loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI VIGNESWARA DHANDAKAMU - LORD GANESH PRAYER IN TELUGU


శ్రీ విఘ్నేశ్వర దండకం

శ్రీ మన్మహారాజ రాజశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించు చున్నట్టి యో విఘ్నరాజా భవత్పాద మందార మకరంద మాశించి నానేత్రభృంగంబులీనాడు వ్రాలెన్ కారుణ్యసారంబు ప్రసరించి కాపాడగా రమ్ము నీవానిగా నన్ను జేకొమ్ము వేదవేదాంగ వేదాంత సారంబులన్ సర్వశాస్త్రార్థ సద్విద్య సందోహముల్ నిన్ను మూలంబుగా గౌరవస్థాన మందుంచి పూజించు ముల్లోకమందెవ్వరేమైన సత్కార్య కర్మంబు జేయంగ మున్ముందుగా నీదునామంబు కీర్తించి యర్చింత్రు,

నీ నామమే సర్వగీర్వాణ సంపూజ్యమై నిత్య సన్మంగళ ప్రాభవంబై ప్రకాశించు నీ రూపు సేవించి యంభోజ సంజాతుడున్ నిర్జరేంద్రుండు నానా విదార్థంబులన్ బొంది సంతోషమున్నందు, రెల్లప్పుడున్ దేవదేవారులున్, యక్షగంధర్వ గరుడోరగాదుల్ భవన్మాయ దెలియంగలేకెంతయో విస్మయాంతాత్ములై యుందురో దేవ షాణ్మాతురుండప్పుడు యుష్మత్ ప్రభావంబు శంకించి అవనీతలం బొక్క నిమిషంబులో తివిరి నేవత్తునంచున్ మనోవేగ మొప్పారగాబోవ నీవంతలో భక్తియుక్తండవై శైలరాజేంద్రతనయన్ జగన్మాతకున్ మందగమనంబుతో జుట్టిరాగా,

మహాదేవుడే నీ మహాత్వంబపూర్వంబుగా సుస్థిరత్వంబుగా చాటడామున్ను! రజతాచలేంద్రాగ్ర భాగంబునన్ శారదేందుప్రభా భాసితాశావకాశంబునన్ సహజ గాంభీర్య గమనంబుతో సంచరింపంగ దర్శించి సనకాది సన్మౌనిబృందంబు పూర్ణేందుబింబంబు నిర్జించు నీ యొక్క మత్తేభవక్త్రంబు నీ గుజ్జురూపున్ తదేకంబుగా జూచి యానందమున్ బొందదా! తారకానాధుడానాడు సౌందర్యశోభా సమోపేత శృంగార సర్వాంగుడై తన్ను కాంతాసమూహంబు మోహంపు చిరునవ్వుతో మంచి నీరాజనంబుల్ సమర్పింపగా అన్నుమిన్నేమియున్ గానగాలేక నీ హ్రస్వరూపంబు వీక్షించి నవ్వంగ నా వారిజారిన్ భవత్కోపదావాగ్ని కిన్నాహుతిన్‌జేయ నుంకించినన్ భీతిచే గర్వమంతన్ విసర్జించి దాసోహమంచున్ నినున్ జేరగా పార్వతీనాధు జూటాగ్రచూడామణిన్ జూచి వర్షవర్షంబునన్ భక్తియుక్తంబుగ సర్వపుష్పంబులన్, సర్వపత్రంబులన్, ద్రాక్ష, జంబీర, నారంగ, రంభాది నానాఫలంబుల్ సమర్పించి యర్చించు సద్భక్తబృందంబులన్,

శోభనంబుల్ ప్రసాదించి రక్షింతునంచున్ వచింపంగ, నీలదాకాశ మధ్యంబులో నుండి విద్యుల్లతా భాసురాంగుల్ నిలింపాగనల్ దివ్య ప్రసూనంపు వర్షంబు వర్షించి హర్షింపరా! మోదకాఖాది మూషికారోహణానందలోలుండవై ముమ్మూర్తులన్ మూడు లోకంబులన్ మంత్రముగ్ధాత్ములన్ జేయవానీవు! ద్వారకానాధుడానాడు సత్రాజితున్ జేరరావించి నీ ఇంటిలో భానుదత్తం బనావృష్టి వార్యంబుగానున్న మణిరాజమిమ్మన్న, మోమాటమింతైన బాటింపకన్ వాడుశౌరిన్ తిరస్కార వాక్యంబులన్ బల్కె నొక్కింతకాలంబుమీదన్ ప్రసేనుండు తమ్ముండు మణిబూని చరియించుచుండంగ కాంతార మధ్యంబులో సింగ మొక్కండు దుష్టోగ్రదంతంబులన్ వానికాయంబు గాయంబుగా జేసి వధియింప, సత్రాజితుండీయదార్థంబు నింతైన గుర్తింపకన్ కృష్ణుడే వాని ప్రాణంబులన్ దీసి మణిగొన్న వాడంచు దుష్ట ప్రచారంబు గావింపగా, రుక్మిణీవల్లభుండాత్మ చింతించి “యేపాప మేమాత్ర మెరుగంగలేనైన దుష్కీర్తివాటిల్లె యోపార్వతీపుత్రయో మేరుగంభీర సద్గాత్ర పాపంబు పుణ్యంబులన్,

