ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HALF SAREES DHAMAKA





USE INGUVA FOR PICKELS CARE


ABOUT ARCTIC BIRD DOVKI


PANT AND SHIRT


LIFE GOES HIGHER AND HIGHER


FIND ANIMALS IN THE PIC - ANSWER BELOW - CHILDRENS PUZZLE



LORD GANESH PUJA


NTR WITH BHANUMATHI - MALLESWARI MOVIE STILL


WHO INVENTED COFFEE - A SHEEP MEN OF ITHOPIA ACCIDENTALLY DISCOVERED COFFEE LEAVES - STORY OF INVENTION OF COFFEE


GODDESS MAHA KALI


BAD MONKEY WITH OLD OX - KIDS STORY IN TELUGU


GLAMOROUS POONAM BAJWA


BIRBAL DECIDES THE ORIGINAL OWNER - KIDS STORY


అసలు యజమాని ఎవరు?

ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల
గురించి విని ఆయనని చూడాలని ఒక
రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని
వైపు బయలుదేరాడు.

దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు.
సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు.

ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు.
సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని
గుర్రం యెక్కించి తను నడవ సాగాడు.

రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి
ఇష్టపడలేదు. కేకలూ అరుపులూ మొదలపెట్టాడు.
సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా
చుట్టూర పది మంది చేరారు.

కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ
రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు.
సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని,
సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు.

ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి
న్యాయంకోసం వచ్చారు.

అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్ప మన్నాడు.
బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని
ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి
రమ్మన్నాడు.

తెల్లవారింది.

ఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని
గుర్రపుశాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని, “నీ
గుర్రం తీసుకో”, అన్నాడు.

అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన
గుర్రం తెలుసుకోలేక, బిక్క మొహం వేశాడు.

అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని
గుర్తుపట్టేడు. గుర్రం కూడ యజమానిని
చూసి సంతోశంగా సెకిలించింది.

వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి
అసలు యజమాని సామంతరాజు అని, అక్బర్ కి
నివేదించాడు.

సామంతరాజు ఎంతో సంతోశంతో తనెవరో చెప్పి
బీర్బల్ని ప్రశంసించి మళ్ళి తన రాజ్యానికి
బయలుదేరాడు.

LANKA BURNING RAMA


ARTICLE ABOUT KARTHIKA PANCHAMI - GNANA PANCHAMI - LAKSHMI PANCHAMI IN TELUGU


కార్తీక పంచమి - జ్ఞాన పంచమి - లక్ష్మీ పంచమి

 అలిమేలు మంగతాయారు పుట్టిన రోజు

స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి ఆగ్రహంతో విష్ణుభగవానుడి హృదయం మీద తంతాడు... తన నివాస స్థలమైన ప్రదేశంలో తన్ని తనను తన భర్తను అవమానించినా... శ్రీహరి భృగు మహర్షిని ఏమీ అనకుండా మిన్నకుండడం.. శ్రీలక్ష్మీదేవికి అవమానంగా అనిపిస్తుంది.. అందుకే 
(పతికి/ గురువుకీ అవమానం జరిగిన చోట ఒక్క క్షణం ఉండరాదని ధర్మం) బాధపడి పాతాళానికెళ్ళిపోయిందనీ, శ్రీ లక్ష్మీదేవిని తిరిగి చేరడానికి శ్రీమహావిష్ణువు చేసిన తపస్సుకు ఫలితంగా సువర్ణముఖరీ నదీతీరంలో (ఇప్పటి తిరుచానూరు ) లో ఉన్న పద్మ సరస్సులో ఉన్న పద్మాల మధ్యలోంచి సువర్ణపద్మంలోంచి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాడ నక్షత్రంలో అమ్మవారు తిరిగి ఆవిర్భవించి, కలువపూల దండలు స్వామికి సమర్పించి తిరిగి స్వామిని చేరిందని అలా ఒకరినొకరు అనుగ్రహించుకున్నారనీ స్థలపురాణంలో ప్రతీతి. పద్మ సరస్సు ఒడ్డున సూర్యభగవానుడు తపస్సు చేసిన స్థలం సూర్య ఆలయం ఇప్పటికీ మనం చూడవచ్చు.
పంచమీ తీర్థోత్సవం అని తిరుచానూరులో ఇప్పటికీ ప్రత్యేక వైభవోత్సవం చేస్తారు. అమ్మవారు అయ్యని తిరిగి చేరిన రోజు .. ఈరోజు అమ్మవారు, అయ్యవారలు పరమ కరుణాదృష్టితో ఉంటారు.. ఈ రోజు తిరుమల/తిరుచానూరు స్వామి వార్లను దర్శించడం చాలా ఉత్తమం....ఈరోజు తిరుమలనుంచి వచ్చే ప్రత్యేక సారెను ఏనుగులపై ఊరేగించి తీసుకొచ్చి అమ్మవారి(తిరుచానూరు)కి సమర్పిస్తారు .

