loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GROUND NUT IS THE KING OF ALL GRAINS - GIVES CALCIUM PHOSPOROUS IRON ZINC ETC ON USING THIESE GRAINS


పౌష్టిక ఆహారమైన వేరుసెనగ!

కందిపప్పుకు సులువైన ప్రత్యామ్నాయంగా అందరిచేతా వహ్వా అనిపించుకున్న వేరుశెనగవల్ల వంటకాలకు రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. మాంసాహారంలో లభించే మాంసకృత్తులన్నీ అంతే మోతాదులో లభించే ఈ వేరుశెనగ.. గుడ్డుకంటే రెండున్నర రెట్ల మాంసకృత్తులను అధికంగా అందిస్తుంది.
వేరుశెనగలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులతో పాటు.. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్, బోరాన్‌లలు పుష్కళంగా లభిస్తాయి. అంతేగాకుండా వీటిని ఆహారంగా తీసుకోవటంవల్ల విటమిన్‌-ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. అయితే ఇందులో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి కెలొరీలూ అంతే స్థాయిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి.
పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తుల పాత్ర అత్యంత కీలకం. అందుకే పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశెనగను మించి ఔషధం లేదు. అదే విధంగా గర్భిణులకు, పాలిచ్చే తల్లులకూ మాంసకృత్తులు వీటినుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశెనగతో రోగ నిరోధక శక్తి పటిష్టం అవుతుంది.
వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.
బరువు తగ్గేందుకు, ఆర్థరైటిస్ నివారణలో సైతం వేరుశెనగ పప్పు చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ఇది పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతుంది. వీటిలో సుమారు 70 శాతం శాచురేటెడ్‌, 15 శాతం పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉన్నప్పటికీ మోనోఫ్యాట్స్‌ వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఈ పప్పులోని ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పప్పుతోపాటు వేరుశెనగ నూనె కూడా మంచిదే. అయితే ఇందులో కేవలం ‘ఇ’ విటమిన్‌ మాత్రమే ఉంటుంది.
ఎలా వాడాలంటే… ప్రతి రోజూ సుమారు 25 గ్రాముల వేరుశెనగపప్పును ఏదో ఒక రూపంలో పిల్లలకు అందివ్వచ్చు. వీటిలో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి, మోతాదు మించి తీసుకోకూడదు. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ తీసుకోవాల్సిన కెలోరీల్లో కొన్నింటిని మానేసి బదులుగా మాత్రమే వేరుశెనగను ఎంచుకోవాలి. లేదంటే చిన్న చిన్న సమస్యలు తప్పవు. అయితే.. కొంతమందికి వేరుశెనగ పడదు. దీన్ని తిన్నవెంటనే ఎలర్జీ వస్తుంది. అలాంటివారు వెంటనే మానేయడం మేలు. పప్పు మాత్రమే కాకుండా, ఇలాంటివారు వేరుశెనగ నూనె కూడా వాడకపోవటం ఉత్తమం.

SITA FRUIT JACK FRUIT - GOLDEN FRUIT IN ALL FRUITS - OFCOURSE SEASONAL - BUT HEALTHY


అమృత ఫలం “సీతాఫలం

పెరటి మొక్కల్లో శీతాఫలం శ్రేష్టమైనది. అన్ని దేశాలలోనూ విరివిగా దొరికే ఈ పండును గుండె జబ్బు ఉన్నవారు సీజన్‌ ఉన్నంత వరకు తప్పకుండా తింటుంటే.. గుండె సంబందిత సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది.
విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి, చలికాలంలో ఎక్కువగా దొరికే ఈ సీతాఫలం మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో చిన్నా, పెద్దా అందరి నోళ్లలోనూ నీళ్లూరిస్తుంది. ఈ పండును సీజన్ ముగిసేంతదాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమేగాకుండా, ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది.
సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీలవరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాముల.. విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ నాలుగు శాతం, సోడియం పది మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండింటిని తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.
ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతం అవుతాయి. బలహీనత, సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పి విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది. ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది. కుదుళ్లకు దృఢత్వానిస్తుంది.
పేగుల్లో వుండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది. త్రిదోష నివారిణిగా శరీరంలో వుండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.
అయితే.. ఆస్తమా ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలంను తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే మామూలుగా పండిన పండును మాత్రం తింటే ఎలాంటి బాధా ఉండదు. అదే ఎక్కువగా పండిన పండును మాత్రం తిన్నట్లయితే అందులో గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండి, చక్కెర వ్యాధి గ్రస్తులకు ఎక్కువగా హాని చేస్తుంది. అలాగే లివర్‌ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.

