loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HOW TO OVERCOME TENSION - BUSY - CAUSES PROBLEMS IN SEXUAL FAMILY LIFE - TIPS TO WIFE AND HUSBAND TO ENJOY FAMILY SEXUAL LIFE FOREVER


HOW TO STOP PIMPLES AND ATTAIN BEAUTINESS ROUND THE CLOCK


BEAUTY FRESHNESS FAIR SKIN WITH DHANIMMA FRUIT


GANESH CHATHURDHI FESTIVAL 05-09-2016 SPECIAL RANGAVALLI


SIMPLE CREATIVE ART RANGOLI OF LORD GANESH - VINAYAKA CHAVITHI FESTIVAL SPECIAL MUGGU 05-09-2016


LOSS OF 2 GOLD TEETH


LIST OF HEALTHY FAST FOODS FOR GOOD HEALTH


పౌష్టికాహారం ....
• హెల్దీ ఫాస్ట్‌ ఫుడ్స్‌ ...!
ఫాస్ట్‌ ఫుడ్స్‌ ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు. అయితే ఫాస్ట్‌ఫుడ్స్‌నే చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యకరమైన ఆహారంగా తయారుచేసుకుని తింటే శరీరానికి పోషకాలు అందడమే కాదు ఫాస్ట్‌ఫుడ్స్‌ తినాలన్న కోరిక కూడా తీరుతుంది. శరీరానికి సమతులాహారం అందుతుంది.
ఫాస్ట్‌ ఫుడ్స్ ‌ను ఆరోగ్యకరంగా ఎలా చేయొచ్చో తెలుసుకుందాం...!
• బర్గర్స్‌: బర్గర్స్‌ లోపల ఉండే టిక్కాలో నూనె ఎక్కువగా ఉంటుంది. పోషకాలు తక్కువగా ఉంటాయి. అందుకని ఆ టిక్కా స్థానంలో బేక్‌ చేసిన ఆకు కూరలు లేదా పెసలు, కందులు వంటి గింజలతో చేసిన పదార్థాన్ని పెట్టి తింటే బర్గర్‌ ఎంతో రుచికరంగా ఉంటుంది. అందులో పోషకపదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
• సాఫ్ట్‌ డ్రింక్స్‌: వీటిల్లో పోషకపదార్థాలుండవు. పైగా ఇవి శరీరంలో ఉన్న కాల్షియంను పీల్చేస్తాయి. అందుకే సాఫ్ట్‌ డ్రింక్స్ ‌ను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. సాఫ్ట్‌ డ్రింక్స్ ‌కు బదులు పళ్ల రసాలు శరీరానికి మంచిది. అలాగే రోజూ పాలు తప్పనిసరిగా తాగాలి.
• ఎనర్జీ డ్రింక్స్‌: ఇవి తాగితే వెంటనే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. వీటిల్లో బి విటమిన్స్‌ బాగా ఉంటాయి. రోజుకు ఒక ఎనర్జీ డ్రింకు మించి తాగకూడదు. కెఫెన్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కెఫెన్‌ ఉన్న వాటిని ఎక్కువ పర్యాయాలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఎనర్జీ డ్రింక్సులో కూడా కెఫెన్‌ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్‌ను ఎనర్జీ డ్రింకుతో కలిపి తాగకూడదు.
• పిజ్జాలు: పిజ్జా పైభాగంలో కూరగాయలు, తక్కువ ఫ్యాట్‌ ఉన్న వెన్న, ఆకుకూరలు టాపింగ్స్‌గా పెట్టి తింటే రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిది.
