loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MARRIAGE ORNAMENTS


BEGGING IN HOME


BEAUTIFUL CHEER GIRLS


PURANA RAMAYANA STORY ABOUT ANGADH


అంగదుడు 
రామాయణంలో అంగదుడు ఒక ముఖ్య పాత్ర.. ఇతను వానరుడైన వాలి కుమారుడు. ఇతని తల్లి తార. వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుణ్ణి రావణుని వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. అంగద రాయబారం రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అన్న రాక్షసుని చంపాడు. జగన్నాధ మహాత్మ్యం అనే కావ్యం లో శ్రీ రాముని ఆజ్ఞ వల్ల అంగదుడు ద్వాపర యుగం లో కృష్ణా వతార కాలం లో బోయ వాడుగా పుట్టాడు .ఇతడు వేసిన బాణం ములికి పాదం లో గుచ్చుకొని శ్రీ కృష్ణ నిర్యాణం జరిగింది .అంటే కృష్ణనిర్యాణానికి కారకుడయ్యాడు .వాలిని నిష్కారణం గా చంపిన పాపం శ్రీ రాముడికి కృష్ణా వతారం లో ఈ రకం గా శాప మైంది .[ఆధారం కోరబడినది].

వాల్మీకి రామాయణంలో అంగదుని పాత్రను ఎంతో వీరుడు, శూరుడు, కార్య నిర్వాహకుడు, కర్తవ్య దీక్షాపరునిగా చిత్రించాడు. సీతను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాధి మహావీరుల బృందానికి అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రం నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శిస్తాడు. అది తప్పితే మిగిలిన అన్ని సందర్భాలలోను అతని రాజ భక్తి, రామకార్యం పట్ల నిరతి చాలా దృఢంగా ప్రదర్శించాడు.

‘’అంగద రాయ బారం ‘’ యుద్ధానికి ముందు చివరి యత్నంగా రావణుని వద్దకు రాయబారిగా రాముడు అంగదుని పంపాడు. సీతను రామునికి అప్పగించి యుద్ధం మానుకొని తన వంశాన్ని రక్షించుకోమని అంగదుడు రావణునికి చెప్పాడు కాని రావణుడు సమ్మతించలేదు. నలుగురు రాక్షసులు అంగదుని పట్టుకొనబోగా అంగదుడు వారిని తన బాహువులలో బిగబట్టి వారితో సహా పైకెగిరి, రావణుని సౌధాగ్రాన్ని కాలితో తన్ని ఎగిరి కపిసేన మధ్యకు వచ్చిపడ్డాడు.దీనినే ‘’అంగద రాయ బారం ‘’అంటారు .


లంకా యుద్ధంలో అంగదుడు అసమానమైన ధైర్య పరాక్రమాలను ప్రదర్శించాడు. అనేక రాక్షసులను హతమార్చాడు. విపత్కాలంలో వానర సేనకు ధైర్యం చెప్పాడు. గొప్ప రాక్షస మహావీరులు అంగదుని చేత హతమయ్యారు. రెండవరోజు యుద్ధంలో వజ్రదంష్ట్రుడు అనే రాక్షస వీరుడు భీకరంగా వానరసేనపైబడి వారిని చంపేయసాగాడు. అపుడు అంగదుడు అతనిని నిలువరించాడు. వారిద్దరూ భీకరంగా యుద్ధం చేశారు. చివరకు అంగదుడు వజ్రదంష్ట్రుని తల నరికేశాడు.

