loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MODELS IN LATEST BLOUSE - FASHION SAREE WEAR
TELUGU TALES OF AKBAR - BIRBAL CHILDREN STORIES - COMMON/TIME SENSE IS THE BEST WEAPON IN THE WORLD సమయస్ఫూర్తే అసలైన ఆయుధం
అక్బర్‌ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్థుడై, ''అహా! భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా?'' అన్నాడు. ''అవును, ప్రభూ! మీరన్నది అక్షర సత్యం'', అన్నారు వెనక నడుస్తూన్న ప్రముఖులు, ఒక్క బీర్బల్‌ తప్ప . అక్బర్‌ బీర్బల్‌ కేసి తిరిగి చూశాడు. అతడు దేన్నో అదేపనిగా వెతుకుతూ కనిపించాడు. ''బీర్బల్‌, భూత లస్వర్గం అంటూఉంటే అది ఇదేనని నేను అన్నాను. దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి,'' అన్నాడు అక్బర్‌. ''ఉద్యానవనం చాలా అందంగా ఉన్నది. అందులో సందేహం లేదు. అయినా,'' అంటూ ఆగాడు బీర్బల్‌. ''అంటే నువ్‌ నా అభిప్రాయంతో ఏకీభ వించడం లేదన్నమాట! అయినా, ఏమిటి అయినా...'' అన్నాడు అక్బర్‌ తీవ్రస్వరంతో. ''అందం ఉన్నచోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా'', అన్నాడు బీర్బల్‌. ''ప్రమాదమా! గులాబీ చెట్లకున్న ముళ్ళ గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. ''ముళ్ళు గులాబీ పూలకు సహజ కవచాలు. నేను వాటిని గురించి చెప్పడం లేదు'', అన్నాడు బీర్బల్‌. మరి గడ్డిలో దాగి వుండే పాముల గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. '' మనుషుల అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి. ప్రాణరక్షణకు మాత్రమే కాటేస్తాయి,'' అన్నాడు బీర్బల్‌. '' మరి ప్రమాదం దేనివల్లో కాస్త స్పష్టంగా చెప్పు'' అన్నాడు అక్బర్‌. ''శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. సమయం చూసి దెబ్బతీయడానికి కాచుకుని ఉంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు రాజులు భయం కారణంగానే, అసూయ వల్లనో ఎలాగైనా పడగొ ట్టాలని చూస్తుంటారు. అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరం అప్రమత్తులై ఉండడం చాలా అవసరం'' అన్నాడు బీర్బల్‌.
ఆ మాటతో అక్బర్‌ ఆలోచనలో పడ్డాడు. మౌనంగా వెనుదిరిగాడు. మరునాడు నిండు సభలో అక్బర్‌, ''హఠాత్తుగా ఆపద ముంచుకు వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది?'' అని సభాసదుల నుద్దేశించి అడిగాడు. ''పదునైన ఖడ్గం,'' అన్నాడు ఒక సభికుడు. 'కత్తిపట్టిన వాడు ఖడ్గవీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది', అన్నాడు బీర్బల్‌. దూరం నుంచే శత్రువుల మీదికి ప్రయోగించ వచ్చుగనక, ఈటె ఉత్తమమైన ఆయుధం?'' అన్నాడు ఇంకొక ముఖ్యుడు. ''ఈటె తన మీదికి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా?'' అన్నాడు బీర్బల్‌ ''ఫిరంగి''! అన్నాడు మరొక సభికుడు. '' దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగని వెతుక్కోవడం సులభం కాదు కదా?'' అన్నాడు అక్బర్‌. ''ఖడ్గమూ కాదు. ఈటే కాదు,. ఫిరంగీ కాదు. మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏదీ బీర్బల్‌?'' అని అడిగాడు అక్బర్‌. ''పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం!'' అన్నాడు బీర్బల్‌. ''ఫలానా ఆయుధం అని చెప్పలేవు, అంతే కదా?'' అన్నాడు బీర్బల్‌ కాస్త కటువుగా, ''సమయ స్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా సరే ఉత్తమ ఆయుధం అందుబాటులో ఉంటుంది ప్రభూ'' అన్నాడు బీర్బల్‌ నెమ్మదిగా. ''అసంబద్ధ!'' అన్నాడు అక్బర్‌ ఆగ్రహంతో. సభికులు లోలోపల నవ్వుకున్నారు. ''సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభూ!'' అన్నాడు బీర్బల్‌ వినయంగా. మరునాడు ఉదయం అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌తో సహా కొందరు ప్రముఖులతో కలిసి వాహ్యాళికి బయలుదేరాడు. వాళ్ళు నదీ తీరాన్ని సమీపిస్తూండగా హాహాకారాలు చేస్తూ, కొందరు అటుకేసి రావడం కనిపించింది. వాళ్ళు చక్రవర్తిని చూసినా ఆగకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు. ఆఖరికి ఒకణ్ణి ఆపి కారణం అడిగితే, ''రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకుని నానా బీభత్సం సృష్టిస్తున్నది. అది ఇటువైపే వస్తున్నది. పారిపొండి''! అంటూ వాడు వెళ్లిపోయాడు. వాడు అటు వెళ్ళగానే ఏనుగు గంటలనాదం, ఘీంకారం వినిపించాయి. అక్బర్‌ చేయి, మొలలో వేలాడుతూన్న కత్తిపిండి మీదికి వెళ్ళింది. తక్కినవారు కూడా కత్తులు దూయడానికి ఆయత్తమయ్యారు. అయినా, మదుపుటేనుగును కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు. అక్కడి నుంచి పారిపోవడం ఒక్కటే తరుణోపాయం. అయినా చక్రవర్తిని వదిలి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు.
చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు. అందరూ బిక్కమొహాలతో బీర్బల్‌ కేసి చూశారు. అయితే, బీర్బల్‌ ఏనుగు వస్తూన్న దిక్కు కేసి కూడా చూడడం లేదు. అతడి చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకుని పడుకున్న ఒక పిల్లి మీద పడ్డాయి. బీర్బల్‌ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవడానికి పిల్లి ప్రయత్నించింది. అయినా, అంతలో ఏనుగు సమీపించడంతో, పిల్లిని ఏనుగు వీపుమీద పడేలా గురి చేసి విసిరాడు. పిల్లి తల్లకిందులుగా ఎగురుతూ వెళ్ళి ఏనుగువీపుపై నాలుగు కాళ్ళ మీద దభీమని నిలబడింది. భయంతో ఏనుగు వీపును గోళ్ళతో గిచ్చసాగింది.
ఏనుగు అక్కడే నిలబడి, కోపంతో పిల్లిని పట్టుకోవడానికి తొండం సాచింది. దానిని గమనించిన పిల్లి వెంటనే కిందకి దూకి పారిపోసాగింది. ఏనుగు దాని వెంటబడి తరుముకుంటూ పరిగెత్తింది. అయినా పిల్లి దానికి చిక్కకుండా, దాపులవున్న పొదలలోకి వెళ్ళిపోయింది. గండం తప్పినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ''బీర్బల్‌, నీ సమయస్ఫూర్తికి జోహార్లు! మదుపుటేనుగును తరమడానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం! ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని బట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్నాడు అక్బర్‌ చక్రవర్తి మందహాసంతో.

