loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MAHABHARATHA PURANA STORIES COLLECTION - HOW ARJUNA GET PASUPATHASTRAM FROM LORD MAHADEV AND GET HIS NAME AS VIJAYA


అర్జునుని కోసం కిరాతకుడిగా మారిన మహాశివుడు

పూర్వం ఒకనాడు ధర్మరాజు తన తమ్ముడైన అర్జునునితో... ‘‘దేవేంద్రుని దగ్గరున్న దివ్య వస్త్రాలను తీసుకుని రా’’ అని చెబుతాడు. అన్న ఆజ్ఞను శిరసావహించి అర్జునుడి బయలుదేరి ఇంద్రలోకానికి చేరుతాడు. అయితే వాటిని పొందడం కోసం ముందుగా పరమశివునిని ప్రసన్నం చేసుకోమని ఇంద్రుడు, అర్జునునితో అంటాడు. దాంతో అతను శివుని కోసం ధ్యానం చేయడం మొదలుపెడతాడు. అయితే శివుడు అతనిని వెంటనే కరుణించకుండా... ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు.

* అర్జునునికి పరీక్ష పెట్టిన శివుడు :

అర్జునుడు ధ్యానం చేస్తుండగానే... అతను కూర్చున్న ప్రదేశంలో మూకాసురునుని సూకర (పంది) రూపంలో వెళ్లమని ఆదేశించాడు. శివుని ఆజ్ఞమేరకు మూకాసురుడు పందిరూపంలో అర్జునుడు ధ్యానం చేస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు. అదే సమయంలో మహాశివుడు కూడా ఆ పందిని వేటాడే వేషంలో కిరాతకుడిగా మారిపోతాడు. అప్పుడు శివుని త్రిశూలం విల్లంబుగా, నెలవంక నెమలి ఈకగా, రుద్రాక్షమాల పూసలదండగా మారిపోతాయి. పార్వతీదేవి కూడా కిరాతకుని భార్యగా అవతరించి, శివుని వెంటే బయలుదేరుతుంది.

భక్తిశ్రద్ధలతో తపస్సు చేసుకుంటున్న అర్జునునికి... పంది అటుఇటుగా తిరుగుతున్న శబ్దం తపోభంగం గావిస్తుంది. దాంతో అతను విసిగిపోయి వెంటనే పందివైపుగా బాణాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలోనే పందిని వెంటాడుతూ కిరాతకుని రూపంలో వచ్చిన శివుడు కూడా దానిపై బాణాలు వేశాడు. అటు అర్జునుడు, ఇటు కిరాతకుడు ఇద్దరూ కలిసి ఒకేసారి బాణాలు ప్రయోగించడంతో ఆ సూకరం ప్రాణాలను కోల్పోతుంది. అప్పుడే వారిద్దరి మధ్య వాగ్యుద్ధం మొదలవుతుంది.

పందిని నేను చంపానంటూ శివుడు అంటే.. లేదు నేనే చంపాను అంటూ అర్జునుడు వాగ్యుద్ధానికి దిగుతాడు. ఇలా కొనసాగిన కొద్దిసేపటి తరువాత ఇద్దరి మధ్య జరుగుతున్న వాగులాట కాస్త ఘర్షణగా మారిపోతుంది. అప్పుడు అర్జునుడు... ‘‘నేను విలువిద్యలో సాటిలేని వాడిని. నన్ను ఓడించినవాడు ఇంతవరకూ ఎవరూ పుట్టలేదు. నేను ఉపయోగించిన బాణంతోనే ఈ సూకరం మరిణించింది అని అంటాడు. అదేవిధంగా కిరాతకుడు కూడా... ‘‘జంతువులను వేటాడటం మా వృత్తి. మేము ప్రయోగించిన బాణంతో ఏ జంతువు కూడా తప్పించుకోలేదు. అది నా బాణానికే ప్రాణాలను కోల్పోయింది’’ అని సమాధానమిస్తాడు.

కిరాతకుని మాటలు విన్న అర్జునుడు ఒక్కసారిగా రగిలిపోతూ శర పరంపర కురిపించాడు. కానీ ఆ బాణాలు కిరాతకుని రూపంలో వున్న శివునిని ఏమీ చేయలేకపోయాయి. శివుడు కూడా అర్జునుని మీద ఒకే ఒక్క బాణం వదులుతాడు. దాంతో అర్జునుడు కిందపడిపోతాడు. దాంతో అతను ఓటిమిని అంగీకరించకుండా కోపంతో తన శక్తినంతటిని ఉపయోగించి, విల్లును సంధిస్తాడు. దాంతో ఒక్కసారిగా మూల్లోకాలన్నీ కంపించాయి. నాలుగువైపులా ఘోర గాలులు వీస్తూ, భూ ప్రపంచం అంతా వినాశనం అవుతున్నట్టు కనిపించింది.

అప్పుడు అర్జునుడు జ్ఞానోదయం కలుగుతుంది. తన ముందున్నది కిరాతక దంపతులు కాదనీ.. ఆ రూపంలో వున్నది శివపార్వతులేనని గ్రహిస్తాడు. వెంటనే తన తప్పును తెలుసుకుని పశ్చాత్తపంతో క్షమించమని వాళ్లిద్దరి కాళ్లమీద పడతాడు. శివుడు చిరునవ్వుతో ఆశీర్వదించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు. ఇలా ఈ విధంగా అర్జునుని అనుగ్రహించేందుకు ఒక పరీక్షను పెట్టి, కిరాతకుని రూపాన్ని ధరించాడు.