POMOGRANATE - DANIMMA FRUIT - CLEANS BLOOD - INCREASE BLOOD CIRULATION - SOMANY ADVANTAGES OF THIS FRUIT EAT DAILY VEST COSTLY FRUIT


రక్తస్రావాన్ని అరికట్టడంలో “దానిమ్మ రసం”

పిల్లల్లో అప్పుడప్పుడు ముక్కునుంచి రక్తం కారుతుంటుంది. అయితే దానికేమీ గాబరా పడకుండా, వైద్యుని వద్దకు తీసుకెళ్లడానికి ముందుగానే నాసికా రంధ్రాల్లో కొన్ని చుక్కల దానిమ్మ రసం వేస్తే సరి. ఇలా చేసినట్లయితే వైద్యుడి వద్దకు వెళ్లేవరకూ రక్తస్రావం కాకుండా ఆపవచ్చు. అలాగే మీ చిన్నారులు డల్‌గా, నలతగా ఉన్నట్లు అనిపిస్తే.. అర గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి ఇస్తే సరిపోతుంది. తేనెలోని సహజసిద్ధమైన ఔషధ గుణాలు పిల్లల శరీరాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చివేస్తాయి.
పెద్దలకు దగ్గునుంచి ఉపశమనం లభించాలంటే… ఆవాలను పొడిచేసి కాసిన్ని నీళ్లుకలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్టులో కాస్తంత తేనె కలిపి తీసుకుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. క్యారెట్, బీట్‌రూట్, టొమోటో, కప్పు నీళ్లు కలిపి గ్రైండ్ చేసి వడగట్టాలి. అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే రక్తవృద్ధి కలుగుతుంది.
దానిమ్మ తొక్కలను ఎండబెట్టి, పొడిచేసి గాలి చొరబడని డబ్బాలో భద్రపరచుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో పావు టీస్పూన్ దానిమ్మ పొడిని కలుపుకుని పరగడుపున తాగాలి. ప్రతిరోజూ ఇలా చేసినట్లయితే రక్తశుద్ధి అవుతుంది. మూత్ర సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

LATEST BRIDAL AND MODERN SEXY TRENDS DRESSES AND SAREES


BEAUTIFUL SAREES IN LATEST FASHION SPECIAL


MODELS WEARING SPECIAL FESTIVAL DESIGNS

KABAB SPECIAL VEGETABLE KABAB


వెజిటేబుల్ కబాబ్

కావలసిన పదార్థాలు:
కూరగాయలు (క్యాబేజీ, బీన్స్‌, క్యారెట్)- 2 cups సన్నగా తరిగిన
ఉడికించిన బంగాళ దుంప – 1,
పన్నీర్ – 50 grms
అల్లం, వెలుల్లు – 1 tbsp
పచ్చిమిరపకాయలు – 4
మైదాపిండి – 1 cup
శెనగ పిండి – 1 cup
మిరియాల పొడి – 1tsp‌,
అజినమోటో – 1/2 tsp
బ్రెడ్‌ పొడి – 1/2 cup
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. కూరగాయల ముక్కలకు బంగాళ దుంప, మిరియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు, అజినమోటో చేర్చి అలాగే బ్రెడ్‌ పొడిని కూడా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని ఉండలు చేసి, పొడుగ్గా సాగదీసి, పన్నీర్‌ను నింపాలి. శెనగ పిండి, మైదాపిండిలో నీరు చేర్చి, గరిట జారుగా కలుపుకోవాలి.
3. కబాబ్‌లను ఈ తోపులో ముంచి మరుగుతున్న నూనెలో వేయించాలి. బయటికి తీసి, సగానికి గాటు పెట్టి, మళ్లీ వేయించాలి. నచ్చిన సాస్‌తో సర్వ్ చేయవచ్చు.