• చెన్నా చాట్‌: చెన్నా చాట్‌లో పుష్కలంగా పోషకాలుంటాయి. తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
• పానీ పూరి: వీటిని రెండు ప్లేట్లు మించి తినొద్దు. వీటికి ఉపయోగించే నీరు పరిశుభ్రంగా ఉందో లేదో గమనించుకుని ఆ తర్వాతే వాటిని తినాలి.
• భేల్‌ పూరి: భేల్‌ పూరికి నట్స్‌ను కూడా జోడించి తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.
• దహీ పూరి: దీనిని ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా మంచిది. ఇది ప్రొబయొటిక్‌ స్నాక్‌. యాంటిబయొటిక్‌ చికిత్స తర్వాత దీన్ని పేషంటుకు పెడితే చాలా మంచిది.
• సేవ్‌ పూరి: ఇందులో సేవ్‌, పూరి రెండింటినీ నూనెలో బాగా వేగిస్తారు. అలా కాకుండా వీటిని తక్కువ ఫ్రై చేసి అందులో కూరగాయలు, నట్స్‌ వేసుకుని తింటే మంచిది.
• చికెన్‌ మంచూరియా: చికెన్‌ మంచూరియాతో పాటు వెజ్‌ సలాడ్‌, మజ్జిగను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
• గోబి మంచూరియా: దీనితో పాటు చిరుధాన్యాల సలాడ్‌, మజ్జిగ లేదా జ్యూసును తాగితే శరీరానికి ఎంతో మంచిది.
• పావ్‌ భాజి: ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని సగం మాత్రమే తినాలి. ఇంకా తినాలనిపిస్తే పచ్చి కూరగాయలు లేదా పళ్లను తినడం మంచిది.
• బిర్యానీ: తరచూ దీన్ని తినకూడదు. దీన్ని తినేటప్పుడు కూడా సగం ప్లేటు మాత్రమే తినాలి. బిర్యానీకి రైతా, నిమ్మరసం జోడించి తినాలి.
• నూడుల్స్‌: నూడుల్స్ ‌తోపాటు ఉడకబెట్టిన గుడ్డు లేదా చికెన్‌ లేదా చిరుధాన్యాల ఫుడ్‌ని జోడించి తింటే మంచిది. ఫ్రైడ్‌ రైస్‌ను కూడా ఇదే పద్ధతిలో తీసుకోవాలి.
• ఇడ్లీ: సాంబారు లేదా చెట్నీతో ఇడ్లీని మితంగా తినాలి.
• వడ: గ్రీన్‌ చెట్నీతో వడలను మితంగా తినాలి.
• పూరి: ఆకుకూరలతో వండిన పప్పుతో పూరిని తింటే ఎంతో ఆరోగ్యం.
• పఫ్స్‌: వీటిల్లో ఎక్కువ కాలరీలు ఉంటాయి. ఇవి తింటే రెండు సార్లు భోజనం చేసిన దానితో సమానమని నిపుణులు చెప్తారు. పఫ్‌ తినాలనుకుంటే దానితోపాటు మజ్జిగ తీసుకోవడం మంచిది.
• సమోసా: పఫ్స్ ‌లో కన్నా సమోసాల్లో కాలరీలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. సమోసాతో పాటు వెజ్‌ సలాడ్‌, మజ్జిగ తీసుకుంటే ఆ పూట భోజనం చేయాల్సిన అవసరం లేదు.
• పేసీ్ట్రస్‌: డార్క్‌ చాక్లెట్‌ మంచిది. ఇది తినడం వల్ల ఎక్స్‌ట్రా కాలరీలు శరీరంలో చేరవు. అన్నం తిన్న తర్వాత పేసీ్ట్ర తినకూడదు. అన్నం మధ్యలో దీన్ని తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కాలరీలు పెరగవు.
- డా.జానకి
న్యూట్రిషనిస్టు,
హైదరాబాద్‌

DONT MISS BREAKFAST - EAT BREAKFAST DAILY AND BE HEALTHY ROUND THE CLOCKబ్రేక్‌ఫాస్ట్‌ మానొద్దు...!

