loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TOTAL CHANGE RECOGNITION


GROUP DIVISION


BAPU VILLAGE HALF SAREE BEAUTY SKETCH


ALL FOUR


TIFFEN CHOICE


SUMMER CARTOONS


BIRTH STORY OF THRILOKA SANCHARI NARADHA MAHA MUNI IN TELUGU


 నారదుని పూర్వజన్మ వృత్తాంతము

సీ. విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱేమియును
లేదు విశ్వమునకు
భవవృద్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీ ముఖమున
నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము కావున హరిపరాక్రమములెల్ల

ఆ. వినుతిసేయు మీవు వినికియుఁ జదువును
దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమికెల్ల ఫలము గాదె పుణ్యశ్లోకుఁ
గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.

నారద మహర్షి వ్యాకులతతో ఉన్న వ్యాసునితో ఇంకా ఇల్లా చెప్పసాగాడు......"మునీంద్రా! ఈ విశ్వమంతా ఆ శ్రీ మహావిష్ణువే. ఆతనికి మించినది,వేరైనది ఏదీ ఈ విశ్వాంతరాళంలో లేదు.సర్వ సృష్టి,స్థితి,వృద్ధి,లయాలన్నీ ఆ పరమేశ్వరుని వలననే జరుగునని నీకు తెలిసిన విషయమే కదా! నీవు ఈ లోకకళ్యాణానికై విష్ణ్వంశతో జన్మించినాడవు..కావున ఆ హరి లీలలన్నిటినీ భాగవత కథారూపాన లోకానికి వివరించు..ఆ కమలనాభుని కీర్తించగలిగినప్పుడే కదా సర్వ రూపమైన తపస్సులూ,సర్వమైన సంపదలూ సఫలాలౌతాయి!

మహాత్మా! నేను నా పూర్వజన్మలో(ఇంతకు ముందు కల్పాన) సదాచారులైన వేదవాదుల ఇంటి దాసికి జన్మించాను. వాళ్ళు,నా చిన్నతనంలో ఒక వానాకాలంలో, చాతుర్మాస్య వ్రతం చేస్తూ, ఒకచోట నిలిచి ఉండే యోగులకు పరిచర్య చేయటానికి నన్ను నియమించారు.(చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి-శయనైకాదశి తో మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి-ఉత్థాన ఏకాదశితో ముగుస్తుంది.ఈ నాల్గునెలలూ నిత్య సంచారులైన యోగులు ఒక్కచోట కదలకుండా ఉండి ఆ నారాయణున్ని అర్చిస్తారు.) నేను నేర్పుగా,ఓర్పుగా అన్ని పనులు చేస్తూ, అందరు బాలురవలే ఆటలకు వెళ్ళక, ఏ ఇతర జంజాటాలు లేకుండా భక్తితో వారిని సేవించాను. వారు మిగిల్చిన ఎంగిలి శుభంగా భావించి భుజిస్తూ,ఎండ వానల్ని లెక్కచేయకుండా వారిని వర్షాకాల,శరత్కాలాలు సేవించాను.వాళ్ళు విష్ణుచరితలు చదువుతూ,పాడుతూ ఉంటే, అవి నా చెవులకు అమృతంలా అనిపించేవి.మనసుకు అపరిమితమైన ఆనందం కలిగేది.దానితో నేను కూడా హరినామకీర్తనం చెయ్యటం మొదలెట్టాను.అలా ఆ మహాజనులవల్ల నాలో రజస్తమోగుణ హారిణియైన ’భక్తి’ కలిగింది.....

