loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

First Look: Nargis Fakhri in 'Banjo


SUMMER HEALTH WITH CURD - CURD CONTROLS BLOOD PRESSURE - CURD INCREASES CONCENTRATION - CURD REDUCES MENTAL TENSION


HAPPY MOTHERS DAY ARTICLES IN TELUGU-4

HAPPY MOTHERS DAY ARTICLES IN TELUGU-3
HAPPY MOTHERS DAY ARTICLES IN TELUGU-2

HAPPY MOTHERS DAY ARTICLES IN TELUGU-1

IMPORTANCE OF THE FESTIVAL Akshaya Tritiya AND HOW TO PERFORM PUJA ON THE DAY Akshaya Tritiya


అక్షయ తృతీయ నాడు జాతక రీత్యా 12 రాశులకు చెందిన జాతకులు, ఏయే దేవతలు పూజించాలనే విషయాన్ని జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.
అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం, పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలుంటాయి.
ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయనాడు విష్ణు, మహాలక్ష్మీలను పూజించడం శ్రేయస్కరం. విష్ణు, మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి, బ్రాహ్మణులకు, పేదలకు చేతనైనా సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.
కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి. దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు, మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు
చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. సింహ, కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివావిష్ణులువుండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది.
తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయకస్వామి, సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది. అలాగే ధనుస్సురాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటిపువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఇకపోతే.. మకరరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి గరిక మాలను సమర్పించుకోవచ్చు.
అలాగే కుంభ రాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుడిని, మీన రాశి జాతకులు నందీశ్వరుడిని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

HOW TO REMOVE OILY SKIN PROBLEM - TIPS TO OVERCOME OILY SKIN PROBLEM IN TLEUGU


జిడ్డు తగ్గించే మార్గాలు!
జిడ్డు సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని ఖరీదైన సౌందర్య సాధనాలే వాడాలని లేదు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
* తెల్లసొన: గుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరాక చల్లటినీళ్లతో కడిగేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొనలో ఎ విటమిన్‌, నిమ్మలోని సి విటమిన్‌ చర్మానికి అంది జిడ్డు సమస్యను తగ్గిస్తాయి.
* నిమ్మరసం: ఇందులోని సిట్రిక్‌ యాసిడ్‌ సహజ యాస్ట్రింజెంట్‌లా పని చేస్తుంది. నిమ్మరసం, మినరల్‌ వాటర్‌ని సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుని నూనె లేని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
పెరుగు: రెండు చెంచాల పెరుగులో కొద్దిగా ఓట్‌మీల్‌ పొడి, చెంచా గోరువెచ్చని తేనె కలిపి ముఖానికి రాసి, మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేయాలి.
* టొమాటోలు: వీటిలో కూడా సహజ యాస్ట్రింజెంట్‌ గుణాలుంటాయి. టొమాటో ముక్కతో ముఖం మీద మర్దన చేసుకోవాలి. వీలుంటే టొమాటో రసంలో కాస్త తేనె కలిసి ముఖానికి మర్దన చేస్తే మరీ మంచిది.
* యాపిల్‌: ఈ గుజ్జులో కాస్త, పెరుగు, నిమ్మరసం కలిపి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు ముఖానికి రాసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద జిడ్డు పేరుకోకుండా ఉంటుంది.
* కీరదోస: ఇందులో విటమిన్‌ ఇ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. కీరదోస గుజ్జును చర్మానికి పూతలా వేసుకుంటే ఆ గుణాలన్నీ అంది.. ఆరోగ్యంగా ఉంచుతాయి. అలానే కీరదోస రసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. కాసేపటికి కడిగేసుకుంటే సరిపోతుంది.

MAHA MRUTYUNJAYA MANTRAM IN TELUGU


మహా మృత్యుంజయ మంత్రం:
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము; త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు; మృత్యోర్ = మృత్యువు నుండి; అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.

తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!

ప్రాశస్త్యము: మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ "మహా మృత్యుంజయ మంత్రం" పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని పారాయణం చేస్తారు.

