ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GREAT HISTORIC PLACE MAHABHALIPURAM - 70km TO CHENNAI - MUST VISIT PLACE


తమిళనాడులోని సాగరతీరం వెంబడి వెలసిన కళాసంపదల ప్రదేశం మహాబలిపురం. చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో, కంచి పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. యునెస్కో వారి ప్రాచీన సంస్కృతి గల ప్రదేశాల్లో ఒకటిగా పరిరక్షింపబడుతోంది.
సాగరతీరంతో పాటు అద్భుతమైన కళాఖండాలకు నిలయమైన ఈ ప్రదేశానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఏడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన పల్లవ రాజుల రాజ్యంలోని ఓ ప్రముఖ తీర నగరం బహాబలిపురం. అప్పటి పల్లవ రాజ్యాన్ని పాలించిన మామ్మల్లరాజు పేరుతో ఈ నగరం కట్టినట్లు చరిత్ర చెబుతోంది.
పల్లవులు తమ పాలనలో ఈ ప్రాంతానికి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారికాలంలో ఈ నగరం రేవు పట్టణంగా ఉండేది. వారే ఇక్కడి కొండల మీద లైట్‌ హౌస్‌ను నిర్మించారు.
పర్యాటకులను ఆకర్షించే కళాఖండాలు
ఆనాటి పల్లవుల వైభవానికి సాక్ష్యంగా ఉన్న మహాబలిపురంలో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సముద్రతీరం వెంబడి వెలసిన ఈ ప్రదేశంలోని గోపురాలు, మండపాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ నిర్మాణాలన్నీ ఆనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పే సాక్షులు.
వీటితో పాటు ఈ ప్రాంతంలో పాండవ రథాలు పేరుతో ఉన్న ఏకశిలా నిర్మాణాలు, వారు నివశించినవని చెప్పబడే గదులు సైతం పర్యాటకులను కదలనివ్వకుండా కట్టిపడేసేవే. ఈ ప్రాంతంలోని అందమైన గార్డెన్‌ ఆహ్లాదపరుస్తూ చూపరులను కదలనివ్వదు. దూరంగా కనబడే సముద్రం... దానికి ముందు అద్భుతమైన శిల్పసంపద ఈ మహాబలిపురం ప్రత్యేకం. ఇలా కనిపించే ప్రకృతి మరెక్కడా చూడలేం. వీటితోపాటు సముద్రం ఒడ్డున ఉన్న సీ షోర్‌ దేవాలయం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఈ ప్రదేశాలన్నీ ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి. ఒక రోజు కేటాయించగలిగితే ఈ ప్రదేశాలను అణువణువుగా వీక్షించవచ్చు. ఈ నిర్మాణాలతోపాటు మహాబలిపురం బీచ్‌ చక్కని కాలక్షేపం. సాయంత్రం వేళ పర్యాటకులతో కళకళలాడుతుంది. గవ్వలతో చేసిన వస్తువులతో పాటు సముద్ర చేపలతో చేసిన రకరకాల వంటకాలు పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తట్టిలేపుతాయి.
సులభంగా చేరుకోవచ్చు
మహాబలిపురం చేరుకోవడం చాలా సులభం. చెన్నై నుండి మహాబలిపురానికి అన్ని వేళలా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దాదాపు రెండుగంటల ప్రయాణం.
మహాబలిపురం టూరిజం ప్రాంతమైనా ఇక్కడ ఉన్న వసతి సౌకర్యాలు కాస్త తక్కువే. హోటళ్లు, స్టాళ్లు అందుబాటులో ఉన్నా వసతి సౌకర్యాలు మాత్రం తక్కువ. అందుకే ఈ ప్రాంతంలో బస చేయడానికి పర్యాటకులు అంతగా ఆసక్తి చూపరు. 

VARIETY BIRYANI WITH VERMI


సేమ్యా చికెన్‌ బిర్యానీ


కావలసిన పదార్థాలు
సేమ్యా - అర కిలో
చికెన్‌ - పావు కిలో
నూనె 2 టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూన్‌
ఉప్పు - తగినంత
కారం - టీ స్పూన్‌
పసుపు - అర టీ స్పూన్‌
గరం మసాలా - అర టీ స్పూన్‌
పుదీనా తరుగు - 1 స్పూన్‌
కొత్తిమీద తరుగు - 1 స్పూన్‌
సాజీరా - 1స్పూన్‌
దాల్చిన చెక్క - చిన్న ముక్క
కుంకుమ పువ్వు - చిటికెడు

తయారీ విధానం
కుక్కర్‌లో రెండు టీ స్పూన్లు నూనె, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, మటన్‌ వేసి ఉడికించాలి. సేమ్యాను విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో నూనె వేడిచేసి సాజీరా, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా వేయించాలి.అందులోనే ఉడికించిన చికెన్‌ కలపాలి. కుక్కర్‌లో ఒక పొర ఉడికించిన చికెన్‌, మరో పొర ఉడికించిన సేమ్యా, మళ్లీ ఉడికించిన చికెన్‌, దానిపైన సేమ్యా ఇలా సర్దాలి. అరకప్పు పాలలో కుంకుమ పువ్వు కలిపి ఈ పాలను పైన తయారు చేసుకున్న మిశ్రమం మీద మీద చిలకరించి మూత పెట్టాలి. దీన్ని ఉడికించితే సేమ్యా చికెన్‌ పులావ్‌ రెడీ. 

