ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF HISTORY ABOUT RAJAMAHENDRAVARAM - RAJAHMUNDRY - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


రాజమహేంద్రవరం

ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులు, సామంతులు, మాండలికుల గురించి రాజనీతిజ్ఞలు, ప్రజలు మొదలైనవాి గురించి చరిత్ర అధ్యయనము ద్వారా తెలుసుకొనగలము. క్రీ.పూ. నుండి స్వాతంత్య్ర సముపార్జనవరకు ఆంధ్రదేశ చరిత్రను పరిశీలించిన, ప్రసిద్ధి చెందిన రాజవంశాలైన శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు, కళింగ గాంగులు, దుర్జయులు, పల్లవులు, తూర్పుచాళక్యులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, చాళుక్యచోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, డచ్‌వారు, ఫ్రెంచివారు మరియు ఆంగ్లేయులు మొదలైనవారు వారి పాత్రలు గణనీయంగా ఉన్నట్లు రాజకీయాంశాలను పరిశీలించుట వలన ఏ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధిచెందినది ఎందువలన అనే విషయాలు కూడా ముఖ్యంగా తెలియుచున్నవి.

నగరాల గురించి తెలుసుకొన్నట్లయితే నగరాలనేవి ఒక్కసారిగా ఉద్భవించినవికావు. కొన్నేళ్ళ గూడెం, పల్లె అయి, పల్లె పెద్ద ఊరై, ప్రజల బ్రతుకు అవసరాల నేపథ్యంలో ఆ ఊర్ళు పట్టణాలై, పట్టణాలు విద్య సాంస్క ృతిక వికాసచైతన్యదీపాలై నగరాలవుతాయి. నగరం ఏర్పడానికి ఇంత పరిణామశీలవంత చరిత్ర ఉంది. ప్రాచీన 'రాజమహేంద్రపురం' నేడు 'రాజమండ్రి'అను నామంతో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదికి తూర్పు ఒడ్డున కలదు. ఇచ్చట గోదావరి నది 3 కిలోమీటర్లు వెడల్పు కలిగి అఖండ గోదావరిగా ఉండి గౌతమవి, వశిష్ట, వృద్ధగౌతమి, తుల్య, ఆత్రేయ, భరద్వాజ, కౌశిక అను ఏడు పాయలుగా విభజించబడి 40 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలియుచున్నది.

ఈ ప్రాంత పరిసరాలలో 1979 సం||లో జరిపిన త్రవ్వకాలలో లభ్యమైన ఇటుకలు, కుండపెంకులు, పాత్రలు మొదలగువాిని బ్టి ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందిన బౌద్ధక్షేత్రంగా చరిత్రకారులు అభిప్రాయపడిరి. పవిత్ర గోదావరి నదికి వేదకాలం నుండి పుష్కర ఉత్సవాలు జరుగుచున్నందున ఈ ఒడ్డున ఏర్పడిన ఈ నగరం ప్రత్యేకమైనటువిం ప్రాముఖ్యతను పవిత్రతను సంతరించుకున్నట్లుగా తెలియుచున్నది. నదీతీరాలు నగరికతకు జన్మక్షేత్రాలు. రాజమండ్రిలోని జీవస్పర్శ ఎన్నెన్ని తరాల నాిదో! యుగాలనాిదో! తెలుగునాట సంస్కరణేచ్చకు, సిద్ధాంత చర్చకు, కళావికాసానికి, కార్యదక్షతకు, శౌర్యానికి, పరాక్రమానికి, క్రీడలకు, క్రీడాస్ఫూర్తికి, ఆధ్యాత్మిక భావజాలపరంపరకు, సేవకు, సమర్పణ భావానికి ఈ రాజమండ్రి గరిమనాభి.

చాళుక్యలకు పూర్వం ఈ నగరం ఏ నామంతో ఉచ్చరించబడినదో ఇదిమిద్ధమైన ఆధారములు మనకు లభించనప్పికి శాతవాహనుల నామకరణములు మరియు శాతవాహన చక్రవర్తియైన హలుని 'గాధాసప్తసతి' ద్వారా ఈ ప్రాంతం క్రీ.పూ.నుండి గొప్ప ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు తెలియుచున్నప్పికీ తూర్పు చాళుక్యులకాలంలో ఈ నగరం రాజధానిగా గుర్తించబడినట్లుగా వివిధ ఆధారాల వలన తెలియుచున్నది. క్రీ.శ.624లో తూర్పు చాళుక్య మొది రాజైన కుబ్జవిష్ణువర్ధనుడు తన సామ్రాజ్యానికి వేంగీపురమును (ప్రస్తుత ఏలూరు నగరం ప్రక్కన గల పెదవేగి)ని రాజధానిగా చేసుకొని వేంగి రాజ్యస్థాపన చేసెను. చాళుక్య వంషాజులలోని అంతఃకలహముల వలననూ రాష్ట్రకూటులు దాడుల వలననూ మొది అమ్మరాజు విష్ణువర్ధనుడు క్రీ.శ.921-27 సం||ల మధ్య 'వేంగీ' కంటే 'రాజమహేంద్రపురం' సురక్షితమైన ప్రాంతంగా భావించి రాజమహేంద్రపురమునకు రాజధానిని తరలించి పరిపాలనను కొనసాగించినారు.

రాజమహేంద్ర బిరుదాంకితుడైన మొది అమ్మరాజు తన బిరుదునకు 'పురం'చేర్చి ఈ ప్రాంతమును 'రాజమహేంద్రపురం'గా నామకరణచేసెను. కాని కొంతమంది చరిత్రకారులు ఈ రాజమహేంద్రపురం నామంపై విభిన్న నామాలు అయిన రాజమహేంద్రవరం, రాణ్మహేంద్రవరం, రాజమహేంద్రి, రాజమందిరి, రాజమండ్రి అని అభిప్రాయపడినప్పికి చారిత్రక ఆధారములను బ్టి ఈ నగరం తొలుత రాజమహేంద్రపురంగానే గుర్తించబడినది. సాధారణంగా చాళుక్యకాలంలో వెల్లిసిల్లిన నగరములు అయిన వేంగిపురం, పిష్ఠపురం, నిరవంధ్యపురం, జననాథపురంల నామములను విశ్లేషించినట్లయితే చాళుక్యుల కాలంలో ఎక్కువ ప్రాంతాలకు 'పురం' చేర్చినట్లు తెలియుచున్నది. తదుపరి పాలకులైన రెడ్డి రాజులు కాలంలో కొన్ని పాంతాలకు చివర 'పురం'కి బదులుగా 'వరం' చేర్చినట్టు తెలియుచున్నది.