సర్వకర్వంబులన్ సాక్షివీవేకదా” యంచు ప్రార్థించి, షడ్రసోపేత మృష్టాన్నముల్, పంచబక్ష్యంబులన్, భక్తినైవేద్యమర్పించి పూజించి, ఘోరాటవిన్ బాగుగాలించి గాడాంధకార ప్రపూర్ణంబునై దుర్గమంబై పాదసంచారియై పోయి, యుద్ధంబులో సాటిలేనట్టి మేటిన్ మహాకాయు భల్లూకనాధున్ కడున్‌నొవ్వగాజేసి మెప్పించి, భానురత్నంబుతో భామతో వచ్చి నిర్ముక్త పాపుండునై కీర్తిధాముండునై యొప్పె భవత్కర్ణ సంచాలనోద్భూత ఝుంఝూనిలం బస్మదీయంపు పాపౌఘ సంజన్య దురితావళిన్ పంచబంగాళ మొనరించు సొంపుతావుల్ గుబాళించు పుష్పంబులా లేవు అర్పింప నామస్తకంబీదు చరణంబులందుంచినాడన్ భవత్ప్రీతిగా నేలుకోవయ్య యో సిద్ధి గణనాధ సర్వ కార్యర్థసిద్ధిన్ ప్రసాదించి రక్షింపుమోదేవ నిన్నెంత కీర్తించినన్ తృప్తియేలేదు మాకింత సంసార మోహంబులో నుండి కూపస్థ మండూకలీలన్ గృహంబున్ విశాల ప్రపంచంబుగా నెంచి నీపాదకంజంబులన్ మ్రొక్కి పూజింపగా నిశ్చలత్వంబు శూన్యంబు అజ్ఞాన తిమిరాంధకారంబులో పూర్ణజ్యోతి స్వరూపంపు నీవే కదా మమ్ము దరీజేర్చి గాపాడుమో ఏకదంతా, బృహత్కీర్తిమంతా సదావిఘ్నహర్తా జగత్కార్యకర్తా నమస్తే నమస్తే నమస్తే నమః.

* సంకష్ట నాశన గణేశ స్తోత్రమ్

ప్రణమ్యశిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే ॥

ప్రథమం వక్రతుండంచ ఏకదన్తం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥

లంబోదరం పంచమంచ షష్ఠంచ వికటమేవచ ।
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టకమ్ ॥

నవమం ఫాల చంద్రం చ దశమంతు వినాయకమ్ ।
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్ ॥

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥

విద్యార్థీలభతే విద్యాం ధనార్ధీలభతే ధనమ్ ।
పుత్రార్థీలభతే పుత్రాన్ మోక్షార్థీలభతే గతిమ్ ॥
జపేత్ గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలంలభేత్ ।
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః ॥

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయం సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః ॥

(ఇతి శ్రీ నారద పురాణే సంకష్టనాశనం గణేశస్తోత్రం సంపూర్ణం)

KALABANDHA PROTECTS FROM SNAKE POISONSTOP EATING HEAVY FOOD STUFF AFTER EXERCISES OR YOGA TIPS IN TELUGU


వ్యాయామం తర్వాత అతిగా తినకుండా ఉండాలంటే..!

