loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IMPORTANCE OF SRAVANA MASAM MANGALA GOWRI VRATHAM


‘శ్రావణ మాసం’ మంగళ గౌరీ వ్రతం
భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి
పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి “అన్నా!మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే “మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు – అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

BEET ROOT CONTROLS THE BLOOD PRESSURE - TRY IT


రక్తపోటు నియంత్రణకు బీట్‌రూట్‌

అన్నీ శక్తి కోసమే కాదు కొన్ని ఆహార పదార్థాలు శక్తినివ్వటమే కాకుండా ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. ప్రకృతి సహజమైన ఆహార పదార్థాల్లోంచే మన ఎన్నో రుగ్మతల్ని నయం చేసే ఔషధాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. కానీ, ఆ విలువల గురించి మనకు తెలియాలి కదా! ఆ తెలియాలంటే వాటి మీద పరిశోధనలు జరగాలి. హైపర్‌ టెన్షన్‌ అనే పత్రిక జరిపిన అధ్యయనంలో నైట్రేట్‌ సమృద్దిగా ఉండే కూరగాయల్లోని నైట్రేట్‌లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. దీనికి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉంది. అందు వల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్దిగా ఉన్న కూరగాయలు ఆకుకూర లు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.

BEAUTIFUL MAKE UP


NEVER LOOSE FRIENDS WHO LIKES YOUనిన్ను నిన్నుగా ఇష్ఠపడేవాళ్ళని ఒదులుకోకు
ఎందుకంటే..
ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది
రాళ్ళని పోగుచేస్తూ వజ్రాన్ని కోల్పోయావని!Jai shree Ganesha


SRI RAMASTAKAM - TELUGU DEVOTIONAL PRAYERS OF LORD SRI RAMA
శ్రీ రామాష్టకము
భజేవిశేషసుందరం సమస్తపాప ఖణ్డనమ్‌ |
స్వభక్త చిత్త రఞ్జనం సదైవ రామమద్వయమ్‌||
జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్‌ |
స్వభక్తభితి భఞ్జనం భజేహ రామమద్వయమ్‌ ||
నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహమ్‌|
నమం శివం నిరఞ్జనం భజేహ రామమద్వయమ్‌ ||
సదా ప్రపంచ కల్పితం హ్యనామరూపహస్తవమ్‌ |
నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్‌||
నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయమ్‌ |
చిదేకరూప సంతతం భజేహ రామమద్వయమ్‌||
భవాబ్ధిపోతరూపకం హ్యశేష దేహ కల్పితమ్‌ |
గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్‌||
మహాసువాక్య బోధకైర్విరాజమాన వాక్పదైః |
పరం చ బ్రహ్మవ్యాపకం భజేహ రామమద్వయమ్‌ ||
శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్‌ |
విరాజమైన దైశికం భజేహ రామమద్వయమ్‌||
రామాష్టకం పఠతి యస్సుకరం సుపుణ్యం |
వ్యాసేనభాషితమిదం శ్రుణుతే మనుష్యః
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్‌ ||
ఇతి శ్రీ రామాష్టకము సంపూర్ణం..

SPISY WORLD CLASS BEAUTIES PHOTO GALLERY


loading...