loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Simple Ayurvedic health tips: Horse gram soup for losing weight - Reduce Your Stomach-Tummy-Belly With Horse Gram - Simple Ayurvedic health tips: Horse gram


ఉలవలు

మూత్రంలో చురుకు, మంట:

ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. మధుమేహం: మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంలో వెంపరి (శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. సెగగడ్డలు: ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపుపొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంమీద తయారైన సెగ గడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. విరేచనాలు: ఒక టీ స్పూన్ ఉలవ ఆకురసానికి అరటి పండు కలిపి రోజుకు 2-3 పర్యాయాలు తీసుకుంటే విరేచనాలు నియంత్రణలోకి వస్తాయి. చర్మంమీద తయారయ్యే వాపు, నొప్పి, దురదలు: మొలలమీద ఉలవల ముద్దను లేపనం చేస్తే నొప్పి, వాపు, దురదలు తగ్గుతాయి. ముఖ చర్మం కాంతి లేకుండా తయారవటం: ఉలవల పిండిని ఫేస్ ప్యాక్‌గా ప్రయోగిస్తే చెక్కిలి, బుగ్గలు కాంతితో మెరుస్తాయి. తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్): ఉలవచెట్టు కట్టెతో తయారుచేసిన కషాయం తీసుకుంటే మహిళల్లో కనిపించే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ప్రసవం పూర్తిగా జరగకపోతే : ప్రసవానంతరం గర్భశయంలో మిగిలిపోయిన మైల సంబంధ రక్తం నిశే్సషంగా వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన చికిత్సలు జ్వరం: జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉలవలతో కషాయం తయారుచేసుకొని పెసర కట్టుకు కలిపి తీసుకోవాలి. ఉలవల వల్ల చెమట పట్టి జ్వరం దిగుతుంది. పెసర కట్టు తేలికగా జీర్ణమై శక్తిని ఇస్తుంది. ఎక్కువగా చెమట పట్టడం (స్వేదాదిక్యత): ఉలవలను కొద్దిగా వేయించి, పొడిచేసి చర్మంమీద రుద్దుకోవాలి. దీనిని నలుగు పిండిగా గాని లేదా స్నాన చూర్ణంగా గాని వాడుకోవచ్చు. దగ్గు, ఆయాసం: ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసంలో హితకరంగా ఉంటుంది.

గుండె జబ్బులు:

బార్లీగింజలతో అన్నం మాదిరిగా వండుకొని ఉలవ కషాయం కలిపి తీసుకుంటే గుండె జబ్బుల్లో హితకరంగా ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు: ఉలవలతో ఘృతపాక విధానంలో ఘృతం తయారుచేసుకొని తీసుకోవాలి. దీనిని కులత్యాదిఘృతం అంటారు. ఉలవల ముద్దకు నాలుగురెట్లు నెయ్యిని, నెయ్యికి నాలుగురెట్లు నీళ్లనూ కలిపి, చిన్న మంట మీద నీరంతా ఆవిరయ్యేవరకూ మరిగించడాన్ని ఘృత పాక విధానం అంటారు. కడుపునొప్పి: ఉలవ కషాయాన్ని సక్రమమైన రీతిలో పులియబెట్టి, సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే కడుపునొప్పిలో హితకరంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తరువాత కడుపునొప్పి వస్తుంటే (అన్నద్రవశూల): ఉలవలు వేయించి, పొడిచేసి వెన్న లేని పాలతో తోడుపెట్టి చేసిన పెరుగుతో కలిపి తీసుకుంటే అన్నద్రవ శూలనుంచి ఉపశమనం లభిస్తుంది. నులిపురుగులు, అంత్రక్రిములు: పాలకు ఉలవ కషాయం చేర్చి తీసుకుంటే అంత్రక్రిములు నశిస్తాయి. దద్దుర్లు (శీతపిత్తం) (అర్టికేరియా): ఉలవలు, ర్యాడిష్ దుంపల పొడి వంటివి ఆహారంలో తీసుకుంటే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్): ఉలవలతో సూప్ తయారుచేసుకొని తీసుకుంటే వాపులతో కూడిన కీళ్లనొప్పిలో హితకరంగా ఉంటుంది. గండమాల (సర్వైకల్ లింఫ్ ఎడినైటిస్): తేమ లేని ఆహారానికి ఉలవల కషాయం చేర్చి తీసుకుంటే గండమాలలో హితకరంగా ఉంటుంది. నష్టార్తవం (బహిష్టు సక్రమంగా రాకపోవటం, బహిష్టు ఆగిపోవటం) (ఎమనోరియా): ఉలవలు, చేపలు, పుల్లని మజ్జిగ, పుల్లని కషాయాలు, నువ్వులు, మినుములు, ద్రాక్షతో తయారైన వైన్ వంటివి తీసుకుంటే బహిష్టు రక్తం అడ్డులేకుండా సజావుగా స్రవిస్తుంది.