శారీరక శ్రమతో కూడిన పని చేసినప్పుడు శరీరం శక్తిని కోల్పోవడం సహజం. అయితే ఇలా శక్తిని కోల్పోయినప్పుడు ఆకలి కూడా బాగానే వేస్తుంటుంది. ఈ సమయంలో వెనకా ముందూ ఆలోచించకుండా అందుబాటులో ఉన్న ఆహారం వెంటనే లాగించేస్తుంటాం. అలాగే వ్యాయామం చేసిన తర్వాత కూడా ఆకలి ఎక్కువగా వేస్తే చాలామంది అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటుంటారు. దీనివల్ల వ్యాయామం చేసిన ఫలితం దక్కకపోగా మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటును ఎంత వీలైతే అంత త్వరగా తగ్గించుకోవడం మంచిది.

• ఇందుకు ఉపకరించే కొన్ని సులువైన పద్ధతులు

ముందే...!

వ్యాయామం చేసిన తర్వాత ఆహారం ఎక్కువగా తినకుండా ఉండాలంటే.. వ్యాయామానికి ముందే తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రెడ్-జామ్, శాండ్‌విచ్, గ్లాసు వెన్నలేని పాలు.. వంటి పదార్థాల్ని తీసుకోవడం వల్ల అటు వ్యాయామం చేయడానికి శరీరానికి శక్తి అందడంతో పాటు ఇటు వ్యాయామం తర్వాత ఆకలి వేయకుండా కూడా ఉంటుంది.

ఆస్వాదించాలి..!

ఏ పనైనా మనస్ఫూర్తిగా ఆస్వాదించి చేయగలిగితేనే అందులో ఉండే ఆనందం మన సొంతమవుతుంది. వ్యాయామం కూడా అంతే.. ఎవరైతే కష్టమనుకోకుండా ఇష్టపడి, ఎంజాయ్ చేస్తూ వ్యాయామం చేస్తారో.. వారు వ్యాయామం తర్వాత తక్కువగా తింటారని ఓ పరిశోధనలో వెల్లడైంది. తద్వారా ఆహారం ఎక్కువగా తీసుకోకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.. అలాగే వ్యాయామం చేసిన ఫలితమూ అందుతుంది.

మధ్యమధ్యలో..

వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని బ్యాలన్స్ చేయడానికి మధ్యమధ్యలో నీరు తాగడం మంచిది. అలాగే వ్యాయామం చేసిన తర్వాత వెంటనే ఆహారం తీసుకోవడం కాకుండా ముందు గ్లాసు నీరు తాగి కనీసం ఇరవై నిమిషాల పాటు ఆగడం మంచిది. ఎందుకంటే నీరు తాగితే కడుపు నిండుగా అనిపించి ఎక్కువగా ఆకలి వేయకుండా ఉండి.. తక్కువ తినే అవకాశం ఉంటుంది.

ఎక్కువ సేపా...?

శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా కరిగించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాయామానికి అవసరమైన దాని కంటే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం ఎక్కువ శక్తిని కోల్పోతుంటుంది. దీంతో ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంటుంది. తద్వారా వ్యాయామం ముగిసిన వెంటనే కడుపునిండా ఆహారం తీసుకోవాలనిపిస్తుంటుంది. కాబట్టి రోజూ వ్యాయామానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించడం మంచిది.

ప్లాన్ చేసుకోండి..

కొంతమంది వ్యాయామం చేసిన తర్వాత ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్ తీసుకుంటుంటారు. దీనివల్ల శరీరంలో అనవసరమైన కొవ్వులు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత ఓ ఇరవై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుని తర్వాత నేరుగా భోజనం చేసేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఫాస్ట్ ఫుడ్స్, స్నాక్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడంతో పాటు మంచి పోషకాహారం తీసుకునే అవకాశం ఉంటుంది.

నిండుగా అనిపించేలా..

క్యాలరీలు తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటివల్ల కడుపు నిండుగా అనిపించి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందులో భాగంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు.. వంటివి రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి. అలాగే ఒకేసారి ఎక్కువగా కాకుండా.. కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు తినేలా ప్లాన్ చేసుకోవడం మంచిది.

LORD HANUMAN MAHAYANTRAM STORY AND PUJA INFORMATION IN TELUGU


ప్రమాదాలను నివారించే శ్రీ హనుమాన్ యంత్రం

ఆంజనేయుడు కొలువై ఉండే ”శ్రీ హనుమాన్ యంత్రం’’ మహా శక్తివంతమైనది. ”శ్రీ హనుమాన్ యంత్రం’’ ఇంట్లో ఉందంటే ఆంజనేయుడు కొలువై ఉన్నట్లే. ఇది ముఖ్యంగా వాహన ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది. హనుమంతునికి మంగళవారం ఇష్టమైన రోజు కనుక, శ్రీ హనుమాన్ యంత్రాన్ని మంగళవారం తెచ్చుకోవడం శ్రేయస్కరం. శ్రీ హనుమాన్ యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రార్ధించాలి. తర్వాత ‘’ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’’ అనే మంత్రాన్ని 108సార్లు జపించి యంత్రాన్ని ధరించాలి. రోజూ స్నానం చేసిన తర్వాత 11 సార్లు ‘’ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’’ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా చేసినట్లయితే వాహన ప్రమాదాలు చోటు చేసుకోవు.