కొంతకాలానికి వారి చాతుర్మాస్య వ్రతం ముగిసి, ఆ యోగులు తిరిగి దేశాటనానికి బయల్దేరారు...అంతట వారు, ఎటువంటి అపచారం లేకుండా భక్తితో నిత్యపరిచర్య చేసిన నన్ను పిలిచి, పరమ ప్రీతితో,కరుణతో నాకు అతిరహస్యమైన ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశం వల్ల ఆ వాసుదేవుని సర్వ మాయావిలాసాన్ని తెలుసుకున్నాను. ఏ పదార్థం వలనైతే వ్యాధి వస్తుందో, ఆ వ్యాధి మాన్చటానికి అదే పదార్థం ఎలా పనికిరాదో, అలానే సంసారహేతుకమైన కర్మలు ఈశ్వర సన్నిధానానికి ప్రతిబంధకాలుగా మారతాయి.వాటిని ఈశ్వరార్పితంగా భావించి ఆచరించాలి. అప్పుడు భక్తియోగం కలుగుతుంది. ప్రణవ సహితంగా వాసుదేవ,ప్రద్యుమ్న,సంకర్షణ,అనిరుద్ధ అనే ఈ నాలుగు నామాల్ని భక్తి పూర్వకంగా పలికి, నమస్కారం చేసి, మంత్రమూర్తియైన ఆ యజ్ఞపురుషుని పూజించిన వాడు సమ్యగ్దర్శనుడౌతాడు.నేను ఆ విధంగా చేయగా, ఆ హరి సంతసించి తనయందలి పరమేశ్వర జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు.

అలా రోజులు గడుస్తున్నాయి.నా తల్లి మా యజమానుల ఇంట భక్తితో పనులన్నీ చేసి, నావద్దకు రేపు మాపు వచ్చి నేను అలసితినని, ఆకొంటినని నాకు అన్నమిడి, నన్ను ముద్దాడి, చుంచు దువ్వి, నన్ను కౌగిలించుకుని ప్రేమగా ఒళ్ళంతా నిమిరెడిది. ఒకనాటి రాత్రి, నా తల్లి పాలు పితకటానికి వెళ్ళ్గి చీకటిలో చూడక పాముతోక తొక్కగా,అది వెంటనే నా తల్లిని కరిచింది. ఆ విషప్రభావాన నా తల్లి విగతజీవియై వెంటనే నేలకూలింది.అది చూచి నేను మోహం పొందక, సంసారబంధాలు తొలగిపోయాయని భావించి,విష్ణుపద ధ్యానంమీద బుద్ధి నిలిపి ఇల్లు వదిలి ఉత్తరాభిముఖంగా బయలుదేరాను.అలా బయలుదేరి, పట్టణాలు,జనపదాలు,పల్లెలు,నదులు,పర్వతాలు,అడవులు దాటి సర్వజంతు వాసితమైన ఒక భీకరారణ్యం ప్రవేశించాను.అక్కడ ఒక సరస్సులో స్నానమాడి, శుచినై, ఒక రావిచెట్టు క్రింద కూర్చుని, నేను విన్న విధంగా నా హృదయగతుడైన ఆ పరమాత్మని,హరిని చింతించాను.అలా ధ్యాననిమగ్నుడనైన నాకు, ఆనందాశ్రువులు రాలగా, రోమాంచం కలుగుతుండగా, నా తలపులో ఆ దేవదేవుడు కనిపించినట్లైంది.కాని ఆ హరి దివ్యరూపం నా కన్నులకు కనపడలేదు.ఆ హరికోసం శోకిస్తూ, నేను ఆ వనం అంతా కలియతిరుగుతుండగా, నన్నుద్దేశించి ఆ హరి మృదు మధుర స్వరంతో ఇలాపలికాడు."కుమారా!దుఃఖించకు.ఈ జన్మలో నన్ను చూడలేవు. నీవు ఈ శరీరాన్ని విడిచిన పిమ్మట, నా భక్తుడవై జన్మిస్తావు.ఈ సృష్టి లయం జరిగి, పునఃసృష్టి జరిగినప్పుడు నా కృపతో జన్మించి, శుద్ధసత్వులందరిలోకి అగ్రగణ్యుడవై వర్ధిల్లుతావు."