వాికి ఉదా:-
అన్నవరం, భీమవరం, వేమవరం, రాజమహేంద్రవరంలను చెప్పవచ్చు. ఈ నగరంలో
1. కమలగిరి 2.పుష్పగిరి 3.శేషగిరి లేక శోణగిరి 4. హేమగిరి (వేమగిరి) 5. ధవళగిరి (ధవళేశ్వరం)లు ఉండుట వలన 'పంచగిరి' అనే నామంతో కూడా వ్యవహరించెడివారు. కనుక ప్రముఖ చరిత్రకారుడైన సీవెల్‌ రచనలు బ్టి ఈ నగరం తూర్పు చాళుక్యుకాలంలో ప్రసిద్ధి చెందిన దుర్గంగా గుర్తించబడినది.

''అఖిల జలధివేలాపలయ వలయిత వసుమతీ వనితా విభూషణంబైన వేంగీదేశంబునకు నాయకరత్నంబునుం బోని రాజమహేంద్రపురంబు నందు''
రాజరాజనరేంద్రుని ఆస్థానంలో నన్నయ్యభట్టు, నారాయణభట్టు యొక్క సహాయంతో మహాభారతంను ఆంధ్రీకరించినందువలన రాజమహేంద్రవరము గొప్ప పరిపాలనా కేంద్రంగాను, ప్రఖ్యాత సాస్కం ృతిక కేంద్రముగాను చెప్పబడుతూ ప్రశంసించబడినది.

తదుపరి కాలంలో రాజమహేంద్రపురం పై చాళుక్యచోళులు, కళింగ గాంగులు, కాకతీయులు, ముస్లిలు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు, ఫ్రెంచివారు, ఆంగ్లేయుల ప్రభావం కలదు. రెడ్డిరాజుల కాలంలో ఈ ప్రాంతం తగిన ప్రాముఖ్యత సంతరించుకున్నట్లుగా కాటయవేమారెడ్డి స్వయంగా విద్వాంసుడై కావ్యములు రచించుటయేగాక పలువురు విద్వాంసులను పోషించుట, చుట్టుప్రక్కల గ్రామాలలో అనేక విద్యాసంస్థలు ఏర్పరచినట్లు తెలియుచున్నది. శ్రీనాథునిచే రచింపబడిన భీమేశ్వరపురాణంలో 1వ అధ్యాయం 32వ ప్రకరణంలో ఈ క్రింది విధంగా వర్ణించబడినది.

''అల్లాడ భూపల్లభుండు రాజమహేంద్రంబు రాజధానిగా సింహాద్రి పర్వంతం ఉత్కల, కళింగ, యువన, కర్ణాట, లాోంతర్దీపంబై....... విశ్వంభరా భువన మండలంబు.....''

ఈ చరిత్ర ప్రసిద్ధి కల్గిన రాజమండ్రి పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉండుట వలన శాతవాహనుల కాలం నుండి ఈ సప్తగోదావరి ప్రస్తావన వచ్చుచున్నందున ఈ పరిసర ప్రాంతాలలో వ్యవసాయం అభివృద్ధి చెంది, వాణిజ్య పంటలు విస్తారంగా పండుట వలన శాతవాహనుల నాణెంలు ఓడ గుర్తును కలిగియుండుటవలన గోదావరిలో పడవలపైన వర్తక, వాణిజ్యాలు, జరిగినట్లు తెలియుటవలననూ, తూర్పు చాళుక్యుల కాలంలోని 'వరాహం' చిహ్నంగల బంగారు నాణెములు బర్మాదేశంలోని అరకాన్‌ ప్రాంతంలోను మరియు సయాం ప్రాంతంలోను దొరికినందున ఈ ప్రాంతంలో ప్రధాన రేవు ఉండి విదేశాలకు కూడా వర్తక వాణిజ్యం వ్యాప్తి చెందినట్లు తెలియడమేగాక, రాజమహేంద్రవరం నగరంగా రూపొందించడానికి కూడా దోహదపడినట్లుగా చెప్పవచ్చును.

మతపరంగా పరిశీలించినట్లయితే రాజమహేంద్రరం పరిసర ప్రాంతాలలో ప్రాచీన యుగం నుండి హిందూ మతంతో పాటు జైన, బౌద్ధ మతములు ఉన్నప్పికి కాలక్రమేనా జైన, బౌద్ధమతాలకు ఆదరణ తగ్గి మధ్యయుగంలో చాళుక్యులు, చాళుక్య చోళులు, కాకతీయులు పరిపాలనా కాలంలో హైందవ మతము అభివృద్ధి చెందినట్లుగా చెప్పవచ్చును.

కాకతీయులు అనంతరం 1323వ సం||లో ఈ రాజమండ్రి తుగ్లక్‌ స్వాధీనంలో ఉన్న కొద్దికాలములోనే మొట్టమొదిసారిగా ముస్లింలు ప్రవేశించి జనజీవనంలో కలిసిపోయిరి. తదుపరి రెడ్డిరాజుల కాలం నుండి గజపతుల కాలంవరకు హిందూమతంనకు గోల్కొండనవాబుల కాలంలో ముస్లింలకు ప్రాముఖ్యత కల్గినది. 17వ శతాబ్దము నుండి మొదటగా డచ్‌వారు ఇచ్చట ప్రవేశించి ఒక స్థావరమేర్పరచుకొనిరి. అదియే ఇప్పి సైంట్రల్‌జైలు. తదుపరి ఫ్రెంచివారు కొంతకాలము తదుపరి ఆంగ్లేయులు ఈ ప్రాంతమును స్వాధీనపరచుకొని మనకు స్వాతంత్య్రం ఇచ్చువరకు ఈ రాజమండ్రిలో క్రైస్తవ మతమునకు ప్రాముఖ్యతనిచ్చి ఈ ప్రాంతమును అభివృద్ధి పరచినారు.

ఈ క్రింద వివరించిన అనేక గ్రంథముల వలన రాజమండ్రి నగర భౌగోళిక చారిత్రక, రాజకీయ అంశాల సమాచారం లభించినప్పికిని సంపూర్ణ సమగ్రమైన చరిత్ర, సంస్కృతిని ప్రాచీన యుగం నుండి ఆధునిక యుగం వరకు వివరించే ప్రయత్నం ఏ రచయిత, పరిశోధకుడు చేయలేదు. దీనిని దృష్టిలో వుంచుకొని ''రాజమండ్రి సమగ్ర చరిత్ర - ఒక పరిశీలన'' అనే అంశంపై అధ్యయనం చేయుటకు ఈ పరిశోధనాంశమును ఎంపిక చేసుకోవడం జరిగినది.