అర్శమొలలు:

ద్రవ రూప మలంతోపాటు అర్శమొలలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎండించిన ముల్లంగి దుంపల పొడిని, ఉలవ పొడినీ కలిపి తీసుకోవాలి. వెలగపండు, మారేడు పండ్లు, చెంగల్వకోష్టు వీటితో కషాయం తయారుచేసుకొని మేక మాంసంతో కలిపి తీసుకోవాలి. కఫంవల్ల ఎక్కిళ్లు, ఉబ్బసం వస్తుంటే: ఉలవ కషాయాన్ని, పంచకోలాల కషాయాన్ని నెయ్యికి చేర్చి ఘృత పాకం విధానంలో నెయ్యిని తయారుచేసుకొని తీసుకుంటే ఎక్కిళ్లు, ఉబ్బసం తగ్గుతాయి. శరీరంలో పెరుగుదలలు తయారవటం (గుల్మం): ఉదర భాగంలో ట్యూమర్లు పెరుగుతున్నప్పుడు ఉలవలు, పెసర గింజలు, పిప్పళ్లు, శంఠి కొమ్ములు, ముల్లంగి, మారేడుపండ్లు, ఉలిమిరిపట్ట, చిరబిల్వ లేతాకులు, చిత్రమూలం వేరు, వాము... వీటిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తీసుకోవాలి.

Turmeric Powder - Health Benefits, Uses - 10 Proven Health Benefits of Turmeric - TURMERIC: Uses, Side Effects, Interactions and Warnings


పసుపు:

ఎన్నో వ్యాధులకు మందు :

మొటిమలు : జామ ఆకులు పసుపు తో కలిపి నూరి రాయాలి ,
కఫము : వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి . కఫము తగ్గుతుంది .
రక్త శుద్ధి : ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది .
దగ్గు ,జలుబు : మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి ,
నొప్పులు , బెనుకులు : పసుపు , ఉప్పు , సున్నము కలిపి పట్టువేయాలి .
డయాబెటిస్ : ఉసిరి పొడి తో పసుపు కలిపి బీర్లో కరిగించి తాగాలి .మధుమేహవ్యాధి అదుపులో ఉంటుంది. చిన్న గ్లాసు నీళ్ళ లో ఒక పసుపు కొమ్ము చేసి రాత్రంతా నానబెట్టి ... పొద్దునా లేచేక పసుపు కొమ్ము తేసేసి నీల్లలు ఒక చెంచా తో బాగా కలిపి పరగడుపున తాగితే చాలు చెక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది . ఈ నీళ్లు కొలెస్టిరాల్ ను , రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది .
తలతిరుగుడు : పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి .
అల్జిమార్ వ్యాధి : పసుపు లో ఉండే "కర్కుమిన్ " అనే పదార్ధము మతిమరుపును అరికడుతుంది.

ఆయుర్వేదిక్ గుణాలు :
పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

ఉపయోగాలు:

చర్మ సౌందర్యానికి:

పసుపు బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతిలో పోషిస్తుంది. సాంప్రదాయకంగా నువ్వులనూనె, సున్నిపిండితో పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే బాదాంనూనె, మీగడ, తేనెను పసుపుతో కలిపి వంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం ఇనుమడిస్తుంది. వంటిమీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే చాలావరకు సంబంధిత భాధలు తగ్గుతాయి. చర్మం మీద మొటిమలు అనేక రుగ్మతలు పసుపు వాడితే తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది1 పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, మరియు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి.

ప్రథమ చికిత్స:

దెబ్బలు, గాయాలు తగిలినపుడు శరీరం నుంచి రక్త స్రావాన్ని ఆపుటకు పసుపు దోహదపడుతుంది. యాక్సిడెంట్లు, ఇతర సంఘటనలతో కొంతమంది మానసిక రుగ్మతలకు గురయినప్పుడు, అలాంటి సమయాలలో ఒక కప్పు వేడిపాలలో రెండు చెంచాల పసుపు, రెండు చెంచాల నెయ్యి కలిపి తాగిస్తే చాలావరకు తేరుకుంటారు. శరీరంలోని వివిధ అవయవాలలో జరిగే ప్రక్రియలు సక్రమంగా నిర్వహించడానికి పసుపు తోడ్పడుతుంది.

