loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRAVANAMASAM STARTING ON 3RD AUGUST 2016 - IMPORTANCE OF FESTIVAL MONTH SRAVANAMASAM


రేపటి నుండి 03/08/2016

శ్రావణ మాసం ప్రారంభం.

పరమేశ్వరుడు స్వయంగా చెప్పినమాట:
12 మాసములలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రావణము. దీనికి ఈపేరు శ్రవణ నక్షత్రముతో కూడిన పూర్ణిమ నాడు రావడం వలన మాత్రమే కాక దీనియొక్క మాహాత్మ్యము వినుటకు ఆనందకరమై/యొగ్యమై అనేక సిద్ధులను ఇచ్చునది గావున ఈపేరు వచ్చినది.

శ్రావణ మాసంలో విధింపబడిన విధులలో ఏ ఒక్కటి అయినా శ్రద్ధగా చేసిన వారు నాకు అత్యంత ప్రియులు. నాకు ఈ మాసము కంటే ప్రియమైనది మరియొకటి లేదు. ఈమాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరుస్తాను. కోరికలు లేకుండా పూజించిన వారికి మొక్షాన్నీ ఇస్తాను. ఈ మాసంలో ఏ ఒక్క తిథి, వారము కూడా వ్రత ప్రాముఖ్యము లేకుండా లేవు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈమాసం గురించి చెప్తూ –ఎవరైతే శ్రావణ మాసంలో ఏక భుక్తము (ఒక్కపూట భోజనం) చేస్తూ ఇంద్రియ నిగ్రహముతో గడుపుతారో వారికి అన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుంది.

ఈ నెలలో దైవకార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అనంత ఫలితాలను ఇస్తాయి. మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి. ఫలహారము లేదా హవిష్యాన్నాము ఆకులో మాత్రమే భుజించాలి. ఆకుకూరలు తినరాదు. ఈ మాసంలో చేసే నమస్కారములు, ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేలరెట్ల ఫలితాన్ని ఇస్తాయి.

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.

స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.

ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.

LEAVE IT DEAR YOU NEVER UNDERSTAND FACE BOOK


NATURAL EYEBROWS MAKE UP TIPSPUSHKARA PADYAM


BEAUTY RULES 2 LIVEHEALTH BENEFITS WITH LIMITED EATING FOOD - INCREASES MEMORY POWER


SIGNS OF YOUR PERFECT BOYFRIENDSWEET EFFECT


TIPS 2 MEN 2 WEAR SCARVESTOP TEN TIPS TO IMPROVE YOUR BODY LANGUAGE


TRADITIONAL LIGHT STAND FREEHAND RANGOLI ART


TRADITIONAL IMPORTANCE OF SIKHA


TELUGU EBOOK - ARTICLE ON SANDHYA VANDHANAM - THATHPARYA SAHITHAM - PART-4TELUGU EBOOK - ARTICLE ON SANDHYA VANDHANAM - THATHPARYA SAHITHAM - PART-3


TELUGU EBOOK - ARTICLE ON SANDHYA VANDHANAM - THATHPARYA SAHITHAM - PART-2


TELUGU EBOOK - ARTICLE ON SANDHYA VANDHANAM - THATHPARYA SAHITHAM - PART-1


VUPAVASAMU - VUTTHAMAMU - HEALTH BENEFITS WITH FASTING - FASTING IS DANGER 2 DIABETES PATIENTS


WINNING DOORS ARE ALWAYS OPEN - FINDING WAY TO WIN IS YOUR SUCCESS


AMAZING NATURES CREATION GINGER GANAPATHI


HEALTH BENEFITS WITH RASPBERRIES


FULL KRISHNA PUSHKARALU 2016 INFORMATION WITH PARKING PLACES IN VIJAYAWADA
కృష్ణాపుష్కారాల 
పార్కింగ్ ప్లేస్‌లివే+++++++