SPECIAL FESTIVAL PANNEER BALLS


పన్నీర్ బాల్స్

కావలసినవి:
పన్నీర్ – 200 grm
ఆలివ్ ఆయిల్ – 4 tsp
నల్ల ఆవాల పేస్ట్ – 1/2 tsp
పొడి చేసిన పిస్తా పప్పు – 1/2 cup
ఛీజ్ – 50 grm
మిరియాల పొడి – 1/2 tsp
టబాస్కో సాస్ – 4 drops
ఉప్పు తగినంత
తయారు చేయు విధానం:
పన్నీర్‌ను చిన్న ముక్కలు చేయాలి. ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి అందులో పనీర్‌ను వేసి 2-3 నిముషాలు వేయించాలి. ఉప్పు, మిరియాల పొడి చేర్చాలి. కిందకు దించి పూర్తిగా చల్లారిన తర్వాత చీజ్, ఆవాల పేస్ట్ టబాస్కో సాస్‌లో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గుండ్రటి బాల్స్‌లాగా చేసుకోవాలి. ఒక్కో బాల్‌నూ పిస్తా పొడిలో దొర్లించి కొద్ది సేపు వుంచాలి. అంతే పన్నీర్ బాల్స్ రెడీ.

VEGETABLE PANNER


మిర్చీ పన్నీర్

కావలసిన పదార్ధాలు:
పన్నీర్ – 250 grm
ఉల్లిపాయలు – 2
క్యాఫ్సికమ్ – 3
టమోటో -2
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 tsp
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమిర – 1/2 కప్పు
పసుపు – 1/2 tsp
కారం – 2 tsp
ఉప్పు – రుచికి సరిపడా
గరం మసాలా – 1 tsp
నూనె – తగినంత
తయారు చేయు పద్దతి:
1. ముందుగా వెడల్పాటి పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి.
2. తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికమ్, టమోటో లు, వేసి మెత్తబడే వరకు నిదానంగా వేయించాలి.
4. ఫైనల్ గా పన్నీర్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేసి కలియ బెట్టి మూత పెట్టి మరో పది నిమిషాలు వేయించాలి అంతే మిర్చీ పన్నీర్ రెడీ.

VEGETABLE SOYA CURRY


వెజిటేబుల్ సోయా పోహ

కావలసిన పదార్థాలు:
అటుకులు – 100 grms
టమోటా – (చిన్నగా కట్ చేసినవి)
ఉల్లిపాయలు – 2(చిన్నగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి – 4
క్యారెట్ – 1/2 cup (చిన్నగా కట్ చేసినవి)
క్యాప్సికం – 1/2 cup (చిన్నగా కట్ చేసినవి)
సోయాబిన్స్ – 1/2 cup (చిన్నగా కట్ చేసినవి)
పోపుదినుసులు – 3 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 tsp
ఉప్పు – రుచికి సరిపడ
కారం – 1 tsp
పసుపు – 1/4 tsp
పచ్చి కొబ్బరి తురుము – 1/4 cup
కొత్తిమిర – 1/2 cup
ఆయిల్ – తగినంత
సోయాగ్రాన్యుమ్స్ – 50grm
తయారుచేయు విదానము:
1. ముందుగా స్టౌ వెలిగించి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి, పోపుదినుసులు, పచ్చిమిర్చి కట్ చేసిన చిన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసి 5 నిమిషాలు పాటు డీప్ ప్రై చేసి కొద్దిగా నీళ్లు వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
2. తర్వాత కారం, పసుపు, ఉప్పు, తర్వాత వేడి నీటిలో నానబెట్టిన సోయాగ్రాన్యుమ్స్ వేసి రెండు నిమిషాల తర్వాత నీటిలో కడిగిన అటుకులు ఒక కప్పు వేసి బాగా కలిపి పక్కకు తీసి పెట్టుకొని దానిని పచ్చికొబ్బరి తురుము, కొత్తిమిరతో గార్నష్ చేసుకుంటే వెజిటేబుట్ సోయా పోహా రెడీ.