మీరు రోజూ బ్రేక్‌ఫాస్ట్‌ తినరా? అయితే ఊబకాయం పాలబడే ప్రమాదం ఉంది. ఈ మాటలు ఎవరో చెబుతున్నవి కాదు సాక్షాత్తూ శాస్త్రవేత్తలు అంటున్న మాటలు. ప్రొటీన్లతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ని మాత్రమే తినాలని వారు చెప్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం వల్ల సన్నబడతామనే చాలామంది అభిప్రాయం తప్పని తేల్చారు. బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేసి లంచ్‌, డిన్నర్‌లలో ఎక్కువ పరిమాణంలో ఆహారం తినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా ఎక్కువ తినడం వల్ల ఊబకాయం పాలబడే ప్రమాదం ఉందన్నారు. ఈ స్టడీలో భాగంగా 19 ఏళ్ల వయసున్న యువతీయువకుల ఆహారపు అలవాట్లను పరిశోధకులు తెలుసుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకుండా ఉంటే ఆహారం ఎక్కువ తింటారని తేలింది. బ్రేక్‌ఫాస్ట్‌ తినని రోజున స్వీట్లు కూడా బాగా తింటారని వెల్లడైంది. అదే బ్రేక్‌ఫాస్ట్‌ తిన్నవాళ్లల్లో స్వీట్ల పట్ల అంత యావ ఉండదని తేలింది. పోషకవిలువలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోవడం వల్ల ఫుడ్‌ క్రేవింగ్‌ కూడా ఉండదట. ఈ స్టడీలో భాగంగా రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు, అవి శరీరంపై చూపే ప్రభావంపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పోషకవిలువలు కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ను తింటే మంచిదని తేల్చారు. సో... బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని తేలుతోంది. 

అందుకే ముఖ్యంగా అమ్మాయిలూ... 
క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోండి ... 
ఆరోగ్యంగా ఉండండి...!

LATE AGE PREGNANCY IS NOT GOOD FOR NEW BORN KIDS


FULL INFORMATION ABOUT NAVAGRAHA STONE GANAPATHULU IN TELUGU


ఆధ్యాత్మిక దైవిక వస్తువులు గ్రంధంలోని నవగ్రహ స్టోన్ గణపతులు

సన్‌స్టోన్ గణపతి

జాతకచక్రంలో రవి నీచలో ఉన్న, శత్రు రాశిలో ఉన్న, రవి దశ, అంతర్ధశ జరుగుతున్న వారు, ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటా డో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధు లు, తండ్రి తరుపు బంధు వులతో పడకపోవు ట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు సన్‌స్టోన్ గణపతిని పూజించిన రవిగ్రహ దోషాలు తొలగిపోవును. సన్‌స్టోన్ గణపతిని పూజా మందిరంలో గోధుమలపై ఎర్ర వస్త్రంపై పరచి ఆదివారం రోజు గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసిన వారికి రవిగ్రహ దోషాలు తొలగిపోవును. వైద్యవృత్తిలో ఆటంకాలు ఉన్న, రాజకీయాలలో రాణింపు లేకున్నా, అదికారుల వేదింపులు ఉన్న, ప్రభుత్వ ఉద్యోగంలో ఆటంకాలు ఉన్న వారు సన్‌స్టోన్ గణపతిని పూజించాలి.

