loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

2015 SRI MANMADHA NAMA SAMVATSARA JATHAKA PHALITHALU IN TELUGU

శ్రీ మన్మదనామ సంవత్సర జాతక పలితాలు మరియు పరిహారాలు
గమనిక: గోచార రీత్యా రాశి ఫలములు అశుభముగా వుండి, దోషములు వున్నప్పటికి, మీ జననకాల దశాఫలములు, శుభముగా వుంటే రాశి ప్రస్తుత అశుభ ఫలాలు స్వల్పంగా జరుగును, చిన్న చిన్న జప,హోమ,దాన పరిహారాలు పాటించి శుభఫలితాలను పొందగలరు.
మేషము:-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంలో గురుడు ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి 13.07.2015 వరకు చతుర్ధస్థాన మందు, తదుపరి సంవత్సర చివరి వరకు పంచమ స్థానమందు , శని ఈ సంవత్సరమంతయు అష్టమరాశియందు సంవత్సర ప్రారంభం నుండి 9.01.2016 వరకు రాహు, కేతువులు షష్ట, వ్యయ స్థానములయందు తదుపరి సంవత్సర చివరి వరకు పంచమ, లాభ స్థానములయందు సంచరించును. 13.7.2015 వరకు చతుర్ధ స్థానమందున్న గురు గ్రహ ప్రభావము వలన స్థాన చలనము. స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టుట. గృహనిర్మాణం, గృహమరమ్మత్తులు, వ్యవసాయం అభివృద్ధిపర్చుట, తల్లిదండ్రులపై శ్రద్ధ వహించుట వారికి కావాల్సిన సదుపాయములు సమకూర్చుట. దేవాలయములు, పాఠశాలలు, అనాధ ఆశ్రమాలు వంటి వాటికి తగిన సహాయ సహకారములు అందించెదరు. స్వంతగ్రామంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు పలిస్థాయి. వ్యవసాయదారులు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసివస్తుంది. పాడిపరిశ్రమ అభివృద్ధికరంగా ఉంటుంది. విద్యార్థులు గృహమునకు దూరంగా ఉండి విద్యాభ్యాసం చేస్తారు. విదేశంలో విద్యను ఆశించే విద్యార్థులకు తగిన అవకాశం వస్తుంది. గుప్తదానాలు చేస్తారు. 13.7.2015 నుండి పంచమస్థానమందున్న గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశిస్తారు. పీహెచ్‌డీ వంటి ఉన్నత డిగ్రీలు పూర్తి చేయుదురు. సంతానం ఆశించే దంపతుల కోరిక నెరవేరును. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుపడుతుంది. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. ఉపాధ్యాయులు, లాయర్లు, రాజకీయనాయకులకు వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. పిల్లలు ఆర్థికంగా సహకరిస్తారు. పిల్లల పెళ్లిళ్లు లేదా వారి ఉన్నత విద్య కొరకు ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చగును.
పరిహారం: ప్రతినెల మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం, అష్టమ శని నివారణకు ఒక శనివారం 800 గ్రా నల్ల నువ్వుల నూనెచే శనిగ్రహమునకు అభిషేకం జరిపించుట, వృద్ధులకు రోగగ్రస్తులకు సేవచేయుట, వారికి కావలసిన సదుపాయములు సమకూర్చుట,దేవాలయ ప్రదక్షిణలు, హనుమాన్‌ చాలిసా పారాయణం, కేతువు వ్యయంలో ఉన్నందువలన అన్నదానము చేయు సంస్థలకు, దేవాలయములకు విరాళం ఇచ్చుట.రాహువు షష్టమ స్ధానం వలన కోర్టు వివాదాలు,గొడవలు,వ్యాపారనష్టం ఉన్నవారు దుర్గా సప్తశ్లోకి పఠించాలి.
