loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

German Silver Earrings Collections

STANDING ALONE


STANDING ALONE IS BETTER

THAN BEING AROUND PEOPLE

WHO DON'T VALUE YOU.

PAKISTAN


INTERIOR DECORATION - BED ROOM DECORATION IDEAS
Samuthrika pattu SAREES-3
Samuthrika pattu SAREES-2

Samuthrika pattu SAREES COLLECTION-1

Will history repeat itself ?


FREE HEART OPERATIONS BELOW 18 YEARS IN ANDHRA HOSPITAL - VIJAYAWADA - FROM NOV-28 TO DEC-05


FUNNY ARTICLE ON TOWN LIVING

A satirical conversation as KITIKI 

టౌన్‌ పక్కకెళ్ళొద్దురా.. డింగరీ!!


''రేరు సుబ్బిగా..! టౌన్‌ హాల్లో ఇయ్యాల జరిగే కలర్‌ఫుల్‌ కార్యక్రమాలేటో?'' సుబ్బారావుని ఆరా తీశాడు టిప్‌టాప్‌గా తయారై వచ్చిన శ్రీమాన్‌ అప్పారావు. 

''ఏందిరోరు అప్పిగా..! ఇయ్యాల గాలంతా టౌన్‌హాల్‌ మీదకి మళ్లిందేటీ? పైగా కలర్‌ఫుల్‌ గిలర్‌ఫుల్‌ అని ఏదో కొత్త బాస కూడా మాటాడేత్తన్నవ్‌.. ఏటీ కథ?'' అడిగాడు సుబ్బారావు. అలియాస్‌ సుబ్బి. 
''మరి కలర్‌ఫుల్‌ అంటే కలర్‌ఫుల్లే.. ఎందుకంటే ఆడ రంగు రంగులు బట్టలేసుకుని.. డాన్సులు ఏత్తుంటారు కదా..! మరి కలర్‌ఫుల్‌ అనక ఏటంటాం?'' అంటూ తన పదప్రయోగంలోని జాణతనాన్ని ఎంతో తెలివిగా ప్రదర్శించాడు అప్పి.

''రేరు..! నువ్వంటన్నదేటో తలకెక్కకుంది. డాన్సంటావ్‌.. కలర్‌ఫుల్‌ చొక్కాలంటావ్‌.. ఇషయం ఏంటో అర్థంకాకుందరా అప్పిగే'' బేలగా మొహంపెట్టి అన్నాడు సుబ్బీ.

''అదేరా.. మన కృష్ణాజిల్లాలో ఉందకదా ఓ ఊరు.. అదే.. ఆ కూచిపూడి.. ఆ కూచిపూడి డాన్సులన్న మాట.. హిహ్హిహ్హీ'' అంటూ చిన్న హింట్‌ ఇచ్చాడు అప్పి.

''వార్నీ.. మన తెలుగోళ్ళ కూచిపూడి డాన్సా..! ఆ మాట సెప్పడానికి ఊరికే ఇందాకడ్నుంచి ఒకటే నీలుగుతావేందుకురా..? లక్షణంగా కూచిపూడి డాన్స్‌ అంటే సరిపోదా ఏంది? సరేగానీ ఇంతకీ ఆ పద్ధతైన డాన్సులతో నీకు పనేందిరా?'' అనుమానంగా అడిగాడు సుబ్బారావు.

''భలేవాడివేరోరు.. కళాపోసనకు పెత్యేకించి ఓ పనే ఉండాలా సెప్పు..? కళ ఏడుంటే ఆడకు వెళ్ళాల్సిందే.. తనివితీరా ఈక్షించాల్సిందే..!'' గంభీర వదనంతో చెప్పసాగాడు అప్పి. 
''ఈక్షించాలా.. లేక ఆడకెళ్ళి ఆళ్ళను శపించాలా?'' ఆక్షేపణగా అన్నాడు సుబ్బారావు.
''రేరు సుబ్బిగా.. నీతో ఏదైనా ఇషయం సెప్తే.. పెతిదీ ఎటకారంగానే తీసుకుంటావురా..! అందుకే నీకేటి సెప్పబుద్ధికాదు'' కాస్తంత ఫీలవుతూ అన్నాడు అప్పి.

''అబ్బో.. నువ్విట్టా ఫీలవ్వమాకరా..! కడుపు తరుక్కుపోతా ఉంది. అయినా.. నీ మొఖం ట్రాజెడీకి సూటవ్వదుగానీ.. ఇంకోమాట సెప్పు'' అంటూ ఫీలవుతున్నవాడ్ని మరింత ఫీలయ్యేలా చేశాడు సుబ్బారావు. 