ANCIENT TELUGU PURANA STORY / PURANA KATHA OF THE GREAT MAHABHARATHA WARRIOR - EKALAVYA


లోకప్రసిద్ధి చెందిన ఏకలవ్యుని గాధ

రామాయణం, మహాభారతం, పురాణాలు, వ్యాసాలు వంటి ఇతిహాసాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రత్యేకమైన పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఏ గురువు దగ్గర కూడా శిష్యరికం చేయకుండానే విలువిద్యలో ఆరితేరిన ఘనుడు ఇతను. కళ్లతో చూడకుండానే కేవలం శబ్దం ఆధారంగానే బాణాన్ని ప్రయోగించి, లక్ష్యాన్ని ఛేదించేవాడు. ఒక సాధారణ ఎరుకల (నిషాద) కుటుంబంలో జన్మించిన ఈ మహావీరుడు.. విలువిద్యలో అగ్రగణ్యునిగా స్థానాన్ని పొందుపరుచుకున్నాడు. అటువంటి సాహసవంతుడైన ఏకలవ్యుని గాధను ఒకసారి తెలుసుకుందాం....
* పురాణాలలో ఏకలవ్యుని ప్రాధాన్యత :
పూర్వం ఒక ఎరుకల (నిషాద) కుటుంబంలో ఏకలవ్యుడు జన్మించాడు. అతని తండ్రి హిరణ్యధన్యుడు. ఏకలవ్యుడు ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ... విలువిద్యలో ప్రావీణ్యం పొంది, అందులో అగ్రగణ్యునిగా నిలవాలని కోరుకుంటాడు. ఈ పట్టుదలతోనే ఇతను ఒకరోజు అస్త్రవిద్యలో మహామేధావి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు విలువిద్యలో శిక్షణ పొందాలని వెళతాడు.
ఏకలవ్యుడు, ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి... ‘‘ఓ గురుదేవా! నేను ఏకలవ్యునుని. మీ దగ్గర శిష్యునిగా చేరి, మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ, విలువిద్యను నేర్చుకోవాలని వచ్చాను. నా కోరికను మన్నించి, ఆశీర్వదిస్తారని నేను ఆశగా ఎదురుచూస్తున్నాను’’ అని తన మనుసులోని మాటను చెబుతాడు. కానీ ఏకలవ్యుడు ఒక నిషాద కుటుంబానికి చెందిన బాలుడు కావడంతో ద్రోణాచార్యునికి అతనిని శిష్యునిగా అంగీకరించడానికి ఇష్టం వుండదు. అయితే ద్రోణుడు తన మనసులోని మాటను అతనికి చెప్పి బాధ పెట్టించకూడదని ఏకలవ్యునితో... ‘‘చూడు నాయనా! నువ్వు పుట్టుకతోనే విలువిద్యలో ఆరితేరినట్టుగా వున్నావు. ఇలాగే ఇంకా బాగా సాధన చెయ్యి. అందులో వున్న రహస్యాలన్నీ తెలుస్తాయి’’ అని అంటాడు.
ద్రోణుడు చెప్పిన మాటలను ఆశీర్వాదంగా భావించి, ఏకలవ్యుడు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోతాడు. అంతేకాకుండా... దైవంకంటే ఎక్కువగా కొలిచే గురువు ద్రోణాచార్యుని విద్రహాన్ని తయారుచేసుకుని, భక్తిగా నమస్కరించుకునేవాడు. ఆ విగ్రహాన్నే ప్రత్యక్ష గురువుగా భావించి, ప్రతిరోజూ కఠోర సాహసాలు చేస్తూ విలువిద్యలో నైపుణ్యం సంపాదించుకున్నాడు. కళ్లతో చూడకుండానే శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించేంత ప్రావీణ్యాన్ని పొందాడు.
