loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD MAHADEV'S PANCHAKSHARI MANTRAM IN TELUGU


WHAT IS IMPORTANCE OF KARPURA HARATHI IN GOD'S POOJA IN TEMPLES


దేవుడికి కర్పూర హారతి ఎందుకు ఇవాల్లి?

పూర్వం దేవాలయాల్లోని గర్భాలయాల్లో దీపారాధన వెలుగులో మాత్రమే మూలమూర్తి కనిపిస్తూ వుండేది. అందువలన దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులకు మూలమూర్తి రూపం ... అలంకారం కనిపించాలనే ఉద్దేశంతో హారతి ఇచ్చేవారు. హారతిని మూలమూర్తికి దగ్గరగా ... ఎదురుగా వుంచి మూడుమార్లు శిరస్సు నుంచి పాదాల వరకూ గుండ్రంగా తిప్పడంలోని ఉద్దేశం ఇదే.

హారతి వెలుగులో దైవం యొక్క రూపాన్ని చూసి తరించిన భక్తులు, ఆ రూపాన్ని మనసులో ముద్రించుకుని తరిస్తుంటారు. ఇక కర్పూరానికి రూపం ... రంగు ... గుణం ... వంటివి వున్నాయి. అది ఆ రూపాన్ని ... రంగుని ... గుణాన్ని దైవసేవలో వదిలి ఆయనలో కలిసిపోతుంది. భగవంతుని సేవకి జీవితాన్ని అంకితం చేయాలనే విషయాన్ని సమస్త మానవాళికి చాటిచెబుతోంది.

అంతేకాదు కర్పూరానికి విశిష్ట లక్షణాలు ఏన్నో ఉన్నవి. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ కాదు. అది చెట్టు నుంచి వస్తుంది. కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి దానితో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించుకునేటప్పుడు మనసులో ఏ విధమైన ఇతర ఆలోచనలూ లేకుండా, ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని. అలాగే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబును తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. అంటువ్యాధుల్ని ప్రబలకుండా చేస్తుంది. ఇంకా ఇలాంటి ఉపయోగాలెన్నో ఉండటం వల్ల కర్పూరాన్ని వాడటం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.

TELUGU PURANA STORY ABOUT LORD SIVA TURNS AS CHANDRASEKHARA


శంకరుడు, చంద్రశేఖరునిగా మరిన కధ

దక్ష ప్రజాపతికి ప్రసుతి ద్వార 24 మంది, పంచజని ద్వార 62 మంది కుమార్తేలు గలరు. అందులో 27 మంది కుమార్తేలకు చంద్రునితో కళ్యాణం జరిగింది. వారు మనం నక్షత్రలుగా పిలుచుకుంటూన్న కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పూనర్వసు, పుష్య, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్తా, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పుర్వషాడ, ఉత్తరషాడ, శ్రవణ, ధనిష్ట, శతభిష,,పూర్వభాధ్ర, ఉత్తరభాధ్ర, రేవతి, అశ్వని, భరణి..

27 మందిని పెళ్ళి చేసుకున్న చంద్రుడు,రోహినితో మత్రమే ప్రేమగా ఉండటంతో మిగిలిన 26 మంది భాదపడుతు ఉండేవారు. వీరి విచారనికి కారణం తేలుసుకున్న దక్షుడు కోపంతో చంద్రుని క్షిణించిపోమ్మని శపిస్తాడు.. చంద్రుడు, బ్రతికించమని దేవులందరిని వేడుకొనగా దీనికి శివుడే తగినవాడనడంతో భోలశంకరుని క్షమించమని ప్రార్ధిస్తాడు.. శివుడు చంద్రుని క్షమించి చంద్రుని తన శిరసున ధరిస్తాడు. శివుని వద్ద ఉండటంతో చంద్రునికి ప్రాణహని లేకపోయినప్పటికిని.. దక్షుని శపం వలన క్షిణించే గుణం తప్పదని, చంద్రుడు పక్షం రోజులు ప్రకాశించడం (కృష్ణ పక్షం) తరువత పక్షం రోజులు క్షిణించడం (శుక్ల పక్షం) ఇలా సృష్టి ఉన్నంత వరకు జరుగుతుందని శివుడు తేలియజేస్తాడు.