అలా ఆ అశరీరవాణి పలుకగా, నేను తలవంచి నమస్కరించితిని. కామక్రోధాదులైన అరిషడ్వర్గాన్ని వర్జించి, ఆ అనంతుని నామాలు పఠిస్తూ,విషయవిరక్తుణ్ణై, కాలానికై ఎదురుచూస్తూ తిరుగుతూ ఉండగా కొంతకాలానికి మెఱుపు మెఱిసినట్టు మృత్యువు రాగా,ఈ పాంచభౌతికదేహాన్ని విడిచి, ఆ శ్రీహరి కృపవల్ల శుద్ధసత్వమయమైన భాగవత దేహాన్ని పొందాను.అంత ముల్లోకాల్నీ లయంచేసి, ఆ ప్రళయకాల జలరాశిమధ్య శయనించి ఉన్న నారాయణమూర్తి యొక్క నాభికమలగతుడై శయనించబోతున్న బ్రహ్మ నిశ్వాస వెంట ఆతని లోనికి ప్రవేశించాను.తరువాత వెయ్యి యుగాల కాలం గడిచిన తర్వాత నిద్రలేచి, లోకాల్ని సృష్టించడానికి ఉపక్రమిస్తున్న ఆ బ్రహ్మ ఉచ్ఛ్వాస వెంట నేను, మరీచి మొదలైన మునులు జన్మించాము. అప్పుడు నేను అఖండమైన బ్రహ్మచర్యాన్ని పూని, ఈశ్వరదత్తమై,బ్రహ్మనుంచి పుట్టిన సప్తస్వరాలని తనంతట తానుగా మోగించే ఈ మహతి(అనే వీణ)ని పూని, ఈ ముల్లోకాలలో ఆ నారాయణుని అనుగ్రహంతో ఏ అడ్డంకి లేకుండా, నారాయణ కథాగానం చేస్తూ చరిస్తూ ఉన్నాను.అంత ఆ మహావిష్ణువు పిలిచిన పలికే వాని లాగా నా మనసులో నిత్యం దర్శనమిస్తుంటాడు.మునీంద్రా!ఈ సంసారమనే సాగరంలో మునిగి, కర్మ వాంఛలచేత వేదన పడేవారికి, ఆ శ్రీహరి నామకీర్తనం తెప్పలాంటిది.అందువల్ల ఆ హరికథామృతాన్ని ప్రవచించి లోకాల్ని పావనం చెయ్యి." అని చెప్పి నారదుడు వ్యాసుని వద్ద వీడ్కోలు తీసుకుని వీణానాదం చేస్తూ ఆకాశమార్గాన వెళ్ళాడు అని సూత మహర్షి చెప్పి ఇలా అన్నాడు.

"వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుంద గీతములు జగములకున్
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే! "

లోకాఃసమస్తాస్సుఖినో భవంతు.

ARTICLE ON SARPAVARAM SRIBHAVANARAYANA SWAMY VARI TEMPLE - SARPAVARAM - KAKINADA - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


శ్రీభావనారాయణ స్వామి దేవాలయం (సర్పవరం)

మన కాకినాడలో, సర్పవరం జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనదని చెప్పబడుతున్న ఒక దేవాలయం ఉంది! అదే సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం. ఎత్తైన గాలిగోపురం, విశాలమైన ప్రాంగణం, పురాతనంగా కనిపించే మండపమూ, ప్రవేశద్వారాలూ, నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంబమూ… మనకి ఒక కొత్త అనుభూతి కలుగజేస్తాయి. గాలిగోపురానికి ఎదురుగా రోడ్డుకి అవతలివైపు నారదుడు స్నానం చేశాడని చెప్పబడే కొలను ఉంది.

* ఈ ఊరికి సర్పవరం అనే పేరు ఎందుకు వచ్చింది?:

కశ్యప, కద్రువ దంపతులకు చాలామంది సర్పరూప సంతానం ఉంటారు. జనమేజయుడనే చక్రవర్తి చేస్తున్న సర్పయాగంలో వారందరూ ఆహుతి కాబోవుచున్న సమయంలో వారిలో అనంతుడనే సర్పము విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి ఆ ఆపదనుంచి రక్షించబడతాడు. అనంతుడు తపస్సు చేసిన ఆ చోటనే విష్ణుమూర్తిని మూల భావనారాయణ స్వామి గా ప్రతిష్ఠ చేశాడట. ఇది పురాణాలలో చెప్పిఉన్నందున, ఈ ప్రతిష్ఠని పురాణవ్యక్తమైన మూర్తి అంటారు. ఒక సర్పముచే ప్రతిష్ఠించబడిన మూర్తి గల క్షేత్రం కనుక ఈ ఊరిని సర్పవరం అని పిలుస్తారు.