ఇదిలా వుండగా... భీష్మ పితామహుడు తన కౌరవ, పాండవులకు అస్త్ర విద్యలు నేర్పించేందుకు ద్రోణాచార్యునిని గురువుగా నియమించాడు. అయితే ద్రోణుడు ఒక గురువుగా కాకుండా తండ్రిగా వారందరికీ అన్నివిధాలుగా సహాయం చేస్తూ అస్త్రవిద్యలను నేర్పించేవాడు. కానీ కౌరవ, పాండవులందరిలో అర్జునుడు విలువిద్యలో మిన్నగా వుంటూ, తన ప్రతిభను చాటుకున్నాడు. దీంతో ద్రోణుడికి అర్జునునిపై అపారమైన ప్రేమ కలుగుతుంది. తన అనుంగు శిష్యునిగా భావించి విలువిద్యలో వున్న అన్ని రహస్యాలను నేర్పిస్తాడు.
ఒకనాడు ద్రోణాచార్యుడు తన శిష్యుడయిన అర్జునునితో కలిసి అడవిలో వేటకు వెళ్లాడు. కొంతదూరం వెళ్లిన తరువాత వారి వెంటే వస్తున్న ఒక కుక్క అరిచింది. అదే సమయంలో కొంతదూరంలో వున్న ఏకలవ్యుడు కుక్క శబ్దాన్ని విని, ఏదో అరిష్టం జరుగుతోందని భావించి, కుక్క మొరిగిన దిశగా బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకు తగిలి చనిపోయింది. ఏకలవ్యుడు అదేమిటో తెలుసుకుందామని శోధిస్తూ.. కుక్క చనిపోయిన ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడే వున్న తన గురువును చూసి, ఆనందమయంలో మునిగిపోతాడు. అలాగే ద్రోణాచార్యుడు కూడా ఏకలవ్యుని విలువిద్యా చాతుర్యాన్ని చూసి ఎంతో ముగ్ధుడయిపోతాడు.
దీనినంతటిని గమనిస్తున్న అర్జునునికి ఒక్కసారి కోపం, దు:ఖం పొంగుకు వస్తాయి. ద్రోణాచార్యుని విగ్రహం కూడా అక్కడే వుంటుంది. అప్పుడు అర్జునుడు తన మనసులో... ‘‘తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారుచేస్తానని గురువు నాకు మాటిచ్చారు. కానీ ఇచ్చిన మాట తప్పి, నన్ను మాయచేసి ఒక ఎరుకులవాన్ని ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు’’ అని అనుకుంటాడు. తన కోపాన్ని మింగుకోలేక అర్జునుడు, ద్రోణాచార్యుడితో... ‘‘గురువుగారు... మీరు నాకిచ్చిన మాటను తప్పారు. మా మాటకు విరుద్ధంగా ఒక ఎరుకులవాన్ని విలువిద్యలో ప్రతిభావంతునిగా తీర్చిదిద్దారు. ఎందుకు?’’ అని బాధపడుతూ చెప్పాడు.
ఈ విధంగా అర్జునుడు బాధపడటాన్ని చూసి, ద్రోణాచార్యుడు సహించలేకపోయాడు. వెంటనే ఏకలవ్యునివైపు చూసి.. ‘‘ఏకలవ్యా! నువ్వు విలువిద్యలో నిజంగానే ఘనతను సాధించావు. నీకు సాటిలేరని నిరూపించుకున్నావు. మరి, దీనికి నా గురుదక్షిణ ఏది?’’ అని అడుగుతాడు. ఈ మాటలు విన్న ఏకలవ్యుని ఆనందానికి అంతులేకుండా పోయింది. కన్నీళ్లతో కాళ్లమీద పడి... ‘‘నేను ధన్యుడినయ్యాను స్వామి! మీరు ఏమైనా కోరుకోండి. నేను ఇవ్వగలిగింది ఏమైనా ఇస్తాను’’ అని అంటాడు. అప్పుడు ద్రోణుడు.. ‘‘నీ కుడిచేతి బొటనవేలు నాకు కావాలి. ఇస్తావా?’’ అని అడుగుతాడు. ఏకలవ్యుడు మరేమీ ఆలోచించకుండా, సంతోషంగా గురువుదక్షిణగా తన బొటనవేలుని కోసిచ్చాడు. తనకు ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేసి, ఒక మంచి శిష్యునిగా చరిత్రలోనే నిలిచిపోయాడు.


