loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SAMANTHA IN TRADITIONAL ROSE-RED MIXTURE SAREE PHOTO STILLS


Heavy Make-up Sruthi Hassan at Yevadu audio Launch Photo Stills.
WHY BREATHING AIR THROUGH NOSE ?మనకు గాలి ఎంతో అవసరం. గాలి లేనిదే క్షణం బ్రతకలేము. గాలే మనకు ప్రాణాధారం. ఈ గాలివల్ల మనకు ఎంతో మేలు కూడా ఉన్నది. మనలాగే జంతువులు, పక్షులు, కీటకాలు, చివరకు మొక్కలు అన్నిటికి గాలి అవసరం. గాలిని పీల్చటాన్నే ''శ్వాసక్రియ'' అని అంటారు కదా! ఈ శ్వాస క్రియ అనేది కొన్ని ప్రాణుల్లో వివిధ విధాలుగా ఉంటుంది. చర్మం ద్వారా గాలిని పీల్చే జీవులు కూడా ఉన్నాయి. మనం ముఖ్యంగా ముక్కు ద్వారానే గాలిని పీలుస్తాం. కొన్ని కొన్ని సమయాలలో నోటిద్వారా కూడా పీలుస్తూ ఉంటాం. గాలిలో ప్రాణ వాయువు ఉన్నది. ఈ ప్రాణవాయువు వాయునాళం ద్వారాఊపిరితిత్తులలోకి చేరుతుంది. మన శరీరం లోపల ఛాతీ భాగంలో రెండు ఊపిరితిత్తులు వుంటాయి. ఇవి టిస్యూలతో తయారు చేయబడిన మెత్తని సంచీ లాంటివి. ఒక్కొక్క దానిలో కొన్ని లక్షల అరలుంటాయి. మనం గాలిని లోనికి పీలుస్తామనుకోండి. ఊపిరి తిత్తులు పెరుగుతాయి. గాలిని వదిలామనుకోండి ముడుచుకుపోతాయి. ముక్కు నుండే వాయునాళం ఉండి ఊపిరి తిత్తులకు కలపబడుతుంది. అందుకే మనం ముక్కుతో గాలిని పీలుస్తుండటం. ముక్కులో రెండు రంధ్రాలున్నాయి కదా! వాటినే 'నాసికా రంధ్రాలు' అంటారు. ఈ రంధ్రాలలో రోమాలు, గ్రంధులు ఉన్నాయి. గ్రంథుల నుండి మ్యూకస్‌ స్రవిస్తుంది. ఇవన్నీ మనం పీల్చే గాలిని వడకడతాయి. అంతే కాక, నాసికా కుహరం ద్వారా లోనికి వెళ్ళేటప్పుడు గాలి వెచ్చబడుతుంది. నోటితో పీల్చినప్పుడు ఇలా జరుగదు. అందుకే గాలిని పీల్చటానికి ముక్కునే వాడుతాం. ఇలా లోనికి పీల్చబడిన గాలి రక్తం ద్వారా శరీరమంతటా వ్యాపిస్తుంది. మనం తిన్న ఆహార పదార్థాలు ప్రాణవాయువు ద్వారా 'ఆక్సీకరణం'
చెందుతాయి. 

EGG IS HEALTHY AND ALSO FOR WOMEN BEAUTY - TIPS FOR USING EGGS FOR BEAUTIFICATION

కొంత మంది తమను తాము ఎగ్‌టేరియన్స్‌గా చెప్పుకుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలున్నందువల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్‌ అయిపోతారు. అంతే కాకుండా గుడ్డును మాంసాహారం అంటారు. కానీ చాలా మంది శాకాహారంగానే భావిస్తున్నారు కాబట్టి శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలుపెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్న పిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేసేవే. ఇది శరీరానికి మాత్రమే కాదు అందానికి కూడా అద్భుతమైన ప్రయోజ నాలను అందిస్తుంది. గుడ్డును ముఖానికి మరియు కేశాలకు అప్లై చేస్తే అనేక బ్యూటీ బెనిఫిట్స్‌తో మీకు ఆశ్చర్యం కలగక మానదు. గుడ్డు చర్మానికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా మొటిమలు మరియు చర్మాన్ని టైట్‌ చేయడంలో, పొడిబారిన మరియు ఆయిల్‌ చర్మానికి అద్భుతంగా పనిచేసి మంచి ఫలితాలను అందిస్తుంది. మొటిమలు, నల్లటి మచ్చలు తొలగిస్తుంది. ఫేస్‌ ప్యాక్‌లలో గుడ్డును చేర్చడం వల్ల ముఖంలో కొత్తమెరు పులు తీసుకొస్తుంది. అలాగే కేశాలు కూడా అద్భుతమైన ప్రయోజ నాలను కలిగి స్తుంది. దీన్ని నేచురల్‌ కండీషనర్‌ గాను మరియు కేశాలకు మ్రుదువుగా మార్చడానికి మరియు షైనింగ్‌ పెంచు కోవడానికి సహజయంగా కేశ సౌందర్యాన్ని పెంపొందించు కోవడానికి గుడ్డును ఉపయోగి స్తారు. మరి గుడ్డులోని మరిన్ని బ్యూటీ బెనిఫిట్స్‌ ఏంటో ఒకసారి చూద్దామా..