అర్బన్‌లో పార్కింగ్‌ ప్లేస్‌లు ఖరారు చేసిన జిల్లా యంత్రాంగం
12 రూట్లలో పార్కింగ్‌ ఏరియాలు, 24 ప్రాంతాలలో పార్కింగ్‌ ప్లేస్‌లు
పార్కింగ్‌ ప్లేస్‌ల మొత్తం విస్తీర్ణం - 2,97,700
ద్విచక్రవాహనాల కెపాసిటీ - 62,750 
కార్ల కెపాసిటీ - 6270
కృష్ణాపుష్కరాల తాకిడి అంతా బెజవాడలోనే ఉంటుంది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే యాత్రీకులు సింహభాగం బెజవాడకే వస్తారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణా జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, రైళ్ళలో వచ్చే యాత్రికులను ఎక్కడికక్కడ శాటిలైట్‌ రైల్వేస్టేషన్స్‌, శాటిలైట్‌ తాత్కాలిక బస్‌స్టేషన్స్‌ ద్వారా పుష్కరనగర్‌లకు సిటీ బస్సుల్లో తరలించటానికి ఆర్టీసీ, రైల్వేశాఖల సౌజన్యంతో కృష్ణా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ అర్బన్‌, రూరల్‌ పరిధిలో వేర్వేరుగా పార్కింగ్‌ ఏరియాలను గుర్తించి ప్రకటించారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ అర్బన్‌ ఏరియాలో మొత్తం 12 రూట్లలో 24 ప్రాంతాలలో పార్కింగ్‌ ప్లేస్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. పార్కింగ్‌ ప్లేస్‌లు ఏర్పాటు చేయటానికి ఈ 24 ప్రాంతాలలో మొత్తం 2,97,700 చదరపు గజాల స్థలాన్ని గుర్తించారు. నగరం నలువైపులా ప్రైవేటు వాహనాల కోసం పార్కింగ్‌ ప్లేస్‌లను గుర్తించారు. మూడు నియోజకవర్గాల పరిధిలో ప్రధాన రోడ్లకు సమీపంలో పార్కింగ్‌ ప్లేస్‌లను యంత్రాంగం గుర్తించింది. ఎక్కడా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా నేరుగా ప్రధాన రోడ్ల మీదకు చేరుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే అవకాశాన్ని కల్పించారు. నగర వ్యాప్తంగా గుర్తించిన పార్కింగ్‌ ప్లేస్‌లలో మొత్తం 62,750 ద్విచక్రవాహనాలు, 6270 కార్లను పార్కింగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. పుష్కర స్నానం ముగించుకుని, ఇతర కార్యక్రమాలను చక్క బెట్టుకోవటానికి ఎంత లేదన్నా ఐదు గంటల సమయం పడుతుంది. ఈ లెక్కన రోజుకు లక్షన్నర వరకు ద్విచక్ర వాహనాలు, 20 వేల వరకు కార్లను పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.
వారధి ఏరియా (ఏలూరు సైడ్‌ - గుంటూరు సైడ్‌) 
1. దూరదూర్శన్‌ ఓపెన్‌ సైట్‌, ఫీడర్‌ రోడ్డు, 
కృష్ణ్ణలంక, స్థలం : 19,200 గజాలు 
కెపాసిటీ : ద్విచక్ర వాహనాలు - 2000, 
కార్లు - 400 
2. పొట్టి శ్రీరాములు స్కూల్‌, క్రష్ణ్ణలంక 
స్థలం : 14,400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్ర వాహనాలు - 150, కార్లు - 300
ఇబ్రహీంపట్నం - గొల్లపూడి వై జంక్షన్‌ 
1. సొసైటీ ప్రైవేటు స్థలం తుమ్మలపాలెం గ్రామం 
స్థలం : 24000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000, కార్లు - 500
గొల్లపూడి వై జంక్షన్‌ - స్వాతి సెంటర్‌, 
గొల్లపూడి వై జంక్షన్‌ - కుమ్మరిపాలెం : 
1. మార్బుల్‌ యార్డ్‌ , గొల్లపూడి 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు -100 
కార్లు - 100 
2. షాదీఖానా, కుమ్మరిపాలెం 
(గుప్తా సెంటర్‌) 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు : 200 
కార్లు - 100
కాళేశ్వరరావు మార్కెట్‌ ఏరియా 
1. కేఆర్‌ మార్కెట్‌ సెల్లార్‌ 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 100 
