ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

EARLY WAKE UP TIPS IN TELUGU


నిద్ర మత్తు వదలాలంటే..!

ఉదయాన్నే నిద్రలేవటం అనేది ఓ మంచి అలవాటు. తెల్లారుజామున నిద్రలేచిన వాళ్ళు రోజంతా ఫ్రెష్‌గా ఉండటంతో పాటు డైలీలై్‌ఫలో ఎక్కువ పనులు చక్కబెట్టుకోవచ్చనే నమ్మకం కలుగుతుంది. 

ఇంతకీ ఉదయాన్నే నిద్రలేవాలంటే ఏం చేయాలి? 

అసలు నిద్రలేచాక మళ్ళీ నిద్రపోకుండా ఉండాలంటే..?

ఉదయాన్నే నిద్రలేవాలంటే మాత్రం రాత్రి త్వరగా నిద్రపోవాలనేది కాదనలేని నిబంధన. ఎన్ని పనులున్నా, అసలు నిద్ర వచ్చే మూడ్‌ లేకున్నా కనీసం పది నుంచి పదకొండు గంటల లోపు బెడ్‌పై చేరాలి. అనవసరంగా రాత్రిపూట టీవీ ఎక్కువ చూడటం, నెట్‌ చూడటం మంచిది కాదు. వీటిని మానేస్తే త్వరగా నిద్ర లేవచ్చు.
నిద్రలేవటానికి చాలా మంది అలారమ్‌ పెట్టుకుంటారు. ఉదయాన్నే అది మోగగానే స్నూజ్‌ బటన్‌ని ఆఫ్‌ చేసి ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. దీనివల్ల ఫలితం ఉండదు. అందుకే సెల్‌ రింగ్‌టోన్‌ అలారంగా సెట్‌ చేసి, లేదా టోన్‌ అలారమ్‌ క్లాక్‌ని మనం నిద్రపోతున్న స్థలానికి దూరంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా బెడ్‌దిగి కొంచెం నడిచి అలారమ్‌ని ఆఫ్‌ చేయటానికి వెళ్ళాలి. ఆ సమయంలో ఫిజికల్‌ యాక్టివిటీ జరగటం వల్ల నిద్రమత్తు వదిలే చాన్స్‌ ఉంది. ఇది రెగ్యులర్‌గా చేస్తే కొన్నాళ్ళయ్యాక మీరే ఖచ్చితమైన సమయానికి స్వతహాగా నిద్రలేస్తారు.

కిటికీ కర్టెన్స్‌ని ఓపెన్‌ చేయాలి. ఒక వేళ అలారం మీరు ఆఫ్‌ చేసి పడుకున్నా కిటికీ లోంచి పడే వెలుతురు పడుకోనివ్వదు. ఇక నిద్రలేచిన వెంటనే పళ్ళు తోమటం, లేకుంటే టీ తయారు చేయటం చేస్తే చురుకుదనం వస్తుంది.

ఉదయాన్నే జాగింగ్‌కి వెళ్లటం లేదా యోగా చేయటం అలవర్చుకోవాలి. లేకుంటే ప్రశాంతంగా ధ్యానం చేసినా ఎంతో మేలు జరుగుతుంది.