చిన్నారులచేత శ్రీ హనుమాన్ యంత్రాన్ని ధరింపచేయడం మంచిది. పిల్లలకు ‘’ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’’ మంత్రాన్ని నేర్పి నిత్యం కనీసం మూడుసార్లు అయినా జపించమని చెప్పాలి. హనుమంతుడు శ్రీరామునికి నమ్మినబంటు. రాముడికి గుండెలోనే గుడి కట్టి పూజించాడు. శ్రీరాముని అంగుళీయకం చూపి సీతమ్మను ఓదార్చాడు. లంకాదహనం చేశాడు. సుగ్రీవుని రక్షించాడు. సర్వ అభయ దీక్షాదక్షుడు. హనుమంతుని భక్తులు చింతలు, చిరాకులకు దూరంగా ఉంటారు. రామనామం ఎంత మధురమైనదో చాటి చెప్పాడు హనుమంతుడు.

శ్రీరాముడు తన అవతారం చాలిస్తూ ‘’కలియుగం అంతమయ్యేవరకూ భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడమని, భయాలూ, ఆందోళనల నుండి రక్షించమని, భూత, ప్రేత, పిశాచాల్లాంటి బాధలు, భయాల నుండి బయట పడేయమని, ఆర్తజన రక్షకుడిగా ఉండమని’’ కోరాడు. శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించాడు హనుమంతుడు. ఆంజనేయుడు భక్తుల మొర ఆలకిస్తాడు. ఆదుకుని ఆపదలు తొలగిస్తాడు. ఆందోళనల నుండి విముక్తి కలిగిస్తాడు. హనుమంతుడు కొలువై ఉండే ”శ్రీ హనుమాన్ యంత్రం” ఎలాంటి ప్రమాదాలూ జరక్కుండా కాపాడుతుంది.

GODDESS MAHA SAKTHI


HINDU GODDESS ON CAMEL


HINDU GOD PICS


Aswini Latest Stills


GARDENS DECORATION IDEAS - FLYING BIRDS


TELUGU TRAVEL INFORMATION GUIDE ABOUT SANKARLODDHI - LORD SIVA RESIDES - 4000 YEAR HISTORICAL IMPORTANCE - MUST VISIT - ADILABAD - INDIA


ఆదివాసీల పుణ్యస్థలం శంకర్‌లొద్ది!

ఆదిలాబాద్‌జిల్లా! ఎటుచూసినా పచ్చదనంతో అలరారుతున్న ప్రాంతం! కొండలు, గుట్టలు, జలపాతాలు, సెలయేళ్లు .. ఆదివాసీ, గిరిజన జీవితం.. ఈ రెండూ కలిసి దీనికో ప్రత్యేకతను అద్దుతున్నాయి! విశిష్ట సంస్కతిని చూపెడుతున్నాయి! అలాంటి ఆదిలాబాద్‌లోని అరుదైన స్థలమే శంకర్‌లొద్ది! ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల పుణ్యస్థలం శంకర్‌లొద్ది! ఆంధ్రప్రదేశ్ - మహారాష్ట్ర సరిహద్దులోనివివాదాస్పద సరిహద్దు గ్రామం!ఈ ఊరి అడవిలోని రాతిగుహలో ఉన్న శివలింగానికి నాలుగువేలయేళ్ల చరిత్ర ఉన్నట్లు ఆదివాసీలు భావిస్తున్నారు. ఒరిస్సా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్ ఇలా సుమారు పదిరాష్ట్రాల్లోని ఆదివాసీలు శంకర్‌లొద్ది అడవుల్లోని ఆదిశంకరుడిని తమ ఆదిదైవంగా, మహిమగల దేవుడిగా కొలుస్తారు. తమకు జీవనాధారమైన అటవీ భూముల్లో పంటలు వేసే మొదటి పండుగ మొదలు, తాము చేసే ఏ శుభకార్యానికైనా ఈ గుహల్లోని దైవమే వారి ఇలవేల్పు. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ గుహలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నా ఆదివాసీలు మాత్రం కంటికి రెప్పలా కాపాడు కొంటున్నారు.

