ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL AVATHARS - SRI DURGA DEVI - 09-10-2016


శ్రీ దుర్గా దేవి:

“ విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట విలద్దస్తా భిరాసేవితాం ! హసైశ్చక్రగదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ‘’

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడ్ని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడ్ని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు ఈ అమ్మనామాన్ని జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు ఈమె శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రనిబట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చెయ్యాలి. “ ఓం దుం దుర్గాయైనమః ‘’ అనే మంత్రం పఠించాలి. పులగాన్నం నివేదన చెయ్యాలి. దుర్గా, లలిత అష్టోత్తరాలుపఠించాలి.