చంద్రుని శిరసున ధరించి పరమేశ్వరుడు చంద్రశేఖరుడైనడు. ఆ రోజే సోమనాధ్ క్షేత్రం వేలసింది. అది మఘ మాస, కృష్ణపక్షం లోని చతుర్ధశి.. మనం జరుపుకుంటున్న మహాశివరాత్రి.

LORD SIVA'S MAHA MRUTYUNJAYA MANTRAM


RARE PIC GODDESS SRI MAHA LAKSHMI


ARTICLE IN TELUGU ABOUT THE REASON FOR NOT USING SAMPANGHI FLOWERS FOR PERFORMING GOD'S PUJA IN TEMPLES


సంపంగి

ఎంతో సువాసన ఇచ్చే సంపంగి పుష్పమును దేవుని పూజ లో ఉపయోగించము,,కారణము ఏమిటో తెలుసుకొందాము,,

ఒకానొక కాలంలో ఒక దురాత్ముడు ఉండేవాడు. అయినను అతడు నిత్య శివపూజాసక్తుడు. ప్రతిదినం సంపెంగలచేత శివుని పూజించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడైనవాడు.
ఆ దేశపు చక్రవర్తినే శాసించగల స్థితికి చేరుకున్నవాడు. చక్రవర్తి అంతటి వాడిని, పాదాక్రాంతుడిగా చేసుకున్న గర్వంతో అతడు ప్రజలను పీడించసాగాడు. కానీ, అతడిపై ఫిర్యాదు చేసినా రాజు పట్టించు కొనేవాడుకాదు.

ఇలా ఉండగా - అతడు ప్రతిరోజు తన అర్చన (సంపెంగపూలతో) మానివేయకుండా జాగ్రత్త పడుతూవచ్చాడు. ఆ కారణాన అంతులేని శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు.

నారదుడు ఓసారి భూలోక సంచారార్థం వచ్చినప్పుడు ఈ వైనం అంతా చూశాడు. కానీ ఆయనకు మొదట్లో ఈ దుష్ఠుని అంతర్యం అంతుపట్టలేదు.

అతడెటువంటివాడని అడగ్గా, సంపంగి బదులివ్వలేదు. కేవలం ఆ దుష్టబుద్ధి అకృత్యాలకు భయపడి సంపంగి మారుపల్కలేదు.

అయినా దేవర్షి అంతటివాడు అడిగినప్పుడు సత్యం చెప్పాలి కదా! దుష్టుని బెదిరింపు వల్ల చెప్పలేకపోవచ్చు! అసత్యమేల? నారదుడు తరచి తరచి ప్రశ్నించినా తనకేమీ తెలియదంది సంపంగి.

అసత్యదోషానికి పాల్పడినందువల్ల "నేటినుంచీ నీ పూలు శివపూజార్హత కోల్పోవుగాక!" అని శపించాడు నారదుడు.
అంతవరకు శివప్రీతికరమైన సంపెంగకు శివపాద సన్నిధి చేరే అవకాశం నశించింది.
(శ్రీ శివ మహాపురాణము నుండి సేకరించిన కధ )

old telugu cartoon


DEEPAVALI FESTIVAL CARTOONS - MIMICRY ARTIST DIWALI CRACKERS


PUJA FOR WEAPONS


NATURAL SILATHORANAM AT TIRUMALA TIRUPATHI - INDIA


దాదాపుగా 15 అడుగులు ఎత్తు, 25 అడుగుల వెడల్పు వున్న సహజ సిద్దమైన శిలాతోరణం ఈ శిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు (డైనోసార్ ల కంటే పూర్వం) పూర్వం తీవ్రమైన నీటికోతలకు గురై ఏర్పడినదని భౌగోళిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అంటే ఒకప్పుడు ఇంత ఎత్తు వరకూ నీటితో నిండి వుండేదన్నమ్మాట. అంటే భాగవతాది పురాణాలు చెప్పిన 'వటపత్రశాయి'కథ నిజమై వుండవచ్చు.

ప్రపంచంలో వున్న మూడే మూడు సహజసిద్ద శిలాతోరణాలలో ఇది ఒకటి. ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ తోరణం మీద ఎవరూ చెక్కని సహజ సిద్దమైన శంఖం, చక్రం, స్వామివారి వర(ద)హస్తం, కటి హస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం వున్నాయి.

SIR RICKSHAW WANTED


loading...