వృషభము :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంలో ఈ రాశి వారికి గురువు సం ప్రారంభం నుండి 13.7.2015 తృతీయస్థానమందు , తదుపరి సం చివరి వరకు చతుర్ధ స్థానమందు శని ఈ సంవత్సరమంతయు, సప్తమస్థానమందు రాహువు సం ప్రారంభంనుండి 9.1.2016 వరకు, పంచమస్థానమందు తదుపరి సం చివరి వరకు చతుర్ధస్థానమందు కేతువు సం ప్రారంభం నుండి 9.1.2016 వరకు లాభస్థానమందు తదుపరి సం చివరి వరకు దశమస్థానమందు సంచరించును. 13.7.2015 వరకు గురువు తృతీయస్థాన సంచారఫలితంగా మంచి స్నేహితులు లభించుట. ఇరుగుపొరుగు వారితో మంచి సంబంధాలు, మంచి ఆలోచనలు, ఇతరులకు, స్నేహితులకు, తోడబుట్టినవారికి సహకరించుట. కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం లభించుట, పిల్లల విద్య లేదా వారి వివాహం కొరకు అధిక ధన వ్యయం, క్రీడాకారులకు పోటీలో విజయం, నిరుద్యోగులకు ఇంటర్వ్యులలో విజయం, చదరంగం ప్లేయర్స్‌కు మంచి అవకాశాలు, గుర్తింపు కలుగును. స్నేహితుల సహకారంతో కోర్టు సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విడిపోయిన బంధువులు, స్నేహితులు తిరిగి కలుసుకుంటారు. సాంప్రదాయాలను గౌరవిస్తారు. మంచి అలవాట్లు నడవడికతో అందరినీ ఆకర్షిస్తారు. ఇరుగుపొరుగు లేదా స్నేహితుల ద్వారా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ట్రాన్స్పపర్లకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచికార్యక్రమాలకు గుప్తదానం చేస్తారు. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. 13.7.2015 నుండి గురువు చతుర్ధస్థాన సంచారమువలన స్థిరాస్తుల విలువ పెరిగి వాటిపై ఆదాయం లభించును. వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉండును. వ్యవసాయ అనుబంధ పరిశ్రమదారులకు కలిసి వచ్చును. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లాభం సంపాదించెదరు. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు ఫలిస్థాయి. విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు విదేశాలు వెళ్తారు. సంతానం కోరుకునే దంపతుల కోరికలు నెరవేరును. ఇన్సూరెన్సులు, చిట్‌ఫండ్స్ ద్వారా ధనం లభించును. ఆకస్మిక ధనలాభం కలుగును.
పరిహారం: ప్రతి శనివారం దగ్గరలో ఉన్న ఆలయం సందర్శించి, నవగ్రహ ప్రదక్షిణలు చేయుట, సప్తమ శని (కంటక శని) కారణంగా శనివారం నియమంగా ఉండాలి. విష్ణూ సహస్త్రనామ పారాయణం, ప్రతినెల మాసశివరాత్రి రోజు శివునికి అభిషేకం, హనుమాన్‌ ఆరాధన, 6 మంగళవారములు హనుమాన్‌ ఆలయంలో 108 తమల పాకులతో అర్చన, వృద్దులకు, అనాదలకు సేవచేయుట.రాహువు పంచమంలో ఉన్నందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు.పాదరసంలో దుర్గాదేవిని పూజించటం మంచిది.కేతువు లాభ స్ధానంలో ఉన్నందువలన స్నేహితులద్వారా ఇబ్బందులు ఎదుర్కోనవచ్చును.తెల్లజిల్లేడు గణపతిని పూజించాలి.
మిథునము :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు ద్వితీయస్థానమందు తదుపరి సంవత్సరాంతం వరకు తృతీయస్థానమందు సంచరించును. ఈ సంవత్సరమంతయు శని షష్ట స్థానమందు సంచరించును. సంవత్సర ప్రారంభం నుండి 9.1.2016 వరకు రాహువు చతుర్ధస్థానమందు తదుపరి సంవత్సరం చివరి వరకు తృతీయస్థానమందు కేతువు 9.1.2016 వరకు దశమ స్థానమందు తదుపరి సంవత్సరం చివరి వరకు భాగ్యస్థానమందు సంచరించును. 