loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

South Indian Banarasi-Georgette-Saree in Green Gold Mixture


MULTI COLOUR BANARASI SAREE


CRAPE BLUE BANARASI SAREE FOR KRISHNA BRIDES


BRIDAL BLUE BANARASI SAREE


BRIDAL GOLD ORANGE BANARASI SAREE


EXTRAORDINARY BENEFITS AND FACTS OF YELLOW BANANAS


HEALTHY BENEFITS OF REGULAR EATING BANANAS


అరటిపండు మనకి సర్వసాధారణంగా అన్ని రోజుల్లోనూ దొరుకుతుంది. అయితే దీన్ని కేవలం శుభకార్యాలకే పరిమితం అనుకుంటే పొరపాటే, ఋతువులతో సంబధం లేకుండా ఏడాది పొడవునా లభ్యమయ్యే ఈ అరటి పండులో పోషక విలువలు చాలా ఉన్నాయి.
ఇందులో 105 కాలరీల శక్తినిచ్చే గుణం ఉంది. విటమిన్‌ బి6, పీచుపదార్దం 3 గ్రాములు, ఫాలెట్‌, పొటాషియం పుష్కలంగా ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక సమస్యల్ని ఎదుర్కునే మహిళలకి ఇది ఎంతో మంచి పౌష్టికాహారం అని చెప్పవచ్చు. ఎంతో మధురంగా ఉండే ఈ అరటి పండుతో మరిన్ని పండ్ల ముక్కలు చేర్చి తీసుకుంటూ ఉంటే, అధిక శాతంలో పొటాషియం లభ్యమయ్యి లోబ్లెడ్‌ ప్రెషర్ని అరికట్టి, రక్తం ప్రసరణ సవ్యంగా జరిగేటట్టు చేస్తుంది. ప్రతి అరటి పండులోను 422 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతుంది. రబ్బరుపాల ఉత్పత్తుల కర్మాగారంలో పనిచేసేవారికి ఆ పాల వల్ల కలిగే అలర్జీకి అరటిపండు ఎంతో దివ్యౌషధం అన్న విషయం ఎంతమందికి తెలుసు! అందుకే పనికిరాని చిరుతిళ్ళు మాని దానికి బదులు అరటి పండ్లు తినడం మొదలు పెట్టండి. సంవత్సరం వచ్చిన చంటిపిల్లలకి కూడా ఆహారంలో అరటిపండుని గుజ్జులా కలిపి పెట్టమని డాక్టర్లు సలహాయిస్తూంటారు.


UNCONDITIONAL HEAD MOVEMENT - HEAD DISORDER - TIPS AND DOCTOR'S ADVISE ON HEAD DISABILITY IN TELUGU


నవీన యుగంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య తలతిరుగుడు. దీనినే వైద్య పరిభాషలో ‘వర్టిగో’ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ఒంటరిగా ఎటు వెళ్ళలేక భయపడుతుంటారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది కాని ఈ సమస్యను అనుభవించే వారి బాధ అంతా ఇంతాకాదు.. ఉదయం నిద్రలేవగానే మొదలవుతుంది. 


ఈ సమస్య నిద్ర నుంచి లేచి పక్కకు తిరిగినప్పుడు, రోడ్డు మీదికి వెళ్ళి నడుస్తున్నప్పుడు, ఆఫీసుల్లో కూర్చుని విధులు నిర్వహిస్తున్నప్పుడు ఉన్నట్టుండి తల తిరుగుతుంది. కొన్ని సందార్భాల్లో తూలిపడిపోవడం కూడా జరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మదన పడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకుంటే ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

కారణాలు:
1. అధిక రక్తపోటు, 
2. చెవి ముక్కు సమసయల వలన, 
3. మెడలోని ఎముకల అరుగుదల వలన., 
4. మెదడుకు అందాల్సిన ఆక్సీజన్‌ పరిమాణం తగ్గడం వలన తలతిప్పుతుంది.

లక్షణాలు:
 • నిద్ర నుంచి లేచినప్పుడు, ఒక పక్కకు తిరిగినప్పుడు ఉన్నట్లుండి తల తిప్పుతుంది.
 • తలతిప్పడంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపిస్తుంది.
 • ఒంటరిగా ఎటు పోవాలన్నా భయంగా ఉంటుంది.
 • కోపం, చిరాకు ఎక్కువగా ఉంటుంది.
 • తేలికగా ఆందోళన చెందుతుంటారు.

 • జాగ్రత్తలు:
 • తలతిప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ద్విచక్ర వాహనాల ప్రయాణం తగ్గించుకోవాలి.
 • ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి.
 • తగినంత విశ్రాంతి కోసం యోగ, మెడిటేషన్‌, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి.
 • సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడిని నివారించుకోవాలి.

  చికిత్స:
  తల తిప్పుడు సమస్య పోవటానికి హోమియో వైద్యంలో మంచి మందులున్నాయి. వ్యక్తి మానసిక లక్షణాలను శరీర లక్షణాలను మరియు వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకొని వైద్యం చేసినా తల తిప్పుడు సమస్యను తగ్గించవచ్చు.

  మందులు:
  కోనియం: 
  తల తిరుగుడు సమస్యకు కోనియం ప్రధానమైన ఔషధం. మంచంలో పడుకొని ఉన్నట్లయితే గది మొత్తం తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తల అటు, ఇటు తిప్పినా కూడా గదిలో వస్తువులు గుండ్రంగా తిరుగున్నట్లుగా ఉంటుంది. అలాగే కదిలే వస్తువులను చూసినా, వర్టిగో సమస్య ఉత్పన్నమవుతుంది. నడిచేటప్పుడు కాళ్ళు తడబడతాయి. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.