మూన్‌స్టోన్ గణపతి

జాతకచక్రంలో చంద్రుడు నీచలో ఉన్న, శత్రు రాశిలో ఉన్న, చంద్ర దశ, అంతర్ధశ జరుగుతున్న వారు, చంద్రుడు జాతక చక్రంలో బల హీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభి వృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరో గ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మాన సిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపో వుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కు వగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అను గ్రహం కొరకు మూన్‌స్టోన్ గణపతిని పూజా మందిరంలో బియ్యం పైన తెల్లని వస్త్రం పరచి సోమవారం రోజు గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసిన చంద్రగ్రహ దోషాలు తొలగిపోవును. చరిత్ర,కవిత్వం,సైకాలజీ,సముద్ర గర్బమును పరిశోదించుట. నీటికి సంబంధించిన శాఖలు , ద్రవ పదార్దములకు సంబంధించినవి . తెలుపు వర్ణమునకు చెందినవి .కూల్ డ్రింక్స్ , పాలు , పాల ఉత్పత్తులు , పంచదార , బియ్యము వ్యాపారములు , రైస్ మిల్స్ , హోటల్స్ , టిఫిన్ సెంటర్స్ , మిల్క్ పార్లర్స్ , నావికుల విద్య,శుక్రునితో కలసిన పాల వ్యాపారం,పెయింట్స్, హోటల్స్ సరిగా నడవలేకున్న, పాలవ్యాపారం, కిరాణం, కుజ శుక్రులతో కలసిన పశువైద్యం,బుద్ధునితో కలసిన టెక్స్ టైల్స్,వస్త్ర వ్యాపారములు , వాటర్ ప్లాంట్స్ , నీరు , చేపల ఉత్పత్తులు , బావులు త్రవ్వడం , బోరింగ్స్ , సముద్రపు ఉత్పత్తులు , జలాంత ర్గామి, నావికా దళ ఉద్యోగములు , దూది వ్యాపారము , దూది ఉత్పత్తులు, పుడ్ ప్రొడక్ట్స్ , వెండి వస్తువులు తయారీ మొదలగు వృత్తుల వారు వాటర్ బిజినెస్ లో ఇబ్బందులు ఉన్నవారు మూన్‌స్టోన్ గణపతిని పూజించాలి.

రోజ్‌క్వార్ట్జ్ స్టోన్ గణపతి

జాతకచక్రంలో కుజుడు నీచలో ఉన్న, శత్రు రాశిలో ఉన్న, కుజ దశ, అంతర్ధశ జరుగుతున్న వారు, కుజు డు బలహీనంగా ఉం డడం వల్ల ధైర్యం లేక పోవుట, అన్న దమ్ము లతో సఖ్యత నశించుట, భూమికి సంబంధిం చిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధిం పులు అప్పులు తీరకపోవుట, ఋణదా తల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారంనందు ఆసక్తి లేకపోవడం, కండరా ల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదు ర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలు గుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తిం చి కుజ గ్రహాను గ్రహం కొరకు రోజ్‌క్వార్ట్జ్ గణపతిని పూజా మందిరంలో కందులపైన ఆరెంజ్ వస్త్రం పరచి మంగళవారం రోజు గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసిన వారికి కుజ గ్రహదోషాలు తొలగిపోవును. గృహ నిర్మాణం,సర్వే,సివిల్ ఇంజనీర్,శస్త్ర చికిత్సలు,పశుపోషణ,శస్త్ర చికిత్సలు,మెకానికల్ ఇంజనీర్,రసాయన విద్యలు,రక్షణ విధానం,పేలుడువస్తువులు,ఫైర్ సర్వీస్,తీర్పులు,హైడ్రో ఎలక్ట్రిక్ ఇంజనీర్,విమాన చోదక విద్య,వ్యవసాయము , వ్యవసాయ ఉత్పత్తులు , మాంసపు ఉత్పత్తులు , కోళ్ల పరిశ్రమలు , యంత్రములు, పనిముట్లు తయారీ , వడ్రంగి పనులు , భవన నిర్మాణములు , కనస్ట్రక్షన్స్ , కాంట్రాక్టులు , బిల్డింగ్ మెటీరియల్ , విద్యుత్తు శక్తి శాఖలు , విద్యుత్ ప్లాంట్స్ , మిలటరీ , పోలీస్ తదితర రక్షణ శాఖలు , సైన్యమునకు సంబంధించిన ఉద్యోగాలు , మోటార్స్ , మెకానికల్ , భూ పరిశోధన, అటవీ ఉత్పత్తులు , అటవీ శాఖ కు చెందిన వృత్తుల వారు, వ్యవసాయం కలసి రాకున్న, సివిల్ ఇంజనీర్స్, రక్షణశాఖ ఉద్యోగస్తులు, ఆటోమొబైల్స్, మెకానికల్ ఇంజనీర్స్, శస్త్రచికిత్సలు చేసేవారు ఈ గణపతిని పూజించిన ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు.