13.7.2015 వరకు గురువు ద్వితీయస్థానమందు సంచారములో కుటుంబంలో శుభ కార్యములు జరుగుట, కుటుంబవృద్ధి, ఆర్థిక సమస్యల నుండి పరిష్కారం, కుటుంబ గౌరవం పెరుగుట, వాక్‌చాతుర్యం పెరుగుట, కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం లభించుట, ఉపాధ్యాయులకు, ప్లీడర్లకు, అర్చకులు, పురోహితులు, జ్యోతిష్కులు మొదలగు వారికి పేరు ప్రతిష్టలతోపాటు ఆదాయం పెరుగుట, వివాహ ప్రయత్నాలు ఫలించును. అనారోగ్య సమస్యలనుండి పరిష్కారం, వ్యాపార అవసరములకు రుణం లభించుట, ప్రేమికులు వివాహ విషయంలో ఒక అంగీకారమునకు వచ్చుట, అజీర్ణసంబంధ అనారోగ్యం, రుణదాతలనుండి ఒత్తిడి, కోర్టు సమస్యలనుండి విముక్తి, నిరుద్యోగులు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం, వృత్తిలో నైపుణ్యం పెరుగుట. సహ ఉద్యోగుల సహకారం, అధికారుల నుండి గుర్తింపు, వృత్తిలో గౌరవం ఆదాయం పెరుగుతుంది. నూతన విద్యలు నేర్చుకునే కోరిక, దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొనుట, వృద్ధులకు, అనాధలకు సేవచేయుట, విద్యలో అభివృద్ధి, వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది.
పరిహారం: ప్రతి శనివారం దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించి, నవగ్రహములకు ప్రదక్షిణలు చేయాలి, 8 శుక్రవారములు కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించి, కుంకుమ అర్చన చేయాలి, విష్ణు సహస్త్రనామ పారాయణం, ప్రతినెల మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం, అనాద శరణాలయాలకు శక్తి కొలది విరాళం ఇచ్చుట, వృద్దులకు సేవచేయుట.రుద్ర నమక త్రిశతి నామావళి పఠించాలి.రాహువు చతుర్ధంలో ఉన్నందువలన స్ధిరాస్తి,వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.దుర్గాదేవి స్తోత్రాలు పఠిస్తూ మినుములతో చేసిన పదార్ధాలు దానం చేయాలి.కేతువు దశమంలో వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి.గణపతిని పూజించాలి.గురుగ్రహ దోష పరిహారానికి హయగ్రీవ పారయణం గాని దత్తాత్రేయ పారాయణం గాని చేస్తూ పాదరస సాయిబాబా ని పూజించాలి.
కర్కాటకము:- స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు జన్మరాశి యందు తదుపరి సంవత్సరం చివరి వరకు ద్వితీయస్థానమందు, శని ఈ సంవత్సరం అంతయు పంచమ స్థానమందు, 9.1.2016 వరకు రాహువు తృతీయస్థానమందు, కేతువు నవమస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు రాహువు ద్వితీయస్థానమందు, కేతువు అష్టమస్థానంలో సంచారము చేయును. ఈ రాశివారికి ఈ సంవత్సరంలో 13.7.2015 వరకు జన్మరాశియందు సంచారము చేయుగురు ప్రభావము వలన మంచి ఆరోగ్యము, నడవడిక, మంచి అలవాట్లు కలుగును. చూసినవారికి ఆకర్షణగా గౌరవభావం కలిగే విధంగా వేష, భాషలయందు మార్పు వస్తుంది. తరచూ ప్రయాణములు పండితులను, గురువులను కలుసుకోవడం, పుణ్యేత్రములు సందర్శన చేయుదురు. 13.7.2015 తదుపరి గురువు ద్వితీయస్థానములో సంచారము వలన వాక్‌చాతుర్యం పెరుగును. కుటుంబ ఆదాయం పెరుగును. కుటుంబం ఏదో ఒక శుభకార్యం జరుగును. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగును. ఉపాధ్యాయులకు, లాయర్లకు, జ్యోతిష్కులకు, పురోహితులకు లాభసాటిగా ఉండి వారి ఆదాయం పెరుగును. ఋణ, కోర్టు సమస్యలనుండి విముక్తి లభించును. నిరుద్యోగులకు నూతన ఉపాధి అవకాశములు, వృత్తిలో అభివృద్ధి, సాటి ఉద్యోగస్తులనుండి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ ధనం లభిస్తుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వాక్‌చాతుర్యంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. దేవాలయాల అభివృద్ధికి సహాయపడతారు. పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు.