TIFFEN / BREAKFAST VADA


సేమ్యా బఠానీ వడలు



కావలసిన పదార్థాలు
సేమ్యా - 100 గ్రాములు, బఠాణీలు - పావుకిలో, అల్లం ముక్కలు - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 1 స్పూన్‌, వంట సోడా - చిటికెడు, పచ్చిమిర్చి - 12, కరివేపాకు - 4 రెమ్మలు, కొత్తిమీర తరుగు - కొద్దిగా, పసుపు - చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు, పుదీనా - కొద్దిగా, నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం
సేమ్యా, బఠాణీలు విడివిడిగా ఉడికించాలి. చల్లారాక నీళ్లు వొంపేయాలి. బఠాణీలను చేత్తో మెత్తగా మెదిపి ఉడికించిన సేమ్యా, నూనె తప్ప మిగిలిన అన్ని పదార్థాలు అందులో కలపాలి. పిండి గట్టిగా ఉంటే సేమ్యా ఉడికించిన నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అరగంట నానబెట్టి సేమ్యా కలపాలి. దీన్ని వడల్లా చేసుకుని నూనెలో వేయించుకోవాలి. వీటిని పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. 

TOMORROW BREAKFAST VERMI IDLI


సేమ్యా ఇడ్లీ


కావలసిన పదార్థాలు.
సేమ్యా - 2 కప్పులు, పెరుగు - 2 కప్పులు, నూనె - 3 స్పూన్లు
ఇంగువ - చిటికెడు, అల్లం - కొద్దిగా, పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, బఠాణీలు - అరకప్పు
ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
అర స్పూన్‌ నూనెలో సేమ్యా దోరగా వేయించాలి. అందులో పెరుగు కలిపి నాననివ్వాలి. బాండీలో రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి వేయించాలి. అందులోనే కరివేపాకు, అల్లం ముద్ద, ఉల్లిపాయ ముక్కలు కలిపి మగ్గబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో నానబెట్టిన సేమ్యాలో కలిపి నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లలో వేయాలి. వీటిని ఆవిరి మీద ఉడికిస్తే వేడి వేడి సేమ్యా ఇడ్లీ రెడీ.

SPECIAL VERMI HOT HOT PULIHORA FESTIVAL SPECIAL

సేమ్యా పులిహోర



కావలసిన పదార్థాలు
సేమ్యా - 2 కప్పులు, నిమ్మకాయలు - 2
ఆవాలు - 1 స్పూను
పచ్చి సెనగపప్పు - 1 స్పూను
ఛాయ మినపప్పు - 1 స్పూను
వేరుసెనగలు - 1 స్పూను
ఆవపిండి - 1 స్పూను
అల్లంవెల్లుల్లి ముద్ద - 1 స్పూను
కరివేపాకు - 2 రెబ్బలు
ఎండుమిర్చి - 1, నూనె - తగినంత
ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 3
ఎండుమిరపకాయల పొడి - 2 స్పూన్లు
తయారీ విధానం
ముందుగా సేమ్యా ఉడికించుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో నీటిని మరిగించాలి. ఆ నీళ్లలోనే పసుపు, ఉప్పు, ఒక స్పూను నూనె వేయాలి. నీళ్లు తెర్లుతున్నప్పుడు సేమ్యా వేసుకోవాలి. సేమ్యా ఉడికిన వెంటనే చిల్లుల గిన్నెలోకి వేసి నీటిని ఓడ్చుకోవాలి. వేడిగా వున్న సేమ్యాలోనే అల్లంవెల్లుల్లి ముద్ద, ఆవపొడి వేసి కలపాలి. సేమ్యా చల్లారాక నిమ్మరసం కలుపుకోవాలి. చిన్న బాండీలో నూనెవేసి కాగిన తరువాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చి సెనగపప్పు, ఛాయమినపప్పు, వేరుసెనగలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత పచ్చిమిర్చి, పసుపు వేసుకోవాలి. తరువాత ఎండుమిర్చి పొడి వేసి వెంటనే పొయ్యి కట్టేయాలి. దాన్ని సేమ్యాలో కలుపుకోవాలి. అంతే! సేమ్యా పులిహోర రెడీ! నిమ్మకాయ బదులు చింతపండు గుజ్జు లేక మామిడికాయ తురుమును కూడా వాడొచ్చు.