loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SELF EMPLOYMENT TIPS AND OPPORTUNITIES AND ARTICLES BY DR.MYNAMPATI SREENIVASA RAO - FLAVOURED MILK MAKING


Flavoured Milk making -A profitable self-employment opportunity
Dear Friends, Please find the attachment for page-1 of Article on flavoured Milk making Industry. For quality conscious youth this will be a good Tiny food industry. For project report,please contact:
Dr.Mynampati Sreenivasa Rao. MBA, Ph.D
Consultant for 1000+ industries (self-employment opportunities) with 15 years experience
Business Consultant
Self employment columnist & Books writer
Mobile:9866119816
e-mail:mynampaticonsultancy@gmail.com

TODAY IS SUNDAY - BORING


SELF EMPLOYMENT OPPORTUNITIES TIPS AND ARTICLES BY SRI MYNAMPATI SRINIVASA RAO IN TELUGU - WATER TANK CLEANING SERVICE


KARBUJA FRUITS PROVIDES WATER TO HUMAN BODY - HEALTH WITH FRUITS IN TELUGU


BEAUTIFUL LONG HAIR WITH COCONUT MILK USAGE - COCONUT TIPS IN TELUGU


కొబ్బరి పాలతో జుట్టు మృదువుగా

కొబ్బరి పాలు జుట్టు కుదుళ్లను దృఢం చేస్తాయి. కొబ్బరి పాలను మాడుకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మాయిశ్చరైజర్ లభించి మృదువుగా అవుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో 2-3 గంటలు ఉంచాలి. తర్వాత బయటికి తీసి, దానిపైన ఏర్పడ్డ పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, మాడుకు పట్టించి, వేడినీళ్లలో ముంచిన ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంట సేపు అలాగే ఉంచి, షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా అవుతుంది.

HEALTH WITH FOOD GRAINS - RAGULU GOOD FOR HEALTH


రాగుల్లో పోషకాలు మెండు

రాగి సంగటి రాయలసీమలో చాలా ఫ్యామస్. మీరు గనుక మాంసాహారులైతే నాటుకోడి ఇగురుతో తింటే దాని రుచే వేరు. అదే శాకాహారులైతే పల్లీల చట్నీతో ఒక పట్టు పట్టొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రాగులను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం.. !

• ఈ క్రమంలో రాగులలో ఉండే పోషకాలేంటో మీరే చూడండి...

* వంద గ్రాముల రాగుల పిండిలో 350 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అలాగే 3.9 మి.గ్రా. ఐరన్, 1.1 మి.గ్రా. నియాసిన్, 0.42 మి.గ్రా. థయమిన్, 0.19 మి.గ్రా. రైబోఫ్లావిన్ ఉంటాయి.

* రాగుల్లో ఉండే పీచు పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. అదే సమయంలో తక్కువ కెలొరీలు అందుతాయి.వీటిల్లో ఉండే ట్రిప్టోపాన్ అనే అమినోయాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువును అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. ఇదే అమినోయాసిడ్ మానసిక సాంత్వనను కూడా అందిస్తుంది. ఫలితంగా ఆందోళన, ఒత్తిడి లాంటి వాటిని అదుపులో ఉంచుకోవడం సులువవుతుంది.

* రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు, ఫైటోకెమికల్స్ వాటిని ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం.. బియ్యం, గోధుమల్లో కన్నా.. రాగుల్లో పీచుశాతం అధికమని తేలింది.

* కాలేయంలో చేరిన అధిక కొవ్వును తగ్గించి.. పరోక్షంగా కొలెస్ట్రాల్ సమస్యనూ అదుపులో ఉంచుతాయి రాగులు.

* రాగుల్లో సమృద్ధిగా లభించే ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది.

* రాగులతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకుంటే.. పోషకాహారలేమి, వార్థక్యపు లక్షణాలు.. దరి చేరవు. రక్తపోటు, గుండె బలహీనత, కాలేయ సమస్యలు, ఉబ్బసం వంటి సమస్యలకు రాగులు చక్కని పరిష్కారం.

* వీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల్ని రోజూ తీసుకుంటే.. భవిష్యత్‌లో ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

HEALTH WITH GROWING FOOD GRAINS - HEALTH TIPS IN TELUGU


మొలకెత్తిన గింజలు ... ఆరోగ్యానికెంతో మంచివి..!

బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నారా? జుట్టు బాగా రాలిపోతోందా? రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు బాధిస్తున్నాయా??.. వీటన్నింటికీ ఒకే మందు.. మొలకెత్తిన గింజలు. ఈ గింజల్లో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని కొంతమంది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే, మరికొంతమంది కూరల్లో కలిపి తింటారు. ఈ క్రమంలో మొలకెత్తిన గింజల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో చూద్దామా??

• ఇంట్లోనే సులభంగా..

మొలకెత్తిన గింజలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే పెసలు, పల్లీలు, శెనగలు.. మొదలైన గింజల్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కనీసం ఆరు గంటల పాటు నాననివ్వాలి. అంతే.. మీకు కావలసిన స్ప్రౌట్స్ రడీ..
జీవక్రియలు వేగవంతం..
శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేయడంలో తోడ్పడే అమైనో ఆమ్లాలు స్ప్రౌట్స్‌లో అధిక మొత్తంలో లభిస్తాయి. అలాగే ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

• ఇన్ఫెక్షన్లకు దూరంగా..

మొలకెత్తిన గింజల్లో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో హానికారక ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ నాశనమవుతాయి. ఫలితంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
వ్యర్థాలను తొలగిస్తాయి..
స్ప్రౌట్స్ త్వరగా జీర్ణమవుతాయి. అలాగే ఇవి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవడంతో పాటు రక్తంలో ఉండే మలినాలు, వ్యర్థాలను తొలగించడంలో కీలకపాత్ర వహిస్తాయి.

• బరువు తగ్గాలంటే..

బరువు తగ్గించడంలో కూడా మొలకెత్తిన గింజలు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల శరీర బరువు అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఈ గింజల్లో ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.. కాబట్టి రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఈ గింజలను విడిగా తినడం ఇష్టం లేకపోతే సలాడ్స్‌లోనైనా వేసుకొని తీసుకోవచ్చు.
ఎర్రరక్త కణాల ఉత్పత్తికి..
పెసలు, మెంతులు, కాయధాన్యాలు.. వంటి రకాలకు చెందిన స్ప్రౌట్స్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్రరక్త కణాల ఉత్పత్తికి, శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారు మొలకెత్తిన గింజల్ని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

• కొవ్వు తగ్గుతుంది..

వివిధ రకాల గింజలు మొక్కల నుంచి సహజసిద్ధంగా లభించేవి. కాబట్టి ఇవి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయులు తగ్గుతాయి. దీనివల్ల గుండె పోటు, గుండె సంబంధిత సమస్యలు.. మొదలైనవి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.

• అదుపులో బీపీ..

మీరు తీసుకునే ఆహారంలో సోడియం స్థాయులు ఎక్కువగా ఉన్నాయా? దీనివల్ల శరీరంలోకి అధిక సోడియం చేరి రక్తపోటు సంబంధిత సమస్యలేమైనా తలెత్తాయా? అయితే వెంటనే మొలకెత్తిన గింజల్ని ఆహారంగా తీసుకోండి. ఎందుకంటే వీటిలో సోడియం ఉండదు. కాబట్టి శరీరంలో బీపీని అదుపులో ఉంచి.. హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడతాయి.

• మలబద్ధకం నివారణకు..

మొలకెత్తిన గింజల్లో పీచు పదార్థం, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్ధకం సమస్యను పారదోలి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.

చూశారుగా.. స్ప్రౌట్స్ వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలున్నాయో! కానీ ఒక్క ముఖ్య విషయం.. వీటిలో శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఉన్నాయి కదా అని మరీ ఎక్కువగా తీసుకోవడమూ మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం.

NATURAL HEALTH WITH FOOD GRAINS - FOOD GRAINS HEALTH TIPS IN TELUGU


CLEAN WITH HOT WATER BEFORE USING VEGETABLES - HEALTH AND DANGER WITH VEGETABLES - AN ARTICLE


BRIDAL MAKE UP IDEAS


jai sri ram jai veer bajrang bali hanuman


GRAPHIC KOLAMS CREATION


loading...