పరిహారం: సంకటనాశన గణేష స్తోత్రం పారాయణం, ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదివారం నియమంగా ఉండుట, ఆదిత్య హృదయం పారాయణం, దగ్గరలో ఉన్న సూర్య లేదా రామాలయములను సందర్శించుట, 4 మంగళ వారములు హనుమాన్‌ ఆలయంలో 108 తమల పాకులతో అర్చన,గోవులకు సేవచేయుట, రక్షించుట తండ్రి సమానులైన వారికి గౌరవించుట. లగ్న, చతుర్ధస్థానాల్లో, కుజగ్రహ సంచారసమయమున, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకము, హనుమంతునికి ఆకుపూలు, వడమాల వేయుట మంచిది.
సింహం :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సరం ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు వ్యయమందు తదుపరి సంవత్సరం చివరి వరకు జన్మరాశియందు, శని ఈ సంవత్సరం అంతయు చతుర్ధస్థానమందు, సంవత్సరం ప్రారంభం నుండి 9.1.2016 వరకు రాహువు ద్వితీయస్థానమందు, కేతువు అష్టమస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు రాహువు జన్మరాశియందు, కేతువు సప్తమస్థానమందు సంచారము చేయును. గురు ప్రభావమువలన ఈ రాశివారికి ఈ సంవత్సరంలో పిల్లలు ఉన్నత విద్యకొరకు దూరప్రాంతమునకు వెళ్లు అవకాశం లభిస్తుంది. వారి విద్య కొరకు అధిక ధనవ్యయం చేయవలసివస్తుంది. పుణ్యకార్యములయందు పాల్గొనుట, అనాధ ఆశ్రమాలకు, వృద్ధ ఆశ్రమాలను సందర్శించి వాటి అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారములు అందిస్తారు. సేవా కార్యక్రమాలయందు, పుణ్యకార్యములయందు పాల్గొంటారు. స్థిరాస్తులపై దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం అగును. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీలో ఉన్న ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయం ప్రేమగా మారుతుంది. రహాస్య కార్యకలాపాలు సాగిస్తారు.
పరిహారం: ప్రతి మంగళవారం హనుమాన్‌ ఆలయం సందర్శించుట, పేద విద్యార్ధులకు చదువుకు కావలసిన పుస్తకములు దానం చేయుట. గురు, శని, రాసు, కేతు గ్రహసంబంధ జపాలు, దానాలు, దత్తాత్రేయ, దక్షిణమూర్తి స్తో్తమ్రు, శ్రీ సాయిబాబాకు సంబంధించిన పారాయణములు ఎంతోమేలు.అర్ధాష్టమ శని నివారణకు శనిగ్రహ రెమిడీస్ చేస్తూ సుందరకాండ పారాయణం చేయాలి.చేతికి గుర్రపు నాడారింగ్ ని దరించి గుర్రపు నాడాని ఇంటి సింహాద్వారానికి ఉంచాలి.గురువు వ్యయ స్ధానంలో ఉన్నందువల్ల వృధా ఖర్చులు తప్పించుకోవటానికి దేవాలయ సందర్శనలు,తీర్ధ యాత్రలు,దైవ సంబంద వస్తువులకు ఖర్చు పెట్టటం వలన వృధా ఖర్చులు తప్పించుకోవచ్చును.
కన్య :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు లాభస్థానమందు తదుపరి సంవత్సరం చివరి వరకు వ్యయస్థానమందు, శని ఈ సంవత్సరం అంతయు తృతీయస్థానమందు, రాహువు సంవత్సరం ప్రారంభం నుండి 9.1.2016 వరకు జన్మరాశియందు తదుపరి వ్యయమందు, కేతువు 9.1.2016 వరకు సప్తమందు తదుపరి షష్టస్థానమందు సంచరించును. ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుండి 13.7.2015 వరకు గురువు లాభస్థానమందు సంచారము వలన విద్యలో అభివృద్ధి, తల్లితరపు బంధువుల సహకారం, స్థిరాస్తుల విలువ పెరిగి వాటిపై ఆదాయం పెరుగును. వ్యవసాయదారులకు, పాడిపరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహంలో విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నూతన వాహనలాభం, జీవిత భాగస్వామి ఆదాయం పెరుగును. భార్య లేదా భర్త తరపు నుండి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన భాగస్తులతో చేయు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్య తరపు బంధువులు సహకరిస్తారు. పాత బాకీలు వసూలు అగును. కోర్టు, రుణ సమస్యల నుండి విముక్తి, మీ సంతానంలో ఒకరికి ఉపాధి అవకాశం వస్తుంది.
