ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SUMMER COOLERS - VEGETABLES AND FRUIT JUICES TIPS


వేసవిలో సొరకాయ-పైనాపిల్‌ 

వేసవిలో దప్పిక తీర్చుకోవడానికి కూల్‌డ్రింక్స్ ‌పై ఆధారపడే కంటే ఇంట్లోనే తయారుచేసుకునే జ్యూస్‌లు తీసుకోవడం మేలు. శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పోటు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాంటి డ్రింకే ఇది. 

కావలసిన పదార్థాలు : సొరకాయ - 100గ్రా, పైనాపిల్‌ - 150గ్రా, పుదీనా - 10 ఆకులు, నిమ్మకాయ - ఒకటి.

తయారుచేయు విధానం : తాజా పైనాపిల్‌ను తీసుకుని శుభ్రంగా తొక్కను తొలగించాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. సొరకాయను తీసుకుని శుభ్రంగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి. నిమ్మకాయను కట్‌ చేసి రసం పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనాపిల్‌ ముక్కలను, సొరకాయ ముక్కలను గ్రైండర్‌లో వేసుకోవాలి. రెండు ఐస్‌ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బ్లెండ్‌ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి వడకట్టుకోవాలి. చల్లదనం కావాలనుకుంటే మరికొన్ని ఐస్‌ ముక్కలు చేసి సర్వ్‌ చేసుకోవచ్చు. ఈ వేసవిలో చల్లదనంతో పాటు పోషకాలను అందిస్తుందీ ఈ డ్రింక్‌.

* పోషకాలు : విటమిన్‌ బి12, ఐరన్‌, విటమిన్‌ సి, థయామిన్‌, జింక్‌, విటమిన్‌ బి6, మెగ్నీషియం, కెరోటిన్స్‌, కాపర్‌, బెటైన్‌ వంటి పోషకాలుంటాయి.

* హెల్త్‌ బెనిఫిట్స్‌ : శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ‌కు బయటకు పంపించి వేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. దగ్గును తగ్గిస్తుంది.