loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SUPER SPICE MEENAKSHI AND ILIYANAFRIDAY LAKSHMI PUJA GIVES WEALTH AND HEALTH TO ALL


శుక్రవారం లక్ష్మీ కటాక్షం: 

లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారమే ఎందుకు చేయాలి?

లక్ష్మీదేవిని గురు, శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజి స్తారు. ఈ రోజులలో దేవిని ప్రసన్నం చేసుకుని, ఆమె ఆశీ స్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతిక రమైన స్తోత్రాలు, స్తుతులు ఆరోజునే పఠిస్తారు. ఆ రోజు కొంతమంది ఉపవాసంఉంటారు.ఈనాడుమానవులేకాదు, పురాణాలలో రాక్షసులు సైతం శుక్రవారం లక్ష్మీదేవిని పూ జించేవారనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమై న దినంగా ఎందుకు పేరుమో సింది? రాక్షసులు కూడా ఆ రోజే లక్ష్మీదేవినిఎందుకు ఆరాధించేవారు? అందునా రాక్ష ససంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజిం చడమేమిటి? ఈ సందేహాలన్నీ వస్తాయి. ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే... రాక్షసుల గురువు శుక్రాచార్యు డు. ఈ శుక్రాచార్యుల పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే శుక్రాచా ర్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవు డి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు. ఈ విధంగా లక్ష్మీ దేవికి శుక్రా చార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్ర వారం అంటే ప్రీతికరమైనది

