ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HAPPY BHAI DOOJ FESTIVAL ON 25-10-2014


25-10-2014, శనివారం, కార్తీక శుద్ధ విదియ, యమద్వితీయ, భగినీహస్తభోజనం

భగినీ అంటే తోబుట్టువైన స్త్రీ అంటే అక్క లేదా చెల్లి అని అర్ధం. సనత్కుమార సంహితలో ఈ యమ ద్వితీయ, భగినీహస్తభోజనం విశేషాలు చెప్పబడ్డాయి. సూర్యునికి ఇద్దరు భార్యలు ఛాయా, ఉష. సూర్యునకు ఛాయాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. యముడి చెల్లెలు యమున. యమునా దేవి ప్రతిరోజు తన ఇంటికి వచ్చి విందు భోజనం చేసి వెళ్ళమని యముడిని ప్రార్ధిస్తూ ఉండేది. యముడికి తీరికలేక - ఎన్నోసార్లు వస్తానని చెప్పినా వెళ్ళలేదు. ఒకనాడు చెప్పకుండానే తన కుటుంబంతో కలిసి యమున ఇంటికి వెళ్తాడు. ఆ రోజే కార్తీక శుద్ధ ద్వితీయ.

చెల్లులు మహానందంతో అన్నకు, ఆయన కుటుంబానికి రుచికరమైన విందుభోజనం పెట్టింది. సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. యమున "అన్నా! ప్రతిసంవత్సరం ఇదే విదియ నాడు నా ఇంటికి వచ్చి, నా చేతి వంటలు స్వీకరించి, నన్ను దీవించాలి. అంతేకాదు, ఈ కార్తీకశుద్ధవిదియ నాడు ఎవరు సోదరిహస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొండకూడదు" అని అర్ధించింది. యముడు "తధాస్తు!శుభమస్తు! " అని అనుగ్రహిస్తూ "అమ్మా!ఈ దినం ఎవరు యమునా నదిలో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం చేసి, తన సోదరిని గౌరవించి, ఆమె చేతి భోజనం చేస్తారో వాళ్లు ఎన్నటికి నరకద్వారాన్ని చూడరు" అని అంటాడు.

కనుక కార్తీకశుద్ధవిదియ రోజున సోదరి ఇంట భోజనం చేసినవారు పరలోకంలో సుఖిస్తారని, ఏ సోదరి తన సోదరునికి ఈ రోజున భోజనం పెడుతుందో, అన్నను గౌరవిస్తుందో, ఆమె దీర్ఘసుమంగళిగా ఉంటుంది. ఇదే రోజున 'భ్రాతృ ద్వితీయను కూడా చేస్తారు. పేరు తేడా తప్ప మిగితాది అంతా అదే పద్ధతి. భ్రాతృ ద్వితీయలో సొదరి తన సోదరులకు నూతనవస్త్రాలిచ్చి గౌరవిస్తుంది. యమద్వితీయలో సోదరుడు సోదరికి వస్త్రాభరణాలు ఇచ్చి దీవిస్తాడు.

సోదరీసోదర ప్రేమలను కలకాలం నిలిపేందుకు,బంధాలను మెరుగుపరిచేందుకు ఇది ప్రతీక. అన్న చెల్లెలి అభుదయాన్ని, సౌమాంగల్యాన్ని, చెల్లులు అన్న శ్రేయస్సును, దీర్ఘాయువును ఆకాంక్షించే పవిత్ర పర్వదినం - ఈ పండుగ.