loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BEAUTIFUL SUMMER COTTON SALWARS

Tamil Actress and Hot Beauty Varu Sarathkumar
OM NAMO SAI BABA NAMAHAHOUSE WORK LIVES ONE HUNDRED YEARS


DOOR CARE


LORD MAHADEV'S SRI KALAHASTHESWARA SATAKAM POEMS AND MEANING IN TELUGUశ్రీకాళహస్తీశ్వర శతకము!
.
నిన్నే రూపముగా భజింతు మదిలో / నీ రూపుమోకాలో స్త్రీ
చన్నో కుంచమో,మేకపెంటియొ యీ / సందేహముల్మాన్పి నా
కన్నార న్భవదీయమూర్తి సగుణా / కారంబుగా జూపవే
చిన్నీరేజ విహార మత్తమధుపా / శ్రీకాళహస్తీశ్వరా!
.
శ్రీ కాళాహస్తీశ్వరా!నీ భక్తులు కోరిన రీతిన సేవించిన చోటనే ప్రత్యక్షమగుచూ వారికి వరాల నిచ్చుచున్నాను.
1.శ్రీకృష్ణుని ఆనతి మేరకు అర్జునుడు కృష్ణుని మోకాలి చిప్పమీద శివుని పూజింపగా,అర్జునునకు ప్రత్యక్షమై పాశుపతాస్త్రమిచ్చెను.అట్టినిన్ను మనస్సులో ఏ రూపములో ద్యానము చేయగలను.నీవు ఒకసారి మోకాలిచిప్పరూపులోను,స్త్రీ యొక్క స్థనములోను,ద్యానము కొల్చే కుంచము రూపములోను,మేక పెంటిక రూపములోనునీ భక్తులకు దర్శనమిచ్చితివి.నీది అసలు ఏ రూపము.నా ఈ అనుమానము తీర్చి కనులారా నీ రూపమును దర్శించనిమ్ము.
.
2.ఒక భక్తుడు స్త్రీలోలుడై శివరాత్రినాడు సంగమము జరుపుచున్న స్త్రీస్తనము మీద శివరూపమును ద్యానించగా శివుడు ప్రత్యక్షమై వానికి కైవల్యమిచ్చెను.అందుకే ఆయన ఆచంటేశ్వరుడు.
.
3.ఒక వర్తకుడు దాన్యము కొలుచ్చుండగా దాన్యకుంచము మీద శివుని ద్యానించగా అచట ప్రత్యక్షమై వానికి మోక్షమిచ్చెను.ఆకారణం చేతనే ఆయన కుంచేశ్వరుడు.
.
4.ఒక గొల్లడు మేక పెంటికలేరుచు అచ్చట శివనామము ద్యానించగా పెంటికమీద శివుడు ప్రత్యక్షమై కైవల్య ప్రాప్తినిచ్చెను.