* ఈ స్వామిని భావనారాయణ స్వామి అని ఎందుకు పిలుస్తారు?:

ఒకసారి నారద మహర్షి దేవతలసభలో 'విష్ణుమాయను తెలుసుకోవడం నిరంతర నారాయణ జపం చేసే తనకు సాధ్యమని ' పలికెనట. తరువాత కొంతకాలానికి ఆయన భూలోక సంచారంచేస్తూ ఒక సుందరమైన సరస్సు చూసి, అక్కడ స్నానము చేయవలెనని తలచి, ఆసరస్సులో మునిగి తేలేసరికి విష్ణుమాయ వలన స్త్రీ రూపం పొదుతాడు.స్త్రీరూపంలో ఉన్న నారదుడిని నారదస్త్రీ అని వ్యవహరిస్తారు.

ఆమె పీఠికాపుర మహారాజుని వివాహమాడి 60మంది సంతానాన్ని కంటుంది.వారి పేర్లే 60 తెలుగు సంవత్సరాలపేర్లని చెబుతారు.పొరుగు రాజ్యంతో జరిగిన యుద్దంలో నారదస్త్రీ యొక్క భర్తా, 60మంది సంతానమూ మరణిస్తారు. అప్పుడు ఆమె ఆకలిబాధతో తనవారినిపోగొట్టుకొన్న దు:ఖ్ఖాన్ని కూడా మరచి అలమటిస్తుండగా ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉన్న సరస్సులో ఆమె ఎడమచేయి తడవకుండా స్నానం చెయ్యమని చెబుతాడు.

అతనుచెప్పిన విధంగానే సరస్సులో స్నానం చేసి భయటకు వచ్చేసరికి ఆమెకి అసలు రూపం వస్తుంది కానీ ఎడమచేతికి ఉన్న గాజులు అలానే మిగిలిపోతాయి. బ్రాహ్మణుడు ఎక్కడా కనిపించడు. నారదమహర్షి విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి వాటిని వదిలించుకొంటాడు. అప్పుడు నారద మహర్షి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావన్నారాయణ స్వామిని ప్రతిష్ఠిస్తాడు. నారదుని గర్వమనే భవరోగాన్ని వదిలించినస్వామి కనుక ఈయనను భావన్నారాయణ స్వామి అంటారు. ఋషిచే ప్రతిష్ఠించబడినది కావున ఈ క్షేత్రాన్ని ఆౠషం అంటారు.

* ఇక్కడి విశేషం ఏమిటి?:

ఇక్కడ స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామికూడా ఉంది. ముగ్గురు మూర్తులున్న దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠము అంటారు. శ్రీ కృష్ణదేవరాయల తండ్రి వసంతభోగరాయలు నిర్మించిన మండపం ఈ దేవాలయంలో ఉంది. ఈ విషయం ఇక్కడి శాశనాల వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడంవల్ల 108 నారాయణ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు.

* విశేషంగా జరిగే కార్యక్రమాలు ఏమిటి?:

మాఘమాసంలో నాలుగు ఆదివారాలూ తిరుణాళ్ళు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం ఘనంగా జరుగుతుంది.

BAPU CHITRALU


SRIVIDHYA RAHASYAMULU - DEVOTIONAL TELUGU BHAKTHI ARTICLE


శ్రీవిద్యా రహస్యములు

ఆది తత్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసన శ్రీవిద్యోపాసన. అది లలితా పర్యాయము, చండి పర్యాయము అని రెండు విధములు.

రెంటికి శబ్దతః భేదమే కానీ వస్తుతః భేదము లేదు. మొదటిది పంచాదశాక్షర మూల మంత్రముతో కూడినది. రెండవది నవాక్షర మంత్రముతో కూడినది.

ఆ పరమాత్మ స్వరూపాన్ని స్త్రీ మూర్తిగా పూజించుటలో ఒక విశేష సౌలబ్యము కలదు. తల్లి పిల్లల తప్పులను ఎంచక వాళ్ళను కడుపులో పెట్టుకొని లాలిస్తుంది. తండ్రి కోపబడినా, తల్లి అంత తొందరగా కోపబడదు. లోకం లో దుర్మార్గుడు అయిన బిడ్డ వుంటాడు గానీ, తల్లి వుండదు.