ROMANTIC BEAUTY PAINTING


SANKRANTHI DOTS AND LINES VILLAGE MUGGU


ARTICLE AND STORY OF CHANDRODAYA UMA VRATHAM OR ATLATHADDHI VRATHAM IN TELUGU



చంద్రోదయ ఉమావ్రతం (అట్లతద్ది వ్రతం)

ప్రతీ సంవత్సరం ఆత్మీయుజ బహుళ తదియనాడు ఈ చంద్రోదయ ‘‘ఉమావ్రతం - అట్లతద్ది’’ని స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. సాధారణంగా కొన్ని వ్రతాలు పెళ్లయిన స్త్రీలు మాత్రమే పెట్టాల్సి వుంటుంది. అయతే ఈ వ్రతం మాత్రం వయస్సుతో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా... చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరు కలిసి చేసుకుంటారు.
తమ జీవితంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా, తమ పిల్లాపాపలతో జీవితాంతం సుఖసంతోషాలతో గడపాలని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ వ్రతంలో చిన్నపిల్లలు కూడా పాల్గొంటారు కాబట్టి.. వివాహం అయిన స్త్రీలు ఆ పిల్లలను చూసి తమ చిన్నతనంలో గడిపిన మధురజ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా చిన్నచిన్న పల్లెలప్రాంతాలలో ఈ వ్రతాన్ని ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించుకుంటారు.
పల్లెటూర్లలో ఈ పండుగను ‘‘గోరింటాకు పండుగ’’ లేదా ‘‘ఊయల పండుగ’’గా వ్యవహరించుకుంటారు.
* పండుగ విశేషాలు :
ఇక పండుగకు ముందురోజు భోగి అని అంటారు. ఈ భోగిరోజు రాత్రి చిన్నపిల్లలనుంచి పెద్దవారివరకు ప్రతిఒక్కరు తమ చేతులకు, పాదాలకు గోరిటాకు పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్న తరువాత ఎవరి చేతులు అయితే బాగా ఎర్రగా పండుతాయో వారు చాలా అదృష్టవంతులని, వారి కోరికలు నెరవేరుతాయని స్త్రీలు విశ్వసిస్తారు. ఈ పండుగరోజు స్త్రీలు తమ ఇంటిపెరిటిలో ఊయలను కట్టుకుంటారు.
ఇక మరుసటిరోజయిన ఆశ్వీయుజ బహుళ తదియనాడు (అట్లతద్ది) తెల్లవారుజామునే లేచి, తమ రోజువారి కార్యక్రమాలను ముగించుకుని, పెరుగన్నాన్ని భుజించుకుంటారు. తరువాత అందరి ఇళ్లల్లో వున్నవారిని లేపి, ఆటలు ఆడుకుంటూ.. పాటలు పాడుకుంటూ.. ఊయల ఊగుటలో వెళ్లి సంతోషంగా తమ సమయాన్ని గడిపి, ఇతరులకు కూడా కనువిందు చేస్తారు.
అట్లతద్ది రోజు మొత్తం స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించుకుని చంద్రోదయం అయ్యేంతవరకు ఉపవాసం వుంటారు. చంద్రోదయం కాగానే తలంటుస్నానాలు చేసుకుని, అట్లు వేసుకుని నివేదనకు సిద్ధం అవుతారు. అనంతరం షాడశోపచారములతో ఉమాశంకరులను పూజించుకుంటారు.
ఈ విధంగా ఈ వ్రతాన్ని నిర్వహించుకోవడం వల్ల పెళ్లికాని అమ్మాయిలకు సమర్థవంతమైన భర్త లభిస్తాడని, పెళ్లయిన వివాహితులకు సుఖసంతోషాలతో కూడిన జీవితం వరిస్తుందని ప్రతిఒక్కరు ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు.
* కథ :
పూర్వం ఒక మహారాజు కావేరి అనే కూతురు ఎంతో అందంగా వుండేది. ఆమె తన తల్లి ద్వారా వ్రతమహత్యం గురించి తెలుసుకుని, తన రాజ్యంలో వున్న స్నేహితురాళ్లయిన మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురితో కలిసి ఈ ‘‘చంద్రోదయ ఉమావ్రతాన్ని’’ ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంది.
అయితే కొన్నిరోజుల తర్వాత కావేరి స్నేహితులందరికీ వివాహ వయస్సు రాగానే వారందరూ సమన్వయవంతులైన భర్తలతో పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఈమెకు మాత్రం పెళ్లిగాని, ఎటువంటి సంబంధాలు కాని వచ్చేవి కావు.
అప్పుడు మహారాజు తన కూతురుకి పెళ్లిజరగడం లేదన్న ఆవేదనతో ఆమె పెళ్లికి కావలసిన అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కేవలం వృద్ధులు, కురూపులు మాత్రమే ముందుకు రాగలిగారు.
తన తండ్రి చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలం అవుతున్నాయన్న బాధతో.. కావేరి రాజ్యాన్ని వదిలేసి సమీపంలోవున్న అరణ్యానికి చేరుకుని, ఘోరతపస్సు చేయసాగింది.
ఒకరోజు పార్వతీపరమేశ్వరులు లోకకళ్యాణం కోసం సంచారం చేస్తుండగా... ఘోరతపస్సు చేస్తున్న కావేరి అనుగ్రహం కలిగి ఆమె ముందు ప్రత్యక్షమవుతారు.
అప్పుడు వారు ‘‘ఓ కన్యాకుమారీ! ఎందుకు నువ్వు ఇంత ఘోర తపస్సును ఆచరిస్తున్నావు? నీకు ఏం వరం కావాలో కోరుకో’’ అని కావేరికి ఒక వరాన్ని ప్రసాదిస్తారు.
కావేరి.. ‘‘ఓ పార్వతీపరమేశ్వరులారా! నేను నా తల్లి ద్వారా తెలుసుకున్న ‘‘చంద్రోదయ ఉమావ్రతం’’ (అట్లతద్ది వ్రతం)ను.. నా స్నేహితులతో కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించాను. అయితే వారందరి కోర్కెలమేరకు వారు మంచి భర్తలతో వివాహం చేసుకుని వెళ్లిపోయారు. నా పెళ్లికోసం నా తండ్రిగారు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అవ్వడమే గాక... కురూపులు, వృద్ధులు అయినవారు మాత్రమే దొరుకుతున్నారు. ఇందులో నా దోషమేంటి’’ అని దు:ఖంతో తన ఆవేదనను వ్యక్తపరిచింది.
అప్పుడు వారు... ‘‘ఓ సౌభాగ్యవతి! ఇందులో నీ దోషం ఏమీ లేదు. నువ్వు ఆ వ్రతాన్ని నోచుకున్న తరువాత ఉపవాస దీక్షను సహించలేక... సొమ్మసిల్లి పడిపోయావు. ఈ విషయాన్ని నీ తల్లి ద్వారా తెలుసుకున్న నీ సోదరులు.. ఇంద్రజాల విద్యను ప్రదర్శించి.. అద్దం ద్వారా నీకు చంద్రుడిని చూపించారు. దాంతో నువ్వు ఉపవాస దీక్షను విరమించావు. ఆ విధంగా నీ వ్రతం భంగిమం కావడం వల్లే నీకు ఇలా జరుగుతోంది. నీ సోదరులు కూడా నీ మీద ప్రేమతో ఇలా చేశారు. అయినా ఇందులో బాధపడాల్సిన విషయం ఏమీలేదు. రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా ఈ వ్రతాన్ని ఆచరించు. నీకు తప్పకుండా మంచి భర్త లభిస్తాడు’’ అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతారు.
ఆ తరువాత రాకుమార్తె అయిన కావేరి.. ఎంతో భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి... ఎంతో అందమైన, నవయవ్వన రాకుమారుడిని పొందతుంది. నిత్యం ఉమాశంకరులను పూజిస్తూ.. సుఖసంతోషాలతో జీవితాన్ని గడపసాగింది.