''ఇదిగో సుబ్బిగా.. ఇక మూత్తావా..! నేనేదో అట్టా టౌన్‌హాల్‌కాడికెళ్లి.. కాసేపు కళాపోసన సేసొద్దాం అనుకుంటుంటే.. ఆ పెశ్న ఈ పెశ్న ఏసి, నా కాళ్ళకు అడ్డుపడతావేంది..? నువ్విట్టా మాటాడితే.. నేనొక్కడ్నే కళాపోసన చేసొత్తా..!'' కాస్తంత కోపంగానే అన్నాడు అప్పి.

''ఓరి నీ కళాపోసన తగలెయ్యా..! ఇంతకీ ఆడకెళ్ళి ఏం సేత్తావు నువ్వు?'' ఆసక్తితోనే అడిగాడు సుబ్బారావు.

''రేరు పబ్లిక్‌లో పాపులారిటీ పెరగాలంటే అప్పుడప్పుడు రాజకీయంతోపాటు కూసింత కళాపోసన కూడా ఉండాలా..?'' భుజంపై ఉన్న జరీరుమాలు సర్దుకుంటూ బేస్‌వాయిస్‌తో అన్నాడు శ్రీమాన్‌ అప్పి. 

''రేరు.. నీకూ నాకూ ఎందుకురా ఈ పాపులారిటీ గోల..? సుబ్రంగా ఏళకి కూసింత గంజి తాగి, సల్లగా తొంగోక..?!'' అని సుబ్బి అనగానే..

''రేరు..! నీకూ.. నాకూ అని.. ఊరికే కలిపేసుకోమాకా.. అయినా.. పాపులారిటీ తెచ్చుకోవాలంటే కూసింత టేస్టుండాల..!'' మళ్లీ పాతపాటే పాడాడు అప్పి.

''సరేరా.. మేము మీ అంత గొప్పోళ్ళం కాదులేగానీ.. ఇంతకీ తమరు టౌన్‌హాల్‌కెళ్ళి ఏం చేద్దామని?'' మళ్లీ అడిగాడు సుబ్బి.

''ఏం చేత్తామంటే ఏం చేత్తాం..?! ఆ.. ఆ.. ఆడకు గొప్ప గొప్ప కళాకారులొత్తారు కదా..! ఆళ్ళతో కాసింత పరిచయాలు పెంచుకుంటాం..!'' మాటల్ని పోగు చేసుకుంటూ చెప్పసాగాడు అప్పి.
''పరిచయాలంటే ఏంటో కూసింత ఇవరంగా సెలవిత్తారా?!'' సుబ్బి అడిగిన ప్రశ్నలో ఒకింత వ్యంగ్యం ధ్వనించింది.

''ఇప్పుడు కళాకారుల భుజంపైన చెయ్యేసి.. నవ్వుతూ ఓ ఫొటో దిగినామనుకో.. అలా పడుంటాది కదా.. హిహ్హీ..!'' తనదైన శైలిలో వివరించాడు అప్పి. 

''ఫొటో దిగడం వల్ల ఉపయోగమేందిరా నీకు?'' కుతూహలంగా అడిగాడు సుబ్బి.
''మనకీ కళాపోసన ఉందన్న సంగతి జనాలకి తెలియాలంటే అప్పుడప్పుడు.. అట్టాంటోళ్ళతో ఫొటోలు, గిటోలు దిగి, పరపతి పెంచుకోవాలి..! లేదంటే కళారంగంలో చులకనైపోమూ..?!'' సాగదీస్తూ అన్నాడు అప్పి.

''దాన్ని కళాపోసన అనర్రా పిచ్చనాయాలా..! తగుదునమ్మా అని, అన్నింట్లోనూ ఏలు పెట్టడమంటారు!'' అప్పారావులోని కళాత్మక మురిపెంపై కళ్ళాపి చల్లాడు సుబ్బారావు.
''నీకెప్పుడూ అంతేరా..! ఈ అప్పిగాడు ఎదిగిపోతన్నాడంటే ఒకటే కుళ్ళు'' గుడ్లురుముతూ నొచ్చుకున్నాడు అప్పి.

''ఒరేరు.. నీకోటి సెప్పనా..?'' అని సుబ్బి అనగానే ''ఇనక సత్తామా?! సెప్పు.. సెప్పు'' అంటూ గుర్రుమన్నాడు.