కుంభకర్ణుడు యుద్ధం చేసేటపుడు వానరసేన కకావికలై పోతుండగా వారికి ధైర్యం చెప్పి అంగదుడు యుద్ధానికి ప్రోత్సహించాడు. స్వయంగా కుంభకర్ణుని నిలువరించడానికి ప్రయత్నించాడు. అంగదుడి పిడి దెబ్బకు కుంభకర్ణుడు మూర్ఛిల్లాడు కాని అంతలోనే తేరుకొని అంగదుడిని ఒక్కపోటు పొడిచాడు. దానితో అంగదుడు తెలివి తప్పిపడిపోయాడు. తరువాత కుంభకర్ణుడు రామలక్ష్మణుల బాణాలతో మరణించాడు. కుంభకర్ణుడి మరణం తరువాత త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు వంటి మహారాక్షస వీరులు యుద్ధానికి బయలుదేరారు. వారిలో నరాంతకుడు అంగదునితో భీకరమైన యుద్ధం చేసి అంగదునిచేత మరణించాడు. ఇంద్రజిత్తు మరణం తరువాత యుద్ధానికి వచ్చిన మహాపార్శ్వుడు కూడా అంగదునిచేతనే మరణించాడు. రామ రావణ సంగ్రామం లో అంగదుడు వీరోచితం గా పోరాడి రాక్షస మూక ను చీల్చి, చెండాడాడు .రావణ సేనాధి పతిని మహా కాయుడిని అంగదుడు హత మార్చాడు ..సైన్యం బలహీనమై పోతుండగా రావణుడు మహా హోమం చేయటం ప్రారంభించాడు .ఇది తెలుసుకొన్న రాముడు అంగదుడు మొద లైన వారిని హోమ భంగం చేయమని పంపాడు . రావణుని అంతఃపురానికి వెళ్ళిన అంగదుడు అతిగా దుఃఖిస్తున్న రావణ పత్ని మండోదరి జుట్టు పట్టుకొని ఈడ్చి తెచ్చి రావణుని ముందు పడేశాడు .విచలితుడైన రాక్షస రాజు హోమం మానేసి భార్యను రక్షించుకో వాలన్న తపన తో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు .రావణ సంహారం అయిన తర్వాతా సుగ్రీవుడు శ్రీ రాముని తో అయోధ్యకు వెళ్లాడు అప్పుడు అంగదుడే కిష్కింధకు రాజైనాడు .

KAVI SRINADHA POETRY MAGIC ABOUT MOON


శ్రీనాధుని చంద్రోదయ వర్ణన.!

‘’ఆతత లీల గోమల నవామ్శుక పాళిమ హాంధ కార సం –ఘాతము
మీటే నద్భుతముగా శశి లాంచను డభ్రవీదికిన్
శ్వేత వరాహ మూర్తి యగు వెన్నుడు ప్రన్నని యొంటి కోర,ధా –త్రీతల మెంత యంతయు ధరిం చిన యట్టి విజ్రుమ్భణంబు నన్’’-అంటే –
విష్ణువు వరాహావతారం ఎత్తి తెల్లగా ఉన్న ఒకే ఒక్క కోరతో భూగోళాన్ని అంతటిని అవలీలగా పైకెత్తి నట్లు
చంద్రుడు నెల వంకచేత ఆశం లో చీకట్లను అద్భుతం గా తొలగించాడు .
యెర్ర దనం తో ఉన్న అర్ధ చంద్ర బింబం తాంబూలం వేసుకోవటం వలన
యెర్ర బడ్డ తూర్పు దిక్కు అనే స్త్రీ యొక్క కింది పెదవిలాగా ఉన్నదట 

LIFE IS FLOWERFUL


SCIENCE AND TECHNOLOGYSWAMIJI OBSERVING LONG TIME VOW OF SILENCE


DONT NEGLECT TIME
CONTROL YOUR ANGER BECAUSE IT IS JUST ONE LETTER AWAY FROM DANGER
GOOD THINKERS ARE NEVER FEELS ALONE
BHAKTHA SIVARAM CHILDRENS TELUGU STORY


FRIENDSHIP IS DIVINE


LORD HANUMAN DECORATED WITH FLOWERS


RED CARPET


GRASS FOOD


LORD GANESH PRARDHANA - VINAYAKA PRARDHANA AND ITS MEANING IN TELUGU


13TH FLOOR GRUHAPRAVESAM


USES OF HAND KANKAN


ROOM WALKING


AKASADEEPAM IN KARTHIKAMASAM


LORD SRI MAHA VISHNU - PADMA PURANAM TO ADHIKANDAM


LORD SIVA PARVATHI BHAKTHI PRAYERS AND POEMS AND ITS MEANING IN TELUGU


PLEASE MARRY A DOCTOR NOT AN LAWYER


DOCTOR SAAB - EYE TEST PLEASE


loading...