STORY AND ARTICLE ON LAKSHA PASUPU NOOMU


లక్ష పసుపు నోము

కథ :
పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణ దంపతులు వుండేవారు. బ్రాహ్మణుడు ఒక విద్యావంతుడు. గౌరవంగా బతకడానికి అన్నిరకాల సదుపాయాలు, సిరిసంపదలు అతని దగ్గర వుంటాయి. అయితే అతను నిత్యం ఏదో ఒక రోగానికి గురవుతూ, బాధలు పడేవాడు.
భర్త ఇలా తరచూ అనారోగ్యానికి గురికావడం చూసి అతని భార్య చాలా బాధపడేది. తనకు ఏ విధంగా సుఖం అందేది కాదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపంలో నిత్యం ఏడుస్తూ తన కాలాన్ని గడిపేది.
ఒకరోజు ఆ బ్రాహ్మణ దంపతులు వుండే ఊరికి ఒక యతీశ్వరుడు వస్తాడు. అతడు ఈ దంపతుల ఇంటికి చేరుకుంటారు. ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఈ యతీశ్వరుడిని అన్నిరకాల అతిథి మర్యాదలు చేసి, భోజనాలు పెడుతుంది. దీనికి ఆ యతీశ్వరుడు చాలా సంతోషిస్తాడు.
అప్పుడు ఆ యతీశ్వరుడు తన దివ్య దృష్టితో ఆమె పరిస్థితిని, ఆమె పడుతున్న బాధల్ని, ఆమె మనోవేదనను తెలిసుకుంటాడు. అతడు.. ‘‘ఓ సాధ్వీమణీ! నువ్వు చింతించకు. నీ బాధ నాకు అర్థమయింది. నువ్వు ఈ దీనపరిస్థితి నుంచి బయటపడడానికి నేనొక ఉపాయాన్ని అందిస్తాన్ని. నువ్వు ఆరునెలలవరకు లక్ష్మీ పసుపు నోమును నోచి, ఉద్యాపన చేస్తే.. అన్ని సమస్యలు చక్కబడుతాయి’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
యతీశ్వరుడు చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణ ఇల్లాలు అదేవిధంగా నోమును నిర్వహించుకుంటుంది. అప్పటినుంచి ఆమె భర్త అనారోగ్యాలబారిన పడకుండా, పూర్ణాయువతో జీవితాన్ని సంతోషంగా గడిపేవాడు. తన భార్యను కూడా సుఖంగా చూసుకుని, ఆమె కోర్కెలను తీర్చేవాడు.
* విధానం :
లక్ష్మీ పసును నోమును నిర్వహించుకున్నవారు ఆరునెలలవరకు తూచాతప్పకుండా నియమించాలి. పైన చెప్పిన కథను ప్రతిరోజూ పఠించి, తలపై అక్షతలు వేసుకోవాలి. ఆరునెలల తరువాత ఏడవ నెల మొదటిరోజు ఉద్యాపన చేసుకోవాలి.
* ఉద్యాపన :
వెన్ను విరగని పసుపు కొమ్మలను లక్షవరకు ఏరుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తగినంత కుంకుమతో శ్రీ మహాలక్ష్మీని పూజించుకోవాలి. ఆ పసుపు కొమ్మలను, కుంకుమను తీసుకుని ఇంటి చుట్టూ వున్న వీధులన్నీ తిరిగి.. ఇంటింటా అందరికీ పంచాలి. ఒకవేళ కుదిరితే పిండివంటలు కూడా పంచుకోవచ్చు.