MASALA CHILLI CAPSICUM PEPPER


మసాలా బెల్ పెప్పర్

కావలసిన పదార్దాలు:
బెల్ పెప్పెర్(క్యాప్సికమ్)
(గ్రీన్, పర్పుల్, రెడ్, ఎల్లో) – 4
పొటాటో (ఉర్ల గడ్డ) – 1
ఉప్పు – రుచికి సరిపడా
కారం – 2 tsp
దనియా – 2 tsp
పసుపు – 1 tsp
వేయించిన పల్లీలు(వేరుశేనగ పప్పు)-1/4 cup
నిమ్మ రసం – 1 tsp
కొబ్బరి తురుము – 2 tsp
ఆవాలు – 1 tsp
జిలకర్ర – 1 tsp
ఆయిల్ – 2 tbsp
తయారు చేసే విధానము:
1. ముందుగా స్టౌ వెలిగించి పల్లీలు(వేరుశెనగ పప్పు)ను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్(నాలుగు కలర్స్) ను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగా పొటాటోను చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జిలకర్ర వేసి చిటపటలాడకా పొటాటో ముక్కలను అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి.
3. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి, ఇప్పుడు కొద్దిగా కారం, దనియాల పొడి వేసి, గరం మసాలా వేసి మరికొద్ది సేపు ప్రై చేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
4. ఇప్పుడు కొబ్బరి తురుము, పల్లీలు(వేరుశెనగ పప్పు) పొడి మెల్లిమెల్లిగా చల్లి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరగా నిమ్మరసం జత చేసి కలియబెట్టాలి అంతే మసాలా బెల్ పెప్పర్ రెడీ. ఇది చపాతీ, పూరీ, పరోటా లలోకి చాలా రుచిగా ఉంటుంది.

HEALTHY CAPSICUL CHILLI GARAM MASALA RICE


ఆరోగ్యకరమైన క్యాప్సికమ్ మసాలా రైస్

కావలసిన పదార్ధాలు:
అన్నం: 3 cups
ఆయిల్: 1 tbsp
నెయ్యి:1 tbsp
ఆవాలు: 1 tsp
కరివేపాకు: 2 రెమ్మలు
క్యాప్సికమ్: 2 (చిన్న చిన్న గా కట్ చేసి పెట్టుకొన్నవి)
ఉప్పు: రుచికి తగినంత
పచ్చికొబ్బరి తురుము: 1 tbsp
వేరుశనగపప్పు: 1 tbsp
పొడి చేయడం కోసం:
ఎండుమిర్చి: 3
ధనియాలు: 1 tbsp
జిలకర్ర: 1/2 tsp
మినప్పప్పు: 1 tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
వేరుశనగపప్పు: 2 tbsp
నెయ్యి: 11 tsp
తయారు చేయు విధానము:
1. పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక జిలకర్ర, మినప్పప్పు వేయించాలి ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలపాలి, తర్వాత పల్లీలు వేసి వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి.
2. వేడి వేడి అన్నంలో ఈ పొడి మిశ్రమాన్ని కలపాలి.
3. అదే పాన్ లో ఆయిల్ లేద నెయ్యి వేసి వేడయ్యాక అవాలు చిటపటలాడాక, కరివేపాకు వేసి కలపాలి.
4. క్యాప్సికమ్ ముక్కలు వేసి మూడు, నాలుగు నిమిషాలపాటు వేయించాలి. తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొబ్బరిపొడి, వేయించిన పల్లీలు, మసాలా పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి అంతే క్యాప్సికమ్ మసాల రైస్ రెడీ. దీనిని ఏదైనా గ్రేవీ కర్రీ లేదంటే ఉరగాయ, పెరుగు కాంబినేషన్ తో క్యాప్పికమ్ రైస్ ని వడ్డించాలి.