* సాహిత్యపరిశీలన :

రాజమండ్రిపై వెలువడిన ఈ క్రింది ఆధునిక రచనలను పరిశీలించినట్లయితే ఏటుకూరి బలరామమూర్తిగారు రచించిన ''ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర''లో క్రీ.శ.921-27 సం||ల మధ్య పరిపాలించిన మొది అమ్మరాజు విష్ణువర్ధనుని కాలంలో రాజమహేంద్రవరం చాళుక్యులకు రాజధాని అయినదనీ, అంతవరకు వేంగినగరం వారి రాజధానిగా యుండెడిదని, నది అవతర రాజధానిని నిర్మించుట ద్వారా శత్రురాజుల నుండి రక్షణ ఏర్పడగలదనే ఉద్దేశ్యంతో అమ్మరాజు విష్ణువర్ధనుడు రాజమహేంద్రవరాన్ని నిర్మించినట్టుగా చెప్పబడినది.

సురవరం ప్రతాపరెడ్డిగారు రచించిన ''ఆంధ్రుల సాంఘీక చరిత్ర''లో మన వాజ్ఞయ చరిత్ర నన్నయభట్టుతో ప్రారంభమయినదనియు అతడు తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని కులబ్రాహ్మణుడనియు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రపురమును రాజధానిగా వేంగిదేశమును క్రీ.శ.1022 నుండి 1063 వరకు పరిపాలించెననియు, నన్నయ కాలము తర్వాతనే బ్రాహ్మణులలో వైదిక నియోగిశాఖలేర్పడెననియు ఆభేదము నన్నయకాలమందుగాని అంతకు పూర్వంగా లేకుండెననియు, నన్నయకు 100 ఏండ్లు పూర్వం అమ్మరాజ విష్ణువర్ధనుడు పరిపాలించినట్టునూ, అప్పి వరకు తూర్పు చాళుక్యుల రాజధాని వేంగింపురమనియు అమ్మరాజే రాజమహేంద్రవరమునకు రాజధానిని తరలించెనని కావున మనకీ కాలమందు తూర్పు తీరమందలి (అప్పి సర్కారులు) జిల్లాలోని స్థితిగతులు కొంతవరకు తెలియవచ్చినవని వివరించబడెను.

ఆంధ్రప్రదేశ్‌ సమాచార పౌరసంబంధాల శాఖవారి ''రాజమహేంద్రవరం చరిత్ర''లో వేదకాలం నుండి ఈనాి వరకు నిరంతరం సాగుతున్న జీవన స్రవంతి సాంస్క ృతిక ప్రతీక గోదావరి పుష్కరాలు అని తెలియుచున్నదని తెలుపబడెను.

యాతగిరి శ్రీరామ నరసింహారావుగారి ''రాజమహేంద్రిలో చారిత్రక విశేషాలు''లో ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా ప్రఖ్యాతి పొందిన పట్టణం రాజమహేంద్రి. ఇచ్చట చారిత్రక ప్రదేశాలు అనేకం ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసెను.

పురాణపండ శ్రీనివాస్‌గారి ''అమరధామంలో శోభిల్లే రాజమహేంద్రి''లో శతాబ్ధాల నాగరికతకు సాక్షీభూతంగా బాసిల్లే పవిత్రగౌతమీ తీరాన దక్షిణకాశీక్షేత్ర పవిత్రతను సంతరించుకున్న నగరి రాజమహేంద్రి రాజకులైన భూషణుడు, చాళుక్యకీర్తి వర్ధనుడు రాజరాజ నరేంద్రునిచే పరిపాలించబడ్డ నగరం రాజమహేంద్రవరం అనియు, సహస్రసంవత్సరాల మార్గకవిత్వం వెలుగుతున్న పురం 'రాన్మహేంద్రపురం' అనియు చెప్పబడింది.

కె. వెంకటపద్మనాభ శాస్త్రిగారి ''ఆంధ్రదేశ చరిత్ర''లో ఈ రాజమహేంద్రపురము వేంగి రాజ్యములో మధ్యభాగమున ఉండుట చేత రాజరాజనరేంద్రుడు ఇందొక కోటను క్టి తనకు రాజధానిగా చిరకాలముగా రాజ్యపాలన చేసెనని, ఈ పట్టణముకు కలిగిన ప్రఖ్యాతి, రాజరాజనరేంద్రుని మూలమున కలిగినదే కాని మరియొకరి మూలమున కలిగినది కాదు అని చెప్పుచూ విన్నకోట పెద్దన కవితన 'కావ్యాలంకారచూడామణి'లో 'రాజమహేంద్రవర స్థాత రాజనరేంద్రుడెక్కువ తాతయే విభునకు'' అని వివరించినట్లు చెప్పబడెను.

కుందూరి ఈశ్వర దత్తుగారి ''ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళము''లో రాజమహేంద్రవరం ఆంధ్రదేశములోని స్థల దుర్గములలో నొకిగాను, రాజరాజ ఇచ్చటనే ప్టాభిశక్తుడైనట్లుగాను, శ్రీమదాంధ్రమహాభారతము నందు భీమేశ్వర పురాణంలోను, శివయోగసారపీఠిక, శివలీలావిలాసంలోను రాజమహేంద్రవరం గురించి ఏ విధంగా ఉందో ఆ వర్ణనను తెలియజేసెను.

నేలటూరి వెంకటరమణయ్యగారి ''ది ఈస్ట్రన్‌ చాళుక్యాస్‌ ఆఫ్‌ వేంగి''లో మొది అమ్మరాజు విష్ణువర్ధనుడు రాజమహేంద్ర బిరుదాంకితుడు రాజమహేంద్రవర స్థాపకుడని, రాష్ట్రకూటలు దాడులకు వేంగి ప్రాంతం కన్నా గోదావరి అవతలి ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం సురక్షితంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేసెనని చెప్పబడుచున్నదని కాని చాళుక్య రాజులలో రాజమహేంద్ర బిరుదములు రెండవ అమ్మరాజుకు మరియు రాజరాజనరేంద్రునకు కూడా కలవు. కాబ్టి రాజరాజనరేంద్రుడు ఆనాి పరిస్థితులను బ్టి రాజధానిని వేంగి నుండి రాజమహేంద్రవరానికి మార్చియుండవచ్చును అని అభిప్రాయపడిరి.