లి అయిల్‌ స్కిన్‌ : ఆయిల్‌ స్కిన్‌ పోగొట్టడంలోబాగాసహాయ పడుతుంది. గుడ్డులోని తెల్లసొనను శాండిల్‌ ఉడ్‌ పౌడర్‌ లో మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల జిడ్డు వదిలిపోతుంది.లి మొటిమల నివారణ: మొటిమ లను నివారించ డంలో అద్భుతం గా పనిచేస్తుంది. ఎగ్‌ వైట్‌ ఫేషియల్‌ మసాజ్‌ చర్మ రంధ్రాలను టైట్‌ చేసి మొటిమలను నివారిస్తుంది. లి చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. గుడ్డును పెరుగుతో మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది. మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. లి సన్‌టాన్‌: ఇది మరో బ్యూటీ బెనిఫిట్‌. గుడ్డును తేనె మరియు నిమ్మరసంతో మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల సన్‌ టాన్‌ మరియు డార్క్‌ స్పాట్స్‌ను తొలగించి మిమ్నల్ని అందంగా ఉంచుతుంది. లి హెయిర్‌ మాయిశ్చరైజర్‌ : మీ కేశాలను సుతిమెత్తగా మరియు ఆరోగ్యంగా నిర్వహించాలంటే గుడ్డును ఉపయోగించాల్సిందే. కేశాలను సున్నితంగా మార్చుతుంది. ఒత్తుగా, మంచి మెరుపుతో ఉంటుంది. లి చుండ్రు నివారణకు : కేశ సంరక్షణలో చుండ్రు ప్రధాన కారణం,చుండ్రుకు గుడ్డుతో ట్రీట్మెంట్‌ చేయవచ్చు. గుడ్డును తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవడం వల్ల చుండ్రు వదిలిపోతుంది. లి జుట్టురాలడాన్ని అరికడుతుంది : గుడ్డుతో హెయిర్‌ప్యాక్‌ వేసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. తలలోని చర్మ సమస్యలను, దురద, మొటిమలను నివారిస్తుంది. గుడ్డు నిమ్మ, హెయిర్‌ ఆయిల్‌తో మిక్స్‌ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. హెయిర్‌ ఫాల్‌ తగ్గుతుంది. లి కేశాల జిడ్డును తగ్గిస్తుంది.: వేసవిలో చాలా వరకూ మన కేశాలు జిడ్డుగా మారతాయి. మరియు చిక్కుకూడా ఎక్కువే. ఈ రెండు సమస్య నివారణకు గుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. నల్లటి వలయాలను పోగొడుతుంది: ఎగ్‌ వైట్‌ను బాగా గిలకొట్టి కళ్ళకింద అప్లై చేయాలి. ఇది తడి ఆరిన తర్వాత తిరిగి మరోసారి అప్లై చేసి అదీ ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు అలాగే కీరదోసముక్కలను కూడా కళ్ళమీద పెట్టుకోవడం వల్ల డార్క్‌సర్కిల్స్‌ తగ్గిస్తుంది. 