జేడ్‌స్టోన్ గణపతి

జాతకచక్రంలో బుధుడు నీచలో ఉన్న, బలహీనంగా ఉన్న, శత్రు రాశిలో ఉన్న, బుధ దశ, అంతర్ధశలు జరుగుతున్నప్పుడు, బుధుడు బలహీ నంతగా ఉన్నట్లయితే నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి జేడ్‌స్టోన్ గణపతిని పూజా మందిరంలో పచ్చ పెసర్ల పైన గ్రీన్ కలర్ వస్త్రం పరచి బుధవారం రోజు గణపతిని ప్రతిష్టించి పూజ చేసిన బుధగ్రహ దోషాలు తొలగిపోవును. వ్యాపారం,కమర్షియల్ డిగ్రీలు,బ్రోకర్స్ , బ్యాంకులు , పైనాన్సియల్ సెక్షన్స్ , చిట్ ఫండ్ వ్యాపారములు , ట్రెజరీ డిపార్టమెంట్లు , బడ్జెట్ తయారీ చేయువారు , చిత్ర కళ,డ్రాయింగ్,పెయింటిగ్,నమూనాలు గీయుట,ఎస్టిమేటింగ్,వ్రాత,గణిత విద్య,కంస్ట్రక్షన్ డిజైన్,జ్యోతిష్యం,శుక్రునితో కలసిన చాయా చిత్రములకు చెందిన వ్యాపారం,రసాయన శాస్త్రం,జీవశాస్త్రం,వృక్షశాస్త్రం,అనువాదకులు,ఉపాద్యాయులు, పత్రికలు , పత్రికా సంపాదకులు , ముద్రణా రంగములు , పుస్తక పరిశ్రమలు , రచయితలు చార్టెడ్ ఎకౌంట్స్ , విలేఖర్లు ,జర్నలిజం , గుమస్తా ఉద్యోగాలు ,సాప్ట్ వేర్ , కంప్యూటర్ , టెక్నాలజీ సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు పచ్చళ్ళు పరిశ్రమల వృత్తుల వారు, విద్యార్దులకు చదువులో ఆటంకాలు ఉన్న, అన్ని రకాల వ్యాపారాలు, సినిమారంగంలో రాణింపు లేకున్నా, జ్యోతిష్యం, ఉపాద్యాయ వృత్తుల వారు, క్రీడలు, పెయింటింగ్ చేసేవాళ్ళు ఈ గణపతిని పూజించాలి.

సిట్రిన్‌స్టోన్ గణపతి

జాతకచక్రంలోగురువు నీచలో ఉన్న, బలహీనంగా ఉన్న, శత్రు రాశిలో ఉన్న, గురు దశ, అంతర్ధశలు జరుగుతున్నప్పుడు, గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, ని యంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతా లు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి సిట్రిన్‌స్టోన్ గణపతిని శెనగల పైన పసుపు వస్త్రం పరచి గురువారం రోజు గణపతిని పూజించిన వారికి గురు గ్రహ దోషాలు తొలగిపోవును. న్యాయవాదులు,ఆర్ధిక శాస్త్రం,సంస్కృతంలో పట్టాలు,వేదాంతం,అవదాన విద్యలు,జ్యోతిష్యం,విద్యా సంస్థలు , ఉపాధ్యాయులు, లెక్చరర్స్ , భోధనా సంబంధ ఉద్యోగములు , పురోహితులు , పూజార్లు , పూజ గది , పూజా ద్రవ్యములు , దేవాలయ సిబ్బంది , దేవాదాయ శాఖలలో ఉద్యోగాలు , పరిశోధనా రంగములు , విశ్లేషకులు , మత ప్రచారకులు , మేధావి వర్గమునకు చెందినవారు . సంస్కృతి , సంప్రదాయములను వివరించు స్వామీజీలు వీరందరూ గురుడు కు సంబంధించిన వారు . గురుడు ఆకాశ తత్వమునకు చెందిన వాడు కాబట్టి విమానయాన రంగములు , శాటిలైట్ లు, ఉపాద్యాయులు, బ్యాంక్ఉద్యోగులు, బంగారం, న్యాయవాద వృత్తుల వారు, పౌరోహిత్యం, జ్యోతిష్యం, సంస్కృత విద్యను అభ్యసించే వాళ్ళు ఈ గణపతిని పూజించిన రాణింపు బాగుంటుంది.