జగన్మాత ఉపాసన మాతృ సేవన వంటిది. ఆమెను సేవించడము అత్యంత సులభము.

శ్రీ చక్ర సంచారిణి ఐన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ, చరాచర సృష్టికి మూల కారణమయ్, అంతట వ్యాపించి, సర్వ ప్రాణులలో "శక్తి" స్వరూపం లో ఛిచ్చక్తి అయి , పరబ్రహ్మ స్వరూపం అయి ప్రకాశిస్తూ వున్నది. సకల ప్రాణులకూ తల్లి అయి " శ్రీమాతగా" పిలువబడు చున్నది.

అందుకే ఆమెను " ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ" ..... అని పోతనామాత్యులు అన్నారు.

పరమేశ్వరుని యందె అంతర్లీనమై , రక్త వర్ణ ప్రభలచే వెలుగొందుచూ, శ్రీచక్రము నందలి బిందు స్థానమై, పరాశక్తి అయి, శ్రీ లలిత గా సంభోదించ బడుచున్నది.

యోగ మాయ బలానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కట్టుబడి ఉండేవారే. యోగ మాయ కు అందరు తలలు ఒగ్గ వలసిన వారె. మాయ అంతర్ముఖ, బహిర్ముఖ బేధముతో
రెండు విధములగా వుంటుంది. ఈ మాయ వలెనే త్రిగుణాలు ఏర్పడినాయ్. అగ్ని మండడం, గాలి వీచడం, సూర్యుడు ఉదయించుట ఇవన్ని ఆమె వలెనే జరుగుతూ ఉంటాయ్.

ఆమె శక్తి గనుక లేక పొతే వాళ్ళకు గుణాలు వుండవు, పేర్లు మాత్రమే మిగులుతాయ్. ఆత్మను ఆశ్రయించిన మాయకే విద్య అని పేరు. ఇది ఒక ఆవరణ, దీనిని తొలిగిస్తే,
నిత్యమూ, సత్యమూ ఐన ఆ తల్లి రూపం కనిపిస్తుంది. ఇచ్ఛ, జ్ఞానము, క్రియ అనే మూడు శక్తులు ఆమెను ఆశ్రయించి వుంటాయి.

మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ రూపమైన ఆ శ్రీమాతను , ఆ పరదేవతను ఆరాధించి కొలవడమే శ్రీవిద్యోపాసన.

త్రిమూర్తులను, త్రిశక్తులను సృష్టించిన శ్రీమాత ఆమె. సర్వ సృష్టికి మూలాధారమైన ఆ ఆది శక్తి మన తల్లి.

ఒకప్పుడు ఆమెను దేవతలందరూ "అమ్మా నీవు ఎవరు? అని అడుగగా
" నేను బ్రహ్మ స్వరూపిణిని, నా వలెనే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించు చున్నది".... అని పలికినది.

అందుకే ఆమె "బ్రహ్మ విష్ణు శివాత్మిక" అని శివ శక్తి ఐక్య రూపిణీ లలితాంబిక ..... అని పిలవబడుచున్నది.

శ్రీ వాగ్దేవీం మహా కాళీం, మహా లక్ష్మీం, సరస్వతీం,
త్రిశక్తి రూపిణీం అంబాం, దుర్గాం, చండీం నమామ్యహం.

ARTICLE ON RUDRAPRAYAGHA TEMPLE - UTTHARAKHAND - INDIA


రుద్రప్రయాగ

రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడు. రుద్రప్రయాగ జిల్లా మూడు జిల్లాలలో నుండి కొంత కొంత భాగం తీసుకొనబడి ఏర్పరచబడినది. ఆ జిల్లాలు చమోలి, పౌరి మరియు తెహ్రి జిల్లాలు. ఈ జిల్లాను 16 సెప్టెంబర్ , 1997 లో ప్రకటించారు. ఈ టవున్ మందాకినీ మరియు అలకనంద నదుల సంగమంలో కలదు.
ఆలయలు ఆకర్షణలు

రుద్రప్రయాగ్ ఆలయ సమీపంలో జగదంబ ఆలయం ఉంది. .అగస్త్యముని టవున్ లో కల అగస్తేశ్వర్ మహాదేవ ఆలయం ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రుద్రప్రయాగ్ లో ప్రసిద్ధ ఆకర్షణలలో దేవోరియ సరస్సు ఒకటి. సముద్ర మట్టానికి 2438 మీటర్ల ఎత్తున కల ఈ సరస్సు శిఖర శ్రేణులతో ఇక్కడే కల గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ, యమునోత్రి మరియు నీల కంట శిఖరాలను చూపుతుంది. ఇక్కడ బర్డ్ వాచింగ్(పక్షుల వీక్షణ) వాటర్ బోటింగ్ మరియు యాన్గ్లింగ్ లు ఆనందించవచ్చు.