భావరాజు వెంటక కృష్ణారావుగారి ''రాజరాజనరేంద్ర ప్టాభిషేక సంచిక''లో క్రీ.శ.982న ఒక శాసనము గలదని దానియందు ఆ కాలమున వృద్ధి (వడ్డీ) గ్రహించినారని తెలియుచున్నదని, నాల్గు 'గద్యాణములకు' నెలకొక 'హాగ' యని యున్నదని, దానిని బ్టి నూరు గద్యాణములకు సంవత్సరమునకు 12 þ 25 లేక 300 హాగలు వృద్ధియగునని, ఈ హాగలను గద్యాణములకు మార్చిన 300þ20/768 లేక 7þ13/16 సాలునకు ఎనిమిది వంతున కాలాంతరమున పుచ్చుకొనువాడుక గలదని, అందుచే దేశమున పరిపాలనము బహుధర్మయుక్తముగ జరుగుచున్నదని చెప్పనొప్పునని, గ్రామ న్వాథమును, వర్తక శ్రేణులును, శిల్పికారాది సంఘములును, నగర మహాజన సంఘమును మొదలగు సంఘముల మూలమున కేంద్రపరిపాలనా విప్లవములు జెడనిశాంతి దేశమున నెలకొనియున్నట్లు తెలియుచున్నదని చెప్పబడెను.

జి. కృష్ణగారి ''ద స్టోరీ ఆఫ్‌ తెలుగూస్‌ అండ్‌ దెయిర్‌ కల్చర్‌''లో అమ్మరాజ రాజమహేంద్రుడు, రాజమహేంద్రపుర నగరాన్ని నిర్మించెననియు, అదే ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి అని చెప్పబడెను.

డా|| ఎన్‌. రమేషన్‌ గారి ''ద ఈస్ట్రన్‌ చాళుక్యాస్‌ ఆఫ్‌ వేంగి''లో మొది అమ్మరాజు రాజమహేంద్ర బిరుదాంకితుడు, తన తండ్రి నాల్గవ విజయాదిత్యుని అనంతరం రాజుగా ప్రకించబడెనని, ఇతని అనుయాయులు పినతండ్రి అయిన రెండవ విక్రమాదిత్యుడు రాష్ట్రకూటుల సహకారంతో తిరుగుబాట్లు చేయుట వలన గోదావరి తూర్పుగట్టునకు రాజధాని కేంద్రమును మార్చినట్టు, అది రాజమహేంద్రపురంగా ప్రసిద్ధి చెందినట్టు తెలియుచున్నదని వివరించెను.

బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావుగారి ''ఆంధ్ర చరిత్ర'' (ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు)లో స్వల్పకాలములో ఆరుగు రాజకుమారులు సింహాసనమెక్కి మరణించారని, చాళుక్యులు స్వహస్తాలతోనే వేంగి నగరాన్ని పరశురామ ప్రీతి చేసినారనియు, ఇి్ట పరిస్థితులలో కొల్లబిగండని కొడుకైన అమ్మరాజు పితృపితామహుల మూలబలాన్ని తన వైపుత్రిప్పుకొని సింహాసనం 921-27 సం||ల మధ్య అధిష్టించినట్లు ఈతని ఈడేరు శాసనం నుండి గ్రహిస్తున్నామని, ఇతనికి రాజమహేంద్ర బిరుదు ఉన్నదని, నాి పరిస్థితులలో వేంగి సురక్షితమైన నగరం కాదని గోదావరి తీరంలో తన పేరున రాజమహేంద్రినగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడనియు, రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రపురం నుండి పాలిస్తూ వేంగిరాజ్య ఐక్యాన్ని పునరుద్ధరించుటకు చోళ సైన్య సహాయంతో తన సవతి తమ్ముడు విజయాదిత్యుని పై కలిదిండి వద్ద ఘోరయుద్ధం చేసి జయించెనని, పశ్చాత్తాపము చెందిన తమ్ముని క్షమించెనని, యుద్ధంలో మృతులైన చోళ సేనాపతులు స్మారకార్ధం కలిదిండిలో 3 శివాలయములు నిర్మించెనని చెప్పబడినది.

భావరాజు వెంకట కృష్ణారావుగారి ''రాజరాజ నరేంద్రుడు''లో విమలాదిత్యుడు తన అశ్వదళమును పంపి శత్రు భూములపై దాడి చేయించి ఆ దాడులలో మరణించిన శత్రువుల శిరములను శూలమునకు గొనివచ్చి రాజమహేంద్రవరమున రాజప్రసాద ప్రాంగణమున పాతించెనని భీమనభట్టు నుడివెననియు, రాజమహేంద్రవరమున గోదావరి పావనోదకములందు గంగ నీిని కలిపి రాజేంద్రచోళుడు జలకమాడి నిజరాజధానికి మరలివెల్లెననియు, గోదావరీ పావనోదకములను భగీరథీ జలమును కొని తెచ్చి గంగయికుండ చోళపురమున ప్రదేశించి వాిని ప్రత్యేక పవిత్రకుండ యందు నింపయాతోకమునకు గంగయికుండ అని పేరడిడెను. అనియు చెప్పబడినది.

కప్పగంతుల మల్లిఖార్జునరావుగారిచే రచించబడిన ''తరతరాల రాజమహేంద్రపుర చరిత్ర''లో మొది అమ్మరాజు విష్ణువర్ధనుని కాలములో రాజమహేంద్రపురం అతనిచే నిర్మించబడినదని, 'అమ్మ మహీపతి గండర గండో రాజమహేంద్రవర ఐతి విఖ్యాతః' అనే చేవూరి శాసనంలో అమ్మరాజు విష్ణువర్ధనుడు ప్రశంసించబడెనని, ఏలూరు శాసనం అమ్మరాజును విష్ణువర్ధనుని రాజమహేంద్రవరనామ' అని పేర్కొనిరని, కనుక చాలా మంది అమ్మరాజు విష్ణువర్ధనుని కాలంలోనే 919-20 సం||లలో రాజమహేంద్రపురం నిర్మితమై, తూర్పు చాళుక్యుల రాజధాని అయినదని విశ్వసిస్తున్నారనియు, ప్రస్తుతం రాజమండ్రిగా వ్యవహరించబడుచున్న ఈ పట్టణం యొక్క భౌగోళిక పరిస్థితి అఖండ గోదావరి నదికి తూర్పు ఒడ్డున 160-18|, 170-38| రేఖాంశములపై 810-7|, 820-40| అక్షాంశములపై నిర్మించబడినదనియు తెలుపబడినది.