''ఇప్పుడూ.. కొన్ని ఇషయాలు కొంతమందికే సూటవుతారు! నీకూ నాకూ అలాంటి కళలు.. కాకరకాయలు నప్పుతాయా సెప్పు..? అయినా అట్టాంటోళ్ళతో ఫొటోలు దిగితే మాత్రం జనాలకి తెలీదా ఎవళెలాంటోళ్ళో..?'' నచ్చచెప్పబోయాడు సుబ్బారావు.
''రేరు సుబ్బిగా! ఇందాకడ్నుంచి సూత్తన్నా.. కాళ్ళట్టి ఒకటే లాగేత్తున్నావ్‌.. నా కళాపోసన నా ఇట్టం. నువ్వేం నాకు బోడి సలహాలివ్వబోక..'' గట్టిగానే విసుక్కున్నాడు అప్పి.
''అబ్బో.. అయ్యగారికి బాగా కోపం వత్తన్నట్టుందే..! అవునులే మరి రాదేటీ.. ఉన్నమాటంటే ఎవళకైనా గుబులేకదా..!!'' అప్పిని మరింత ఉడికించబోయాడు సుబ్బారావు.
''రేరు పరపతి పెంచుకోవడం తప్పులేదుగానీ, రాని ఇద్యలో ఏలెట్టమాక..! నువ్వేమో మొరటునాయలివి. ఆళ్ళేమో ఎన్నో ఏళ్ళు కళను ఔపోసన పట్టినోళ్ళు.. ఆళ్ళతో నువ్వు ఫొటోలు దిగినంత మాత్రానా కాకి నెమలైపోద్దా? సెప్పు'' నవ్వుతూ అన్నాడు సుబ్బి.
''ఇంతకీ కాకెవరు.. నెమలెవరు? నీ ఎటకారం మరీ ఎక్కువైందిరోరు సుబ్బీ..! ఇట్టా అయితే నీకూ నాకూ కుదురదు..'' అలిగినట్టు మాట్లాడాడు అప్పి.

''నేనూ అదే అంటన్నా.. ఇట్టా అయితే నాకూ కుదరదు మరి. మనకు చేతకాకపోయినా.. ఏదో పామేసుకుందామని అన్నింట్లోనూ ఏలెట్టామనుకో.. జనాల్లో బేడయిపోతాం.. ఏదో మనకొచ్చిన పని మనం సేసుకోవాలా! మనకిచ్చిన బాధ్యతల్ని మనం సరిగ్గా సెయ్యాలా..!! అంతేగానీ.. '' అంటూ సుబ్బి ఇంకేదో చెప్పబోతుంటే.. పక్క వీధులోంచి సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ''టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ.. డాంభికాలు పోవొద్దురా!'' అంటూ పాట వినపడుతోంది.
చెవులకు ఇంపుగా తోచని సుబ్బి మాటల్ని, మైక్‌సెట్‌లో ఆ పాటను వినడం ఇష్టంలేక అక్కడ్నుంచి ''డింగ్‌'' అని మాయమైపోయాడు అప్పారావు.. అలియాస్‌ అప్పి.

- గంగాధర్‌ వీర్ల

POLICE - NAYAM DIARY

పోలీస్ : సాయిలు అంటే నువ్వేనా..?
సాయిలు : నేనే సారు.. ఏం కావాలే సారు..?
పోలీస్ : నయీం డైరీల నీ పేరుంది..
సాయిలు : నా పేరా నాకేం తెల్వదు సారు.. 😱
పోలీస్ : బొంకకు.. బొక్కలిరగ్గొట్టి పొయ్యిలవెడ్తం.. 👊
సాయిలు : అయ్యో అమ్మతోడు సారు నాలేం తెల్వదు..
పోలీస్ : షాద్ నగర్ సాయిలు అంటే నువ్వే కదా..
సాయిలు : నేనే సారు కానీ నా పేరెందుకు రాశిండో నాకు తెల్వదు..
పోలీస్ : షాద్ నగర్ సాయిలు దగ్గర 40 L అని రాశిండు.. అంటే నీ దగ్గర 40 లక్షలు దాశివెట్టిండు.. ఏడున్నయో చెప్పు.. 😬
సాయిలు : నా దగ్గర అన్ని పైసలుంటే గీడెందుకుంట సారు.. 😱
పోలీస్ : నక్రాల్ చెయ్యక్ రా బిడ్డా.. మంచి ముచ్చట కొద్ది చెప్పు.. 40 లక్షలెక్కడా..? 😈
సాయిలు : హా.. యాదికొచ్చింది సారు నేను పాల బ్యారం చేస్తా.. ఓసారి దావత్కి 40 లీటర్ల పాలు తీస్కవోయిండు ఉద్దెర ఖాతా వెట్టి.. ఒకపారి అడిగితే బెదిరిచ్చిండు ఇంగ పోతే వోని అనుకున్నా.. 😷😷
పోలీస్ : 40 L అంటే 40 లీటర్లా..?? 😎
సాయిలు : అవును సారు నా పేరు గిట్ల మరిశిపోకుండా యాదివెట్టుకుండు వాడెంత మంచోడో.. ఎక్కన్నన్న పైసలొత్తే నా పాల పైసల్ నాకిప్పియ్యిర్రి సారు.. 🙅
పోలీస్ : హా అట్లనే.. 😠