ఈ కార్తీక శుక్ల పంచమి రోజున లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించటం విశేష అభిషేక అర్చనాదులు నిర్వహించడం పరిపాటి. లక్ష్మీ మంత్ర దీక్ష ఉన్నవారు ప్రత్యేకంగా ఈ రోజు అనుష్ఠానాదులు పెంచుకుంటారు. గురువుల అనుగ్రహంతో కొత్తగా ఆదీక్ష తీసుకునేవారు కూడా ఈ నాడు తీసుకుంటూంటారు.
తన పతి ఏ చోట అవమానింపబడ్డాడో ఆ చోటు విడిచింది అమ్మవారు, అంటే ఆది లక్ష్మియైనా సరే పతినింద, గురునింద తట్టుకోలేదన్నమాట. విష్ణుమూర్తే భృగుమహర్షితో అనునయంగా మాట్లాడినా తన భర్తకు జరిగిన అవమానాన్ని తాను భరించలేకపోయింది (మనకీ గురునింద వినరాదు, గురునింద జరిగేచోటునుండి వెంటనే వెళ్ళిపోవాలి అని శాస్త్రాలు/పెద్దలు చెప్తారు)కాబట్టి అయ్యవారిని విడిచి కాకుండా అమ్మవార్ని సంతుష్టురాల్ని చేయటానికి ’అయ్యవార్ని అమ్మవార్ని’ కలిపి పూజించండి. వీలైతే విష్ణు సహస్రనామం/ గోవిందనామాలు పారాయణ చేసి అమ్మవారి అష్టోత్తరనామాలతో పూజించుకోవడం శ్రేష్ఠం. వేదాంతర్గత సూక్త పారాయణ చేయగలిగేవారు పురుష సూక్త, శ్రీ సూక్తపారాయణలు అర్చనలు చేసుకోవచ్చు. లేదా హయిగా దేవాలయంలో దర్శనం చేసుకొని అర్చనాదులు చేయించుకోవడం ఉత్తమం. , ఇతర లక్ష్మీ దేవి స్తోత్రాలూ పూజలో అనుసంధానం చేసుకోవచ్చు.

ఇక ఈ పంచమిని జ్ఞాన పంచమి అని కూడా పిలుస్తారు, ఈ రోజు సుబ్రహ్మణ్యారాధన వలన జన్మ్యాంతరంలో సుబ్రహ్మణ్యానుగ్రహం వలన శుద్ధజ్ఞానం కలుగుతుందని నమ్మకం.


FESTIVAL FUNCTION SAREES COLLECTION





indian-bollywood-fancy-heavy-partywear-designer-long-dress-gownS





bollywood-indian-fancy-partywear-heavy-green-designer-long-dress-gown/



BEAUTIFUL SALWARS FOR INDIAN TEENS





LATEST FESTIVAL SALWAR KHAMEEZ DESIGNS






FESTIVAL SAREES DHAMAKA




SILKY BEAUTY PARINIDHI



WHY ONLY PARROTS CAN TALK LIKE HUMANS - REASON IN TELUGU


A TRIBUTE TO DR.GUDURU VENKATACHALAM - AGRICULTURAL SCIENTIST


MARRIAGE AFTER LIFE SETTLED


DETAILED ARTICLE IN TELUGU ABOUT LORD HANUMAN / LORD ANJANEYA SWAMY - ABOUT ANJANEYASWAMY TEMPLES - HANUMAN BIRTH - LIFE ETC


హనుమంతుడు

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు , పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది.

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధ క్లుప్తంగా ఇవ్వబడింది.