* పాండవుల అరణ్యవాసం

ఈ శంకర్‌లొద్దిగుహలు కెరమెరి మండలంలో ఉన్నాయి. నిట్టనిలువుగా ఉన్న ఈ రాతికొండ మధ్యలో చిన్న గుహ ఉంటుంది. పాండవులు అరణ్యవాసం సమయంలో ఇక్కడి గుహల్లో గడిపినట్లు స్థానికులు చెబుతారు. ఈ రాతి గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన ఓ శివలింగం ఉంది. భీమసేనుడు ప్రతినిత్యం ఆ శివలింగాన్ని పూజించేవాడని ప్రతీతి. ఆ శివలింగం అత్యంత మహిమకలదని ఆదివాసీల నమ్మకం. పాండవులు ఇక్కడి గుహల్లో ఉంటున్న సమయంలోనే భీముడికి పెళ్లి జరిగిందని, ఇక్కడే ఉంటూ మహాభారత యుద్ధం కూడా చేశారని.. ఆ శివలింగం మహిమ వల్లే పాండవులు కౌరవులపై విజయం సాధించగలిగారని ఆదివాసీల భావన. అందుకే భీమసేనుడిని కూడా ఆదివాసీలు భీమల్‌పేన్ (భీమన్న దేవుడిగా)కొలుస్తుంటారు. ఈ గుహపరిసరాల్లోనే రాతితోకట్టిన ఆలయం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఈ గుహలను ఆనుకునే ఓ సెలయేరు ప్రవహిస్తూంటుంది. ఆ సెలయేటిలో స్నానం చేసేందుకు వీలుగా రాతి మెట్లతోపాటు, రాతి గుహమధ్యలో ఉన్న శివలింగం వద్దకు వెళ్లేందుకు పెద్ద పెద్ద బండరాళ్లతో చేసిన మెట్లూ ఉన్నాయి. అవిప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి.

* కోరికలను నెరవేర్చే సిద్ధికాస...

శివలింగం ఉన్న కొండను ఆనుకొని ప్రవహిస్తున్న సెలయేరు అత్యంత పవిత్రమైనది. మూడుకాలాలపాటు ఈ యేరు నీటిప్రవాహంతో కళకళలాడుతుంటుంది జీవనదిలా! ఇందులో స్నానంచేసి లింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని గిరిజనుల నమ్మకం. అందుకే ఈ వాగుకు సిద్ధికాస అనే పేరు వచ్చిందని చెబుతారు ఆదివాసీలు. ఇక్కడి గిరిజనులు తమ పోడుభూముల్లో విత్తనాలు వేసేముందు ఈ వాగు నీటిలో తాము స్నానంచేయడమే కాక విత్తనాలనూ ఈ నీటితో కడిగి శివుడి ముందుపెట్టి పూజలు చేస్తారు. ఇలా చేస్తే తాము కోరుకున్నంత పంట పండుతుందని వీరి నమ్మకం. ఈ గుహలకు సమీపంలోనే సిద్ధికాసతోపాటు, విద్యకాస, బుస్‌కత్తి, సోప్లకస, కుడికస మొదలైన పదికసలుండేవని అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని చెప్తారు ఆదివాసీలు! అలాగే ఈ కొండగుహలో శంభుగిరిజలు (శివపార్వతులు)కూడా నివాసం ఉంటూ తమను కనిపెట్టుకుంటారని ఆదివాసీల విశ్వాసం!

* పట్టించుకోని ప్రభుత్వాలు..

నాలుగువేల సంవత్సరాల చరిత్ర కలిగి.. ఆదివాసీలు అత్యంత పవిత్రంగా భావించే ఈ శంకర్‌లొద్దిని ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకున్నదాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతం తమదంటే తమదని వివాదం చేస్తున్నారు తప్ప ఇటువెళ్ళేందుకు కనీసం రోడ్డు అయినా వేయలేదు. మంచినీటి వసతి అస్సల్లేదు. ఇక్కడి అటవీప్రాంతంలో అపారంగా ఉన్న సున్నపురాయి నిల్వలను కొల్లగొట్లేందుకు మాత్రం జిల్లాకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు విశ్వప్రయత్నం చేశారు. ఆదివాసీలు తిరుగబడటంతో మిన్నకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి దీని అభివద్ధిపై దష్టినిలపాలి. చుట్టూ పచ్చని ప్రకతిలో సెలయేటిఝరులతో కనువిందు చేసే శంకర్‌లొద్దిని చక్కటి పర్యాటకప్రాంతంగా మలచాలి!