SUPER SIX FACTS AND FIGURES OF SWEET CORN - GOOD HEALTH WITH SWEET CORN - EAT CORN DAILY REDUCE YOUR WEIGHT, INCREASE UR EFFICIENCY OF DIGESTIVE SYSTEM, SKIN CARE ETC
మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యా నికి ఎంతోమేలు చేస్తుంది. దీనిని సాధార ణంగా జొన్నలని కూడా అంటారు. ఈ మొక్కజొన్న గింజలను వివిధ రకాలుగా వండుతారు. కండెలుగా వున్నప్పుడే వాటిని తీపివిగా తినేయ వచ్చు. లేదా వాటికి మసాలాలు, కారాలు కూడా తగిలించి తింటారు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు. లేదా ఉల్లిపాయ, పచ్చి మిర్చీ వంటి వాటితో కూడా చేర్చి సాయంకాలం వేళ మంచి చిరుతిండిగా తినేయవచ్చు. మొక్కజొన్న కండెలను సాధారణంగా మనం నిప్పులపై వేడిచేసి బాగా కాలిన తర్వాత తింటాం. లేదా కాల్చిన మొక్కజొన్న కండెలకు వివిధ కారాలు, ఉప్పులు రాసికూడా తినేస్తాం. మొక్కజొన్న తినటం రుచే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మొక్కజొన్న కండెలలోని ఆరోగ్య ప్రయోజనాలు:

1.జీర్ణక్రియను పెంపొందిస్తుంది. మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ అరికడుతుంది.