ANJALI SYAMALA BEAUTIES
ORANGE HALF SAREE


THE LEADER


SUPER BLACK CAR


BEAUTIFUL WEDDING BEAUTIES

COLOURFUL LONG MULTICOLOR ANARKALI SUITS
TRADITIONAL GREEN LONG ANARKALI SUIT


FULL PURANA STORY OF DURVASA MAHARISHI / MAHA MUNI IN TELUGU


దూర్వాస మహర్షి కధ - హనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం 

దూర్వాస మహర్షి అంటే కోపానికి ప్రతి రూపం అని అందరికి తెలుసు .అయితె ఆయనను గురించిన కధలు చాయా వున్నాయి అవి అందరికి తెలియవు .కొన్ని కధలను తెలుసు కొందాం
దూర్వాసుడు అతి పురాతన మహర్షి .మహా సిద్ధుడు .మహాయోగి .కనుక తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి వుందాయనకు .మార్కండేయుని వంటి చిరంజీవి .మహా మంత్ర శాస్త్రాలన్నీ ఆపోసన పట్టిన మహాత్ముడు .పుణ్య వంతుడు ,ప్రజ్ఞా శీలి,.. ఆయన జన్మ గురించి రెండు రకాల కధలున్నాయి .పూర్వం త్రిపురాసుర సంహారం చేసి శివుడు చంకలో ఒక బాణం పెట్టు కోని వస్తున్నాడు.దారిలో ఇద్దరు దేవ పురుషులు కని పించారు .వారికి శివుడి చంక లో వున్న బాణం శిశు రూపం లో వున్న శివుని లాగా కన్పించిందట .వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరని అడిగారు .అప్పుడు శివుడు ఆతడు తన కుమారుడని ,పేరు దూర్వాసుడు అని చెప్పాడు .వెంటనే ఆ బాణం శివానుగ్రహం తో శిశువు గా మారి ,క్రమ క్రమం గా పెరిగి మహా మేధావి, జ్ఞాని అయిన దుర్వాస మహర్షి గా వృద్ధి చెందాడు .ఇది దూర్వాసుని గురించిన మొదటి కధ .
రెండవ కధ – అత్రి మహర్షి కి అనసూయా దేవి అనే మహా పతి వ్రత భార్య గా వుంది .అనసూయ దేవ హోతీ ,కర్దము ల కుమార్తె .అత్రి అనసూయలు చక్కని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసు కొంటు వున్నారు .ఒక సారి త్రిమూర్తులైన బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ ,అత్రి మహర్షి ఆశ్రమం మీదగా ప్రయాణిస్తుంటే ఆ వాహనాలు కదల కుండా ఆగి పోయాయి .కారణం వారికేవారికి తెలియ లేదు .అప్పుడు గరుత్మంతుడు విష్ణు మూర్తి తో ”స్వామీ !కింద అత్రి మహా ముని ఆశ్రమం వుంది .దాని మీద నుంచి ,దానిని ,అతిక్రస్మించి ఎవరు పొరాదు .పోవటం సాధ్యం కూడా కాదు ”అని విన్న వించాడు .సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్ళారు .అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది .అత్రి మహర్షి ,,అంతటి మహిమావితుడా ?అయితె పరీక్షించాలి అను కొన్నారు .వాహనాలను చాలా దూరం లో ఆపేసి మ్ బ్రాహ్మణ వేషాలు వేసుకొని అత్రి మహర్షి ఆశ్రమం చేరారు త్రిమూర్తులు .ఆకలి గా వుందని ,తమకు భోజనం పెట్ట మని మహర్షిని వేడు కొన్నారు .
మహా సాధ్వి అనసూయా దేవి ,భ్హర్త అను మతి తో వారికి పీటలు వేసి ,విస్తళ్ళు పరిచి వడ్డించ టానికి సిద్ధ పడింది .అప్పుడు ఆ బ్రాహ్మణ వేషం లోని త్రిమూర్తులు ”అమ్మా !మాకు ఒక నియమం వుంది .మాకు వడ్డించే వారు దిస మొల తో వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాం ”అన్నారు .వీరి ని గుర్తించిన సాధ్వి ,వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది .వారు పసి పాపలు గా మారి పోయారు .అప్పుడు వారికి వారు కోరి నట్లే వడ్డించి ,మళ్ళీ నీళ్ళు చల్లింది .మళ్ళీ యధా రూపం పొందారు వారు .వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసి పాపలు గా మార్చి ఉయ్యాల లో ఊపుతూ ,పెంచసాగింది .అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాక పోయే సరికి ఏదో కీడు శంకించి ,చివరికి వారు అత్రి ముని ఆశ్రమం లో అనసూయమ్మ ఒడిలో పెరుగు తున్నారని తెలుసు కోని వెంటనే అక్కడికి చేరారు .తమ పాతివ్రత్యం అనసూయా దేవి పాతివ్రత్యం ముందు ఎందుకూ పనికి రాకుండా పోయిందని గ్రహించి ,నిజ రూపాలైన లక్ష్మీ సరస్వతి ,పార్వతి రూపాలతో అక్కడికి చేరారు .తమ నాదులను తమకు ఇవ్వ వలసినది గా అనసూయా దేవిని ప్రార్ధించారు .జగన్మాతలు తమ ఆశ్రమం కు వచ్చిన కారణం తెలుసు కొన్న అనసూయ దేవి వారి అతిధి మర్యాదలు చేసి సభక్తి గా పూజించించింది .వారి కోరికను మన్నించి ,ఆ పసి బాలురను మళ్ళీ త్రిమూర్తులను గా మార్చి వేసింది మంత్ర జలం ప్రభావం తో .అప్పుడు బ్రహ్మ విష్ణు ,మహేశ్వరులు నిజ రూపం పొంది ,అనసూయా దేవి పాతి వ్రత్యానికి అబ్బుర పడి ,నమస్సు లర్పించి ,తాము పరీక్షించా టానికి వచ్చినందుకు సిగ్గు పడు తున్నామని తెలిపి ఆమె కు వరాలు ఇవ్వాలని అనుకొంటున్నామని కోరుకో మని విన్న వించారు .అనసూయ తమకు తల్లి అయి, ఇప్పటి దాకా లాలించి పాలించి నందుకు గర్వ పడు తున్నామని సవినయం గా తెలిపారు .ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులు గా జన్మించి ,ఆస లైన పుత్ర ప్రేమ ను కల్గించ మని కోరింది .వారు మువ్వురు తధాస్తు అన్నారు .త్రిమూర్తులు ,జగన్మాటలు అత్రి ,అనసూయాదేవి ల అనుగ్రహం పొంది వారి ఆశీస్సులు గ్రహించి వారి వారి పట్ట నాలకు వారి వారి వాహనాల పై వెళ్ళారు .కొంత కాలమ్ తర్వాత బ్రహ్మ అంశ తో అనసూయ గర్భం లో చంద్రుడు జన్మించాడు .విష్ణువు అంశ తో దత్తాత్రేయ మహర్షి ,శివాంశ తో దూర్వాస మహర్షి ఆమె కు జన్మించారు .ఇలా దూర్వాస మహర్షి మహా తపస్సంపన్ను లైన అత్రి ,అనసూయ దంపతుల కు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు అని రెండో కధ వివ రిస్తోది .మిగిలిన కధలు తరువాత తెలుసు కొందాం .