జననం, బాల్యం

సూర్యుని పండు అని భ్రమపడుతున్న హనుమంతుడు

పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్లా శ్రేష్టమయినది.శంబసాదనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాదనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాదనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
వజ్ర ఘాతం
ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరుచేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు , మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ఫి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంతనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుడాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధఘాతానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పికలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసమ్హరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువులేక దేహాలు స్థంబించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మ దేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతులు ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమురగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పని చేయడం జరిగింది.
అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు.ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డదికావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ , ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని , మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంటపెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.
విద్యాభ్యాసం
హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.
హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచీర్యలు చింపివేయడం , అగ్ని హోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది.
గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.
ఉద్యోగం
]
విద్యముగిసింది. ఇక ఉద్యోగం వితుక్కోవాలి. అప్పుడు వానరులకు ఋక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికిద్దరు కొడుకులు. వాలి సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు పనికి కుదిరాడు.
వాలి సుగ్రీవులకు వైరం
వాలి మహాబలసంపన్నుడు. రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తలవంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఒక సారి మాయవి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి కిష్కింధవచ్చి గలాబా సౄష్టిచాడు. వాలి సుగ్రీవులు అతని ముందుకొచ్చారు. వారిని చూడగానే మాయవికి పై ప్రాణాలు పైకే పోయాయి. భయప్ది పారిపోయాడు. వాలి అతన్ని వదలక అనుసరించాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి సుగ్రీవునితో " నువ్వు ఇక్కడే నాకోసం వేచు ఉండు. వాడెక్కడున్నా సరే. వాడిని చంపి గాని తిరిగిరాను. " అని బిలంలోకి దూరాడు. ఏడాది పాతు ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు, ఏరులై పారుతూ రక్తం బిలం నుంచి బయతకు వచ్చింది. సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చని పోయాడని భావించి వాలినే జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి బిలాన్ని ఒక పెద్ద రాతితో మూసు విచారిస్తూ కిష్కింధకు పోయి జరిగిన సంగతి చెప్పి వాలికి అంత్యక్రియలు చేసాడు. వానర పెద్దలు సుగ్రీవుడిని రాజు చేసారు. కొన్నాళ్ళకు బిలం ముందు ఉన్నరాయిని కాలితో తన్ని కిష్కింధకు వస్తాడు వాలి.అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిధ్ధమవుతాడు వాలి. ఇక అక్కడ ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తల దాచుకొనేవాడు అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులలో హనుమంతుడు ఒకడు.
