదులాడేను చేప పిల్ల
చుట్టూ ఉన్న వారిని చూసి
భీతిల్లి, తప్పిపొతానేమొ అని
అమ్మ కొంగట్టుకు తిరిగెను చిట్టితల్లి

ఎన్ని రంగులొ, ఎన్ని అందాలో
ఎంతమంది బంధుమిత్రులో
అని కళ్లు విప్పార్చి పలకరించే చేప పిల్ల
ఎన్ని వర్ణాలో, ఎన్నెన్ని అందాలో ప్రకృతిలో
మనసంతా ఆనందాన్ని పదిలపరుచుకునే చిట్టితల్లి

అందరూ మనవారు కాదని అమ్మ
చెప్పెను జాగ్రత్తలు చేపపిల్లకు
అందరినీ నమ్మకు బుజ్జీ అని అమ్మ
హెచ్చరించెను చిట్టి తల్లికి

తనవారే తనకు శత్రువులా
అని మాటవినక సాగిపోయె చేపపిల్ల
అందరూ మనసున్న మారాజులే
అని నమ్మి మోసపోయే చిట్టితల్లి

అన్నా అని చేరబోయి
సొరచేప నోటచిక్కె చేపపిల్ల
తాళి కట్టించుకుని
కట్నదాహానికి బూడిదాయె చిట్టితల్లి.