Govinda.. Govinda


MOTOR CYCLE CIRCUS FEETS AT WOMENS COLLEGE


HEALTH SECRETS WITH HONEY AND INDIAN SPICES


కొంచెం తేనె. . కొంచెం చెక్క 

తేనె, దాల్చిన చెక్క పొడిని రోజూ తీసుకుంటే చాలా వరకు వ్యాధులు నయమవుతా యంటున్నారు పరిశోధకులు. జబ్బులను నయం చేయడమే కాకుండా వ్యాధులు దరిచేరకుండా చూడటంలోనూ ఈ మిశ్రమం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అయితే ఎలా తీసుకుంటే ఫలితం ఉంటుంది?
ఏయే జబ్బులకు ఔషధంగా పనిచేస్తుంది?
• గుండె జబ్బులు : దాల్చిన చెక్కను పొడిగా చేసుకుని తరువాత తేనె కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తీసుకోవాలి. రెగ్యులర్‌గా బ్రేక్‌ఫా్‌స్టలో జెల్లీ, జామ్‌ బదులుగా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కొలెసా్ట్రల్‌ తగ్గి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఒకవేళ మీకు ఇప్పటికే హార్ట్‌ఎటాక్‌ ఒకసారి వచ్చి ఉంటే మరోసారి రాకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క, తేనెను తీసుకోవడం వల్ల హార్ట్‌బీట్‌ కూడా మెరుగవుతుంది.
• ఆర్థరైటిస్‌ : రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, ఒక చిన్న టీ స్పూన్‌ దాల్చిన చెక్కపొడిని కప్పు వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ తీసుకుంటే క్రానిక్‌ ఆర్థరైటిస్‌ సమస్య కూడా నయమవుతుంది. పరిశోధనల్లోనూ ఈ విషయం రుజువయింది. 200 మంది ఆర్థరైటిస్‌ రోగులకు తేనె, దాల్చిన చెక్క పొడిని బ్రేక్‌ఫాస్ట్‌ కన్నా ముందు అందజేసి పరీక్షించారు. అందులో 73 మందికి నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించింది.
• మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు : రెండు టేబుల్‌స్పూన్ల దాల్చినచెక్కపొడి, ఒక టీస్పూన్‌ తేనెను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
• కొలెసా్ట్రల్‌ : రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, మూడు టీస్పూన్ల దాల్చిన చెక్కపొడిని 16 ఔన్సుల టీ వాటర్‌తో కలిపి కొలెసా్ట్రల్‌ పేషెంట్స్‌ తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు గంటల్లోగా 10 శాతం కొలెసా్ట్రల్‌ తగ్గిపోతుంది.
• జలుబు : సాధారణ జలుబు లేక తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నా ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, పావు చెంచా దాల్చినచెక్క పొడిని రోజుకొకసారి మూడు రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, సైనస్‌ సమస్యలు దూరమవుతాయి.
• కడుపునొప్పి : దాల్చిన చెక్కను తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్సర్‌ సమస్య కూడా నయమవుతుంది.
• ఇన్‌ఫ్లూయెంజా : తేనెలో ఉన్న సహజసిద్ధగుణాలు ఇన్‌ఫ్లూయెంజా జెర్మ్స్‌ని చంపేసి ఫ్లూ నుంచి కాపాడతాయి.
• గొంతు నొప్పి : గొంతులో కిచ్‌ కిచ్‌గా ఉంటే ఒక టేబుల్‌స్పూన్‌ తేనె తీసుకోవాలి. ప్రతీ మూడు గంటలకొకసారి తీసుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు త్వరగా దూరమవుతాయి.
• మొటిమలు : మూడు టేబుల్‌స్పూన్ల తేనె, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని పేస్టు మాదిరిగా చేసుకుని పడుకునే ముందు ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు మొత్తం మటుమాయమవుతాయి.
• వెయిట్‌లాస్‌ : రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించి తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువుతు తగ్గుతారు.
• నోటి దుర్వాసన : ఒక టీ స్పూన్‌ తేనె, దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చటి నీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే ఆ రోజంతా నోటి సువాసన తాజాదనాన్నిస్తుంది.
• అలసట : అర టేబుల్‌ స్పూన్‌ తేనెను గ్లాసు నీటిలో కలుపుకుని కొంచెం దాల్చిన చెక్కపొడిని అందులో వేసుకుని తాగితే అలసట దూరమవుతుంది. ముఖ్యంగీ సీనియర్‌ సిజిజన్స్‌కు ఇది బాగా ఉపకరిస్తుంది.
• వినికిడి సమస్యలు : రోజూ ఉదయం, రాత్రి తేనె, దాల్చిన చెక్క పొడిని సమానంగా తీసుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి.
• రోగనిరోధక శక్తి : రోజూ క్రమంతప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.
• చర్మ వ్యాధులు : తేనె, దాల్చినచెక్క పొడిని సమానంగా తీసుకుని సమస్య ఉన్న చోట పూస్తే ఎగ్జిమా, రింగ్‌వార్మ్స్‌, ఇతర స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

loading...