దూర్వాస మహర్షి కధ –2
శివామ్ష తో జన్మించిన దూర్వాసుడు ,అన్ని విద్యలు నేర్చి ,గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు .అప్పుడు దేవ దాసీ తిలోత్తమ ,ఆమె ప్రియుడు సాహసి అనే వాడు ఈ మహర్షిని గమనించ కుండా రాతి క్రీడలో పాల్గొన్నారు .వారి మాటలు ,చేష్టలు మహర్షి తపస్సు కు భంగం కల్గించాయి .ఆయన కళ్ళు తెరచి ,వారి కామోద్రేకానికి కినిసి ,వారిద్దరిని రాక్షసు లు గా జన్మించ మని శపించాడు .సాహసి ”గర్దభాసురుడు ”గా జన్మించాడు .ఇతడు మహా విష్ణువు చేతిలో మరణం చెండాడు .ఏమైనా భరద్వాజుని ఏకాగ్రత దెబ్బ తిండి .కామ వికారం కల్గి ,పెళ్లి చేసుకోవాలనే కోర్కె పెరిగింది .అదే సమయం లో చ్యవన మహర్షి కుమారుడు ”ఔర్వుడు ”అనే ఆయన ,తన కుమార్తె ”కందళి ”తో అక్కడికి వచ్చి ,మహర్షి మనసు లోని ఆట తెలుసు కోని ,తన కూతురు కందళి నిచ్చి దూర్వాసునికి వివాహం చేశాడు .
కందళి గంప గయ్యాళి .ఆమె ను భరించటం కష్టం గా వుంది ..ఆమె కోపాన్ని భరించ లేక ,ఆమెను వదిలి ,మళ్ళీ తపస్సు కు వెళ్ళాడు .ఆమెకు భర్త ను వదలటం ఇష్టం లేక ,ఆతడిని అనుసరించింది .కొంత దూరం వెళ్ళిన తర్వాత ,దివ్య రూపం లో వున్న ఒక పిల్ల వాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలిక ను విడిచి పెట్ట వద్దనీ ,ఆమెయే తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్లి పోయాడు .కందలిక తన పేరు మీద కదళీ వృక్ష జాతిని సృష్టించింది.కందళి కడలి గా ,రంభా గా అరటి గా పేరు మారింది . .
దూర్వాస మహర్షి గురించిన మూడో కధ .పూర్వం ”నాభాగుడు ”అనే రాజు వుండే వాడు .ఆయన కుమారుడే అంబరీషుడు .అంబరీషుడు విష్ణు భక్తుడు .ఏకాదశీ వ్రతాన్ని భ క్తీ శ్రర్ధ లతో చేసే వాడు .ఒక సారి ఏకాదశి ఉపవాసం వుంది ,మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధ మైన సమయం లో దూర్వాసుడు ,ఆయనకు అతిధి గా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు .ద్వాదశి ఘడియలు పూర్తి ఆయె సమయం అయినా మహర్షి రాలేదు .అక్కడున్న మార్షుల అనుమతి తో ,కొద్దిగా జలాన్ని తీర్ధం గా త్రాగాడు .తర్వాత దూర్వాసుడు వచ్చి ,జరిగిన దానికి కోప పది తన శిరస్సు లోని ఒక జడ ను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు .అది అతి భయంకరం గా మీదకు రావటం గ్రహించి ,రాజు ,శ్రీ హరిణి మనసు లో ధ్యానించాడు .వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి ,పిశాచాన్ని చంపి ,,దుర్వాసుని చంప టానికి మీదకు వెళ్ళింది .
భయం తో దుర్వాసుడు పారి పోవటం ప్రారంభించాడు .చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది .మూడు లోకాలూ తిరిగి నా ఎవరూ,దుర్వాసునికి అభయం ఇవ్వ లేదు .చివరికి విష్ణువు ఆజ్ఞా తో మళ్ళీ అమ్బరీశున్నే శరణు వేడాడు .అంబరీషుడు అతన్ని క్షమించాడు .వెంటనే చక్రం అదృశ్య మైంది .భగవంతుని కంటే ,భక్తుడే శక్తి కల వాడు అని ఈ కధ మనకు తెలియ జేస్తుంది .
ద్వాపర యుగం లో కుంతిభోజుడు అనే రాజు దగ్గరకు దుర్వాసుడు వచ్చాడు .ఆయన కుమార్తె కుంటే దేవిని చూసి ,ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిచాడు .ఆ మంత్రాన్ని ఏ దేవుడిని ఉద్దేశించి జపిస్తే ,ఆయన వల్ల మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు .కుంటే దేవి బుద్ధి చాపల్యం తో ఆమంత్ర ప్రభావాన్ని పరీక్షించాలను కొంది .సూర్యుని గురించి ప్రార్ధించింది .ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు కుంతికి వివాహం అయిన తర్వాత ధర్మ దేవత ,వాయుదేవుడు ,ఇంద్రుడు ,అశ్వినీ దేవతలను దుర్వాసుని మంత్రం తో స్మరించి ,క్రమంగా ధర్మ రాజు ,భీముడు ,అర్జునుడు ,నకుల సహ దేవులను కన్నది .వీరే పంచ పాండవులు .కర్ణుడిని నదిలో వదిలి పెడితే ఆతడు సూతుది కి దొరికి అక్కడ పెరిగి కుమారాస్త్ర విద్యా ప్రదర్శన లో తన సామర్ధ్యం రుజువు చేసు కోని ,దుర్యోధనుని మనసు గెల్చి ,అంగ రాజ్యానికి అభిషిక్తుడై ,కౌరవ పక్షం లో ముఖ్యుడైన సంగతి మనకు తెలిసిందే.
దూర్వాసుడు వైష్ణవ ,శాక్తేయాది మహా మంత్రాలన్నీ జపించి నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది .చివరికి ”శ్రీ హనుమత్సంజీవినీ విద్య ”నేర్చి జపించాడు .అప్పుడు హనుమ ఒకే ముఖం తో 18 భుజాలతో దర్శన మిచ్చాడు .దుర్వాసుడు పరవశించి ఆన్జనేయుడిని భక్తీ తో కీర్తించాడు .చక్కని శ్లోకం తో ఆయన్ను వర్ణించాడు -
”శక్తిం ,పాశం చ కుంతం ,పరశు మపి హలం తోమరం ,ఖేతకం వా
శంఖం చక్రం త్రిశూలం ముసలమపి గడం పట్టాసం ముద్గరం చ
గాండీవం బాణ పద్మం ,ద్వినవ వర భుజైహ్,ఖడ్గ మస్యావదానం
వందేహం వాయుసూనుం ,సురరిపు మధనం ,భక్త రక్షా దురీణం .”
ఈ శ్లోకం విన గానే ,ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి ,అదృశ్యమైనాడు .అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తీ శ్రద్ధ లోతో జపిస్తూ మనశ్శాంతి ని పొందుతూ ,కోపం లేని వాడై ,గంధమాదన పర్వతం ఈదే నివశిస్తూ ,మహా యోగి యై శివుని వలె నిత్య ప్రాతస్మరనుడు అయాడు ..కనుక మానషిక శాంతి లభించాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అనిదుర్వాసుని కధల వల్ల మనకు తెలుస్తోంది .దుర్వాసముని కధ సమాప్తం.