ఇక్కడ కల త్రియుగినారాయన్ అనే చిన్న గ్రామంలో హవన్ కుండ్ అనే నిరంతరం వెలిగే జ్యోతిని కూడా చూడవచ్చు. స్థానికుల నమ్మకాల మేరకు ఈ గ్రామం హిమవత్ రాజ్య రాజధాని అని ఇక్కడ ఈ జ్యోతి సమక్షంలో పార్వతీ పరమేస్వర్లు వివాహం చేసుకున్నారని చెపుతారు. రుద్ర ప్రయాగ్ లో ఇంకనూ చూడవలసినవి గుప్తకాశి, ఉఖి మట్, వాసుకి తాల్, జఖోలి మరియు తుంగనాత్ వంటివి కలవు. టూరిస్టులు కలిమాట్, కార్తిక్ స్వామీ టెంపుల్, ఇంద్రసాని మానస దేవి టెంపుల్, చంద్రశిల, మా హరియాలి దేవి టెంపుల్, కోటేశ్వర్ టెంపుల్ మరియు, మాడ మహేశ్వర్ గుళ్ళు చూడవచ్చు.

* ఘాటులు

ఇండియా లోని సిద్ధ పీటాలలో కాళీ మట్ ఒకటి. ఇక్కడ కాళీ మాత గుడి కలదు. నవరాత్రి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రదేశాల నుండి వేలాది భక్తులు వస్తారు. ఉఖి మట్, గుప్త కాశి ప్రదేశాలు దీనికి సమీపంలోనే వుంటాయి.

* రుద్రప్రయాగ ఆలయం

అలకనంద మరియు మందాకినీ అనే రెండు నదుల సంగమంలో కల రుద్రప్రయాగ్ టెంపుల్ ప్రధాన మతపర ప్రదేశం. శివుడు కల ఈ గుడికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు. ఇక్కడ సంగీతంలో సాధన పట్టు కొరకు తపస్సు చేస్తున్న నారదుడిని శివుడు రుద్రుడి అవతారంలో వచ్చి దీవించాడని పురాణాల కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ కల జగదంబ దేవి ఆలయం కూడా ఒక ఆకర్షణ.

* త్రియుగ నారాయణ్ ఆలయం

రుద్ర ప్రయగ్ లో కల త్రియుగి నారాయణ్ ఒక పవిత్ర ప్రదేశం. ఇది హిమవత్ కు రాజధానిగా చెపుతారు. ఇక్కడ శివ పార్వతుల వివాహం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న హవాన కుండ్ జ్యోతి సమక్షంలో వారి వివాహం జరిగిందని చెపుతారు. ఈ అగ్ని బూడిద భక్తుల వివాహ జీవితాలను ఆశీర్వదిస్తుందని చెపుతారు. ఈ ప్రదేశ సమీపంలో ఒక విష్ణు ఆలయం ఉంది. దీని శిల్పశైలి కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి వుంటుంది. ఈ ప్రదేశం చూసే పర్యాటకులు రుద్రకుండ్, విష్ణు కుండ్ మరియు బ్రహ్మ కుండ్ లు తప్పక చూడాలి. ఈ మూడు కుండ్ లకు సరస్వతి కుండ్ మూల స్థానం. స్థానికుల నమ్మిక మేరకు ఈ కుండ్ నీరు విష్ణు నాభి స్థానం నుండి వస్తుందని చెపుతారు. ఈ నీరు మహిళల సంతానవిహీనతను లేకుండా పోగొడ్తుందని విశ్వసిస్తున్నారు.

* ప్రయాణ సౌకర్యాలు

రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి వుంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.