హనుమంతుడి మత్రిత్వం
నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బల గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతీ రోజు ప్రాణ భయంతో విలపిస్తూన్న సుగ్రీవుడింతో ఒక రోజు ఇలా అన్నాడు" మీ అన్న ఒక సారి దుందుభి అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశౄంగ పర్వతం మీద తపస్సు చేస్తూన్న మతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మతంగ ముని ఈ పర్వతనికి వాలి వస్తే తలపగిలిచస్తావని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు. మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం" అని సుగ్రీవుడికి ఆ సలహా నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు.
రామ లక్ష్మణులతో స్నేహం
రామ లక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొనిపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారి ఆ పర్వతాన్ని చేరుకొంటారు. వారిని చూసి వాలి తనకోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు.
హనుమంతుడు బిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిధి పూజ చేసి " అయ్యా! మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తూంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని. వానరుడిని. కామరూప విద్య తెలిసినవాడిని కావటాన ఈ రూపంలోకి మారాను." అందుకు రాముడు" చూసావా లక్ష్మణా! మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశ్రుతీ లేదు. మహా వ్యాకరణ పండితుడని తెలుస్తూంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు. " అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేసాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసాడు. రాజయిన తరువాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మరచిపోగా లక్షంఅణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చేరపిలిచి ఒకొక్కరినీ ఒకొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒకొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. నెల రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధిస్తాడు.
హనుమంతుడి దళంలో అంగదడుకూడా ఉన్నాడు. అంగదుడు కిష్కింధకు యువరాజు. అలా వెళ్ళిన వారు చెట్టులు పుట్టలు అడవులు కొండలు గాలిస్తూ అలసిపోయారు. సుగ్రీవుడు పెట్టిన గడువు నెల రోజులు ఇట్టే అయిపోయాయి. కానీ వారికి సీత జాడమాత్రం తెలియలేదు. ఆకలిదప్పులతో కదలలేని స్థితికి చేరుకొన్నారు.
స్వయంప్రభా సర్శనం
డస్సి పోయి ఉన్న వారికి ఒక బిలం , ఆ బిలంలోనుండి వస్తున్న హంసలు మొదలైన పక్షులు కనిపించాయి. పక్షులొస్తున్నాయి గనక నీరు చెట్లు సమృధ్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్లారు. యోజనం పైగా నడిచినా వారికి అక్కడ ఏమీ కనపడక ప్రాణాలు కడగంటే స్థితికి వచ్చారు. అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూల గుత్తెలు, విమానాలు, బంగారు సోపానాలు కలిగిన మణిమయ మండపాలు స్వర్ణ వర్ణంతో ఉన్న తాబేళ్ళు చేపలు, నిర్మలమైన నీరు, పళ్ళు ఉన్న స్థలం కనిపించింది. అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక తపస్విని ఉన్నది. హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించి తమ వౄత్తాంతం చెప్పుకొన్నాడు. ఆమె వారికి అతిధ్యం ఇచ్చి.