ARTICLE AND STORY OF VAMANA NOOMU AND STEP BY STEP INFORMATION OF PERFORMANCE OF VAMANA NOOMU


వామన నోము విధానం

కథ :
ఒకానొక రాజుకు ‘‘అమృతవల్లి’’ అనే అందమైన కూతరు వుండేది. ఆనాటి యువరాణులలోని అందాచందాలలో ఆమెకు ఆమె సాటి. దీంతో కేవలం అలనాటి రాజకుమారులే కాకుండా... వివాహితులైన ఎందరో రాజులు ఈమెను పెళ్లి చేసుకోవాలని ఆశించేవారు. దీంతో ఇతర రాజకుమార్తెలు అమృతవల్లిపై ఈర్ష్య పెంచుకున్నారు. ప్రతిఒక్కరాజు ఆమెవైపే మొగ్గుచూపడంతో.. ఎవరు వీరిని వివాహం చేసుకోరు అనే భంగిమలో పడిపోయారు.
దీంతో వీరంతా ‘తంబళ’ అనే మంత్రికురాలి దగ్గరకు వెళ్లి అమృతవల్లి అందాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపించారు. దాంతో తంబళ అమృతవల్లికి చెరుపు(హాని) పెట్టింది. అది మొదలు ఆమె అందాచందాలన్ని మాయమైపోయాయి. అలా జరిగిన ఆమెను చూసి.. రాజులందరూ ఆమె మీద పెంచుకున్న మోజును తగ్గించుకున్నారు. ఆమెను వివాహమాడేందుకు ఏ ఒక్కరాజు కూడా ముందుకు రాలేదు.
ఇదిలావుండగా.... తీర్థయాత్రలకు వెళ్లిన రాజపురోహితుడు తిరిగి వచ్చి ఈ విషయం గురించి తెలుసుకున్నాడు. తరువాత రాజు దగ్గరకు వెళ్లి... ‘‘మహారాజా! నేను కాశీలో వుండగా యువరాణిగారి విషాదగాధ గురించి తెలిసింది. అనుక్షణమే అక్కడ వున్న పండితులతో దీని గురించి చర్చించాను. రాజకుమార్తెకు జరిగినటువంటి సంఘటనలుగాని, కోపాలు, శాపాలు వంటివి వామన నోము చేయడం ద్వారా తొలగిపోతాయని వారు చెప్పారు. తొందరగా యువరాణి ద్వారా వామన నోమును పట్టించండి’’ అని చెప్పాడు. ఇలా నోమును నిర్వహించిన పదిరోజులకల్లా అమృతవల్లి తన అందాన్ని, ఆరోగ్యాన్ని తిరిగి పొందింది.
* విధానం :
ఈ నోము ప్రతిఏటా భాద్రపద మాసంనాడు నిర్వహించుకుంటారు. ఆరోజు పైన చెప్పకున్న కథను ఒకసారి చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. ఈ భాద్రపద మాసంలో శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం వుండాలి. ఇలా ఉపవాసం వుండడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అందరూ విశ్వసిస్తారు. శుద్ధ ద్వాదశి శ్రవణా నక్షత్ర ఘడియలలో, గాలీ వెలుతురూ బాగా వీచి, మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశంలో ఈ పూజను నిర్వహించుకోవాలి.
గడ్డకట్టి, కదలకుండా వుండే పెరుగును ఒక పాత్రలో తీసుకోవాలి. పాత్ర మీద వామనుడి స్వర్ణ ప్రతిమ ఉంచి, ఒక చేత్తో పెరుగన్నం గిన్నె, మరొక చేత్తో అమృత కలశం ధరించి వున్నట్లుగా భావిస్తూ యధాశక్తి పూజించి దద్దోజనం నివేదించాలి. ఇలా పూజ కార్యక్రమాలు పూర్తయిన తరువాత ప్రసాదాన్ని 12 మంది పేదవారికి కడుపునిండా పెట్టి, ఆ తరువాత తాము తినాలి. ఈ విధంగా ఈ పూజను 12 సంవత్సరాల వరకు చేయాలి.
* ఉద్యాపనం :
12వ సంవత్సరంలో ఈ నోము నిర్వహించుకునేటప్పుడు 12 పెరుగు పాత్రలు, 12 వామన విగ్రహాలు, 12 దద్దోజన పాత్రలు దానమివ్వడం సంప్రదాయం.
బాల్యం నుంచి ఈ నోమును నోచుకుంటే.. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి రోగాలు సోకవు. గాలీధూళీ సోకవు. ఈ నోము నిర్వహించిన తరువాత కూడా ఎటువంటి ఆపదలు ఏమైనా సంభవిస్తే.. మళ్లీ ఇంకొకసారి ఈ నోమును రెండుసంవత్సరాలవరకు నిర్వహించుకుంటే అంతా శుభమే జరుగుతుంది. భక్తిగా ఆచరిస్తే గొప్ప ఫలితం ఉంటుంది.