* రోడ్డు ప్రయాణం

రుద్రప్రయాగ్ నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గం లో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవి లో న్యూ ఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగా నే వెళతాయి. రిషికేశ్ నుండి రుద్రప్రయాగ్ కు రెగ్యులర్ బస్సు లు కలవు. రుద్రప్రయాగ్ వాయు,

* రైలు మార్గం

రుద్రప్రయాగ్ కు ఋషి కేష్ రైలు స్టేషన్ సమీపం. కొన్ని రైళ్ళ తో ఇది ఒక చిన్న రైలు స్టేషన్. అయితే 24 కి. మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.

* వాయుమార్గం

రుద్రప్రయాగ్ కు సమీప ఎయిర్ బేస్ సుమారు 183 కి. మీ. ల దూరం లోని దేహ్రా దూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి రుద్రా ప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.

METLA GUTTA KSHETRAM / TEMPLE AT MADIKONDA VILLAGE, WARANGAL DISTRICT


ఆసక్తికర విశేషాలను ఆవిష్కరించే గుట్ట !

పాండవుల పేరు వినిపించని ప్రాచీన క్షేత్రాలు తక్కువేనని చెప్పాలి. ఏదో ఒక విధంగా ఆయా క్షేత్రాలతో వాళ్లకి అనుబంధం ఉందని చెప్పే సంఘటనలు స్థలపురాణంగా వినిపిస్తూ ఉంటాయి. పాండవులు అరణ్యవాస కాలంలో అనేక ప్రాంతాలమీదుగా తమ ప్రయాణాన్ని కొనసాగించడమే ఇందుకు కారణం.

అరణ్యవాస కాలంలో పాండవులు ఎన్నో క్షేత్రాలను దర్శించారు ... మరెన్నో ప్రదేశాల్లో బస చేశారు. అందువల్లనే ఆయా ప్రాంతాలలో గల కొన్ని మందిరాలను పాండవుల గుళ్లనీ ... వాళ్లు నివసించిన గుట్టలను పాండవుల గుట్టలని పిలుస్తుంటారు. అలా పాండవులలో ఒకడైన భీముడు ... ఆయనపై మనసు పారేసుకున్న 'హిడింబి' అనే రాక్షస కన్య గురించి ఒకానొక క్షేత్రంలో వినిపిస్తుంది.

'మెట్టుగుట్ట' గా పిలవబడుతోన్న ఆ క్షేత్రం వరంగల్ జిల్లా మడికొండలో కనిపిస్తుంది. శివకేశవులు కొలువైన ఈ క్షేత్రంలో, స్థూపం ఆకారంలో రెండు శిలారూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకదానిపై ఒకటిగా పెద్ద పెద్ద బండరాళ్లు పేర్చినట్టుగా ఈ శిలారూపాలు దర్శనమిస్తూ ఉంటాయి. భీముడిపై మనసుపడి అతని వలన 'ఘటోత్కచుడు'కి జన్మనిచ్చిన హిడింబి, ఆటలో భాగంగా ఈ రాళ్లను ఇలా పేర్చిందనే కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.

ఈ విషయంలో సందేహపడేవారికి సమాధానం అన్నట్టుగా ఆ పక్కనే భీముడివిగా చెప్పబడుతోన్న పాదముద్రలు కనిపిస్తుంటాయి. సహజసిద్ధంగా కనిపించే ఈ పాదముద్రలు చూస్తే, హిడింబితో భీముడు ఈ ప్రదేశానికి వచ్చాడనే విశ్వాసం కలుగుతుంటుంది. శివకేశవులు ఆవిర్భవించిన తీరు ... ఆయా భక్తులను వాళ్లు అనుగ్రహించిన వైనం ... వ్యాధులను నివారించే ఇక్కడి గుండాలలోని తీర్థం ... ఈ క్షేత్ర విశిష్టతకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అనేక విశేషాలకు ... మహిమలకు ఈ క్షేత్రం నిలయమని చాటుతుంటాయి.

SIVA LINGASTAKAM - LORD SIVAS TELUGU PRAYER


TWO FRIENDS - TRUE KNOWLEDGE - CHILDRENS TELUGU STORY


ADVANTAGES AND USES OF EARTHWORMS TO HUMANS


loading...