తన పేరు స్వయం ప్రభ అని హేమ స్నేహితురాలినని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దయతో బిలం దాటించి వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది. వారు బయటకు వచ్చి సీతను చెప్పిన గడవులో వెతికి గుర్తించలేందుకు చండశాసనుడైన సుగ్రీవుడు మరణ దండన విధించి తీరుతాడుగనక ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనిపించింది. వానర మూకను సంపాతి అనే పక్షి గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృధ్ధిగా దొరికిందని వారితో అని భక్షించడానికి పూనుకొన్నది. అప్పుడు అంగదుడు హనుమతో" చూసావా హనుమా! జటాయువులా మనకు దురదృష్టకరమయిన మరణం రాసిపెట్టి ఉన్నది." అన్నాడు. సంపాతికి జటాయువు సోదరుడు. సంపాతి వారితో" ఓయీ! జటాయువును నీవు ఎరుగుదువా?" అని ఆసక్తిగా అడిగింది. అప్పుడు హనుమ సీతాన్వేషణం దాకా మొత్తం కథను చెప్పాడు. అది విని సంపాతి" నాయనా! జటాయువు నా సోదరుడు. అతని మరణానికి కారణమైన రావణుడిపై వృధ్ధుడనై, సూర్యతాపం వలన రెక్కలు కాలినందున పగ తీర్చుకొనలేను.కానీ నాకు యోజనాల దూరం ఇక్కడనుంచే చూసే శక్తి ఉన్నది. సీత సముద్రానికి ఆవల విషన్నవదనయై లంకానగరంలోని అశోక వృక్షం కింద భర్తకోసం విలపిస్తున్నది. సముద్రాన్ని దాటి వెళ్ళి ఆమెను రక్షించండి " అన్నాడు.
కిష్కింధ కాండ
సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి
వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెదకుచు రామ లక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకొని, వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసికొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను.
రాముని చేత వాలి హతుడవ గా సుగ్రీవుడు వానర రాజయ్యెను. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లినవారిలో, దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు.
వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు (జటాయువు అన్న) సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.
ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.
హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశి ని గోష్పదంలా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.
సుందర కాండ
అశోక వనములో సీతను చూచిన హనుమంతుడు
హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు
ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండ
ఇంద్రజిత్తు వేసిన బాణానికి గాయపడ్డ లక్ష్మణుడు
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.
శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.
రావణుని శక్తితో మూర్ఛిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.
తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతి లో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవని ని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.
ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రామునిచేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది.
శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేసెను. సభలోని వారందరూ ఆశ్చర్యపోయిరి. లక్ష్మణునికి కోపము వచ్చినది. ఆంజనేయా! నీవు ఏమి చేయుచుంటివి అని ప్రశ్నించెను. హనుమంతుడు మాత్రం "శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం" అని పల్కెను. అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోద్రిక్తుడై "శ్రీరాముడు నీలో ఉన్నాడా?" అని ప్రశ్నించెను. శ్రీరాముడు మాత్రం అంతా ప్రశాంతంగా గమనించుచుండెను. అప్పుడు హనుమంతుడు తన హృదయమును చీల్చెను. అప్పుడు హనుమంతుని హృదయం నుండి కాంతిమంతంగా సీతారాములు అగు పడిరి. అందరూ ఆశ్చర్యానందాలతో పరవశించిపోయిరి.
వానరుల శక్తి