TRAVEL INFORMATION ABOUT DURAJPALLI PEDDHA GUTTA JATHARA - ANDHRA PRADESH - INDIA


కొండా కోనల్లో..పెద్దగట్టు జాతర..

ట్టిన ముడుపులు..చెల్లించాల్సిన మొక్కులు.. అదిగో.. దురాజ్‌పల్లిలో ఆ డిల్లెం బల్లెం చప్పుడు.. ఒలింగా.. ఓ లింగా నామస్మరణ విను.. పెద్దగట్టు లింగన్నకు మొక్కు చెల్లించే వేళయింది. కొండా కోనల్లో వెలసినవో లింగ శంభు లింగా.. అంటూ పెద్దగట్టు జాతరలో జనం చిందేస్తుంటే గొల్లగట్టు గొంతు కలుపుతున్నది. దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్దది. లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల లాగు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలుపట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఒలింగా... ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపొటేల్‌ను తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటేల్‌కు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటారు.

లింగమంతుడు శాఖాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా.. భక్తజన లింగనాదాల మధ్య నిన్న ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాదు.. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతీయేటా సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. రాష్ట్రం వచ్చాక తొలి జాతర కావడంతో భక్తులు పోటెత్తారు.

* చౌడమ్మ పల్లకిలో..

ఇది ఐదు రోజుల పండుగ. శనివారం మధ్యాహ్నం మూలవిరాట్‌లకు అలంకరణ మొదలయింది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరించారు.

ఆదివారం జాతర తొలిరోజు. భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకున్నారు. నేడు రెండోరోజు. యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేయగా.. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పించారు. ఇక జంతుబలి ఉండనే ఉంది. జాతరిక జనసంద్రమవుతుంది. ఇక మూడో రోజైన మంగళవారం చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. నాలుగో రోజు నెలవారం. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు... మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు.

ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉందని కొందరు.. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని.. ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు మరికొందరు చెప్తుంటారు. దురాజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో ఏడెనిమిది కొండగుట్టలున్న అటవీప్రాంతం ఉంది. శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట.

* చేరుకోవడం ఇలా...

పెద్దగట్టు... హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారి(65వ నెంబర్) పై దురాజ్‌పల్లిలో ఉంది. సూర్యాపేట నుంచి 5 కిలోమీటర్ల దూరం. ప్రత్యేక బస్సులుంటాయి.

TRAVEL GUIDE INFORMATION ABOUT SRI THALPAGIRI RANGANADHASWAMY TEMPLE, NELLORE, ANDHRA PRADESH, INDIA


శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, నెల్లూరు

నెల్లూరు పట్టణంలోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం కలదు.

రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు.

ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి.

మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.

12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది.

17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్థులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.

ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి.

ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు.

గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు.

శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.

ARTICLE ABOUT INFORMATION AND HISTORY OF GODDESS PYDITHALLI TEMPLE AT VIJAYA NAGARAM, ANDHRA PRADESH, INDIA


కల్పవల్లి... పైడితల్లి!

విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మను ప్రజలు ఆడబిడ్డగా ఆడపడుచుగా భావించి ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ఆమెను ఏటా మూడునాలుగు సార్లయినా తలచుకుని చీరా, సారె పెట్టి మొక్కుతీర్చుకుంటారు.

కల్పవల్లి... పైడితల్లి!అమ్మవార్లను, గ్రామదేవతలను పూజించడం మన రాష్ట్రంలో చిరకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా చాలా చోట్ల అమ్మవారిని, గ్రామ దేవతను తల్లిగా, ఇంటి ఇలవేల్పుగా భావించి కొలవడం సాధారణం. అలాగే విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మను ప్రజలు ఆడపడుచుగా భావించి ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ఆమెను ఏటా మూడునాలుగు సార్లయినా తలచుకుని చీరా, సారె పెట్టి మొక్కుతీర్చుకుంటారు. వాస్తవానికి విజయనగరం సంస్థానాధీశుల తోబుట్టువు అయిన పైడితల్లమ్మను ఆ సంస్థానం పరిధిలోని ప్రజానీకమంతా ఆడపడుచుగానే ఆదరించి నిత్యపూజలు చేస్తున్నారు.