కార్లు - 50 
2. వక్డ్‌బోర్డు ఖాళీ స్థలం, ఇందాద్‌ 
ఘర్‌ (కేఆర్‌ మార్కెట్‌ ఎదురుగా) 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 100 
కార్లు - 50 
3. వన్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా : 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 100 
కార్లు - 50
తారాపేట - వెస్ట్‌ బుకింగ్‌ ఏరియా 
1. కృష్ణ్ణవేణి క్లాత్‌ మార్కెట్‌ సెల్లార్‌ 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 500 
కార్లు - 100
కాల్టెక్స్‌ రోడ్డు, మెయిన్‌ రైల్వే స్టేషన్‌ 
1. పాత ప్రభుత్వ హాస్పిటల్‌ 
దగ్గర ఖాళీ స్థలం 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 500 
కార్లు - 100 
2. ఆంధ్రపత్రిక ఓపెన్‌ సైట్‌ 
స్థలం : 2500 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 600 
కార్లు - 70 
3. జింఖానా గ్రౌండ్స్‌, గాంధీనగర్‌ 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 400 
కార్లు - 50 
4. సత్యనారాయణపురం రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000 
కార్లు - 200 
5. సత్యనారాయణపురం రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000 
కార్లు - 200 
6. మధురానగర్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు (కేంద్రీయ విద్యాలయం) 
స్థలం : 14000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 3000 
కార్లు - 300
ఎంజీ రోడ్‌ 
1. సిద్దార్థ మహిళా కాలేజీ 
స్థలం : 19,200 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 2000 
కార్లు - 400
ఐదవ నెంబర్‌ రూట్‌ 
1. బిషప్‌ అజరయ్య స్కూల్‌, రెడ్‌ సర్కిల్‌ 
స్థలం : 14,400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1500 
కార్లు - 300 
2. సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ , పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డు 
స్థలం : 28,800 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 2500 , కార్లు - 500
చుట్టుగుంట - సీతారామపురం 
1. శాతవాహన కాలేజి 
స్థలం : 14,400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1500 , కార్లు - 300
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు - రామవరప్పాడు జంక్షన్‌, గొల్లపూడి వై జంక్షన్‌ - నున్న బైపాస్‌, మ్యాంగో మార్కెట్‌ 
1. మాకినేని బసవపున్నయ్య స్టేడియం , అజిత్‌సింగ్‌ నగర్‌ 
స్థలం : 19000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 2000 
కార్లు - 500 
2. రోహిత్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ , పైపుల రోడ్డు 
స్థలం : 10000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000 
కార్లు - 100 
3. గుణదల రైల్వేస్టేషన్‌ గ్రౌండ్‌ ఎదురుగా : 
స్థలం : 5000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000 
కార్లు - 100
వైవీ రావు ఎస్టేటు ఓపెన్‌ సైట్‌ 
1. వైవీ రావు ఎస్టేటు స్థలం (ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు) 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 500 
కార్లు ----
రమేష్‌ హాస్పిటల్‌ ఏరియా
1. ఆంధ్రా లయోల కాలేజీ గ్రౌండ్స్‌, స్థలం : 72000 గజాలు