డా|| వెలమల సిమ్మన్నగారి ''తెలుగుభాషా చరిత్ర''లో 'భాష్‌' (þþþþþþ) అనే సంస్క ృత ధాతువు నుండి వచ్చిన 'భాష' అనే పదానికి మ్లాడడానికి మ్లాడబడేది అని అర్థం. 'భాష్యతే ఇతి భాషా' భాషించబడేది భాష అని, హేతువాద దృక్పథంలో నిశితంగా పరిశీలిస్తే 'స్వతస్సిద్ద వాదం' భాషావిర్భావాన్ని బాగా నిరూపించినదని, సుమారు 5000 భాషలు ఉన్నాయని ''ఆంధ్ర'' శబ్దం సంస్క ృత పదం అని తెల్పియున్నారు.

డా|| గుండవరపు లక్ష్మీనారాయణగారి ''శ్రీనాథమహాకవి విరచిత శ్రీ భీమేశ్వరపురాణం''లో రాజమహేంద్రవరమునకు పంచగిరి దుర్గమని ప్రసిద్ధి అని అవి (1)వేమగిరి, (2)ధవళగిరి, (3)పద్మగిరి, (4)భద్రగిరి, (5)రామగిరి అని వివరించెను.

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డా|| జి.యస్‌.భాస్కరరావుగార్లచే వెలువడిన ''నన్నయభారతి''లో రాజరాజు నాికే 'లకులీశపాశుపత' ప్రభావం చేత జైనం శైవంగా మారిపోయిందని బౌద్ధులు, జైనులు అంతవరకు ఆరాదిస్తూ వచ్చిన శక్తి స్వరూపాలు పానవ్టాలుగా మారాయని, జైనుల వృషభ ఆరాధన నంది పూజగా మారినదని, పశుపతీనాధుడు పార్వతీనాధుడైనాడని, గోమఠేశ్వర ఆరాధకులే గోమఠులు, కోమట్లయ్యారని, అవి ఉభయుమతస్తులను ఏకోన్ముఖులుగా చేసెననియూ, బౌద్ధారామాలలోని ఆయక స్తంభాలు శివలింగాలుగా మారాయని, గుళ్ళు గోపురాలు లేచి బౌద్ధం, జైనం, శైవం సమ్మిశ్రతమయ్యెనని తెల్పెను.

కె. సోమశేఖర్‌ గారిచే సమర్పించబడిన పరిశోధకవ్యాసం ''రాజమండ్రి మున్సిపాలిీ 1866-1947''లో శ్రీకృష్ణదేవరాయలు 1515 సం||లో ఈ ప్రాంతాన్ని జయించెనని 1572 సం||లో గోల్కొండ నవాబులు పరిపాలనలోనికి, 1687 సం||లో ఔరంగజేబు పరిపాలనలోనికి వెళ్ళెననియు 1866 సం|| డిశంబరు నెలలో రాజమండ్రి మున్సిపాలిీగా అవతరించెను.

ఆంద్రేతిహాస పరిశోధక మండలి, వడ్డాది అప్పారావుగారి సంపాదకీయం ''రెడ్డి సంచిక''లో 1328 సం||లో తుగ్లక్‌ కాకతీయ ప్రతాపరుద్రుని ఓడించి రాజమహేంద్రవరమును ఆక్రమించి తన ప్రతినిధిగా సాలార్‌ ఉల్వీని నియమించగా అతను వేణుగోపాలస్వామి దేవాలయంను మసీదుగా మార్చెననియు, తదుపరి కొప్పుల కాపయనాయకుడు ఈ ప్రతినిధిని ఓడించి ఈ ప్రాంతంను స్వాధీనం చేసుకొనెనని 1388 సం||లో కాటయ వేమారెడ్డి ఈ ప్రాంతంను జయించి స్వాధీనపర్చుకొని వేమవీరభద్రారెడ్ల అనంతరము విజయనగర చక్రవర్తి ప్రౌడదేవరాయలు అధీనములో ఈ ప్రాంతం కొద్దికాలం ఉన్నాదని తెల్పెను.

గంథం నాగ సుబ్రహ్మణ్యంగారి సంపాదకీయం ''సమాచారం 40వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక''లో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తంలో రాజమండ్రి నగరానికి ఉన్నంత చారిత్రక ప్రాశస్త్య, పురావస్తు నేపథ్యం మరే ప్రాంతానికి లేదని, క్రీ.పూ.3వ శతాబ్ధములో మౌర్యుల కాలంనాడు గోదావరి తీరాన గల 'మహేంద్ర'అనే పట్టణం రాజమహేంద్రియే అన్నది ఒక బలమైన వాదన అని దానికి తగ్గట్టుగా పాత స్ట్‌ే బ్యాంక్‌ దిబ్బ (మహలక్ష్మీ హోటల్‌ ఎదుట గల దొమ్మేరు జమిందారుగారి స్థలం) నుండి గోదావరి అంచులోకి దిబ్బ అక్కడున్న పురాతన కుడ్య శకలాలు 'ట్రయల్‌ ట్రెంచ్‌ వేయగా 2þ11/2þ1/4 అడుగుల కొలత గల ఇటుకలతో గోడ బయటపడిందని, దాని వర్తులాకార కదలికను బ్టి అదంతా ఒక బౌద్ధ స్థూపాన్ని (చైత్వము) పోలి ఉన్నదని తెల్పియున్నారు.

ఈ క్రింద వివరించిన జర్నల్స్‌ నందు రాజమహేంద్రవరం గురించి వెలువడిన వ్యాసములను పరిశీలించినచో జె.ఎ.హెచ్‌.ఆర్‌.యస్‌. సంపుి 2, 3, 5లలో బి.వి.కృష్ణారావుగారిచే వెలువడిన ''హిస్టరీ ఆఫ్‌ రాజమండ్రి''లో వేంగి దేశం బంగాళాఖాతం ఒడ్డున ఉండుటవలన సముద్రయానం ద్వారా వాణిజ్య సంబంధాలు అరకాన్‌, పెగూ, చైనా, సయీమ్‌ మొదలైన దేశాలతో పెంపొందించుకున్నట్లు ఆయా ప్రాంతాలలో దొరికిన చాళుక్యుల కాలంనాి బంగారు నాణెముల వలన తెలియుచున్నదనియు, రాజరాజనరేంద్రుడు క్రీ.శ.16 ఆగష్టు 1022 గురువారం నాడు రాజమహేంద్రవరంలో ప్టాభిషక్తుడైనాడనియు, కులోత్తుంగ చోళుడు రాజమహేంద్రవరానికి రాజ్యాన్ని ఏలుటకు వచ్చియుండలేదనియు తన తనయులను రాజప్రతినిధిలుగా నియమించెనని చెప్పబడినది.