MARRIAGE IS A UNIVERSITY


BORING PERSON


REDUCE MONTHLY PROBLEMS WITH YOGA


HOW TO LEARN AND IMPLEMENT YOGA FOR GOOD HEALTH


HEALTHY FOOD TO HEALTHY WOMEN - TOP FOOD HEALTH TIPS TO TELUGU WOMEN


HEALTHY EATING FOOD TIPS TO WOMEN WHO LEFT FOR JOB


ANCIENT YOGA FOR REDUCING FAT CONTENT IN HUMAN BODY


ONLY NEXT TO OUR CATEGORY


VERY POOR IN MATHS DAD


HINDU GODS AND THEIR VAHANS


REDUCE YOUR WEIGHT WITH HONEY AND NIMBOO DAILY


బరువు తగ్గండిలా
అధిక బరువు ఉన్నవారు రోజూ ఉదయం వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గుతారు.

 గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. 

ఆహారం సక్రమంగా పచనమవడానికి అవసరమైన జీర్ణరసాలను కాలేయం ఉత్పత్తి చేయడంలో

 ఈ రసం దివ్యౌషధంగా పని చేస్తుంది. జీర్ణవాహికలో కదలికలు సరిగ్గా జరగడానికి, 

కడుపు ఉబ్బరం తగ్గడానికి కూడా తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమం 

ఎంతో ఉపయోగపడుతుంది.

PAPER ART DESIGNS


Heart Crystal Bracelets
LORD SRINIVASA AND GODDESS PADAMAVATHI MARRIAGE STORY IN TELUGUపద్మావతీ శ్రీనివాసుల కల్యాణము

ఆకాశరాజు శ్రీనివాసునకు ఎదుర్కోలు గావించుట

ఆకాశరాజు రాజధానియైన నారాయణపుర మంతయూ అతివైభవముగా అలంకరించారు. చలువ పందిళ్ళు వేసి పచ్చల తోరణములు గట్టి, పన్నీరు కలపిన కల్లాపు జల్లించిరి. ముత్యాలమ్రుగ్గులు బెట్టించిరి. పద్మావతీదేవికి అంతఃపుర స్త్రీలు మంగళస్నాములు చేయించి, బంగారు చెరగుల పట్టుపీతాంబరము కట్టించి యేడు వారముల నగలు ధరింపజేసి, శ్రీమహాలక్ష్మి వలె శృంగారించిరి. శ్రీనివాసమూర్తి వచ్చెనను వార్త విని ఆకాశరాజు పద్మావతిదేవిని పట్టపుయేనుగుపై గూర్చుండబెట్టి, మంగళ వాద్యములతో శ్రీనివాసునకు యెదురుగా నేగెను.
ఆకాశరాజు శ్రీనివాసుని గాంచి అనేక విధముల స్తోత్రించి తన కుమారై పద్మావతిని అతనిని పునర్దర్శనము చేయించెను. అంతట పద్మావతీ శ్రీనివాసులను సమస్త మేళతాళములతో ప్రవేశింపజేసి వీధులందు ఉత్సవము చేయించెను. ఆ వుత్సవ సమయమున నగరములో వున్న పుణ్యస్త్రీలు పద్మావతీ శ్రీనివాసులకు హారతులు పట్టి పూజలు పుష్పములు అక్షంతలు వారిపై జల్లి దీవించిరి. వంది మాగధులు కైవారములు చేయుచుండ నృత్యగాన వాద్యములు మ్రోయుచుండ జయజయ శబ్దములు మునులు పలుకచుండ పట్టణమంతయూ వధూవరులను ఊరేగించిరి. అనంతరము శ్రీనివాసుని నొక దివ్యమందిరంలో ప్రవేశపెట్టిరి. మిగతావారందరికి తగిన విధముగా విడుదులు యేర్పరచిరి.

అంత ఆ రాత్రి ఆకాశరాజు అనేకమంది పాకశాస్త్ర ప్రవీణులచేత మంచి మంచి పదార్థములు ఆనేకరకములు చేయించి పెండ్లివారందరికి ఆనందముగా భోజనములు పెట్టించెను. ఆ రాత్రి అందరూ సుఖముగా గడిపిరి. ఆ రాత్రి ఆకాశరాజు వశిష్ఠాది పురోహితులతో కల్యాణమునకు కావలసిన వస్తుసంబారము లన్నియూ అడిగి తెలిసికొని వారు చెప్పినట్లు అన్ని వస్తువులనూ సిద్ధము చేయించెను. ధరణీదేవి చెలికత్తెల నందఱిని చేర్చుకొని చీరెలూ, రవికలు, పూజాద్రవ్యములు పండ్లు, పసుపు కుంకుమలు నగలు మొదలయినవి కళ్యాణమునకు సిద్ధము చేసెను.


పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణము

ముహూర్తము సమీపించుచుండగా ఆకాశరాజు సమస్త బంధువులతో మంగళవాద్యములతో శ్రీనివాసుని విడిది గృహమునకు బోయిరి. అంతట వశిష్ఠ మహాముని ఆకాశరాజుతో "ఆర్యా! మీ దంపతులు వరుని పూజ గావింప వలసినది" అనెను. ఆకాశరాజు దంపతులు శ్రీనివాసునకు చందన తాంబూలములు వస్త్రములు భూషణములు యిచ్చి పుష్పములచే పూజించిరి. శ్రీనివాసుని పట్టపు యేనుగుపై గూర్చుండజేసి, బ్రహ్మాది దేవతలూ, మునులు, పుణ్యాంగనలు, సమస్త వాద్యములతో విడిది గృహమునండి రాజమందిరద్వారము చెంతకు దీసుకొని వచ్చిరి, ద్వారము వద్ద పుణ్యస్త్రీలు శ్రీనివాసునకు నీరాజనమిచ్చిరి.
పిమ్మట కన్నుల పండుగగా వైభవముగా కళకళలాడు కళ్యాణ మంటపమునకు శ్రీనివాసుని గొనిపోయి బంగారు పీటపై గూర్చుండబెట్టిరి. అంతట వశిష్ఠ మహాముని చెప్పగా పవిత్రమగు స్వామి పుష్కరిణి తీర్థము ధరణీదేవి బంగారుకలశములతో పోయుచుండ ఆకాశరాజు, శ్రీనివాసుని పాదములు గడిగి తన శిరస్సునా భార్య శిరస్సునా జల్లుకొనెను.

వశిష్ఠుడు బృహప్సతియూ కల్యాణ మంత్రములు ప్రారంభించిరి. ఆకాశరాజు పద్మవతీదేవి చేతిని పట్టుకొని ధరణిదేవి బంగారు పాత్రలో జలము పోయుచుండ శ్రీనివాసుని చేతిలో ధారపోసెను. వశిష్ఠుడు వధూవరులకు కంకణములు గట్టెను. సుముహూర్త గడియవచ్చెను. వశిష్ఠాదులు మంత్రములు చెప్పుచుండ మంగళవాద్యములు మ్రోగుచుండ ముత్తైదువులు మంగళములు పాడుచుండ శ్రీనివాసమూర్తి పద్మావతీ మెడలో మాంగల్యము కట్టెను. దేవతలు పుష్పవర్షము గురిపించిరి. మహామునులు ఆశీర్వదించిరి. అనంతరము మంచి ముత్యములతో కళ్యాణదంపతులిద్దరూ తలంబ్రాలు పోసుకొనిరి. పెండ్లివేడుక జరిగిపోయెను.

ఆకాశరాజు శ్రీనివాసునకు పద్మావతిని అప్పగించుట

కళ్యాణ సమయమున ఆకాశరాజు అల్లుడైన శ్రీనివాసునకు కట్నముగా నూరు బారువుల బంగారు కిరీటము, ఒక కోటి బంగారు నిష్కములను, మణులు చెక్కిన కంఠహారములు, మాణిక్య పతకములు, మకర కుండలములు, సింహతలాట కంకణములు, రవ్వల ఉంగరములు, బంగారు మొలత్రాడు, అపరంజి పాదుకలు, బంగారు భోజనపాత్రలు రత్నకంబళములు, వేయి యేనుగులు, పదివేల గుఱ్ఱములు, దాస దాసీజనములు మొదలైన అనేక విధములగు వాటిని నిచ్చెను.

పద్మావతీదేవికి చీని చీనాంబరములు, మణిమయ సువర్ణభూషణములు, దాసీజనమును, నూరు గ్రామములును యిచ్చి గౌరవించెను. వివాహమునకు వచ్చిన శ్రీనివాసుని వైపు వారికిని తనవైపు వారికిని సమస్త మర్యాదలూ చేసెను. బ్రాహ్మణులకు భూరి సంభావనలిచ్చి మృష్టాన్నములు పెట్టించెను. ఈ విధముగా అయిదు రోజులు పెండ్లి మహావైభవముగా జరిగినది.