పరిహారాలు: కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కుంకుమ అర్చన, గురు చరిత్ర పారాయణం, గురువు జులై తరువాత వ్యయ స్ధానంలో సంచారం చేసే సమయంలో 3 గురువారములు 750 గ్రా శనగలు, గుగ్గళ్ళుగా చేసి సాయి ఆలయంలో ఇవ్వవలెను,మొలకలు వచ్చిన శెనగలు తినటం,దానం చేయటం చేయాలి. వృద్దులకు రోగగ్రస్తులకు సేవ చేయుట, వారి మందులకు కావలసినధనం ఇచ్చుట, వారికి ఉపయోగపడే వస్తువులు దానం చేయుట. రాహువు జన్మలో ఉన్నందు వల్ల మానసిక చికాకులు ఆదికం.నివారణకు రాహుకాల దీపాలు వెలిగించాలి.పాదరస దుర్గా దేవిని పూజించాలి.
తుల :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు దశమస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు లాభస్థానమందు, శని ఈ సంవత్సరమంతయూ ద్వితీయస్థానమందు, సంవత్సరం ప్రారంభం నుండి 9.1.2016 వరకు రాహువు వ్యయమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు లాభస్థానమందు, కేతువు 9.1.2016 వరకు షష్ట స్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు పంచమ స్థానమందు సంచరించును. ఈ రాశివారికి సంవత్సరం ప్రారంభం నుండి 13.7.2015 వరకు గురువు దశమమున వృత్తిస్థానమందు సంచారము వలన వృత్తియందు ఆకస్మికమార్పులు, ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్లు వంటివి లభించును. చేయువృత్తియందు ఇతరుల జోక్యం ఎక్కువగా ఉంటుంది. వైద్యులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌రంగంలో వారికి నూతన అవకాశములు వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి నూతన ఉపాధి అవకాశం వస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.
పరిహారాలు: శని ద్వితీయంలో ఎల్నాటి శని ఉన్నందువల్ల అనాథ శరణాలయాల అభివృద్ధికి శక్తికొలది విరాళము చేయుట, శనివారం రోజు శనిగ్రహమునకు 800 గ్రా నల్లనువ్వుల నూనెతో అభిషేకం,నల్ల చీమలకు తేనె వెయ్యటం. విష్ణు సహస్రనామ పారాయణం, దగ్గరలో ఉన్న పుణ్యనదిలో స్నానం చేయుట, వృద్ధులైన స్త్రీలకు సేవ చేయుట, వారికి కావలసిన వస్తువులను దానం చేయుట, విష్ణూ సహస్రనామ పారాయణం. లగ్న, వ్యయ, అష్టమ స్థానాలలో కుజ సంచార సమయములలో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకము మరియు హనుమంతునికి ఆకుపూజ, వడమాల అవసరం.
వృశ్చికం :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు భాగ్యస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు దశమస్థానమందు, ఈ సంవత్సరమంతయూ శని జన్మరాశియందు, 9.1.2016 వరకు రాహువు లాభస్థానమందు, కేతువు పంచమస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు రాహువు దశమస్థానమందు, కేతువు చతుర్ధమందు సంచారము చేయును. ఈ సంవత్సరం ఈ రాశి వారికి 13.7.2015 వరకు గురువు భాగ్యస్థాన సంచారం వలన పేరు ప్రతిష్టలు పెరుగును. మంచి అలవాట్లు, మంచి నడవడిక ఏర్పడును. దైవభక్తి, సేవాభావం కలుగును. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం, విదేశ అవకాశములు వచ్చును. పెద్దల సహకారంతో కుటుంబ అవసరములకు తగిన ధనం సమకూరును. సంతానం కోరుకునే వారి కోరికలు నెరవేరును. కుటుంబవృద్ధి, వంశాభివృద్ధి కలుగును.
