ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI KALAHASTESWARA SATAKAM POEMS AND MEANING


శ్రీకాళహస్తీశ్వర శతకము....ధూర్జటి.
.
అంతా మిధ్య తలంచిచూచిన నరుం / సట్లౌటెరింగిన్ సదా
కాంతల్పుత్రులు నర్థముల్ తనువు ని / క్కంబంచు మోహర్ణవ
భ్రాంతింజెంది చరించుగాని,పరమా / ర్థంబైన నీయందు దా
చింతాకంతయు చింతనిల్పుడు కదా / శ్రీకాళాహస్తీశ్వరా!
.
శ్రీకాళాహస్తీశ్వరా!మానవుడు పుట్టుట,చచ్చుట మొదలగు చేష్టలచే ప్రపంచమంతయు మిష్యారూపమైన మాయాని తెలిసి కూడ,అశాశ్వతమగు భార్యాపుత్రులయందు మోహమును విడనాడక సంచరించును.కాని ముక్తిని ఇచ్చెడు నీయందు చింతాకాంతయైనను మనస్సును లగ్నముఁచేసి సంచరించడు గదా?