ఆకాశరాజు, ధరణిదేవియును పాలధారలతో పద్మావతీదేవిని శ్రీనివాసుని చేతిలో నప్పగించి, ఆకాశరాజు శ్రీనివాసునితో యిలా అన్నాడు! "నాయనా! శ్రీనివాసా! నీవు సాక్షాత్తూ భగవానుడవని తెలుసుకున్నాను. నీ పాదములు గడిగి బిడ్డ నిచ్చుటవలన మా వంశమంతా తరించింది. నేను పూర్వజన్మమున యెంతో పుణ్యము చేయుటవల్ల భగవంతుడైన నీవు అల్లుడవైనావు నీవు ధర్మదేవతవు. నీకు తెలియని ధర్మములులేవు. అయిననూ తండ్రి ధర్మమువల్ల నీకొక్క మాట మనవి చేసికొందును. ఏమంధువా? మా పద్మావతి ఏమీ తెలియని బాల. ఆమెను ఎలా ఏలుకొంటావో సుమా! పూర్వము నీ సంగతి తెలియనప్పుడు నిన్ను రాళ్లచే కొట్టించెనన్న సంగతి మనసులో పుంచుకొనక క్షమించుము" అని ప్రార్థించి పద్మావతితో యిలా అన్నాడు. "అమ్మా! నీవు విజ్ఞానవంతురాలవు. నేను చెప్పుమాటలు సావధానముగా విను. నీవు చాలా అదృష్టవంతురాలవు. ఏలనన? భగవానునకు యిల్లాలు వగుటచేత సుమా! స్త్రీకి భర్తయే భగవంతుడు ఎల్లప్పుడు భర్తపాదసేవ మరువకుము. నీ పతిమాటలకు యెన్నడూ యెదురాడకము. పెద్దల సేవ చేయుము ఆశ్రయించినవారిని ఆదరముతో పోషింపుము. పుట్టినింటికి అత్తవారింటికి పేరు ప్రతిష్ఠలు తేవలసినది. అనసూయాది మహాతల్లుల చరిత్రలు జ్ఞప్తికి తెచ్చుకొని ప్రవర్తింపుము. మమ్ము మరువకుము" అని యెన్నియో మంచి వాక్యములు బోధించెను.

పద్మావతిని అత్తగారింటికి ప్రయాణము చేయించిరి. సారెలు నగలతో శ్రీనివాసునితో కూడా ప్రయాణమైరి. శ్రీనివాసమూర్తి ఆత్తమామల సెలవొంది పద్మావతితో గరుడవాహన మొక్కెను. మిగిలిన పెండ్లివారు తమతమ వాహనములనెక్కి ప్రయాణము సాగించిరి.

శ్రీనివాసుడు పద్మావతితో అగస్త్యాశ్రమమున నుండుట

శ్రీనివాసుడు ప్రయాణము సాగించుచూ ఆకాశరాజును జూచి "మామా! నీవు నా కొనర్చినమేలు యెన్నటికినీ మరువను. నీకేమి కావలెనో కోరుకొనుము యిచ్చెదను" అనెను. ఆకాశరాజు యిట్లనెను.
"భగవానుడా! నీ కరుణ వలన నాకు రాజ్యము మొదలైన సమస్త భోగములు వున్నవి. నాకేమి కొరత, అయిననూ నిన్నొకటి కోరెదను. ఏమన? నా మనస్సు సర్వదా నీ నామస్మరణ మరువకుండునట్లు వరమిమ్ము. అంతకంటే నాకేమియూ వద్దు" అని ప్రార్థించెను. శ్రీనివాసుడు సంతసించి "నీకు పరమాత్ముని సాయుజ్యమును ప్రసాదించితి" ననెను. ఆకాశరాజు ఆనందమందెను. శ్రీనివాసుడు వారి సెలవు దీసుకుని సమస్త పరివారముతో ప్రయాణము సాగించి మార్గమధ్యములో అగస్త్యుని ఆశ్రమము చేరిరి. అచ్చట అగస్త్య మహాముని శ్రీనివాసుని భక్తితో పూజించెను. తరువాత శ్రీనివాసమూర్తి బ్రహ్మాదిదేవతలతో యిట్లనెను.

"అయ్యలారా! మీ కొక్క విశేషము చెప్పెదను. వివాహమైన నూతన దంపతులు ఆరునెలల వరకూ యీ అగస్త్యముని ఆశ్రమమందే యుండి అనంతరము శేషాచలమునకు చేరెదను" అని వారినందరినీ పేరు పేరున వరుసగా మర్యాదలు చేసెను. బ్రహ్మ మొదలైన వారందరూ శ్రీనివాసుని ఆజ్ఞ తీసుకుని తమతమ యిండ్లకు చేరిరి. శ్రీనివాసమూర్తి పద్మావతీదేవితో సుఖముగా అగస్త్యముని ఆశ్రమములో నుండెను.
ఆకాశరాజు మోక్షము పొందుట

ఒకనాడు నారాయణ పురమునుండి ఒక సేవకుడు అగస్త్యముని ఆశ్రమమునకు వచ్చి, పద్మావతీ శ్రీనివాసులను జూచి దుఃఖముతో "అయ్యా! మా ప్రభువైన ఆకాశరాజుగారికి అకస్మాత్తుగా జబ్బుచేసింది. వారు చాలా ప్రమాద స్థితిలోవున్నారు. మహారాజుగారు మిమ్ములను చూడవలెనని కోరుచున్నారు. కనుక దయచేయుడు" అనెను.
ఆ మాటలు విని పద్మావతీ శ్రీనివాసులు విచారపడి అగస్త్యమహామునిని తమ వెంటబెట్టుకొని తొందరగా నారాయణపురము జేరిరి. ఆకాశరాజు స్పృహలేక యుండెను. శ్రీనివాసముర్తి దుఃఖముతో మహారాజును పలుకరించెను. గాని ప్రత్యుత్తరము చెప్పుస్థితిలో లేడు. పద్మావతి తల్లియైన ధరణిదేవిని కౌగలించుకొని యేడ్చుచుండెను. ఆ ఆకాశరాజు కొంతసేపటికి కొంచెము కన్నెత్తి చూసెను. కూతురును అల్లుడును కనుపించిరి.