WOMEN EAR RINGS IS A ITEM FOR HEALTH NOT FOR BEAUTY

చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్ళకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సంప్రదాయం అని చాలా మంది అను కుంటారు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. అసలిది కేవలం అందం కోసం పుట్టిన సంప్రదాయం అంతకంటే కాదు. చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుడు రాదు. చెవికి, కంటికి సంబంధం ఉందని మనకు తెలుసు. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. మొదట కంటిచూపును మెరుగుపరచుకోవడం కోసమే చెవులు కుట్టించుకోవడం అనే సంప్ర దాయం ఏర్పడింది. అలా చెవులకు రంధ్రాలు అయిన తర్వాత వాటికి ఆభరణాలను పెట్టుకోవ డం అనే ఆచారం ఆరంభమయింది. అందువల్లనే పూర్వం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టించుకునేవారు. ఎక్కువ మంది చెవికి అడుగుభాగంలో కుట్టించుకుంటారు. మరికొందరు చెవికి క్రింది భాగంలోనే కాకుండా పైన, పక్కన అనేక భాగాల్లో కూడా కుట్టించుకుంటారు. ఇంకొందరు ముక్కుకు రంధ్రం పెట్టించుకుంటారు. 'ఇవన్నీ కూడా ఆరోగ్యరీత్యా ఏర్పడిన సంప్రదా యాలే. ఆయుర్వేదం, హౌమియోపతి, అలోపతి ల్లాగే ఆక్యుపంక్చర్‌ ఒక వైద్య విధానం. అయితే ఈ పేరుతో, ప్రస్తుత పద్ధతిలో కాకున్నా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చికిత్స ఉండేది. 


అందులో భాగమే చెవులు, ముక్కు కుట్టించుకునే పద్ధతి. ఇంకా లోతుగా చెప్పాలంటే... చెవికి, కళ్ళు, ముక్కు, పళ్ళులాంటి ఇతర అవయవాలతోనూ సంబంధం వుంది. ముఖంలోని అనేక ఇతర అవయవాలకు చెవి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుకనే పన్ను పీకేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా వినికిడి శక్తి తగ్గుతుంది. ఒక్కోసారి విషజ్వరం లాంటి అనారోగ్యాలు సోకినప్పుడు చెవికి ఇబ్బంది కలుగుతుంది. కొందరికి కొంత వినికిడి శక్తి తగ్గవచ్చు. ఇంకొందరికి బ్రహ్మచెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవులు కుట్టించుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉబ్బసం, మూర్చ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను చెవులు కుట్ట డం ద్వారా నివారించవచ్చు. శరీరంలోని ఇతర అవయవాలకు, చెవికి ఇంత అవినా భావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీ,పురుషులందరూ చెవి కుట్టించుకునేవారు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మొదలై, అందచందాలు తీసుకొ స్తోంది. ఆరోగ్యం కోసం చెవులు కుట్టించు కోవడం మొదలయ్యాక బంగారం, రాగి లాంటి లోహాలతో చెవి దుద్దులు, లోలకులు తయారుచేయించుకుని ధరిస్తున్నారు. 

SUMMER GONE - BUT STILL HOT WEATHER IS GOING ON - TAKE BUTTERMILK AS REMEDY TO HOT
ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడికి తట్టుకోలేక మనకు వడ దెబ్బ తగులు తుంది. పసివాళ్ళు, ముసలివాళ్ళు దీనికి గురవుతారు. కొందరు చనిపోతుం టారు కూడా! మన శరీరంలో చాలా నీరు ఉంటుంది ఇది చెమట రూపంలో బయటికి పోతుంది. దానితోపాటు ఉప్పు కూడా పోతుంది. అందువల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఒళ్ళు కాలిపోతుంది. తెలివి తప్పి పడిపోతారు దానినే వడదెబ్బ అంటారు. ఇది చాలా అపాయం మొదట శరీరం వేడి తగ్గించాలి. దెబ్బతగిలిన మనిషిని నీడలో పడుకోబెట్టి ఒంటిమీది గుడ్డలు తీసి, తడి గుడ్డతో మాటి మాటికి తుడవాలి. గాలి విసరాలి. వేడి తగ్గేందో లేదో నిమిష నిమిషాకి చూడాలి. తేలివ వచ్చేదాకా ఏమి తాగించకూడదు. ఎండా కాలంలో మంచి నీళ్ళు బాగా తాగాలి. ఉప్పు కలిపిన గంజినీళ్లు నీరు మజ్జిగ తాగితే మంచిది ఎండకు కొందరికి బలహీనంగా ఉంటుంది. వీకి ఉప్పు, పంచదార కలిపి నీరు తాగడం మంచిది. సాధార ణంగా ప్రతి వ్యక్తికి శరీరం యొక్క 98.6 డిగ్రీ లకు కొంచెం ఇటు అటుగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వాతవరణంలో మార్పుల వల్ల కూడా సంభవిస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం లేదా తగ్గడం వల్ల పలు ఆరోగ్య సమ స్యలు ఎదుర్కొవలసి వస్తుం ది.కనుక శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచు కోవాలి.

బాడీ హీట్‌ తగ్గాలంటే ...