స్పటిక గణపతి

జాతకచక్రంలో శుక్రుడు నీచలో ఉన్న, బలహీనంగా ఉన్న, శత్రు రాశిలో ఉన్న, శుక్ర దశ, అంతర్ధశలు జరుగుతున్నప్పుడు, శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగుట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భ ర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనము ల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి స్పటిక గణపతిని అలచందలపైన తెల్ల వస్త్రం పరచి శుక్రవారం రోజు గణపతిని పూజించిన శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. నాట్య రంగం,చిత్రకళలు,రసాయన శాస్త్రం,కామశాస్త్రం,గురు,బుదులతో కలసిన ఎలక్ట్రానిక్స్,వస్త్రాలు, ఆభరణ తయారీలు, ఆర్నమెంట్ నగల వ్యాపారము , బంగారు వ్యాపారము , అలంకరణ సామాగ్రి , ఇంటీరియర్ డిజైనింగ్ , ఫాన్సీ దుకాణాలు , హైర్ స్టైయిల్ డిజైనింగ్,కుట్టుపని,ఎంబ్రాయిడరీ ట్రైనింగ్,ఇల్లు,వాహనాలకు పెయింట్స్ వేయటం,మసాజ్ సెంటర్స్ , రెడీమేడ్ వస్త్రములు , వస్తువులు , స్త్రీలకు సంబంధించిన వస్తువులు , సుగంధ ద్రవ్యములు , అగరబత్తీ పరిశ్రమలు, నూతన వస్తువులు, కళలు , సినిమా రంగము , కళాకారులు , ఎలక్టానిక్ మీడియా , గాయకులు , సంగీత సాహిత్య రంగములు, లలితకళలలో రాణింపు, బ్యూటీపార్లర్, సంగీతం, నాట్యం, వస్త్ర వ్యాపారులు, కుట్టు పనిచేసే వాళ్ళు, జ్యూలరీషాపు వారు స్పటిక గణపతిని పూజించిన దినదినాభివృద్ధి చెందుతారు.

ఎమితెస్ట్, లాఫిజ్, బ్లాక్ స్టోన్ గణపతి

జాతకచక్రంలో శని నీచలో ఉన్న, బలహీనంగా ఉన్న, శత్రు రాశిలో ఉన్న, శని దశ, అంతర్ధశలు జరుగుతున్నప్పుడు, శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధ కము, అతినిద్ర దీర్థకాలిక వ్యాధులు, సరయి న ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, ఇతరుల ఆధీనములో పని చేయు ట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌర వం లేకపోవుట, పాడుపడిన గృహముల యందు జీవించుట, ఇతరుల ఇంట్లో జీవన ము సాగించుట, భార్య పిల్లలు అవమానిం చుట, కుటుం బమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరయిన భోజనం కూడా లేకపో వుట మొదల గు కష్టములు శని గ్రహ దోషము గా గుర్తించి ఈ గణపతులని నల్లని నువ్వులపైన నలుపు వస్త్రం పరచి శని వారం రోజు పూజ చేసిన శని దోషాలు తొలగిపోతాయి. గనులు,త్రవ్వకాలు,భూగర్భ శాస్త్రం,భూగోళ శాస్త్రం,పురాతన వస్తుసేకరణ,బొగ్గు గనులు,ఆర్ధోఫిడిక్స్, రాజకీయ నాయకులు , నామినేటెడ్ పోస్టులు పొందేవారు . న్యాయవాదులు , జడ్జీలు , న్యాయశాఖకు సంబంధించి ఉద్యోగులు , గాలికి సంబంధించిన రంగములు అనగా టెలీ ఫోన్ , కమ్యునికేషన్ , బట్వాడా కార్మికులు , తపాలా శాఖ , సేవకులు , కూలీలు , వ్యవసాయ కార్మికులు , కష్టముచే జీవించువారు , ఇనుము , ఉక్కు పరిశ్రమలు , ఇనుము ఉత్పత్తులు , బొగ్గు సంబంధిత శాఖలలో పనిచేయువారు , బరువులు మోయువారు , ఇన్సూరెన్స్ సంబందిత రంగములలో పని చేయువారు,ఇంగ్లీష్ విద్య,ప్రజా ప్రభుత్వ విద్యలు, సంచార జీవులు, నూనె కర్మాగారములు , పెట్రోల్ , డీసెల్ , గ్యాస్ సంబంధిత పరిశ్రమలలో ఉద్యోగ, వ్యాపారములు , సెకండ్ హ్యాండిల్ వస్తువుల వ్యాపారము మొదలగు వృత్తులు శనిగ్రహము వలన కలుగును . కంప్యూటర్ హార్డ్ వేర్ , అసెంబ్లింగ్ యూనిట్స్ మొదలగునవి . ఐరన్, మైనింగ్, గనులు, ఆయిల్ వ్యాపారస్ధులు, ఇంగ్లీష్ విద్యలో రాణించాలన్న, డీజిల్, పెట్రోల్, వ్యాపారస్ధులు, బొగ్గు న్యాయవాద వృత్తులవారు ఈ గణపతులను పూజించాలి.