MEDICINAL DIVERSITY


JOBS GONE


ARTICLE ON LAKSHAVATHULA NOOMU - HOW TO PERFORM LAKSHAVATHULA NOOMU IN TELUGU


 లక్షవొత్తుల నోము

పార్వతి ఆడవారి దోషాలను లెక్కిస్తూ పరమేశ్వరుడికి ఈ విధంగా వివరిస్తుంది.... ‘‘అన్న, తండి వంటి వావివరుసలు లేకుండా అందమైన మగాడు కనపించగానే... స్త్రీలయోని వేడి తగిలిన నెయ్యిలా ద్రవిస్తూ వుంటుంది.
అంతేకాదు... ఇతర అనేక రహస్య కృత్యాలు అనేక విధాలుగా వున్నాయి. ఇతరుల ఇళ్లలో ఎక్కువ సమయం వుండటం, భర్తతో కఠినంగా మాట్లాడటం, గర్భస్రావం, శిశుహత్య, పెళ్లయిన తరువాత కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఎక్కువగా అసత్యాలు పలకడం, అత్తమామలు-బంధుత్వాలతో అమర్యాదగా ప్రవర్తించడం, దుర్మార్గం చేయడం, శిశుహత్య, క్రోధం పెంచుకోవడం.... ఇలా ఒకటేంటి... మొత్తం పాపాలా పుట్టగా కలిగి వున్న స్త్రీలు చాలామంది వున్నారు.
అజ్ఞాతంగా వచ్చిన పాపాలు అంటుకున్నవారు కూడా చాలామంది వున్నారు. ఇటువంటి మహిళలు తమ పాపాలను తుడుచుకోవడానికి, తరించిపోయేందుకు ఏదైనా వ్రతం వుందా’’ అని శివుడిని కోరుతుంది.
అప్పుడు శివుడు ఆమె ‘‘లక్షవొత్తుల నోము’’ వ్రతానికి సంబంధించిన విధివిధానాలను, ఉద్యాపనాదులు వివరిస్తాడు. పార్వతి ‘‘ఈ నోమును అంతకుముందు ఎవరు చేసేవారు?’’ అని కోరగా... శివుడు దానికి సంబంధించిన ఒక కథను ఈ విధంగా వివరిస్తాడు.
‘‘పూర్వం ఒకనాడు ఆర్యవర్త దేశంలో కాంత అనే ఒక వేశ్య వుండేది. ఒకరోజు ఆమె విహారానికి వెళ్లగా.. ఒక బ్రాహ్మణుని శవం ముందు విదారకరగా రోదిస్తున్న అతని ఇల్లాలిని చూసి ‘‘అయ్యో పాపం! స్త్రీలకే ఎందుకు ఇంత దుర్భరం’’ అని అంటుంది.
ఆ సమయంలో ఆమె పక్కనున్న దాసుడు ఈమె మాటలు విని..‘‘సృష్ట్యా సృష్ట్యా పురాద్వి జా రేహిణం చైవ లోకానాం హితార్థం మంత్ర కోవిదా:’’ అని చెబుతాడు.
అది విన్న ఆమె వెంటనే ఒక కోవిదుడైన యాచకుడనే బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి, ‘‘కులస్త్రీలకు ఇంతటి కష్టం రావడానికి కారణం ఏంటి’’ అని ప్రశ్నిస్తుంది.
దానికి సమాధానంగా యాచకుడు ఈ విధంగా చెబుతాడు... ‘‘అమ్మాయీ! స్త్రీలు అనేకానేక జ్ఞానం, అజ్ఞానంతో చేసిన పాపాలవల్లే ఇలా కష్టాలు కలుగుతాయి. దేవ, పితృకార్యాల్లో ఒక్కోసారి హఠాత్తుగా రజస్వలవుతుంటారు. సంప్రదాయానికి భయపడో, పురుషులేమంటారోననే భయంతోనో, తామున్న ప్రాంతమంతా అషౌచమవడం వల్ల అక్కడి విలువైన ద్రవ్యాలన్నీ వృధా అవుతాయనే లోభత్వం వల్లనో, వారు తమ ఇబ్బందిని గోప్యంగానే వుంచుకుని కార్యక్రమాలు సాగిస్తారు. అవన్నీ చెడు ఫలితాలనే యిస్తాయి. ఈ పాపాలే పెరిగి వైధవ్యాన్ని అనుగ్రహిస్తాయి.
దీని నుండి విముక్తి కలిగే మార్గం లక్షవత్తి వ్రతం ఒక్కటే. ఈ వ్రతం నిర్వహించడం వల్ల సువాసినులకు, సంపూర్ణమైన మూసివాయినాలు ఇవ్వడం వల్ల అన్ని దోషాలు నశిస్తాయి’’ అని వివరిస్తాడు. దానికి ఆమె అతనితో ‘‘దీనికేమైన ఋజువుందా?’’ అని ప్రశ్నించగా... ఆయన ‘‘నువ్వే ఋజువు. నువ్వే ఈ వ్రతం చేసి, ఆ ఫలితాన్ని ఆ విధవరాలికి ధారబోసి చూడు’’ అని అంటాడు.
అప్పుడు ఆమె దేనిగురించి ఆలోచించకుండా, డబ్బును వెచ్చించి, యాచకుడినే బ్రహ్మగా వరించి వ్రతాన్ని ఆచరిస్తుంది. దాంతో వచ్చిన ఫలితాన్ని ఆ బ్రాహ్మణ వితంతుడుకు ధారబోయగా, మరణించిన బ్రాహ్మణుడు తిరిగి పునర్జీవుడవుతాడు.
ఇలా ఈ విధంగా మొదలైన ఈ వ్రతం.. ప్రతిఒక్కరు ఆచరించి తమ దోషాలను తొలగించుకుంటూ.. విముక్తులవుతున్నారని శివుడు పార్వతికి వివరిస్తాడు.
* విధానం :
ఈ వ్రతాన్ని చాతుర్మాస్యంలో చేస్తారు. ఉదయాన్నే లేచి నిరంతర కార్యక్రమాలు ముగిశాక సంచగవ్వ ప్రాశనం చేయాలి. తరువాత వచనం, తర్పణ చేయాలి.
ఇలా చేసిన తరువాత గుహ్యసూక్త ప్రకారం 1000 నారాయణ గాయత్రి, పరమాన్నం, నెయ్యితో హోమం చేయాలి. నాలుగు మూలలున్నవేదిక చేసి గోమయంతో అలికి మధ్యలో పంచరంగులతో అష్టదళ పద్మాన్ని వేసి, చెఱకు గడలతో చాందినీ కట్టి, వాటిమధ్య దివ్య వస్త్రం పరచి, అయిదు కుంచాల బియ్యం పోసి మధ్యలో పంచపల్లవ శోభితమైన కలశం స్థాపించాలి. ఆ వస్త్రం మీద లక్ష్మీనారాయణ ప్రతిమను ఆవాహనం చెయ్యాలి. షోడ శోపచారాల లక్ష్మీనారయణుల్ని అర్చించాలి. లక్ష వత్తులతో ఆవునేతితో దీపారాధన చెయ్యాలి. ఇలా చేసిన తరువాత రాత్రంతా జాగారం చేయాలి. 0 ఫలాల ఎత్తుగల కంచుగిన్నె నిండా ఆవు నెయ్యి పోసి, బంగారపు వత్తినీ... వెండి వత్తినీ...ప్రత్తి వత్తినీ ఉంచి మహా దీపారాధన చెయ్యాలి.