కుటుంబంలో శుభకార్యములు జరుగును. వాక్‌చాతుర్యంతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. సంఘంలో కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఉపాధ్యాయులు, ఫ్లీడర్లు, జ్యోతిష్కులు, పురోహితులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారి ఆదాయం పెరుగుతుంది. చేయువృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. టెక్నికల్‌ విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మికరంగంలో వారికి రచయితీలకు గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూరప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు సందర్శించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. 13.7.2015 నుండి గురువు దశమస్థాన సంచారం వలన తెలివితేటలు ఉపయోగించి పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉద్యోగం సంపాదిస్తారు. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు వృత్తిలో హోదా ఆదాయం పెరుగును. మీ సంతానంలో ఒకరు ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రాంతం వెళతారు.
పరిహారం: విఘ్నేశ్వరునికి గరికతో అర్చన, సంకట నాశన గణేష్‌ స్తో్త్రం పారాయణం, ప్రతి శనివారంహనుమాన్‌ ఆలయ దర్శనం, హనుమాన్‌ చాలీసా పారాయణం, వృద్దులకు రోగగ్రస్తులకు సేవ చేయుట వారికి కావలసిన సదుపాయములు సమకూర్చుట, కులదైవాన్ని ఆరాదించుట, మంగళవారం నియమం పాటించుట.ఎల్నాటి శని దోష నివారణకు సాలగ్రామ మాలను ధరించటం గాని,మాలతో జపంచేయటం గాని చేస్తే మంచిది.
ధనుస్సు :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు అష్టమరాశి యందు, తదుపరి సంవత్సరం చివరి వరకు భాగ్యరాశియందు, శని ఈ సంవత్సరం అంతయూ వ్యయస్థానమందు, రాహు 9.1.2016 వరకు దశమస్థానమందు, కేతువు చతుర్ధస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు రాహువు నవమస్థానమందు, కేతువు తృతీయస్థానమందు సంచరించును. ఈ రాశి వారికి13.7.2015 వరకు గురువు అష్టమస్థానమందు సంచారము వలన విద్యార్థులకు ప్రతిభకు తగిన గుర్తింపు పరిశోధనలు చేయువారికి పిహెచ్‌డీలు మొదలగు ఉన్నతస్థాయి విద్యార్థులకు వారి శ్రమకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించును. ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహం లభించును. ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక వ్యాధులు బయటపడే అవకాశం ఉన్నది. వారసత్వంగా స్థిరాస్థులు లభించును. చేయువృత్తియందు అనుకోని అభివృద్ధి, ఆదాయం పెరుగును. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు ఫలిస్థాయి. ఆనుకున్న దానికన్నా ఎక్కువ ధర లభిస్తుంది. రహాస్యంగా ఉంచాలి అనుకున్న విషయం బయటపడి పరువు ప్రతిష్టలకు భంగం కలుగును.
13.7.2015 నుండి గురువు నవమస్థానమందు సంచారము వలన సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న పెద్దవారితో పరిచయం, దైవభక్తి పెరుగుతుంది. మంచి అలవాట్లు నడవడికతో పదిమంది దృష్టిని ఆకర్షిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం లభిస్తుంది. అనారోగ్య సమస్యలనుండి విముక్తి లభించి శరీర ఆకర్షణ పెరుగుతుంది. ఉపాధ్యాయులు, లాయర్లు, రచయితలు, జ్యోతిష్కులకు, పురోహితులకు గుర్తింపు, ప్రభుత్వ సత్కరం లభిస్తుంది. స్థానచలనం కొరకునే ఉద్యోగులకు కోరుకున్నచోటుకు ట్రాన్సఫర్లు లభిస్తాయి. పాతబాకీలు వసూలు అగును. కోర్టు సమస్యలనుండి, రుణ సమస్యలనుండి విముక్తి లభిస్తుంది.