స్థలపురాణం: 1757లో బొబ్బిలి రాజులకు, విజయనగరాన్ని పాలిస్తున్న విజయరామరాజుకు యుద్ధం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయనగర ప్రభువులు ఫ్రెంచి సేనాని బుస్సీ దొర మద్దతుతో బొబ్బిలి సంస్థానం పాలకుడైన రంగారావుపై దండెత్తారు. విజయరామరాజు సోదరి అయిన చిన్నారి పైడిమాంబ యుద్ధం వల్ల వినాశనం తప్ప ఒరిగేదేమీ లేదని భావించి, యుద్ధాన్ని ఆపడానికని స్వయంగా గుర్రపుబగ్గీపై బయల్దేరుతుంది.

మార్గమధ్యంలో ఉండగానే తన సోదరుడు విజయరామరాజు బొబ్బిలి వీరుడైన తాండ్రపాపారాయుడి చేతిలో హతమైనట్లు తెలుసుకుని హతాశురాలవుతుంది. ఆమె సృ్పహ తప్పి పడిపోగా వెంటనున్న అనుచరుడు పతివాడ అప్పలనాయుడు ఆమెను సేదదీర్చారు. తానిక జీవించజాలనని, దేవిలో ఐక్యమవుతున్నానని, అయితే తన ప్రతిమ మాత్రం విజయనగరంలోని పెద్ద చెరువులో లభ్యమవుతుందని, దాన్ని తీసుకొచ్చి నిత్యపూజలు చేయాలని చెప్పి ఆమె తనువు చాలిస్తుంది. ఆమె చెప్పినట్లుగానే పెద్ద చెరువులో వెతకగా అమ్మవారి ప్రతిమ లభిస్తుంది.

ఈ ప్రతిమనే రైల్వే స్టేషన్ సమీపంలో ప్రతిష్టించి, దీన్ని వనం గుడిగా పేర్కొంటూ పూజలు చేస్తుంటారు. అనంతరం అమ్మవారి కోసం మూడు లాంతర్ల సమీపంలో చదురు గుడిని నిర్మించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని వైశాఖ మాసం శుద్ధ నవమి వరకూ వనం గుడిలో ఉంచుతారు. దశమినాడు భారీ ఊరేగింపుతో చదురు గుడికి తీసుకొస్తారు.

విజయదశమి తరువాత వచ్చే సోమ, మంగళవారాల్లో విజయనగరం భక్తులతో పోటెత్తుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని చీర, సారె, పసుపు కుంకాలు అర్పిస్తారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే విజయనగరం ప్రజానీకం ఈ ఉత్సవాల సందర్భంగా తమ అక్కచెల్లెళ్లను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేసి చీర, పసుపు కుంకుమలతో సత్కరించి పంపుతారు.

పండగంటే ఇలా ఉండాలి... పైడితల్లమ్మ పండగను రెండ్రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగేది తొలేళ్ల ఉత్సవం. ఇది ప్రత్యేకంగా రైతుల కోసం నిర్వహించేది. అమ్మవారి ఆశీస్సులతో సాగు ప్రారంభిస్తే పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. ఈ సందర్భంగా ఘటాలను ఊరేగిస్తారు. మేళతాళాలతో ఊరేగింపు ఉంటుంది.

* సిరిమాను చూడాల్సిందే..

అమ్మవారి పండగలో ప్రధానమైనది సిరిమాను ఉత్సవం. ఈ ఉత్సవానికి నెల రోజుల ముందుగా ప్రధానార్చకుడి కలలోకి అమ్మవారు వచ్చి ‘ఫలానాచోట సిరిమానుకు సంబంధించిన చెట్టుంది. దాన్ని తీసుకురండి...’ అని ఉపదేశిస్తారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే అమ్మవారు సూచించిన పొడుగాటి చింత మానుతో ఎత్తై సిరిమానును ఏర్పాటు చేస్తారు. దీని చివర్న అమ్మవారి ఆలయ ప్రధానార్చకుడు కూర్చుంటారు. ఈ సందర్భంగా సిరిమాను ఊరేగిస్తారు. అనంతరం చదురు గుడి నుంచి కోట వరకు మూడుసార్లు సిరిమానును అటు-ఇటు నడుపుతారు. ఈ సందర్భంగా పులివేషాలు, సాముగరిడీల వంటి పోటీలుంటాయి.