THEFT BUMPER OFFER


WIFE AND HUSBAND'S LOVE JOKE



ప్రేమంటే ఇదేనా...?

"వంటపని మొదలుపెట్టారా పిన్నిగారూ?" అడిగింది రమ.

"ఇంకా లేదమ్మా! ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, నిద్ర లేవగానే ఆయన కాళ్ళకి నమస్కరిద్దామని వెళ్ళాను. 

ఆయనేమో అలాంటివి నచ్చవంటారు. చివరికి రెండు తగిలించి, నచ్చజెప్పి ఆ పని పూర్తి చేసేసరికి ఈ 

సమయమయ్యింది!" చెప్పింది కమల.

WHAT IS TRAYODASI PUJA VRATHAM - HOW TO PERFORM TRAYODASI VRATHAM - STEP BY STEP INFORMATION FOR PERFORMING TRAYODASI VRATHA PUJA VIDHANAM


త్రయోదశి వ్రతం ఎందుకు చేస్తారు?

త్రయోదశి వ్రతాన్ని ‘‘ప్రదోష వ్రతం’’ అని కూడా అంటారు. ఈవ్రతాన్ని ఎటువంటి హంగులూ, ఆర్భాటాలూ లేకుండా ఆచరించవచ్చు. ఈ వ్రతం చాలా సులువుగానే చేయవచ్చు. దీనికి ఫలితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇది కొన్ని కాలాలపాటు చేయాల్సిన సుదీర్ఘవ్రతం. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) ఈ వ్రతం తప్పకుండా చేయాలి. అలా 11 సంవత్సరాలపాటు దీన్ని ఆచరించాల్సి వుంటుంది. మధ్యలో ఏమైనా సమస్య తలెత్తి ఈ వ్రతం చేయలేకపోతే.. ఉద్యాపన చేసి ప్రతిమను విసర్జించవచ్చు.
ఇంతకీ త్రయోదశి వ్రతం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా చేస్తారన్న మొదలైన విషయాలు తెలుసుకుందాం...
త్రయోదశినాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కనుక దీనికి త్రయోదశి వ్రతం అని అంటారు. శివపూజ, రాత్రి భోజనం చేయడం వల్ల ఈ వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. త్రయోదశి వ్రతం విధివిధాలుగా చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నం అవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా తమకు అధికారం లేదా హోదా కావాలనుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు వంటివాటికి కొదవ ఉండదు. అన్ని పూజలు, వ్రతాల మాదిరిగా త్రయోదశి వ్రతాన్ని ఉదయం వేళ చేయరు. సూర్యాస్తమయం నుండి రాత్రి రెండు ఘడియల లోపు ఈ పూజను నిర్వహిస్తారు. ఏ నెలలో అయినా త్రయోదశి నాడు ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుందని భావిస్తారు.
సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్నానం చేసుకోవాలి. పూజా మందిరాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కులలో ముఖం పెట్టి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. మందిరంలో శివుని విగ్రహాన్ని లేదా ఫొటోను ఉంచాలి. ఒకవేళ ఈ రెండూ లభించకపోతే తడిమట్టితో మహాశివుని రూపాన్ని రూపొందించుకుని ''శూలపాణయే నమః'' అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్టించాలి. శుద్ధోదకం, పుష్పాలు, గంధము, అక్షతలు మొదలైనవి సిద్ధం చేసుకోవాలి. మెడలో రుద్రాక్షమాల వేసుకుని నుదుట విభూతి దిద్దుకోవాలి. శివుని ప్రతిమకు ఎదురుగా కూర్చుని ''మమ శివ ప్రసాద ప్రాప్తి కామనయా ప్రదోష వ్రతాం గీభూతం శివ పూజనం కరిష్యే'' అని సంకల్పం చెప్పుకోవాలి.
గంధము, సుమాలు, అక్షతలతో మహాశివుని భక్తిగా పూజించాలి.
''పినాకపాణయే నమః'' అంటూ ఆవాహన చేయాలి.
''శివాయనమః'' అంటూ అభిషేకం చేయాలి.
''పశుపతయే నమః'' అంటూ గంధం, పుష్పాలు, అక్షతలు, ధూపదీపవైవేద్యాలు సమర్పించాలి.
''జయ నాథ కృపా సింధో జయ భక్తార్తి భంజన
జయ దుస్తర సంసార సాగరోత్తారణ ప్రభో ప్రసీద
సే మహా భాగా సంసారర్తస్య ఖద్యతః
సర్వ పాపక్షయం కృత్వా రక్షమాం పరమేశ్వర''
అనే శ్లోకాన్ని భక్తిగా జపిస్తూ శివుని ప్రార్ధించాలి.
''మహాదేవాయ నమః'' అంటూ పూజించిన మూర్తిని వదిలేయాలి.

loading...