Om namassivaaya


SEXY SLIM IMAGES OF ILIYANA IN RED


SEXY DANCING STILL OF ANUSHKHA IN RED DRESS


TIPS FOR BEAUTY AND SLIM IN TELUGU


అందం - ఆరోగ్యం
• సన్నడేందుకు పద్ధతుంది..!
సన్నబడాలని అనుకోవడం ఆలస్యం.. ముందు ఆహారంలో మార్పులు చేయడం మొదలుపెడతారు చాలామంది. దాంతో చాలావాటిని మానేస్తూ.. కొత్త పదార్థాలు తింటూ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అందువల్ల అనుకున్న ఫలితం కలగకపోగా.. కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీరూ ఇందుకు మినహాయింపు కాకపోతే.. డైటింగ్‌ విషయంలో మీరెక్కడ లోపాలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
ఫలానా పదార్థం తింటారా అని అడగడం ఆలస్యం.. నేను డైటింగ్‌ చేస్తున్నానని చెప్పకండి. ఎందుకంటే.. అది మీ మనసుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. అంటే.. చేయకూడని పనేదో చేస్తున్నట్లుగా మీ మనసు భావిస్తుందట అలా చెప్పడం వల్ల ఆనందం కూడా ఉండదు. అందుకే కొన్ని తినడం మానేస్తున్నా డైటింగ్‌ గురించి ఆలోచించకూడదు.
చాలామంది బరువు తగ్గాలని నియమాలు పెట్టుకుని అన్నింటినీ తినడం మానేస్తుంటారు. ముందుగా పిండిపదార్థాలూ, కొవ్వూ తినడం మానేస్తారు. కానీ అది సరైన పనికాదు. పిండిపదార్థాలు హాని చేస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమే. అన్ని రకాల పిండిపదార్థాలను పూర్తిగా తినడం మానేయడం వల్ల బరువు తగ్గకపోగా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. మెదడుకీ, శరీరానికీ శక్తి అంది, చురుగ్గా పనిచేయాలంటే పిండిపదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే వీలున్నంతవరకూ సంక్లిష్ట పిండిపదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయండి.
పూర్తిగా ఏ మాత్రం ఇష్టంలేని పదార్థాలు తీసుకోవడం మొదలుపెడతారు కొందరు. అవి ఆరోగ్యకరం కాబట్టి.. అయిష్టమైనా తప్పనిసరిగా తినాలనుకోవడం సరైన పనికాదు. దానికి బదులుగా ఓ పని చేయండి. మీకు బాగా ఇష్టమైన పదార్థాల్లో పోషకాలు అందించేవి ఏవో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాటిని తరచూ తీసుకునేలా చూసుకుంటే మంచిది.
కొందరు పూర్తిగా ఘనపదార్థాలు మానేసి, పండ్లరసాలూ, ఇతర ద్రవపదార్థాలకూ ప్రాధాన్యం ఇస్తుంటారు. సమతులాహారం తీసుకుంటూనే సన్నబడేందుకు ప్రయత్నించాలి తప్ప.. అసలు తినకుండా పొట్ట మాడ్చుకుని మాత్రం కాదు.

HISTORICAL IMPORTANCE OF RAMAYANAMరామాయణము!
.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కధ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉన్నది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.
.
రామాయణము ప్రాముఖ్యము.
24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:
రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము . ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే!

LATEST HEAVY SUPER BIKES MODELS


SIX LEAVES RANGOLI ART


BEAUTIFUL AND GLAMOUR ACTRESS NAYANATHARA


A BEAUTIFUL CAR


A BEAUTIFUL WOMEN PENCIL SKETCH


KNOW THE SECRETS ABOUT INDIAN TRADITIONS


SUNDAY SPECIAL HUMAN 65


WATER SECRET


TAKE REPEAT


MOBILE GONE SEARCH GOOGLE


IT IS REALLY CONFUSING


VERY SAD SCHOOL HOLIDAYS ARE OVER


PURPLE AND WHITE CHANDERI SILK EMBROIDERED DESIGNER DRESS


GRAY JACQUARD EMBROIDERY DESIGNER SALWAR SUIT


Red Faux Georgette Embroidery Designer Suit


VITAMIN-C INCREASES RESISTENCE POWER IN HUMANS HEAVILY FOUND IN GUAVA FRUIT
VERY BORING HERE FRIEND


UNBELIEVABLE FACTS ABOUT GAUTHAM BUDDHA


CHANGING SAREES DEAR


BRIDAL MAKE UP DEAR


loading...