YOGA IMPROVES BRAIN PERFORMANCE POWER


FIVE TIPS FOR GOOD FAMILY LIFE AND PARTNERSHIP


GIVE REST TO EYES FOR BETTER PERFORMANCE -EYE CARE TELUGU TIPS


కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి

 పెళ్లై, పిల్లలున్న ఉద్యోగినులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి పనులూ, పిల్లల బాధ్యతలూ, ఉద్యోగంతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. కంటి నిండా నిద్ర కూడా ఉండదు. దాంతో ప్రభావం కళ్ల మీద పడినప్పుడు కనురెప్పలూ, కనుబొమ్మలు అదురుతుంటాయి. నిద్రలేని కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. అప్పుడు సమయానికి తిన్నా, పని తగ్గించుకున్నా కూడా అలసటగానే అనిపిస్తుంది. కళ్లు మండుతాయి. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం కనురెప్పలు అదే పనిగా అదురుతుంటాయి. అలాంటప్పుడు బాగా నిద్రపోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కళ్లకు సాధ్యమైనంతవరకు విశ్రాంతి ఇవ్వాలి. కాంటాక్ట్‌ లెన్స్‌ అధికంగా వాడినా.. కళ్లద్దాలను మార్చకుండా దీర్ఘకాలం వాడుతున్నా.. కళ్లు ఎక్కువ శ్రమకు గురైనా కళ్లు అదురుతాయి

HEALTHY FOOD STUFF FOR ROMANCE UNLIMITED


SUMMER COOL FOOD HEALTH TIPS IN TELUGU


LIVE YOUNG WITH LAUGHING HEALTH TIPS IN TELUGU


Unique Semi-Stitched SuitsONE ANNA IN TELUGU


*ఈ నాణెం మీద ఉన్న నాలుగు భాషలలో

 మన తెలుగు భాష కూడా ఉంది.

* అప్పుడు మన తెలుగు భాషకున్న విలువకు,

గౌరవానికి నిదర్శనమిది

Unique Jewellery COLLECTION FOR WOMEN

Unique Jewellery Starting Rs. 228. Click here to buy: http://goo.gl/Xq1cib

BUBLE BEAUTY SANJANA SINGH


Eesha New Pics


BEAUTIFUL LADY OF SOUTH CINE RICHA GANGOPADYAYA


HONEY IS THE BEST REMEDY FOR COUGH PROBLEM


"దగ్గు" తగ్గాలంటే ?

దగ్గుకి తేనెను మించిన ఔషధం లేదు. తేనెలో ఏమీ కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతులోపల ఓ పూతలా ఏర్పడి.. గరగరమనే మంటను తగ్గిస్తుంది. తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా తక్షణ ఉపశమనం ఉంటుంది.
అల్లం టీ కూడా దగ్గుకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్లాన్ని పది పన్నెండు చిన్న ముక్కలుగా కోసి.. మూడు కప్పుల నీటిలో 20 నిమిషాలు వేడి చేయండి. కాస్త చల్లారాక చెంచా తేనె కలపండి. నిమ్మకాయ రెండు చెక్కలు పిండేయండి. రుచి చూసి ఘాటుగా అనిపిస్తే కాసిని నీళ్లు కలపండి. రెండు పూటలా దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది.

చెంచా నల్ల మిరియాలకు చెంచా తేనె కలపండి. వీటిలో వేడినీళ్లు పోయండి. ఈ మిశ్రమంపై మూతపెట్టి పావుగంట తరువాత తాగితే ఫలితం ఉంటుంది. అలాగే కప్పు నీటిలో చెంచా పసుపూ, చెంచా వామూ వేసి వేడి చేయండి. నీళ్లు సగానికి సగం తగ్గేదాకా మరగనిచ్చి దించేయండి. దీనికి తేనె కలిపి రోజులో మూడుపూటలా తాగితే మంచిది.

FLOWERS MUGGULU WITH LAMPS


TEENAGE BEAUTIES MODERN COLOURFUL DRESSES COLLECTION


An alluring collection of anarkalis and straight suits bestowed with grand motifs and unique embellishments meant for weddings. Shop Now: http://www.cbazaar.com/…/wedding-anarkalis-n-straig…/sb.html
An alluring collection of anarkalis and straight suits bestowed with grand motifs and unique embellishments meant for weddings. 
Shop Now: http://www.cbazaar.com/…/wedding-anarkalis-n-straig…/sb.htmlloading...