MANGALA GOWRI VRATHA VIDHANAM - SRAVANAMASAM PUJA FESTIVAL ARTICLES COLLECTION


మంగళగౌరీ వ్రత విధానం
శ్రావణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకుసౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.
మంగళగౌరీ వ్రత నియమాలు
తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.
వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)
ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.
ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.
మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు :
పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.
మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం
వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.
పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.
మంగళగౌరీ వ్రత విధానం :
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)
విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః
అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
ఓం లక్ష్మినారాయణభ్యయం నమః శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః శ్రీ శచిపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః మాతృభ్యో నమః, పితృభ్యో నమః
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే , శుభ తిథౌ, శుక్రవాసరే, శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).
శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.
శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.
అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా
సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!
వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.
తోర పూజ :
తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.
అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం – శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :
ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి
ఓం శ్రీ గౌరీ రత్నసింహాసనం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ అర్జ్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి
అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.
రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.
తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..
ఆ తరువాత ఈ విధంగా చేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.
శ్రీ మంగళ గౌరీ వ్రతకథ :
పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.
అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.
మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.
ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.
మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.


SPECIAL TELUGU ARTICLES FOR KRISHNA PUSHKARALU 2016 - SRI KANAKADURGA MAHIMA


కనకదుర్గ మహిమ
ఓంకార పంజర శికీ ముననిష దుద్యాన కేళికల కంఠిమ్!
ఆగమ విపిన మయూరీ మర్యామంతర్విభావ యే గౌరమ్!!
భక్త్యాస్నాత్యాత్ర మల్లీశం దుర్గం దుర్గారి నాశినీం
దృష్ట్యా పాపాత్ ప్రముచ్యేత్ దేవలోకే వసేత్సదా!!కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి వున్న కనక దుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్య మహర్షి తమ తపొఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో వుండేదని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీ చక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల కోరికలు నేరవేరుస్తున్నదని చెబుతారు. కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే పురాణ గాథలు పరిశీలిద్దాం.
ఇంద్రకీలాద్రి కథ
ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిరనివాసం ఏర్పరచుకొని భక్తులను ఈడేరుస్తోంది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి వుండడానికి ఒక కథ వుంది. దుర్గామాత ఆలయం వున్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్టించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు.
అతను పూర్వకాలంలో ప్రతిరోజూ కృష్ణవేణి నదిలో స్నానంచేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీపరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గా మాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి, సింహాన్ని అధిష్టించి మహిషాసురుని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది, ఆరి, శంఖ, కేత. శూల. పాశ అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి, దుర్గాదేవి బాహువుల్లో ధరించే ఎనిమిది ఆయుధాలు, ఈ దేవీమూర్తికి ఎడమభాగంలో శ్రీ చక్రం స్థాపించబడి వుంది. ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తికి గల మకరతోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి వున్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు.
మహిషాసుర సంహారం
పూర్వకాలంలో దనువు పుత్రులైన రంభ కరంభులనే వారు సంతానంకోసం ఈశ్వరుని గూర్చి ఘోరతపస్సు చేశారు. కరంభుడు నీటిలోను, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ‘పుత్రసంతతిలేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగవిధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి’ అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాలు మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ చేతిలో నీకు మరణం సిద్దిస్తుందని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధుపుంగవులని, దేవతలనీ, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్ధించారు. ఆ దేవి ‘ఉగ్రచండి’ అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రుడిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలనీ పీడిస్తువుంటే, ఆ దేవతల ప్రార్ధనపై ఆదిశక్తి ‘భద్రకాళి’ రూపంలో అవతరించి మహిషుని మట్టుపెట్టింది. మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోరతపస్సు చేసి బ్రహ్మ వనువరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కలవచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోరతపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యింది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగార్హత కలుగచేయవలసిందని మహిషుడు కోరాడు.
‘మహిషా! ఇక నువ్వు నా వాహనంగా వుండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచివుంటావు’ అని దేవి పలికింది.
ఆ తర్వాత మహిషుడికి జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలని, మునులని పీడిస్తూ వుండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గమాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుని సంహరించింది.
శంభు నిశంభుల కథ
మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభు నిశంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి వుంది. పూర్వం శంభునిశంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీభ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు. అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్ధించారు. వారి మొర ఆలకించిన దేవీ శరీరం నుంచి దివ్యతేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. శంభనిశంభుల సేవకులైన చండాదులు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు. తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు. శంభునిశంభులు తనతో యుద్దంచేసి తనను జయించిన వానినిగాని, తనతో సమాన బలపరాక్రమశాలిని గాని తాను పెళ్ళి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పంది. ఆ మాటలు విన్న శంభునిశంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టితెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనుడిని పంపారు. తనపై దండెత్తిన ధూమ్ర లోచనుడిని, అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రుధిరమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది. ఈ వార్తవిన్న శంభునిశంభులు చతురంగ బలాలను సమకూర్చుకుని దేవిపై యుద్ధం ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భ్రూమధ్య నుండి ఖడ్గం, పాశం మొదలయిన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శంభునిశంభులని నిమిషకాలంలో హతమార్చింది.
దుర్గాసుర సంహారం
ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడి వుంది. పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వర గర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు. దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం, వరుణినిచేత శంఖం, అగ్నిచేత బల్లెం, వాయువుచేత బాణాలు అంబులపొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహ వాహనం పొందింది. స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడివున్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపురసుందరి, లలితాత్రిపురసుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలిలీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి.

FOUR PEACOCKS FLOWER MUGGU


SRAVANAMASAM FESTIVAL PUJA POTS MUGGU


RED FLOWERS DECORATED BEAUTIFUL MULTI STEP CAKE DESIGN


loading...