జె.ఎ.హెచ్‌.ఆర్‌.ఎస్‌. సంపుి 5 నందు జి.జె.డుబ్రియల్‌ గారిచే వెలువడిన ''రూయిన్స్‌ ఆఫ్‌ ది బుద్దిస్ట్‌ పీరియడ్‌ ఆన్‌ ది మ్‌ౌం ఆఫ్‌ సారంగధర ఎ్‌ రాజమండ్రి''లో రాజమహేంద్రవరమున ప్రాచీన కాలమునందు ఒక బౌద్ధ సంఘారామముండెననియు, ఈ ప్రాంతమును నేడు సారంగధర మెట్ట అని పిలుచుచున్నారనియు, ఇచ్చట బౌద్దకాలము నాి వెడల్పు అయిన ఇటుకలు బయల్పడినవని తెల్పబడినది.

జె.ఎ.హెచ్‌.ఆర్‌.ఎస్‌. సంపుి 7లో ఆర్‌.ఎస్‌. సుబ్బారావుగారిచే వెలువడిన ''రీస్‌ెం ఆర్యియాలాజికల్‌ ఫైండ్స్‌ ఎ్‌ రాజమండ్రి''లో 1933 జనవరిలో రాజమహేంద్రవరం ప్రస్తుత మున్సిపాలిీ ప్రాంతం గోదావరి నది ఒడ్డున (పూర్వపుష్పగిరిప్రాంతం) జరిగిన త్రవ్వకములో 6 ముఖములు 12 చేతులు కల్గిన కుమారస్వామి గ్రానైటు రాతి విగ్రహము లభ్యమైనదని, ఇంకను తల లేని నంది, స్థంభములు, 7వ విజయాదిత్యుని శాసనము దొరికినవని తెలియజేసెను.

జె.ఎ.హెచ్‌.ఆర్‌.ఎస్‌. సంపుి 30 నందు సి.హెచ్‌. ముత్యాలయ్యనాయుడు గారిచే వెలువడిన ''బిగినింగ్స్‌ ఆఫ్‌ విడో రీమేరేజెస్‌ మూమ్‌ెం ఇన్‌ ఇండియా''లో మొట్టమొదట వితంతు పునర్వివాహముల గూర్చి ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ ఉద్యమించగా బ్రిీష్‌ ప్రభుత్వం వారు యాక్ట్‌ 15 ఆఫ్‌ 1856 ద్వారా అనుమతించిరని, కందుకూరి వీరేశలింగంగారు 11 డిసెంబరు 1881 సం||మున మొట్టమొది వివాహం జరిపించినారని తెల్పెను.

జె.ఎ.హెచ్‌.ఆర్‌.ఎస్‌.సంపుి 31నందు వై. విఠల్‌రావుగారిచే వెలువబడిన ''సోషియో-ఎకనమిక్‌ కండిషన్స్‌ ఇన్‌ ఆంధ్రా ఇన్‌ ద కంపెనీ పీరియడ్‌ ిల్‌ 1858''లో గోల్కొండరాజ్యం 24 పరగణాలుగా విభజించబడినదని అందులో రాజమండ్రి ఒక పరగణా అని, అన్వరుద్దీన్‌ అనునతడు రాజమండ్రి పరగణాకు జమిందారుగా నియమించబడెనని ఇతనిపాలన పాశవికంగా జరిగినదని తెలుపబడెను.

మొదిలి నాగభూషణశర్మగారి సంపాదకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే వెలువబడిన ''హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ది ఆంద్రాస్‌''లో 1880వ సం||లో మొట్టమొదట రాజమండ్రిలో మోడ్రన్‌ తెలుగు థియేటర్‌ కందుకూరి వీరేశలింగం గారిచే ఏర్పాటు చేయబడినట్లు, వడ్డాది సుబ్బారాయుడుగారిచే 1884వ సం||లో ''హిందూ నాటకోజ్జివాక సమాజం'' రాజమండ్రిలో ప్రారంభించబడినదని తెలుపబడెను.

గోదావరికి తూర్పు ఒడ్డున రాజమహేంద్రవరంలో చిత్రాంగి మేడ దిగువన 1978 సం||లో త్రవ్వకములో ఒక నందీశ్వరుని గ్రానైటు రాతి విగ్రహం బయటపడి పీఠభాగమున 'మృకండు లింగానకు మారెళ్ళ భీమన సమర్పించిన నంది' అని శాసనం ఉందని దానిని బ్టి ఇది క్రీ.శ.13-14 శతాబ్ధములకు చెందినదిగా చెప్పవచ్చునని, దీనితోపాటు ఎన్నో శిల్ప శకలాలు బయటపడ్డాయని, ఇచ్చటనే 10 మీటర్ల పొడవున గోడ, మ్టి వలయాలతో కూడిన భావి, ఖనన మృణ్మయపాత్ర లభ్యమైనవని, ఇందులో రకరకాల పరిమాణాలతో పింగాణీ పొర సైతం ఊడిపోయిన ఎముకలు ఉండటం వలన ఈ ఖనన సామాగ్రి అత్యంత ప్రాచీనమైనదని నిశ్చయముగా చెప్పవచ్చునని, చారిత్రకయుగ ఆరంభానికి చెందిన మ్టి మూకుడులు కానవచ్చినవని, లభ్యమైన సామాగ్రి దృష్ట్యా ఈ పురం తూర్పు చాళుక్యుల కాలం నాికి పూర్వమే యున్నదని చెప్పవచ్చునని తెలియజేసెను.

భారతి (సాహిత్య మాస పత్రిక) ఏప్రియల్‌ 1987 సం||లో కె.యస్‌.కోదండ రామయ్యగారిచే వెలువడిన ''రాజరాజ ఆనతికి నన్నయ రంగమును సిద్ధము చేసిన వైనము''లో తన వంశమున ప్రసిద్ధులైన, విమల సద్గుణశోభితులైన పాండవోత్తముల చరిత్రను, తెలుగున వినవలయునను అభీష్టము రాజరాజునకు మక్కువగా నుండుటయేగాక తన ప్రజలు సైతము భారత కథను స్వయంగా చదువుకొనవలయునను ఆకాంక్ష కూడా ఆతనికుండెనని, తెనుగులో వ్రాసిన తన ప్రజలెల్లరు సంతోషింతురని, ప్రజల తృప్తి మరియు సంతోషము పాలకులకు మంచివరము వింవనియు, రాజరాజ నరేంద్రుడు బాల్యం నుండి తన రాజధాని నగరమైన రాజమహేంద్రపురమునందే యుండి నన్నయ పర్యవేక్షణ క్రిందనే విద్యాభ్యాసము గావించెనని రాజరాజు వేయించిన కలిదిండి తామ్ర శాసనము ద్వారా చెప్పబడినట్టుగా తెలియజేయబడెను.