సీత లంకలో ప్రాణాలతో క్షేమంగా ఉన్నట్టు తెలిసి ఆనందించి వారు సముద్రాతీరానికి వెళ్ళారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం శతయోజనాల విస్తీఈర్ణం ఉన్న మహాసముద్రాన్ని చూడగానే చప్పగా చల్లారిపోయింది. ఈ కడలిని లంఘించి ఆవలి ఒడ్డుకు వెళ్ళడం ఎలా? అని వారు విదారంలో పడ్డారు. అంగదుడు వారితో ఈ సముద్రాన్ని దాటగలవారు మనలో ఎవరు?" అని అడిగాడు. గజుడు పది యోజనాలు, గవాక్షుడు ఇరవై, గవయుడు ముప్ఫై, శరభుడు నలభై, మాదనుడు యాభై, మైందుడు అరవై,ద్వివిదుడు డెభ్భై, సుషేణుడు ఎనభై ఆమడలు ఎగరగలరని తేలింది. జాంబవంతుడు తాను ప్రస్తుతం వృధ్ధుడినికనుక తొంభై ఆమడలవరకు ఎగురగలనన్నాడు. అంగదుడు" నేను నూరుయోజనాలు ఎగిరగలను. కానీ తిరిగిరాగలనా అని సందేహిస్తున్నాను" అన్నడు. అప్పుడు జాంబవంతుడు " రాజా ! నీవు రాజువు గనక ఎవరిననైనా పంపాలే తప్ప వెళ్ళడం పద్దతికాదు." అన్నాడు. అప్పుడు " ఇప్రాయోపవేశం చేయటమే తప్ప ఇక మనకు మరో మార్గం లేదు " అన్నాడు.
హనుమంతునికి ప్రోత్సాహం
అప్పుడు" యువరాజా! మనలో ఈ వారధిని లంఘించగల వీరుడు హనుమంతుడొకడే" అని పలికి హనుమంతునితో" హనుమా! లే. నూవు అనన్య సామాన్యుదివని గుర్తు చేస్తున్నాను. నీకంటే శక్తిమంతులు ఈ భూమండలం మీద లేరు. వెళ్ళి కార్యం సఫలం చేసుకొనిరా" అని అతని శక్తులు గుర్తుచేసాడు. హనుమంతుడు తన శక్తులు గుర్తుకు రాగా అర్ధరాత్రి ఒక్క సారి హఠాత్తుగా వెలిగిన సూర్యుడిలా ప్రకాశించాడు. తన శక్తులు గుర్తుకురాగా తోకవిదిలించి లేచాడు. వానరులందరూ హనుమంతుడిని స్తుతిస్తుంటే హనుమంతుడు భీకరాకారంతో మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఒక్క ఎగురులో వారధి మీదుగా లంకకు దూసుకు పోయాడు.
రామకార్యార్ధియై వెడుతున్న హనుమంతునకు విశ్రాంతినిచ్చేందుకు సముద్రుడు మైనాకపర్వతాన్ని ఆదేశించేడు.మైనాకుడు సముద్రంలోనుండి ఎదిగి హనుమదారికి అడ్డుగా నిలబడి ఆతిధ్యం స్వీకరించమని కోరగా రామకార్యార్ధిని కనుక విశ్రమించనని కృతజ్ఞతలు తెలిపి సెలవుతీసుకొన్నాడు.
హనుమంతుని శక్తిని తెలుసుకోడానికి దేవతలు సురసను పంపారు. ఆమె హనుమంతునికి అడ్డుపడి" నాకెదురైనవారు నా ఆహారమని దేవతలు చెప్పారు. నా ఉదరంలోకి రా" అని నోరుతెరిచింది. హనుమంతుడు తన శరీరం పెంచాడు. సురస కూడా శరీరం పెంచుతూ పోయింది. ఒక్క సారి హనుమంతుడు బొటన వేలంతగా మారి ఆమె ఉద్రంలోకి ప్రవేశించి గభాలున ఆమె నోరుమూసుకొనేలోగా వచ్చేసాడు. హనుమంతుని యుక్తికి మెచ్చి సురస దీవించింది.
సింహిక అనే రాక్షసి హనుమతుడు ఎగురుతుండగా నీటిపై ఉన్న అతని నీడను పట్టి ఆపింది. హనుమంతుడు తన శరీరాన్ని వేగంగా పెంచి ఒక్క సారి తగ్గిచుకొని రాక్షసి కడుపులోకి వెళ్ళి పేగులు చీల్చి బయటకు వచ్చాడు.
లంకిణీ ని సంహరించడం
లంకను చేరిన హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకొని లంకానగరంలోని కట్టాడాలు, వనాలు చూస్తూ కోటలోకి ప్రవేశించబోగా లంకిణి అడ్డుకొని గుండెలపై చరిచింది. హనుమంతుడు కోపంతో ఎడమ పిడికిలితో ఆమెను కొట్టాడు. ఆమె కిందపడి " మహావీరా! ఒక వానరం నన్ను జయించిన రోజున లంకావైభవం నశిస్తుందన్ని బ్రహ్మ నాకు చెప్పాడు. దానవులకు ఆయువు మూడింది. నీవు స్వేఛ్చగా వెళ్ళు" అన్నది. లంకా వైభవాన్ని కనులారా తిలకిస్తూ ఆశ్చర్యపోతూన్న హనుమంతుడు రావణ కుం భకర్ణులను సౌందర్యవంతమైన స్త్రీలను రాక్షసులను చూసాడు. అతనికి సీత ఎక్కడా కనపడలేదు. అర్ధరాత్రి పండువెన్నల కురుస్తుండగా కోట బయటకు వచ్చిన హనుమంతుడికి అశోకవనంలో మహాతేజస్సుతో వెలుగుతూన్న స్త్రీమూర్తి కనిపించింది. పోలికలనుబట్టి , ఆమె చీరను చూసి,ఆమె సీతాసాధ్వి అని నిర్దారించుకొన్నాడు. రాక్షస స్త్రీల కాపలాలో ఆమె విషన్నవదనై ఉండడం చూసి విచారించాడు.