loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

KNOW ABOUT VEGETARIAN FOOD AND NON VEGETARIAN FOOD SPECIALTIES AND CHOOSE THE BEST ONE


మాంసాహారం మంచిదా.. శాఖాహారం మంచిదా... తెలుసుకోండిలా?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యంగావుంటే ఆయుష్షు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఆహారంలో శాఖాహారం ఉత్తమం అంటున్నారు వైద్యులు. శాఖాహారం తీసుకుంటే అధిక రక్తపోటు నుండి కూడా మనిషి తనని తాను కాపాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోపాటు పోషకపదార్థాలుండాలి. ఇవన్నీ కలగలిసిన భోజనమే అమృతంతో సమానం. మనం తీసుకునే భోజనం ప్రకృతి సిద్ధమైనదైవుండాలి. సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయటపడగలుగుతామని పరిశోధకులు తెలిపారు.

మాంసాహారం అధికంగా తీసుకునేవారిలో అధిక రక్తపోటును గమనించామని అదే శాఖాహారం తీసుకున్నవారిలో అమినో ఆమ్లము అధికంగా వుందని పరిశోధకులు తెలిపారు. ఈ అమినో ఆమ్లం రక్తపోటును నివారిస్తుంది. కాయగూరల్లో అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం కూడా వుంటుందని ఇది రక్త పోటును క్రమబద్దీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇంతేకాకుండా మాంసాహారుల్లో ఫైబర్ శాతం కూడా తక్కువగా వుంటుందని తేలింది.

ఫైబర్ మనకు ధాన్యాలలో అధికంగా లభిస్తుంది. పప్పులు, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్‌లలో అధికంగా లభిస్తుంది. ఇవి శరీర బరువును కూడా క్రమబద్దీకరిస్తాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం పెరిగిపోతుంది, కొవ్వు కూడా అధికంగా పేరుకు పోతుంది. ముఖ్యంగా శరీరానికి కార్బోహైడ్రేట్‌లు కూడా ఎంతో అవసరం. మాంసాహారులు మాంసంలో కూడా ఈ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయనుకుంటారు. కానీ ఇది ఎంతమాత్రం నిజంకాదు. ఎందుకంటే ఇది మాంసాహారంలో ఏమాత్రం లభించదంటున్నారు పరిశోధకులు. ఇది బ్రెడ్, రొట్టెలు, అరటిపండు, బంగాళాదుంపల్లో ఎక్కువగా దొరుకుతుంది.

శరీరంలో రక్తం పెరగడానికి మాంసాహారం తీసుకుంటే రక్తం పెరగదు. శరీరంలో రక్త శాతం పెరగాలంటే ఆకుకూరలు, పుదీనా, బెల్లం తదితరాలు తీసుకోవాల్సివుంటుంది. మాంసాహారం నుంచి లభించని బలం పుష్టికరమైన శాఖాహారం నుండి లభిస్తుంది. ఆకుకూరలలో విటమిన్ కే కూడా ఉంటుంది. విటమిన్ కే శరీరంలో తక్కువగావుంటే అధికంగా రక్తస్రావం అయ్యే సూచనలున్నాయి.

మానవుడు ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకుంటే కోపం, విసుగు, తనపై తనకే అభద్రతాభావం కలుగుతాయని పరిశోధకులు తెలిపారు. ఇది మానవ శరీరంతోబాటు మనసుపై కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రకృతి మనకు ఎన్నో పదార్థాలను ప్రసాదించింది. ఈ పదార్థాల వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతాయి. కాబట్టి ఇప్పుడు మాంసాహారం మంచిదా లేక శాఖాహారమా.. మీరే నిర్ణయించండి.

loading...