ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HINDU GODS RESIDES IN TULASI TREE - AN ARTILCE IN TELUGU


తులసి మొక్కలో బ్రహ్మ.. విష్ణు.. శంకరుడు

రామాలయంలేని ఊరుగానీ తులసి మొక్కలేని ఇల్లుగాని కనిపించవు. తులసి మొక్కను అంతా పవిత్రంగా పూజిస్తుంటారు. తులసి మొక్క మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు చివరిలో శంకరుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేవాలయంలో ఇచ్చే తీర్థంలో తులసిని కలుపుతున్నారు.

రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, కర్పూర తులసి, వనతులసి, శొంఠి తులసి ఇలా పలు రకాల తులసి ప్రజలకుఅందుబాటులో ఉంది. కార్తీక మాసంలో తులసి మరింత పుష్పించి తన సుగంధాలను నలుదిశలా వెదజల్లుతుంది. కొందరు విశిష్టమైన మాసాల్లో తులసిని పూజిస్తే ... మరికొందరు అనునిత్యం కొలుస్తుంటారు. ఆధ్యాత్మిక పథంలో ప్రదక్షిణా పూర్వకంగా పూజలు అందుకునే తులసి, ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది.

తులసి వనముపై నుంచి వచ్చే గాలి కారణంగా క్రిమి కీటకాలు నశిస్తాయి. పాములు ... తేళ్లు వంటి విష కీటకాలు కూడా ఆ వైపుకు రావడానికి సాహసించవు. ఇంటి చుట్టూ తులసి మొక్కలు ఉన్నట్టయితే, ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ప్రతి నిత్యం రెండు పూటలా తులసి దళములను పూజించడం ద్వారా, ఎన్నో రకాల వ్యాధుల బారినుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చర్మ వ్యాధులకు ... శ్వాస కోశ వ్యాధులకు తులసిని మించిన దివ్య ఔషధం లేదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.