ఇంతలో తెల్లవారింది. రావణుడు సీత దగ్గరకు వచ్చి రకరకాలుగా ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిచాడు. ఆమె తిరస్కరించింది. అప్పుదు రావణుడు" రెండు నెలల సమయంలో నీవు మనసుమార్చుకో. లేదా నిన్ను చంపి పలహారం గా వండిస్తాను" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అంతా సద్దుమణిగాక హనుమ రామ సంకీర్తనం మొదలుపెట్టాడు. సీత లంకలో రామామౄతం విని ఆశ్చర్యపోయింది. హనుమంతుడు రావణుడు పంపిన వాడేమో అనుకొన్నది. హనుమంతుని రమ్మని రకరకాల ప్రశ్నలు వేసింది. హనుమంతుడు చెప్పిన జవాబులు విని తౄప్తిపడ్డాక అంగుళీకాన్ని ఇస్తాడు హనుమంతుడు. తాను కామరూపినని అనుమతిస్తే ముమ్ము భుజాన మోసుకొని లంకను దాటించగలనని చెప్పి తన మహారూపాన్ని చూపిస్తాడు. సీత సంతోషించి నాయనా ! నాభర్త వచ్చి రావణుడిని సమ్హరించి నన్ను తీసుకువెళ్ళడం యుక్తం. ఆయనకొరకు ఎదురుచూస్తున్నాని చెప్పు" అంటూ చూడామణి గుర్తుగా ఇచ్చి రాముడికి తనకూ మాత్రమే తెలిసిన సంగతులు చెప్పి పంపింది. లంకాదహనం
లంకలో ఎలాంటి శక్తువంతులున్నారో తెలుసుకొంటే రేపు రామ రావణ యుధ్ధంలో ఉపయోగంగా ఉంటుందని భావించి అక్కడ ఉద్యానవనాలు ధ్వంసంచేయప్రారంభించాడు. అది చూసి రాక్షసస్త్రీలు రావణుడికి తెలుపగా రావణుడు తనతో బలసమానులైన కింకర గణాన్ని పంపాడు. వారిని గెద్ద పాములను సమ్హరించినట్టు హనుమంతుడు నిర్జించాడు. తనతో పోరాటానికి వచ్చిన జంబుమాలిని, ఏడుగురు మంత్రిపుత్రులు , విరూపాక్షుడు,యూపాక్షుడు మొదలైనవారు యుధ్ధానికి రాగా వారిని స్వర్గానికి పంపాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి వివశుడు కాగా బంధించి రావణుని యొద్దకు తీసుకెళ్ళారు రాక్షస వీరులు. హనుమంతుడు తాను రామదూతనని సీతను రామునికి అప్పగించకుంటే చావు తప్పదని హెచ్చరిస్తాడు. రావణుడు హనుమంతుని వంధించమనగా దూతను చంపరాదని మరేదైనా శిక్ష విధించవచ్చని విభీషణుడు అన్నాడు. రావణుడు కోతులకు తోక ఎంతో ప్రీతికనుక అ తోకకు నిప్పంటించమనగా లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి సీతకు తిరిగి కనిపించి నమస్కరించి వానరులతో కూడి రాముడిని చేరి" చూసాను సీతను అని చెప్పాడు.
రామ రావణ యుధ్ధం
రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించి చేసిన రామ రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు. లక్షల మంది దానవులను సమ్హరించడమేగాక లక్ష్మణుడు మూర్చపోగా రాత్రికిరాత్రై ఔషధీ పర్వతం తెచ్చి రక్షించాడు. రావణుడి మరణం తరువాత అయోధ్యకు వెళ్ళి భరతనుకి రాముని రాక ఎరిగించి స్వాగత కార్యక్రమాలు నిర్వహింపచేసించి హనుమంతుడే! శ్రీ రామ పట్టాభిషేక వేళ సీతమ్మతో అమూలూమైన రత్నహారాన్ని ఇవ్వడమే గాక రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమ చూపి చిరంజీవిత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదించాడు. హనుమంతుని జీవనం మనకందరకూ ఆదర్శవంతమైంది.
పూజా సాంప్రదాయాలు
దేవాలయాలు
శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్టింపబడడం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటిలోనూ సీతారాముల పటమో, విగ్రహాలో, ఆలయాలో ఉండడం సాధారణం. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా వూళ్ళలోను, రోడ్లప్రక్కన, చెట్లక్రింద - ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. భయాపహారిగా ఆంజనేయుడు పల్లెలలో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు.
హనుమంతుని కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్
హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయం.
తణుకు కు దగ్గర గల తీపర్రు లో ప్రసన్న ఏకాదసముఖి వీరాంజనేయ స్వామి ఆలయం కలదు .
హనుమాన్ జంక్షన్: అభయాంజనేయ స్వామి
గురవాయిగూడెం: మద్ది వీరాంజనేయ స్వామి
విజయవాడ: దాసాంజనేయస్వామి, మాచవరం
సురేంద్రపురి, యాదగిరిగుట్ట: పంచముఖ హనుమదీశ్వరాలయం
తిరుమల: కోనేటి గట్టు ఆంజనేయ స్వామి, బేడీ ఆంజనేయస్వామి, జాబాలి తీర్థం
రాజమండ్రి, సుందర ఆంజనేయస్వామి దేవాలయం