CHRISTAMAS SPECIAL COCONUT CAKE VERY CRISPY


కొబ్బరి కేక్

కావలసిన పదార్దాలు:
మైదా – 30 grm
కొబ్బరి – (టెంకాయలో సగ భాగం)
పంచదార – 50 grm
గుడ్లు – 2
పాలు – 1/2 cup
వెన్న – 20 grm
చెర్రీస్ – 5
బేకింగ్ పౌడర్ – 1/2 tsp
తయారు చేయు విధానము:
1. ఒక గిన్నెలో వెన్న, పంచదారపొడి కలియబెట్టి మిశ్రమంలా తయారు చేయాలి. అందులోనే పాలు, మైదా, బేకింగ్ పౌడర్, పగలగొట్టిన కోడిగుడ్ల మిశ్రమాన్ని కలపాలి.
2. తర్వాత అందులోనే తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి.
3. చిన్న కప్పులకు వెన్నగాని, నెయ్యిగాని రాసి కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని పోసి దీని పైన చెర్రీస్ పెట్టాలి. వీటిని ఓవెన్ లో నూటఎనబై డిగ్రీల దగ్గర ఇరవై నిముషాలు పాటు పెట్టి తీసి చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా వుంటాయి.

HALE BEEDU FORT TEMPLE - ANCIENT HISTORICAL PLACE - LORD GANESH LORD SHIVA ETC RESIDES - MUST VISIT TEMPLE AND BEST TOURIST SPOT IN KARNATAKA INDIA


అహో... హళేబీడు
హళేబీడు, బేలూరుల మధ్య దూరంలో సుమారు ఇరవెై నిమిషాలు వుంటుంది . హాళేబీడు చిన్న పల్లె. దీనిపేరు ద్వారసముద్రం. వంశపు రాజులు ముఖ్యపట్టణం. ఇప్పటికి హళేబీడు హసన్‌కు మధ్యవున్న మార్గంలో ఆనాటి కోట యొక్క శిథిలాలు కనిపిస్తాయి. కన్నడ భాషలో ‘హళె’ అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం.

Holebaహళేబీడులోని ఆలయం విశాల మైదానంలో వుంది. బయట వున్న ప్రాకారం నుంచి లోపల వంద గజాల దూరంలో ఆలయం వుంటుంది. ప్రాకారం దాటి లోపలవున్న ఆలయం దగ్గరకు వెళ్ళడానికి ముందే ఎడమ చేతి వెైపున ఒక యాభెై గజాల దూరంలో చిన్న భవనం పురాత్తవశాఖ వారి ఆఫీసు ఉంటుంది. బేలూరు ఆలయంలాగే ఈ హోళేబీడు ఆలయం కూడా ఆరడుగుల ఎత్తువున్న విశాలమైన వేదికమీద నిర్మించబడింది. ఆలయం మొత్తం అరవెైనాలుగు కోణాలు కలిగి ఉంటుంది. గోడల కింద చుట్టూ వరసగా వివిధ రకాల జంతువులు నాట్యం చేస్తున్న గణేశుడు, తాండవం చేస్తున్న శివుడు, కైలాస పర్వతాన్ని పెైకి ఎత్తాలనుకుంటున్న రావణుడు, ఐరావతం మీద స్వారీ చేస్తూవున్న దేవేంద్రుడు, హంసవాహనం మీద వున్న బ్రహ్మదేవుడు, నాట్య సరస్వతి, దశావతారాలకు సంబంధించిన ఘట్టాలు, శ్రీరాముడు ఒకే బాణంతో ఏడుతాటిచెట్లను పడగొట్టడం, తన తలపెైగా విల్లు ఎక్కుపెట్టి వున్న అర్జనుడు, చిన్ని కృష్ణుని అల్లరి పనులు. 

ఈ విధంగా ఎన్నో చిత్ర విచిత్రములెైన శిల్పాలు పురాణగాథలను తెలిపే శిల్పాలు ఎన్నో వున్నాయి. ఆలయం లోపల శాంతలేశ్వర స్వామి వున్న గర్భగుడి ద్వారానికి రెండుపక్కలా రెండు ద్వారపాల కుల విగ్రహాలున్నాయి. ఇది ఒక్కొక్కటి ఒకేరాతి ముక్కలో చెక్కి నల్లసీసపు రాతి విగ్రహాలు వీటి యొక్క నగిషీ పని ఎంతో అద్భుతంగా వుంటుంది. నదురు మధ్య అగ్గపుల్ల దూరేటంత ఖాళీ వుంచి కిరీటపు సన్నని అంచుకు అతి సూక్ష్మమైన సగిషీ చెక్కారు. ఇది చూస్తే ఇక్కడి శిల్పాలలోని పనితనం, నేర్పు అర్థం అవుతాయి.లోపలవున్న రెండు ఆలయాలకు ఎదురుగా వేరుగా వున్న ఒక్క మండపంలో రెండు నంది విగ్రహాలు వున్నాయి. భారతదేశంలో వున్న నంది విగ్రహాగాలన్నిటిలోనూ, పరిమాణపు లెక్కను బట్టి ఇది అయిదు, ఆరు స్థానాలలో వున్నాయి. ఇందులో ఒకటి కొంచెం పెద్దది. 