  కాకుయలస్‌ ఇండికస్‌ : బస్సు, కారు, రైలు ప్రయాణాలు చేసినప్పుడు వాంతులతో పాటు తలతిరుగుతున్నట్లుగా అనిపించే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
  సైలీషియా : వీరు పైకి చూసినా, కదిలినా, కళ్ళు మూసుకున్నా ‘వర్టిగో’ సమస్యతో తూలుతూ ఉంటారు. వీరు కుడివైపుకి తిరిగి పడుకున్నప్పుడు వర్టిగో సమస్య అధికమవుతుంది. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.ఇలా మందులను లక్షణ సముదాయంను పరిగణలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల వర్టిగో సమస్యను నివారించవచ్చు.


COMB IS THE BEST BEAUTICIAN FOR SHILKY HAIR


కొందరు మహిళలకు జట్టు పొడవుగా ఉండి నిగనిగలాడుతూ ఎంతో అందాన్నిస్తుంది. తోటి ఆడవాళ్ళు కూడా ఈర్ష్య పడే విధంగా ఆకట్టుకుంటుంది. అయితే అందరికీ అటువంటి అదృష్టం కలగదు అని వాపోతూవుం టారు. అందుకు నల్లగా నిగనిగలాడే పొడవాటి కురుల కోసం ఏం చేయాలంటే.. జుట్టు తత్వాన్ని బట్టి దువ్వెన వాడాలని బ్యూటీషన్లు చెబుతున్నారు.

తలను నెమ్మదిగా, నింపాదిగా దువ్వుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీనివల్ల కుదు ళ్ళు గట్టిపడతాయి. అయితే నేటి తరానికి అంత నింపా దిగా దువ్వుకునే తీరిక, ఓర్పు రెండూ వుండటం లేదు. అందుకే దువ్వే కొద్దిసేపైనా సరైన బ్రెష్‌ను ఎంచుకోవాలి. జుట్టు వున్నదానికంటే తిన్నగా కనిపించాలని కోరుకునే వారు వెడల్పాటి బ్రెష్‌ను ఉపయోగించాలి. ఉంగరాల్ని పెంచుకోవాలంటే లీవ్‌-ఇన్‌-కండిషనర్‌ ఉపయోగిం చాలి. అలాగే హెయిర్‌ డ్రయర్‌ కూడా. అయితే దీనిని తరచుగా వాడకూడదు. ఎక్కువుగా ఉపయోగిస్తే జుట్టంతా పొడిబారిపోతుంది. జుట్టు బలహీనంగా లేదా తక్కువుగా వున్నట్లయితే పళ్ళు బాగా దగ్గర దగ్గరగా వుండే బ్రెష్‌ ఉపయోగించాలి. స్ట్రెయిట్‌ జుట్టు ఉన్నట్లయి తే అదృష్టవంతులే. ఎటువంటి బ్రెష్‌ అయినా వాడుకో వచ్చు. జుట్టు ఊరికే చిక్కులు పడేవారు వెడల్పాటి పళ్ళు న్న బ్రెష్‌ వాడాలి. చిన్న చిన్న పళ్ళు మరింత దగ్గరగా వున్న బ్రెష్‌ వాడాలి. జుట్టు చిక్కులు త్వరగా విడిపోయేం దుకు వీలుగా వుండే ఉత్పత్తులు ఉపయోగించాలి. జుట్టు అదుపులో ఉండేందుకు కొద్దిపాటి నూనె అప్లయ్‌ చేస్తుండాలి. జుట్టును లేయర్ల మాదిరి కట్‌ చేసినట్ల యితే, దానిని ట్విస్ట్‌ చేసి, తడిపొడిగా వున్నప్పుడే బన్‌తో రోల్‌ చేసుకోవాలి. డ్రైయర్‌ నుంచి కొంత వేడిగాలితో డ్రై చేస్తే లేయర్లు మరింత స్పష్టంగా అందంగా కనిపిస్తాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇతరులను ఆకర్షించే విధమైన జుట్టు మీ సొంతం అవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. రహస్యం తెలిసిపోయిందిగా ఇంక బ్యూటీపార్లర్‌ ఖర్చుపెట్టకుండా చెప్పింది చేయండి... రెండు విధాలా లాభపడినట్టే!

INTERNATIONAL JEWELLARY FASHION WEEK 2013


అద్భుతమెన రాంప్‌పై వజ్రాలు, బంగారు నగలు తలతలమంటూ మెరిశాయి. గీతాంజలి గ్రూప్‌ అంతర్జాతీయ జువెల్లరీ వీక్‌+2013ను ఢిల్లీలో ఏర్పాటు చేసింది. మహిళలను ఆకట్టుకునే విధంగా రూపొందించిన పలు అభరణాలను మోడల్‌‌స ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను మహిళల సాధికారతకు అంకితం ఇచ్చారు. గీతాంజలి గ్రూప్‌ ప్రపంచంలో అత్యధికంగా 2.5 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీ. భూమి, గాలి, నీరు, అగ్నిని మహిళతో పోల్చుతాం. అంత పవి్త్రంగా ఆభరణాలు తయారు చేస్తున్నామని గీతాంజలి గ్రూప్‌ చెబుతోంది. 18 సున్నితమైన గ్లాస్‌ దీపాలతో ర్యాంప్‌ షోను ఏర్పాటు చేశారు. బాలీవుడ్‌ నటి అమీషా పటేల్‌, మీనాక్షిచోప్రా లాంటి వారు ఈ ర్యాంప్‌ షోలో పాల్గొన్నారు. 2011 మిస్‌ ఇండియా అంకితా శౌరీ గీతాంజలి జువెల్లర్‌‌సకు బ్రాండ్‌ అంబాసిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

loading...