కాకినాడకు దగ్గర లో ని మామిడాడ వద్ద గల గంద్రేడు గ్రామం లో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కలదు.
అరగొండ, అర్ధగిరి ఆంజనేయస్వామి దేవాలయం, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా
భర్తిపూడి, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా: ప్రసన్నాంజనేయ స్వామి
వెల్లాల సంజీవరాయుడు, కర్నూలు జిల్లా
కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి, గుంతకల్లు, అనంతపురం జిల్లా
వేటపాలెం, ప్రకాశం జిల్లా
మద్దిమఱ్ఱి, శ్రీశైలం వద్ద
పంచముఖ ఆంజనేయ స్వామి,సురేంద్రపురి
హైదరాబాదు, సికందరాబాదు జంటనగరాలు: తాడ్‌బంద్, బడీచౌడీ, సుల్తాన్ బజార్ కూరల మార్కెట్టు, కర్మన్ ఘాట్, ఖైరతాబాద్, సోమాజీగూడా, వివేక్ నగర్, సైఫాబాద్ ఆంధ్రాబ్యాంక్, చార్మినార్ క్రాస్ రోడ్ వద్ద లక్ష్మీ గణపతి దేవాలయం
పొన్నూరు ఆంజనేయస్వామి
సామర్లకోట ఆంజనేయస్వామి
కొండగట్టు, ఆంజనేయస్వామి (ప్రముఖ పున్యక్షెత్రమ్ ), కరీంనగర్ జిల్లా
[అగ్రహరమ్] ].,కరీంనగర్ జిల్లా
నల్లబండగూడెం, నల్గండ జిల్లా : పంచముఖ ఆంజనేయ స్వామి
గండి, వేంపలే, వైఎస్ఆర్ జిల్లా :ఆంజనేయస్వామి
తణుకు కు దగ్గర గల వేల్పూరు లో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కలదు
Vijayawada-Paritala Anjaneya swamy temple
ఇతర రాష్ట్రాలలో
ఉత్తర ప్రదేశ్, వారాణసి: సంకట్ మోచన్ హనుమాన్
ప్రసన్న వీరాంజనేయస్వామి మందిరం: మహాలక్ష్మీ లే-అవుట్, బెంగళూరు, కర్ణాటక
రామాంజనేయ స్వామి మందిరం - రాగి గుడ్డ, జె.పి.నగర్, బెంగళూరు, కర్ణాటక
ఝన్‌కూ -సిమ్లా -హిమాచల్ ప్రదేశ్
హనుమాన్ టోక్ - గాంగ్‌టక్ - సిక్కిమ్
శ్రీ విశ్వరూప ఆధివ్యాధిహర భక్తాంజనేయ స్వామి మందిరం - చెన్నై
శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయ స్వామి ఆశ్రమము - చెన్నై
మెహందీపూర్ బాలాజీ మందిరం - ధౌసా, రాజస్థాన్
యోగాంజనేయస్వామి మందిరం, షోలింగాపూర్, తిరుత్తణి, తమిళనాడు.
విదేశాలలో
శ్రీలంక 'నువారా ఎలియా'లో హనుమంతుని మందిరం[1]
మస్కట్, ఒమన్ - శివాలయంలో ప్రతిష్టింపబడిన ఆంజనేయ స్వామి
ట్రినిడాడ్, టొబాగో
శ్రీలంక - సువారా ఎలియా
ఫ్రిస్కో, టెక్సాస్, యు.ఎస్.ఏ - కార్యసిద్ధి ఆంజనేయస్వామి
ప్రార్థనలు
సాంప్రదాయానుసారముగా శ్రీసీతారామ స్తుతి హనుమంతునకు అత్యంత ప్రీతికరమైనది. "యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్". అయితే రక్షణకు, విజయానికి, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యుభయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వ సాధారణం.
హనుమంతుని ప్రార్ధనలలో ప్రసిద్ధమైనవి
ఆంజనేయ దండకం - "శ్రీ ఆంజనేయం ప్రన్నాంజనేయం ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం ...." అని సాగే ఈ దండకము తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా పల్లెటూళ్ళలో రాత్రుళ్ళు ఒంటరిగా వెళ్ళేవారు భయవిముక్తికి ఈ దండకం చదువుకోవడం జరుగుతుంది.
హనుమాన్ చాలీసా: గోస్వామి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన. ఎమ్.ఎస్.రామారావు దీనికి ఒక తెలుగు సేత వెలువరించాడు.
సుందర కాండ - సుందరకాండ పారాయణ కూడా హనుమదారాధనే అంటారు.
విభీషణుడు చెప్పిన ఆపదుద్ధారక ఆంజనేయ స్తోత్రము
హనుమత్కవచమ్
ఆంజనేయ స్తోత్రము - "మనోజవం మారుత తుల్య వేగం..." వంటి శ్లోకాలతో కూడినది. ఇందులో అన్ని శ్లోకాలూ ప్రసిద్ధము.
ఆంజనేయ స్తోత్రము - "రం రం రం రక్త వర్ణం ..." అని ప్రారంభమై ప్రతి శ్లోకంలోనూ "సకల దిశ యశం రామదూతం నమామి" అని ఉంటుంది.
శంకర భగవత్పాదుల హనుమత్పంచరత్న స్తోత్రము
హనుమంతుని ద్వాదశ నామ స్తోత్రము
ఆంజనేయ మంగళాష్టకము
ఇంకా వివిధ నామ స్తోత్రాలు, భజనలు, పాటలు చాలా ఉన్నాయి.


LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...