సమాలోచన (జాతీయ సాంస్కృతిక పక్షపత్రిక) సంపుీలు 5, 8 సంచికలు 1, 2, 10 లలో జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారిచే వెలువబడిన ''రాజమండ్రినామ పద చర్చ''లో తొలుత రాజమహేంద్రపురంగా పిలువబడ్డ ఈ పట్టణం క్రమంగా రాజమహేంద్రవరముగా మారి ఆ తరువాత మహ్మదీయుల, ఆంగ్లేయుల పాలనలో భ్రష్ట రూపాలను సంతరించుకొని రాజమహేంద్రము, రాణ్మహేంద్రము, రాజమంద్రము, రాజమందిరము, రాజమండ్రిగా మారినదనీ, కొందరు ఇీవల రాజమహేంద్రి అని కూడా వ్యవహరించుచున్నట్లుగా చెప్పబడినది.

2. భౌగోళిక పరిస్థితులు - స్థానిక చరిత్ర

ఏదైన ఒక ప్రాంతం చరిత్ర-సంస్క ృతి ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి యుండును. ఆ ప్రాంత ప్రజల రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక జీవన పరిస్థితులను భౌగోళిక పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. బర్టన్‌ స్టెయిన్‌, జి.జె.బేకర్‌, డి.ఎ.వాష్‌బ్రూక్‌, డేవిడ్‌ లుడ్డెన్‌, మొర్టన్‌ జె బ్రెయిన్‌ మొదలైనవారు తమ తమ గ్రంథములలో భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ప్రజల జీవన గమనాన్ని ప్రభావితం చేస్తాయో చెప్పటం జరిగింది.

రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో అఖండ గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఉన్నది. ఇది 160-18|, 170-38| రేఖాంశములపై 810-7|, 820-40|, అక్షాంశముల పైననూ, పడమర గోదావరి, దక్షిణమున ధవళగిరి, వేమగిరి, తూర్పున రాజానగరం, ఉత్తరమున సీతానగరంల మధ్యన జాతీయ రహదారి నె.5పై చెన్నైకు 560 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 520 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 205 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హౌరా-చెన్నైరైల్వేలైను ఇందు గుండా వెళ్ళుచున్నది. ఇండియాలో అతిపెద్ద 2743 మీటర్ల పొడవుగల రైల్‌ కమ్‌ రోడ్డు బ్రిడ్జి ఇచ్చట కలదు. ఇచ్చట 1944 నుండి విమానాశ్రయం కూడా కలదు.

* శీతోష్ణస్థితి :

పరిసర ప్రాంతంలో కొండలు, అడవి, ఒకప్రక్కనది, కొంచెం దూరంలో సముద్రతీరం యుండుటవలన ఈ ప్రాంతం సమ శీతోష్ణస్థితిని కలిగియుండును. సగటున 1057.2 మి.మీటర్లు వర్షపాతము, వేసవిలో 390, శీతాకాలంలో 120 ఉష్ణోగ్రత కల్గివున్నది.

* ప్రకృతి :

ఈ ప్రాంతంలో గ్రాఫైటు, బంకమన్ను (క్లే), వుల్ఫమైటు, మెటల్‌ మొదలైన ఖనిజ సంపదలతో పాటుగా ఉత్తర దిక్కున అడవి ప్రాంతం హెచ్చుగా యుండుట వలన కలప, వెదురుతోపాటుగా తాిచెట్లు, పండ్లతోటలు మరియు ఆహార దాన్యాలు, వాణిజ్యపంటలు పండించుటకు అత్యంత అనుకూలమైన ప్రదేశమైనది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నాగరికతలు, సంస్క ృతులు నదీ తీరాల్లోనే ఉద్భవించినవి. ఎందువలనంటే ప్రతి జీవికి గాలి, నీరు, ఆహారం ముఖ్యం. ఏ ఒక్కి లేకపోయిననూ జీవనం ప్రశ్నార్ధకం. భూమిపై గాలి సర్వాంతర్యామి ఇక పోత నీరు అనేది భూగర్భంద్వారా, వర్షపాతం ద్వారా లభ్యమగుచుండును. భూగర్భ జలం అనేది అన్నిచోట్ల వచ్చే అవకాశంలేదు. ప్రాచీన ప్రజలకు భూగర్భజలం పై పెద్దగా అవగాహన ఉండి ఉండకపోవచ్చు. వర్షపాతం, మంచు ద్వారా నదులలో నీరు ప్రవహించి పల్లపు ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. ఇది బాహ్యంగా కనబడుతుంది. నీరు లభ్యమైతే పంటలు పండించుకొని ఆహారాన్ని ఏర్పాటు చేసుకొనవచ్చును. కాబ్టి పూర్వులు బాహ్యంగా లభ్యమయ్యే నీరు (నదులు) వెంటే పయనించిరి.

మానవుడికి నదీ జలాలకు అవినాభావ సంబందం ఉంది. నైలునది, యూఫ్రిటస్‌, టైగ్రిస్‌, సింధూ, గంగ, గోదావరి మొదలైన నదీ తీరాల్లోనే నాగరికతలు వెలసిల్లి మానవ మనోవికాసం జరిగింది. ప్రపంచంలోని అనేక నదులు వేల సంవత్సరాలనుండి నేి వరకు మానవుడి సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక, వికాసాభివృద్ధికి తోడ్పడుచున్నాయి.

భారతీయుల నాగరికతా సాంస్కృతుల వికాసానికి 'సింధూ' నది ప్రధాన పాత్రపోషించింది. అలాగే ఆంధ్రుల లేదా తెలుగు జాతి వెలుగులకు కృష్ణా, గోదావరి నదులే జీవగర్రలుగా వెలువడ్డాయి. ప్రకృతిలో మానవుడు ఒక భాగమైనప్పికిని తన యొక్క అసమానమైన మేదస్సుతో మొత్తం ప్రకృతినే అనేక రకాలుగా ప్రభావితం చేయగలుగుచున్నాడు. ప్రకృతిలోని మార్పులకు కొంతవరకు కారకుడిగా మారినాడు. ఇవి తనకు తనవారికి అనుకూలంగా ఉండేలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆదిమకాలం నుండి మానవుడికి సంస్కృతి ఉంది. ఆనాడు మానవుడి ఆదిపత్యం ప్రకృతి మీదలేదు కాని నేడు ప్రకృతినే అనుకూలంగా మలచుకుంటున్నాడు.