టైగర్ స్టోన్ గణపతులు

జాతకచక్రంలో రాహువు బలహీనంగా ఉన్న, శత్రు రాశిలో ఉన్న, రాహు దశ, అంతర్ధశలు జరుగుతున్నప్పుడు, జాతక చక్రంలో బలహీ నముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కు ష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవిం చుట, విద్యార్థులు విద్య మధ్యలో మానివేయు ట, పాడుపడిన గృహములలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కు లు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవు ట, మొదలగున వి సంభ వించు చున్నప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి టైగర్‌స్టోన్ గణపతిని మినుములపైన తెల్ల వస్త్రం పరచి బుధ వారం పూజ చేసిన రాహుగ్రహ దోషాలు, కాలసర్ప దోషాలు, నాగ దోషం తొలగి పోతాయి. డాక్టర్స్ , మత్తు పానీయముల వ్యాపారము చేయువారు , మందుల దుకాణములు, కెమికల్ ఇండస్ట్రీస్ , రసాయన శాస్త్రవేత్తలు , చెత్త వ్యాపారము, డాక్టర్స్, మద్యం దుకాణాల వాళ్ళు, మెడికల్ బిజినెస్, కెమికల్ బిజినెస్ వాళ్ళు టైగర్‌స్టోన్ గణపతిని పూజించిన వ్యాపారాభివృద్ధి ఉంటుంది.

వైడూర్యస్టోన్ గణపతి

జాతకచక్రంలో కేతువు బలహీనంగా ఉన్న, శత్రు రాశిలో ఉన్న, కేతు దశ, అంతర్ధశలు జరుగుతున్నప్పుడు, కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తన లో తానే ఊహించుకొనుట, తనని తాను దేవు డు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధార ణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పో వుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచి త్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నా డు. కేతు గ్రహ అనుగ్రహం కొరకు వైడూర్యస్టోన్ గణపతిని ఉలవలపైన పసుపు వర్ణం వస్త్రం పరచి గురువారం పూజ చేసిన కేతుగ్రహ దోషాలు తొలగును. చర్మపు ఉత్పత్తులు, జోళ్ళు, రబ్బరు పరిశ్రమలు, రబ్బరు ఉత్పత్తులు, పశువులు, గొర్రెలు, కోళ్ళు పెంపకం చేసే వాళ్ళు ఈ గణపతిని పూజించాలి.

Each One:- 200.00 (Small Size)

http://astroexperts.blogspot.in/2016/08/blog-post_23.html

Sri Sai Jyotisha Kendram.Ph-9949621214.

loading...