ఇది స్ట్రెస్‌కు కారణం కావచ్చు. ఇది దానంతట అది తగ్గదు. ఎందుకంటే శరీరంలో అనేక హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉదా: అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. వేడి కలిగించే ఆహారం తీసుకోవడం వల్ల, నీరు అతి తక్కువగా తాగడం వల్ల బాడీ హీట్‌కు కారణాలు. కాబట్టి శరీరాన్ని తేమగా ఉంచుకోవడం చాలా అవసరం. అధికంగా నీరు తాగడం, శరీరంలోని టాక్సిన్‌ మలినాలు విషాలను తొలగించండి. శరీరాన్ని చల్లగా వుంచు తుంది. హెల్త్‌ మరియు కూలింగ్‌ ఫుడ్‌ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ శరీరంలో వేడి తగ్గించుకోవచ్చు. 

TIPS FOR CLEANING CLOTHES WITH NIMBO - TRADITIONAL WAY IN TELUGUబట్టలపై మొండి మరకలను వదలగొట్టడానికి మార్కెట్‌లో రకరకాల స్టెయిన్‌ రిమూవర్‌ లిక్విడ్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే అవి ఖర్చుతో కూడినవి అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే
ఉంటుంది. బట్టలపై పడే మరకలను తొలగించడానికి ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి కొన్ని మొండి మరకలు అంత త్వరగా వదలవు. సిరా, రక్తం, కాఫీ మరియు రస్ట్‌ మరకలు మొండి మరకలు. వీటిని తొలగించేటప్పుడు ఈ క్రింది చిట్కాలను పాటించి చూడండి. అయితే ఒకమరకపై పనిచేసిన చిట్కా మరొక రకమైన మరకపై పనిచేయక పోవచ్చు.
ముఖ్యంగా స్త్రీల విషయంలో రుతుక్రమంలో రక్తపు మరకలు కొత్త బట్టలు. లేదా ఇష్టమైన బట్టల మీద పడితే చాలా బాధ పడుతుంటారు. ఇంక వాటిని
ఉపయోగించడానికి వీలు పడదని డిసైడ్‌ అయి పోతారు. రక్తపు మరకలు పసుపు పచ్చ వర్ణంలోనికి తిరిగి మొండి మరకగా ఏర్పడుతుంది. ఈ మరకను వదలగొట్టాంటే సాధ్యపడదు.అటువంటప్పుడు మేము కొన్ని సులభ చిట్కాలు అందిస్తున్నాం.రక్తపు మరక ఏర్పడ్డ వెంటనే వీటిని ఉపయోగించినట్లయితే రక్తపు మరకలు త్వరగా వదిలించుకోవచ్చు. రక్తపుమరకులు తడి ఆరిపోతే వదిలించుకోవడం చాలా కష్టం. మరి ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం.
ఉప్పు: దుస్తులమీద రక్తపు మరకలు ఏర్పడ్డ వెంటనే ఆ దుస్తులను ఉప్పు వేసిన నీటిలో నానబెట్టుకోవాలి.
ఉప్పు రక్తపుమరకను లైట్‌గా మార్చి సులభంగా మరక వదిలేదా చేస్తుంది.
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌: నాన్‌ టాక్సిక్‌ కెమికల్స్‌లో నానబెట్టాలి లేదా హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ రెండు మూడు చుక్కలు నీటిలో వేసి మరకలున్న దుస్తులను అందులో నానబెట్టిన తర్వాత శుభ్రం చేస్తే మరకలు వదిలి పోతాయి.

డిటర్జెంట్‌ బార్‌: డిటెర్జెంట్‌ సోపులను ఉపయోగించడం వల్ల కూడా రక్తపు మరకలు సులభంగా పోగొట్టవచ్చు. మరకలు వదిలించడంలో డిటర్జెంట్‌ పౌడర్లు పని చేయకపోతే డిటర్జెంట్‌ సోపులను ఉపయోగించి, వేడి నీళ్ళ సహాయంతో అతి సులభంగా తొలగించ వచ్చు.

చల్లటి నీళ్ళు: రక్తపు మరకలు అప్పుడే పడిఉంటే, వెంటనే చల్లటి నీటిలో ఆ దుస్తులను నానబెట్టిన తర్వాత మరకల మీద ఉప్పు వేసి బాగా రుద్ది శుభ్రంచేయడం వల్ల మరక వదిలిపోవడమే కాకుండా దుస్తుల యొక్క రంగు మారదు.
బేకింగ్‌ సోడా: చాలా వరకు దుస్తులను శుభ్రపరచడానికి బేకింగ్‌ సోడాను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.కాబట్టి ఫాబ్రిక్‌ క్లోత్స్‌ను ఉతికేటప్పుడు బేకింగ్‌ సోడాను
ఉపయోగించడం వల్ల దుస్తుల మీద మెండి మరకలు వదలడంతో పాటు, కలర్‌మారకుండా సహాయ పడుతుంది.