భారతదేశంలో ప్రవహించే జీవనదులలో గంగానది అతిపెద్దది అంతేగాక యమునతో సంగమించి మరింత పెద్దదిగా మారినది. భారతీయ నాగరికతా సాంస్కృతులకు ఆధ్యాత్మిక భావనకు ఈ నది ప్రతీక. ఈ నదీతీరంలోనే సువిశాల సామ్రాజ్యాలు ఏర్పడి అనేకమంది చక్రవర్తులు ఈ భూభాగ ప్రజలను పరిపాలించి ఎంతో అభివృద్ధినొందించారు. ఈ నదీతీరంలోనే భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలయిన ఋషికేష్‌, హరిద్వార్‌, ప్రయాగ, వారణాసిలు శతాబ్దాల తరబడిగా విలసిల్లుచున్నవి.

దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది తన సుజల ప్రవాహంతో ఆకులు అలములు తినే ఆదిమానవుడి దగ్గర నుండి ఆధునిక ఇరవై ఒకటవ శతాబ్ది నాగరికతా స్థాయి వరకు అపూర్వమైన సాంఘీక, ఆర్ధిక, రాజకీయ, సాంస్క ృతిక మార్పులను తీసుకువచ్చినది. కృష్ణా గోదావరి నదీతీరాల్లోని ప్రాచీనులు ఎవరు వారి నాగరికత, సంస్కృతులు ఏమి అనేవిషయంలో పండితులు అనేక రకాలయిన అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రాచీనాంద్ర భూభాగాలలో అనాగరిక, కిరాతక, ఆటవిక జాతులు నివసించారని వారిలో ఆంధ్రులు లేరని పేర్కొన్నారు. ఆంధ్ర నామాంకితమైన జాతి ఒకి ఉన్నట్లుగా 'ఐతరేయ బ్రాహ్మణం' పేర్కొన్నది. విశ్వామిత్రుడికి నూరుమంది పుత్రులని వారిలో యాభైమందిని శపించి కృష్ణా గోదావరి ప్రాంతాలలో జీవించమని పంపించాడని 'మత్స్యపురాణం' పేర్కొన్నది. ఆంధ్ర, పుండ్ర, శబరి, పులింద జాతులు వీరేనని చెప్పబడినది. విశ్వామిత్రుడు ఆర్యుడైనందున ఆయన సంతతిని ఆర్యసంతతికి చెందినవారని కొందరు పేర్కొంటున్నారు. అనార్యులే ఈ ఆదిమ తెగలవారని మరికొంతమంది పండితులు పేర్కొంటున్నారు.

కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతంలో అనాదిగా నాగజాతి ప్రజలు జీవించినట్లుగా బౌద్ధ వాంఙ్మయం తెలియజేయుచున్నది. ఈ జాతివారు సమానత్వాన్ని బోధించిన బౌద్ధమతాన్ని స్వీకరించారు. మౌర్య అశోకుని కన్నా ముందే ఆంధ్రదేశంలో వీరు బౌద్ధాన్ని స్వీకరించారని, బౌద్ధవాస్తును నిర్మించారని తెలియుచున్నది. గోదావరీ నదీ పరీవాహక ప్రాంతంలో మానవులు నివసించ శక్యంకాని 'దండకారణ్యం' ఉండేదని అది అంధకారబందురమైన ప్రాంతం కనుక 'అంధ' దేశమని దానిలో నివసించిన జాతులు అంధులు తర్వాత ఆంధ్రులు అయ్యారని 'ఆంధ్రాక్షర తత్వం'లో తెలుపబడినది.

బ్రహ్మాండ పురాణం కృష్ణా గోదావరి పరీవాహక ప్రదేశాన్ని 'త్రిలింగ దేశసీమా' అని పేర్కొన్నది. ఆంధ్ర దేశానికి ఆరంభం నుండి నేికి పిలువబడుచున్న పేరు 'తెలుగు' ఈ పేరు ప్రథమంలో త్రికలింగంగా ఉండేదని క్రమంగా 'త్రిలింగం'గా మారిందని పండితుల అభిప్రాయం. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం త్రిలింగాలు. శ్రీశైలం కృష్ణానదీతీరంలోనూ, కాళేశ్వరం, ద్రాక్షారామం గోదావరీ తీరంలోనూ సుప్రసిద్ధ దేవాలయాలు ఈ మూడు ప్రాంతాల విస్తీర్ణమే త్రిలింగ దేశం.

నన్నయ్య భ్టారకుడు ''ఆంధ్ర మహాభారతం''లో తెనుగు అనే మాటను ప్రయోగించెను. అది క్రమేణా తెలుగు అయింది. తెలంగిరి, తెలంగాణ్యులు అనేపేర్లు ప్రాచీన కాలానికి చెందినవని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం.

క్రీ.శ.1-2 శతాబ్దాల కాలంలో కృష్ణా గోదావరి నదుల ముఖద్వారం నుండి పెద్ద పెద్ద పడవలు ప్రయాణించేవని, ప్రయాణికులకు సరుకుల రవాణాకు అనేకరకాలైన పడవలుండేవని ఆంధ్ర దేశం నుండి విదేశీ వర్తక వాణిజ్యాలు కొనసాగుచున్నట్లుగా 'ోలమీ'అను చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ ఆంధ్రదేశంలో గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఏర్పడిన నగరమే రాజమండ్రి. మెగస్తనీస్‌ పేర్కొన్న ఆంధ్రదేశ పట్టణాలలో రాజమండ్రి ఒకి ఉందని తెలుయుచున్నది.

గోదావరి నదికి రాజమండ్రికి అవినాభావ సంబంధం వుంది. గోదావరి నది వలన ఎన్నో ఏండ్లుగా ఈ నగరం అభివృద్ధి చెందటమేకాక అనేక సందర్భాలలో తనలో కలుపుకొని స్వరూప స్వభావాలనే మార్చివేసింది. ఆ చరిత్ర కాలాతీతమైనది. అయినా ఈ పురప్రజలకు గోదావరిమాతన్నా ఆమె పుష్కరాలన్నా ఎంతో ఇష్టం.