మరణావస్థలో వున్న ఆకాశరాజు యెట్లో ఓపిక తెచ్చుకొని శ్రీనివాసునితో యిట్లనెను. "పరంధామా! జగన్నాధా! వాసుదేవా! గోవిందా! అంత్యకాలములో నిన్ను చూచి నా జన్మ తరించినది. నాకేమీ కోరికలేదు. కాని నిన్నొక్కటి ప్రార్థిస్తాను. నా కుమారుడైన "వసుదాసుడు" నా తమ్ముడైన "తొండమానుడు" యేమి తెలియనివారు వారిద్దరిని కంటికి రెప్పవలె కాపాడుము. నాకదియే పదివేలు" అని జెప్పి కుమారైయైన పద్మావతీదేవిని దగ్గరచేర్చుకొని, "అమ్మా! నీవు లోకమాతవు. నీ వలన నా వంశము తరించినది. నీకునూ నీ తండ్రికిని యీ జన్మతో ఋణము తీరినదని తలంచుము. సుఖముగా వర్దిల్లుము అని పలికి ప్రాణములు విడిచెను. అందరూ గొల్లుమని యేడ్చిరి. ఆకాశరాజునకు దహనసంస్కార మొనర్చిరి. ధరణిదేవి తన భర్తతో సహగమనము చేసెను. తరువాత పద్మావతీ శ్రీనివాసులు మరలా అగస్త్యముని ఆశ్రమము చేరి సుఖముగా నుండిరి.

తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము

పూర్వము ఒకానొకప్పుడు "వైఖానసుడు" అనుభక్తుడు కలడు అతడు కృష్ణావతారమును మిక్కిలి ప్రేమించును. అందువలన కృష్ణభగవానుని ప్రత్యక్షముగా చూడవలెనని కోరిక గలిగి నిద్రాహారములు మానుకుని అఖండ దీక్షతో భగవంతుని గురించి తపస్సు ప్రారంబించెను. ఆ తపస్సు యెన్నియో యేండ్లు జరిగినది. పట్టుదలతో చేయు చుండిన ఆ తపస్సునకు భగవానుడైన శ్రీమహావిష్ణువు సంతసించి అతనికి ప్రత్యక్షమై "భక్తుడా! నీ కేమి కావలెనో కోరుకొమ్మనెను. వైఖానసుడు కన్నులు దేరచి భగవంతుని దివ్యమంగళ విగ్రహమును జూచి మిక్కిలి సంతసించి స్వామి పాదములకు సాష్టాంగ దండప్రణామ మొనరించి యిట్లు ప్రార్థించెను.

మహానుభావా! కరుణాసముద్రా! దేవదేవా! నాకు యితరమైన కోరికలు లేవు. కాని నీ కృష్ణావతారమును కన్నులారా చూచి పూజించవలెనని మాత్రము వాంఛ వున్నది. నాకు ఆ భాగ్యము ప్రసాదింపుము" మనెను. శ్రీహరి "నాయనా! నీవిప్పుడు కృష్ణరూపమును చూడజాలవు. కాని యిప్పుడు శేషాద్రియందు కృష్ణుడే శ్రీనివాసరూపముతో ఒక పుట్టలో నున్నాడు. నీవు అతని పూజింపుము" అని చెప్పి విష్ణుమూర్తి అంతర్థాన మయ్యెను.

వైఖానస ఋషి సంతోషించి, అక్కడినుండి శేషాద్రికి ప్రయాణమై పోవుచుండెను. మార్గమధ్యమున "రంగదాసు అను భక్తుడు వైఖానసుని కలిసి "స్వామీ! తామెక్కడికి పోవుచున్నారనెను. వైఖానసుడు వానితో "నాయనా! నేను శేషాద్రియందున్న శ్రీనివాసుని సేవించుటకు పోవుచున్నాను అనెను. ఆ మాటవిని రంగదాసు "మహానుభావా! నేనునూ స్వామి సేవకు వచ్చెదను పూజయందు మీకు సహాయముగా నుందును నన్నునూ తీసుకొనిపోవలసిన" దని కోరెను. వైఖానసుడు సంతిసంచి అట్లే రమ్మనెను. వారిద్దఱూ కలిసి శేషాద్రిపర్వతమునకు ప్రయాణము సాగించి కొండపైకెక్కిరి.

వైఖానసముని పుట్టవద్దకు చేరియందున్న భగవానుని పూజింపనెంచి రంగదాసుతో " ఓయీ! స్వామిని పూలతో పూజించిన చాలా సంతోషించి తొందరగా ముక్తినిచ్చును. గనుక నీవు ఒక పూలతోట పెంచి స్వామి పూజకు పూలు యిచ్చుచుండు" మనెను.