నిమ్మ:ఇది మరొక క్లీనింగ్‌ ఏజెంట్‌. దీన్ని నేచురల్‌ బ్లీచ్‌గా ఉపయోగిస్తారు. రక్తపు మరకలున్న చోట ఉప్పు మరియు నిమ్మతొక్కతో రుద్దడం వల్ల మరకలు సులభంగా తొలగిపోతాయి.

MULLANGI - RADISH - MASALA FRY CURRY


కావలసిన పదార్థములు:ముల్లంగి:2 ఉల్లిపాయలు : 3, పచ్చిమిర్చి : 2, టమాటాలు : 4, పసుపు: చిటికెడు, అల్లం,వెల్లూల్లిముద్ద : 1స్పూను, మసాలా పౌడర్‌ :1/4 స్పూను, నూనె: తగినంత కరివేపాకు: కొద్దిగా, కొత్తిమీర: 1కట్టు,ఉప్పు: తగినంత, కారం: 1స్పూను

తయారు చేయు విధానము: ముందుగా ముల్లంగిని శుభ్రంగా కడిగి ముక్కలు తరగాలి. ఉల్లిపాయుల, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా తరగాలి. బాణలీలో నూనె మరిగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు మగ్గించి, అల్లం, వెల్లూల్లి ముద్ద వేసి బాగావేగాగ ముల్లంగి ముక్కలు,ఉప్పు, పసుపువేసిి సన్నని సెగమీద మగ్గించాలి. తరువాత కారం వేసి టమాట ముక్కలు వేసి బాగా మగ్గినాక కొద్దినీరు పోసి దగ్గర పడ్డాక మసాలా పౌడర్‌ వేసి కలియబెట్టి దించాలి. 

WINTER TIPS ON ROSY LIPS - SECRET BEAUTY TIPS FOR LOVE LOCK LIPSమృదువుగా, అందంగా ఉండే పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అయితే పెదాలు తడిగా ఉండేందుకు అక్కడ నూనె గ్రంధులేవీ ఉండనం దువల్ల అవి తరచు పొడిగా మారుతుంటాయి. పెదాలను నాలుకతో తడిచేసుకోవడం చాలా మందిలో మనం గమనిస్తున్నదే. కాని అలా చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. చలికాలంలో చర్మం పొడిగా మారి చాలా చోట్ల పగుళ్లు ఏర్పడడం, చిట్లిపోవ డం జరుగుతుంది. పెదాలు చిట్లిపోయి రక్తం కూడా కారు తుంది. పెదాలు చిట్లిపోవడానికి చాలా కారణాలు ఉం టాయి. విటమిన్ల లోపం, శరీరంలో నీటి నిల్వలు తగ్గిపో వడం, వాతావరణ మార్పులు ఇందులో ముఖ్యమైనవి.

చలికాలంలో పెదాల సంరక్షణకు తీసుకోవలసిన సూచనలు ఇవి: పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడిచేసుకోవద్దు. అలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమన ఉంటుంది. కాని తడి ఆరిన తర్వాత నొప్పి అధికం అవుతుంది.బాగా నీరు తాగాలి. కనీసం రోజుకు పది గ్లాసుల నీరు తాగాలి.,చవకరకం లిప్‌స్టిక్స్‌ వాడవద్దు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్‌ ఇ ఆయింట్‌ మెంట్‌ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి.,కలబంద రసాన్ని పూయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది., కీరా ముక్కను పెదాలపై రాయడం వల్ల పెదాలు మృదువుగా ఉంటాయి.,రాత్రుళ్లు పడుకునే ముందు పెదాలపై పేరుకుని ఉన్న నెయ్యి రాయడం వల్ల ఉదయానికి పెదాలు మృదువుగా, మెరుస్తూ కనపడతాయి. ఆలివ్‌ ఆయిల్‌ను రాయడం వల్ల కూడా పెదాల పగుళ్లు తగ్గుతాయి. 


ACTRESS DISHAW PANDEY IN COLOURFUL PEACOCK TYPE TRADITIONAL WEAR


loading...