పరిహారం:గురు చరిత్ర పారాయణ, గోవులకు సేవ చేయుట గురువులను సత్కరించుట, సంకష్టహరచతుర్ధి వ్రతము చేయుట, మాసశివరాత్రి రోజు శివునికి అభిషేకం చేయుట ప్రతి మంగళవారం హనుమాన్‌ ఆలయ ధర్శనం, హనుమాన్‌ చాలిసా పారాయణ, శుక్రవారం నియమంగా ఉండుట. మినుములు, ఉలవలు ఆవుకి ఆహారంగా పెట్టటము, చాలా మంచిది, దుర్గాదేవికి కుంకుమ పూజ.దీర్ఘకాల వ్యాదుల నివారణకుఎల్నాటి శని ఇబ్బంది పెడుతుంటే హనుమాన్ కి తమలపాకుతో ఆకు పూజ చేస్తూ శనివారం ఉపవాసం ఉండటం మంచిది.పాదరస హనుమాన్ ని పూజించాలి.నల్ల పసుపు పొడిని నుదుట గంధంతో గాని,కుంకుమతో గాని ధరించాలి.
మకరం :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు సప్తమస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు అష్టమస్థానమందు, శని ఈ సంవత్సరం అంతయూ లాభస్థానమందు, రాహు, కేతువులు 9.1.2016 వరకు నవమ తృతీయస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు అష్టమ ద్వితీయస్థానమందు సంచారం చేయును. ఈ రాశి వారికి 13.7.2015 వరకు గురువు సప్తమస్థానమందు సంచారము వలన దూర ప్రాంత ప్రయాణము ఎక్కువగా ఉంటాయి. విదేశ అవకాశములు వస్తాయి. భార్యా భర్తల మధ్య తాత్కాలిక ఎడబాటు వస్తుంది. అందము ఆకర్షణ కలిగిన స్త్రీలతో పరిచయం అవుతుంది.
వివాహ ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలిస్థాయి. వ్యాపార భాగస్తులచే విభేదాలు వస్తాయి. వారితో విడిపోయే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జీవిత భాగస్వామికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. మధ్యవర్తులు లేదా పేపరు ప్రకటన ద్వారా, ఎస్‌ఎమ్‌ఎస్‌, ఇంటర్‌నెట్‌ చాటింగ్‌ ద్వారా పరిచయం అయి అవి వివాహమునకు దారి తీస్తుంది. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబంలో ఒకరికి విదేశంలో ఉద్యోగ అవకాశం వస్తుంది. కుటుంబ ఆదాయం పెరుగును. కుటుంబంలో పెద్దవారి అనారోగ్యం వలన మానసిక అశాంతికి గురవుతారు. దగ్గరి బంధువులతో విరోదం ఏర్పడుతుంది. రుణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ప్రయాణములలో విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు.
పరిహారాలు: విష్ణు సహస్త్రనామ పారాయణం, ప్రతినెల మాస శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయుట, ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం పారాయణ సుబ్రమణ్య స్వామివారి ఆరాధన, వృద్దులకు సేవ చేయటం, వారికి గొడుగు, దుప్పట, జోళ్ళు, వంటి ఉపయోగపడే వస్తువులు ఇవ్వటం.గురువు సప్తమ స్ధాన సంచారం వలన దంపతుల మద్య విబేదాల నివారణకు పసుపు కొమ్ము గణపతిని పూజించటం గాని పసుపు మాలతో జపం చేయటం గాని చెయ్యాలి.
కుంభం:- స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు షష్టస్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు సప్తమస్థానమందు, శని ఈ సంవత్సరం అంతయూ దశమస్థానమందు, రాహు కేతువులు 9.1.2016 వరకు అష్టమ, ద్వితీయ స్థానములయందు తదుపరి సంవత్సరం చివరి వరకు సప్తమ జన్మరాశియందు సంచారం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 13.7.2015 వరకు గురువు షష్టి స్థానమందు సంచారము వలన ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాక్‌చాతుర్యంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు.