రంగదాసు సంతోషించి పూలతోటను పెంచుటకు నీరు ముఖ్యముగాన అందులకై ఒక భావిని త్రవ్వించెను. దానికే "పూలబావి" అని పేరు. రంగదాసు పూలతోటనాటి ఆ బావిలో నీరుతోడి పోయుచూ వనమును పెంచి అందలి పూలుప్రతిదినమూ స్వామిపూజకు వైఖానసమునికి యిచ్చుచుండెను.

ఇట్లుండ ఒకనాడు ఒక గంధర్వరాజు తన భార్యలతో పుష్కరిణిలో జలక్రిడలాడుచుండెను. పువ్వులకొరకు వచ్చిన రంగదాసు వారి క్రీడలు జూచుచు తానునూ చిత్తచాంచల్యముతో అట్లే వుండిపోయెను. స్వామిపూజకు వేళమించు చుండెనని కూడా గుర్తింపకుండెను. తరువాత ఆ గంధర్వులు వెళ్ళిన యనంతరము తెలివివచ్చి పూలు కోసుకొని బిరబిర వైఖానసముని వద్దకు వచ్చెను. ముని వాని ఆలస్యమునకు కారణమేమన, రంగదాసు జరిగిన వృత్తాంతము నెరింగించి తాను పూజకు ఆలస్యము చేసినందుకు భగవంతుని అనేక విధముల ప్రార్థించెను. అంతట శ్రీనివాసమూర్తి ప్రత్యక్షమై "రంగదాసుడా! విచారింపకుము. నీవు నా మాయా మోహముచే గంధర్వుల సుఖములపై భ్రాంతి జెందితిని. నీవు యీ శరీరము విడిచి నారాయణపురమున సుధర్మరాజునకు కుమారుడవై "తొండమానుడు" అను పేరుతో రాజ్యసుఖములను అనుభవింపుము" అని చెప్పెను. ఆ రంగదాసుడే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడై పుట్టెను.

BEAUTIFUL VILLAGE WOMEN PAINTING


DREAMING COLORS


INFORMATION IN TELUGU ABOUT INDIAN NATIONAL FLAG AND ASHOKA CHAKRA


మన భారత జాతీయపతాకంలోని అశోకచక్రం గురించిన వివరాలు తెలుసుకుందాం

అశోకచక్రాన్నే ధర్మచక్రం అని కూడా అంటారు... ఇందులో 24 ఆకులు (స్పోక్స్) గలవు. ఈ చక్రం గురించి, మౌర్య సామ్రాజ్యం లో అనేక కథనాలున్నవి. అశోక చక్రవర్తి (273 - 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్తంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటుచేసుకున్నది. దీనిని 1947 జూలై 22 న, పొందుపరచారు. ఈ అశోకచక్రం, తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో 'నీలి ఊదా' రంగులో గలదు.

ప్రఖ్యాత 'సాండ్-స్టోన్' (ఇసుకరాయి) లో చెక్కబడిన 'నాలుగు సింహాల' చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో గలదు. ఇది అశోక స్తంభం పైభాగాన గలదు. దీని నిర్మాణ క్రీ.పూ. 250 లో జరిగినది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.

డిజైను వెనుక గల చరిత్ర మరియు కారణాలు

ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మింపబడినది. 'చక్ర' అనేది సంస్కృత పదము, దీనికి ఇంకో అర్థం, స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది. 'గుర్రం' ఖచ్చితత్వానికీ మరియు 'ఎద్దు' కృషి కి చిహ్నాలు.

ఈ చక్రంలో గల 24 ఆకులు (స్పోక్స్), 24 భావాలను సూచిస్తాయి :

ప్రేమ (Love)
ధైర్యము (Courage)
సహనం (Patience)
శాంతి (Peacefulness)
కరుణ (kindness)
మంచి (Goodness)
విశ్వాసం (Faithfulness)
మృదుస్వభావం (Gentleness)
సంయమనం (Self-control)
త్యాగనిరతి (Selflessness)
ఆత్మార్పణ (Self sacrifice)
నిజాయితీ (Truthfulness)
సచ్ఛీలత (Righteousness)
న్యాయం (Justice)
దయ (Mercy)
హుందాతనం (Graciousness)
వినమ్రత (Humility)
దయ (Empathy)
జాలి (Sympathy)
దివ్యజ్ఞానం (Godly knowledge)
ఈశ్వర జ్ఞానం (Godly wisdom)
దైవనీతి (దివ్యనీతి) (Godly moral)
దైవభీతి (దైవభక్తి) (Reverential fear of God)
దైవంపై ఆశ/నమ్మకం/విశ్వాసం (Hope/trust/faith in the goodness of God.)

భారతీయ పాఠ్యపుస్తకాల అనుసారం, ఈ ఇరవైనాలుగు ఆకులు (స్పోక్స్), 24 గంటలూ భారత ప్రగతిని సూచిస్తాయి.

SWEET AND CUTE BABIES


AMAZING PAINTING OF LORD SRI KRISHNA


PREPARATION OF TEA


loading...