జీర్ణకోశ సమస్యలకు:

పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్‌ను తగ్గిస్తుంది.
హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
గుదం (రెక్టమ్‌) నుంచి రక్తస్రావం జరుగుతుంటే 2 లేదా 3 టీస్పూన్లు పసుపును అన్నంతోగాని, పాలలోగాని కలిపి తీసుకుంటే తగ్గుతుంది.
నీళ్ల విరేచనాలు/ రక్త విరేచనాలకు ఒక కప్పు పెరుగులో 10 గ్రా. లేదా 2 టీ స్పూన్లు పసుపు చేర్చి తింటే తగ్గిపోవచ్చు.
మూల వ్యాధి (పైల్స్‌)తో బాధపడేవారు పసుపు, ఆవనూనె, ఉల్లిరసం కలిపిన మిశ్రమాన్ని పైల్స్‌ ఉన్నచోట రాస్తే ఉపశమనం ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం.

కాలేయం (లివర్‌)

విషతుల్యమైన పదార్థాల నుంచి కాలేయానికి హాని కలుగకుండా కాపాడుతుంది.
కాలేయంలో తయారయ్యే పిత్తరసం లేదా బైల్‌ ఉత్పత్తిని పెంచుతుంది.
ఆల్కహాల్‌ ఎక్కువ తాగేప్పుడు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 5 గ్రా. పసుపును ఒక గ్లాసు నీళ్ళలోగాని, మజ్జిగలోగాని కలిపి నెలరోజులపాటు తాగితే లివర్‌కు ప్రమాదం లేకుండా ఉంటుంది.

శ్వాసకోశ సమస్యలకు

బయటి కాలుష్యం నుంచి, విషతుల్యమైన పదార్థాల నుంచి శ్వాసకోశాన్ని రక్షిస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్‌ నెయ్యి, 4-5 గ్రా. పసుపు కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. ఆస్మా నుంచి ఉపశమనం ఉంటుంది.
నేతిలో ఒక స్పూన్‌ పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లులి వేసి వేయించి, వాసన పీల్చి తింటే బ్రాంకైటిస్‌ వున్నవారికి మందు బాగా పనిచేస్తుంది.
స్త్రీలలో నెలసరి సక్రమంగా జరగటానికి దోహదపడుతుంది.
బహిష్టులో వున్నప్పుడు ఎలాంటి నొప్పులు రాకుండా చేస్తుంది.
స్త్రీల గర్భసంచిలో ట్యూమర్‌ రాకుండా తోడ్పడుతుంది.
రొమ్ములో కాన్సర్‌ రాకుండా నివారిస్తుంది.

ఇతర ఉపయోగాలు:

రక్తంలో చెడు(ఎల్‌.డి.ఎల్‌) కొలెస్టెరాల్‌ మోతాదును తగ్గించి గుండెజబ్బులు రాకుండా చూస్తుంది.
పసుపులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

క్యాన్సర్‌ను చంపే పసుపు:

పసుపు శరీరంలోని ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు వగైరా భాగాలలో కాన్సర్‌ రాకుండా నివారిస్తుంది. పసుపు శరీరంలో కాన్సర్‌ దరి చేరలేని పరిస్థితులు కల్పిస్తూ, శరీరంలోని వివిధ కణాలను కాన్సర్‌ ఎదుర్కొనేట్లు చేస్తుంది. ఎప్పుడైనా కణితి (ట్యూమర్‌) ఏర్పడితే దాన్ని నిర్మూలించేట్లు చేస్తుంది.పసుపుకు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు , పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌ కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.

పసుపుతో కాలేయానికి రక్ష:

కాలేయం పనితీరును దెబ్బతీసే తీవ్రమైన సిరోసిస్‌ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది.పసుపులో ఉండే 'కర్కుమిన్‌' అనే పదార్థం కాలేయం కణాల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.పసుపులో ఉండే వర్ణకం పిత్త వాహికల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది.

REMOVE KIDNEY STONES WITH GALZERU KONDAPINDI AYURVEDAM


LORD SRINIVASA TEMPLE IN THE BORDERS OF TELANGA- MAHARASHTRA STATES


MEMORY LOSS PROBLEM - GONE WITH EATING PAPAYA AND BOPPAYA FRUIT REGULARLY


FOOD GRAINS - JONNALU HEALTH BENEFITS


BRIDAL HAIR STYLES AND BRIDAL JEWELLARY


SUN STAR CHIKKU MUGGU


Cinnamon - DALCHINA CHAKKA HEALTH BENEFITS


దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు


దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు. ఇది డయాబెటిస్ ని నివారిస్తుందని తేల్చాయి. ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. ఒక కప్పు వేడి పాలకు రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం అంతే. డైలీ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..

దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా సాగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పామ్స్ ని ఇది స్మూత్ గా మార్చి, పొట్టలో వచ్చే అసౌకర్యాన్ని అరికట్టి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

కంటినిండా నిద్రపోవాలని భావించేవాళ్లు.. దాల్చిన చెక్క పాలు తాగితే చాలు.. హ్యాపీగా నిద్రపోవచ్చు. కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు తాగండి.. చిన్న పిల్లల్లా హ్యాపీగా నిద్రపోతారు.

దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి మంచిది.అందమైన కురులు, మెరిసే చర్మం పొందాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా ఈ పాలు తాగడం మొదలుపెట్టండి.

వయసు పెరిగిన వాళ్లలో ఎముకలు బలంగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి. రెగ్యులర్ గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్క కలిపిన పాలల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల పంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది.క్యావిటీస్, ఓరల్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి.
సాధారణ దగ్గు, ఫ్లూ వంటివి నివారించడానికి ఈ పాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా.. హానికర బ్యాక్టీరియాను నివారించి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

Indian Grocery Translations - English to Telugu


EnglishTelugu
Pulses and Cereals 
Bengal GramSenaga pappu
Green GramPesara pappu
Red GramKandhi pappu
Black GramMinappappu
Gram FlourSenaga pindi
Corn FlourMokka jonna pindi
Vegetables and Fruits 
BrinjalVankaya
CapsicumBengulooru Mirapakaya
CabbageCabbage / Gobi
CauliflowerGobi puvvu /Cauliflower
CarrotCarrot
Coriander leavesKothimeera
CoconutKobbari Kaya
Mint LeavesPudina
Green PeasBataneelu
LemonNimma pandu
OnionUllipayalu / Yerra gaddalu
GarlicVelluli payulu / tellapaayalu
Potatoalu gadda / Bangalu Dumpa
TomatoRamaMulaga (Pandu/Kaya)
BananaArati pandu
PineappleAnaasa pandu
MangoMamidi pandu
GrapesDhraksha pallu
Nuts and Condiments 
AniseedSopu
AsafoetidaInguva
Bay LeafMasala Aku / Biryani aaku
Black PepperMiriyalu
CardamomElaichi / Yaalakkaya
CinnamonDalchina chekka or Dalchini
ClovesLavangam
Coriander SeedsDhaniyalu
Cumin SeedsJeelakarra
Curry leavesKarivepaku
CashewnutsJeedi pappu
FennelPeddajeelakarra or Sopu
FenugreekMenthulu
GarlicVelluli payalu
GingerAllam
JaggeryBellamu
MustardAvalu
Poppy SeedsGasalu / gasagasaalu
Red ChilliesYendu mirapakayalu
RaisinsYendu dhraksha
TamarindChintha pandu
Turmeric powderPasupu
Miscellaneous 
YogurtPerugu
Rice (Raw)Biyyamu
Rice (Boiled)Uppudu Biyyamu
SemolinaBombai rawa
VermicelliSemia


TWO FISH CIRCLE FLOWERS RANGOLI ART


Green peas nutrition facts and health benefits


TELUGU SAMETHA - POMMANALEKA POGA PETTINATLU


COME ON TOMMY


CHARMI-NG SILKY SITARA


LUNGI GURU


RINGA RINGA ROSES MUGGU


CHITTI CHITTI MIRIYALU - TELUGU KIDS SONG LYRICS


చిట్టిపొట్టి మిరియాలు.!..........( శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి.)
.
చిట్టిపొట్టి మిరియాలు
చిట్టిపొట్టి మిరియాలు
చెట్టుక్రింద పోసి
పుట్టమన్ను తెచ్చి,
బొమ్మరిల్లు కట్టి,
బొమ్మరింట్లో
బోగం పాప కన్నది.
బిడ్డతలకు చమురులేదు,
నా తలకు నూనెలేదు,
అల్లవారింటికి
చల్లకుపోతే
కలవారి కుక్క
భౌవ్‌ మన్నది!
నాకాళ్ల గజ్జెలు
ఘల్లుమన్నవి!!

EAT FRUITS NOT FRUIT JUICES FOR INSTANT HEALTH


BLUE DIAMOND NECKLACE SET


A BEAUTIFUL LADY


RAMZAN FESTIVAL CHITRA KALA


BEAUTIFUL STAR DESIGN RANGOLI


MUMMY BIRTHDAY


ORANGE DIAMOND JEWELLARY


Antibiotics: How Do Antibiotics Work - Danger with Anbtibiotics


Antibiotics, also known as antibacterials, are types of medications that destroy or slow down the growth of bacteria. The Greek word anti means "against", and the Greek word bios means "life" (bacteria are life forms).Antibiotics are used to treat infections caused by bacteria.

FUNNY MEDICAL NEWS


ARTICLE ON aplastic anaemia - HEALTH TIPS FOR aplastic anaemia - deficiency of all types of blood cell caused by failure of bone marrow development.


VEGETARIAN FOOD HEALTH TIPS IN TELUGU


loading...