KISS SALARY

ముద్దుల జీతం.
ఒక భర్త తన భార్యకు వుత్తరం రాశాడు.
"ఈ నెల జీతం బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను. తీసుకో."
భార్య నుంచి భర్తకు వుత్తరం వచ్చింది.
"మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మామయ్యగారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే, వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటి ఓనరు రోజూ 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. ఐనా, కంగారు పడకండి. నా వద్ద మీరు పంపిన 35 ముద్దులు మిగిలే వున్నాయి."
భర్త నుంచి వెంటనే టెలిగ్రాం వచ్చింది.
"రేపే నా జీతం మనీ ఆర్డరు పంపిస్తున్నాను. ముద్దులు ఇవ్వడం ఆపేయ్ వెంటనే."

COLOURFUL LAMPS DECORATED FESTIVAL MUGGULU


CREATIVE AND COLOURFUL FESTIVAL ANDHRA MUGGULU

TELUGU MANTRALU AND SLOKALU COLLECTION


అద్భుత రహస్య మంత్రాలు మీ కోసం.. తప్పక చదవండి.


ప్రతి నిత్యము పటించవలసిన ప్రార్దనలు 


 🕉 ఉదయం కరదర్శనం
“కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం” 

 🕉 ఉదయం భూప్రార్ధన
“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే” 

 🕉 మానసిక శుద్ది
“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:” 

 🕉 స్నాన సమయంలో
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు” 

 🕉 భోజనానికి ముందు
“అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే” 

 🕉 భోజనము తరువాత
శ్లో|| అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం
ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం ||

 🕉 ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి !
“గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ” 

 🕉 అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి.
“ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా”
మరియు / లేక “క్రీం అచ్యుతానంత గోవింద” 

 🕉 విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి
“ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి” 

 🕉 విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండ ఉండటానికి పఠించాల్సిన మంత్రం
“గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ” 

 🕉 ప్రారంబించిన పనిని విజయ వంతంగ పూర్తి చేయడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా” 
🕉 చేపట్టిన కార్యం లొ, పోటి పరిక్షలొ ను విజయం సాదించడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“శ్రీ రామ జయరామ జయజయ రామరామ” 
 🕉 అన్ని సమస్యలకు ప్రతి నిత్యం సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం
“ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:” 
 🕉 ఉద్యోగం లొ ఉన్నతి కొరకు, పై అదికారుల అబిమానం మరియు తన వద్ద పనిచేయువారి సహకారం లబించాలంటె క్రింది మంత్రాన్ని ప్రతి దినం గంట సమయం పఠించాలి
“ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా” మరియు / లేక “శ్రీ రాజ మాతంగ్యై నమ :” 
 🕉 ఉత్తమ భర్తను పొందుటకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి 

“హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్”

 🕉 ఉత్తమ భార్యను పొందుటకు.
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి

“పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్ 
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్”

 🕉 వివాహాం తోందరగా జరగడానికి.
మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.

“ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే” 

 అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి.
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి

“కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ
నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:
పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం
తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం
పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం” 

 🕉 అబ్బాయిలకు వివాహాం తోందరగా జరగడానికి
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.

“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”

 స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.

“హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం
పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా
మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్” 

 🕉 వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి

“శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం” 

🕉 కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
“ఓం క్లీం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్
పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ క్లీం” 

 🕉 కుటుంబంలొ వచ్ఛు సమస్యలను తొలగి సౌఖ్యంగ ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ” లేక
“సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి
సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని” 

 🕉 కుటుంబ సమస్యలతో దూరమైన భర్త ను పొందడానికి మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
:ఓం నమో మహాయక్షిణ్యై మమపతిం
మే వశ్యం కురు కురు స్వహా” 

 🕉 ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“ఓం దేవకిసుత గోవింద జగత్పతె
దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:” 

 🕉 సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా
తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః” 

 🕉 ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక”

 🕉 ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“అపదామపర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం 

“దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని” 

సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల”

loading...