Holeaరెండవది చిన్నది. వీటిని నిశితంగా చూస్తే శివుని తాండవ నృత్యం ఏకాక్రగతతో వింటున్నట్లు రిక్కించి వున్న చెవులు, ఆ నృత్యంలోని వీర రసానికి కలిగే ఆవేశపు అనుభూతికి గుర్తుగా వెడల్పుగా సాగిన ముక్కు పుటాలు తనూ వేచి నృత్యం చేయాలి అనే ఉత్సాహం కలుగుతుండగా, తీక్షణంగా వున్న కళ్ళు, నేలకు తన్ని పట్టి పెైకి లేవడానికి సిద్ధపడుతూ వున్న కాలి గిట్టలు చూస్తే శిల్పకారుడి ఊహాశక్తికి నేర్పరితనానికి జోహారులు అర్పించాలి. ఆలయానికి అవతల పక్క విశాలమైన బయట ప్రదేశంలో శిథిలమైన అనేక శిల్పాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఆలయానికి కుడివెైపు మూలగా పురాతత్వశాఖవారి ఆఫీసులో మ్యూజియం వుంది. విరిగిన శిల్పాలను అక్కడ భద్రపరిచారు. విష్ణువర్ధన చక్రవర్తి యొక్క సేనాధిపతి కేతుమల్లుడు అనే ఆయన క్రీశ 1121 సంలో ఆలయం నిర్మాణం ప్రారంభించాడు. 

ఇది పూర్తి అవడానికి 105 సంలు పట్టింది. ‘‘శిల్ప నిర్మాణంలోని ఊహాశక్తికి, నేర్పరితనానికి చాతుర్యానికి హోళేబీడు ఆలయానికి సాటి మరొకటి లేదు’’. ఇది విదేశీ శిల్ప పండితుల అభిప్రాయం. భారతీయ శిల్పుల ఔన్నత్యం నెైపుణ్యం ఎంత అద్వితీయమైనవో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు. ఈ ఆలయాన్ని తప్పక చూడవలసిందే.

Email | Print |

SANKRANTHI FESTIVAL SPECIAL COCO BOBBATTLU


 స్పెషల్ కొబ్బరి బొబ్బట్లు

కావలసినవి:
కొబ్బరికాయ: 2
మైదా: 1/2 kg
బెల్లం లేదా పంచదార: 1/4 kg
యాలకులు: 3
నూనె లేదా నెయ్యి: 100grm
గసగసాలు: 100grms
తయారు చేయు విధానము:
1. కొబ్బరిని తరుముకొని, బెల్లం కూడా తురుముకోవాలి రెండింటినీ ఒక గిన్నెలో వేసి ఉడికించాలి.
2. కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగ పాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి.
3. మైదా పిండిలో నీళ్లు పోసి చపాతీ పిండి మాదిరిగా కలిపి 2 గంటు నాననివ్వాలి.
4. మైదాను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కో దాన్నీ చిన్న పూరీలా ఒత్తి అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి.
5. వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి(బెల్లం ఇష్టం లేని వారు పంచదారా కూడా వాడవచ్చు).