కుటుంబంలో ఒకరికి అనారోగ్యం కలుగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగును.లాయర్లు, ఉపాధ్యాయులు, జ్యోతిష్కులు, పురోహితులు, సంగీత కళాకారులు, ప్రవచనములు చెప్పేవారికి వ్యక్తిగత గుర్తింపు ఆదాయం లభిస్తుంది. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభకార్యములు జరుగుతాయి. వ్యక్తిగత తెలివితేటలతో స్వయం కృషితో నూతన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. వృత్తిలో మార్పుకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రచయితలకు, పరిశోధనలకు ప్రభుత్వ గుర్తింపు వస్తుంది. మీలో అంతర్గతంగా దాగివున్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కుటుంబ అవసరాలకు అధిక ధనం వ్యయం అగును.
పరిహారం: శనిగ్రహమునకు 800 గ్రా నల్లనువ్వుల నూనెతో శనివారం అభిషేకం చేయుట, రామ రక్షా స్తోత్ర పారాయణ, ప్రతినెల మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం, హనుమాన్‌ ఆలయంలో 4 మంగళవారములు 108 తమలపాకులతో అర్చన, వృద్ధులైన స్త్రీలను ఆదరించుట వారికి సేవలు చేయుట వారికి ఉపయోగపడే వస్తువులు ఇచ్చుట.
మీనం :-స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది నుండి 13.7.2015 వరకు గురువు పంచమ స్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు షష్టస్థానమందు, శని ఈ సంవత్సరమంతయు నవమస్థానమందు, రాహుకేతువులు 9.1.2016 వరకు సప్తమ, జన్మరాశియందు తదుపరి సంవత్సరమంతయు షష్ట, వ్యయస్థానముల యందు సంచారము చేయును. ఈ రాశి వారికి 13.7.2015 వరకు గురువు పంచమ స్థాన సంచారము వలన సంతాన ప్రాప్తి, మనసులో ఉన్న కోరికలు నెరవేరును. స్పెక్సులేషన్‌ కలిసి వచ్చును.
విద్యార్థులు ఉన్నత శ్రేణి ఫలితాలు సాధించి మంచి పేరున్న కళాశాలలో సీటు సంపాదిస్తారు. మీ సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమికుల ప్రేమ ఫలించి వివాహ విషయంలో ఒక అంగీకారమునకు వస్తారు. నూతన పరిచయాలు, అలవాట్లు, సంతోషాన్ని కలిగిస్థాయి. ఎక్కువగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సినిమా, టీవీ, కళాకారులకు, పోటోగ్రఫి, యానిమేషన్‌ రంగాలలో వారికి మంచి అవకాశాలు గుర్తింపు లభిస్తుంది. మత్స్య పరిశ్రమ, హోటల్స్‌, వాటర్‌ప్లాన్‌లు, లిక్కర్‌ పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలు పెట్టుబడిగా వ్యాపారం చేయు వారికి బాగా కలిసి వస్తుంది.
పరిహారం: ఆదివారం నియమంగా ఉండుట, ఆదిత్య హృదయం పారాయణ, సూర్య లేదా రామాలయాలను సందర్శించుట, ధీర్ఘకాల రోగులకు తండ్రి సమానులైనవారికి సేవ చేయుట, మందులకు కావలసిన ధనం సమకూర్చుట సంకటహరచతుర్ధి వ్రతము చేయుట, గోవులకు సేవచేయుట.కేతువు జన్మరాశిలో ఉన్నందు వలన వైరాగ్యం అధికంగా ఉంటుంది.రోజు మొత్తంలో కొంత సమయాన్ని దైవ కార్యాలకు వెచ్చించాలి.వక్క గణపతిని పూజించటం మంచిది.

AMMA VARU PIC


NEW GADGET FOR CELL PHONE


MORNING DREAMS OF A FARMER


SUNDAY IS LIKES ICE CREAM


NEW HUSBAND


TEMPLE PUJA TIPS IN TELUGU


PRETTY BEAUTY IN SAREE


OLDEST WOMEN IN RAJAHMUNDRY


ARTICLE IN TELUGU ABOUT PANCHA SAROVARALU - 4

ARTICLE IN TELUGU ABOUT PANCHA SAROVARALU - 3

ARTICLE IN TELUGU ABOUT PANCHA SAROVARALU - 2

ARTICLE IN TELUGU ABOUT PANCHA SAROVARALU - 1

loading...