FRIED RICE WITH PANNEEER


పనీర్ ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్ధాలు:
పనీర్ – 2 cup
బాస్మతి బియ్యం – 2 cup
క్యాప్సికమ్ – 1 (చిన్నగా తరిగినవి)
పచ్చిబఠాణి – 1/2 cup
జీడిపప్పు 25 gms
తాజా కొబ్బరి తురుము – 1/4 cup
క్యారట్ తురుము – 1/4 cup
ఉల్లికాడల తురుము – 1/4 cup
చిల్లీ సాస్ – 1 tsp
టొమాటో సాస్ – 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద – 1tsp
గరం మసాలా పొడి – 1/2 tsp
మిరియాలపొడి – 1/2 tsp
ఉప్పు – రుచికి సరిపడా
అజినోమాటో – చిటికెడు
నూనె 50 gms
తయారు చేయు విధానము:
1. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అంగుళం ముక్కలుగా కోసిన పనీర్ ముక్కలు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. బియ్యం కడిగి కాస్త బిరుసుగా(పొడిపొడిగా) వండి పెట్టుకోవాలి.
3. అదే పాన్ లో మరి కొద్ది నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఉల్లికాడల తురుము, క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి.
4. ఆ తర్వాత చిల్లీసాస్, టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా వేపాలి.
5. ఇప్పుడు అందులోనే వేపి పెట్టుకొన్న పనీర్, జీడిపప్పు ముక్కలు, అజినోమాటో, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి. చివరగా తురిమిన కొత్తిమిర, కొబ్బరి కూడా చల్లి 5 నిమిషాలు ఉంచి దింపేయాలి. అంతే ఫన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.

BREAKFAST SPECIAL COCONUT POORI


కొబ్బరి పూరీలు

కావలసిన పదార్ధాలు:
మైదా – 2 cups
గోధుమ పిండి – 1 cup
నూనె – 1 tbsp
తురిమిన కొబ్బరి – 1 cup
పెసర పిండి – 1/2 cup
నూనె – 2 tbsp
కరివేపాకు – 1 tsp
పచ్చిమిర్చి – 2
అల్లం – 1 tsp
కారం – 1 tsp
ఆవాలు – 1 tsp
జీలకర్ర – 1/2 tsp
ఇంగువ – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడ
తయారు చేయు విదానము:
1. ముందుగా మైదా, గోధుమపిండి, నూనె, ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసి అవాలు, కరివేపాకు వేసి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జిలకర్ర, ఇంగువ వేయించాలి.
3. ఇప్పుడు తురిమిన కొబ్బరి, పెసరపిండి, కారం, ఉప్పు, వేసి బాగా వేపి కొద్దిగా నీరు పోసి మళ్ళీ కొద్ది సేపు వేపి స్టౌ మీద నుండి దింపి పక్కన పెట్టుకోవాలి.
4. చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కలిపి పెట్టుకొన్న మైదా, గోధుమ పిండిని కూడా కాస్త పెద్ద ఉండలుగా చేయాలి.
5. ఒక్క పిండి ముద్ద చేతితో వెడల్పుగా చేసి అందులో కొబ్బరి ఉండ పెట్టి మూసేసి పూరీల్లా చేసుకుని వేడి నూనెలో కాల్చాలి. అంతే కొబ్బరి పూరీలు రెడీ అయితే వీటికి పచ్చడి అవసరం ఉండదు. కావలనుకొనే వాళ్ళు ఆలూ తో చేసిన ఫ్రైతో తింటే చాలా రుచిగా ఉంటాయి

BANANA WITH COCONUT ONION CHILLI STUFFING


బనానా స్టఫింగ్

కావలసిన పదార్ధాలు:
పచ్చి అరటికాయలు: 2
కొబ్బరి తురుము: 1/2 cup
పచ్చిమిరపకాయ ముక్కలు: 4
ఎండుమిరపకాయ ముక్కలు: 3
కొత్తిమీర: 1/2 cup
పసుపు: చిటికెడు
ఆవాలు: 1/2 tsp
నిమ్మరసం: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: తగినంత
తయారుచేయు విధానము:
1. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అందులోనే ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి కలిపి ప్రక్కన పెట్టుకోవాలి.
2. అరటికాయలను రెండు అంగుళాల పొడవుగా ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.
3. పై పొట్టు(తొక్క) తీసాక ముక్కలను సగం వరకు నిలువగా కోసి, అందులో కొబ్బరి తదితర పదార్ధాలతో తయారైన ముద్దను కూరాలి.
4. పాన్ లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు వేసి, అవి చిటపట లాడగానే అరటికాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేయాలి అంతే బనానా స్టఫింగ్ రెడీ.

SOUTH INDIAN SEXY ACTRESS Hasika IN DIFFERENT STYLES
Hasika SOUTH INDIAN ACTRESS LATEST UNSEEN PICSSEXY ACTRESS Nikita Rawalloading...