2.మొక్కజొన్నలో కావలసినన్ని లవణాలు లేదా మినరల్స్‌ వుంటాయి. పసుపురంగులో వుండే ఈ చిన్న గింజలలో మినరల్స్‌ అధికం. మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ వంటివి కూడా వీటిలో వుండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. మీ ఎముకల విరుగుట అరికట్టటమేకాక, మీరు పెద్దవారయ్యే కొద్ది కిడ్నీలను కూడా ఆరోగ్యంగా వుంచుతాయి.

3.చర్మ సంరక్షణ-మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా వుంచి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మొక్కజొన్న గింజలు తినటమే కాక, ఈ విత్తనాల నూనె కనుక చర్మానికి రాస్తే, దీనిలో వుండే లినోలె యాసిడ్‌ చర్మమంటలను, లేదా ర్యాష్‌లను కూడా తగ్గిస్తుంది.

4. రక్తహీనతను అరికడతాయి. రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన్‌ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది. మరి మీరు తినే స్వీట్‌ మొక్కజొన్న విటమిన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి మీలో రక్తహీనత లేకుండా చేస్తుంది.

5.కొల్లెస్టరాల్‌ నివారణ చేస్తాయి. శరీరంలో లివర్‌ కొలెస్టరాల్‌ను తయారు చేస్తుంది. రెండు రకాల కొలెస్టరాల్‌ తయారవుతుంది. అవి హెడ్‌డిఎల్‌ మరియు చెడు కొలెస్టరాల్‌ అయిన ఎల్‌డిఎల్‌. నేటి రోజులలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్టరాల్‌ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్‌ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.

6.గర్భవతులకు ఈ ఆహారం ప్రధానం-గర్భవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి ఉండాలి. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.

కనుక మీ ఆహారంలో తగినంత మొక్కజొన్న ఆహారం చేర్చి తినండి. దానివలన వచ్చే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. వివిధ రోగాలను తగ్గించుకోండి. ఆరోగ్యంగా ఉండండి. 

TELUGU ARTICLE ON BLOOD - BRIEF FACTS IN TELUGU''నాకే రక్తం లేదు. నేనెలా రక్తమిస్తాను ?'' అని రక్తదాన మంటే భయపడే వాళ్ళు చెప్పే మొదటి మాట. రక్తం గురించి కొంత అవగాహన ఉంటే ఆమాట రాదు. ప్రతి జీవికి రక్తం ఉం టుంది. అయితే వెన్నెముకగల జంతువులలో రక్తం ఎరుపు రంగులోను, వెన్నెముకలేని ప్రాణులలో మూడు రంగులలో వుంటుంది. తేలు. జెర్రి'బొద్దింక' మగ దోమలలో తెలుపు రంగు, నత్త పీత కొన్ని రకాల కీటకాలు, సముద్ర జలచరాల్లో నీలం రంగులోను,పేను, నల్లి, జలగ,ఆడ దోమలలో నలుపు రంగులోను ఉంటుంది. సాధారణంగా మనుషులలో 4 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. పురుషులలో ఒక కిలో బరువుకు 76 మి.లీ.లు స్త్రీలలో ఒక కిలో బరువుకు 66 మి.లీ. రక్తం ఉంటుంది. ఎవరికైనా అవసరానికి మించి ఒక లీటరు రక్తం స్పేర్‌గా ఉంటుంది. ప్రమాదాలలో ఒక లీటరు రక్తం పోయినా మానసికంగాధైైర్యంగా ఉంటే ప్రాణాపాయం ఉండదు. ఒకలీటరు కన్నా ఎక్కువ రక్త స్రావం జరిగితే24 గంటలలోగా రక్తం ఎక్కిస్తే ప్రాణగండం తప్పినట్లే. రక్తదాన ప్రక్రియలో కేవలం 350 మి.లీ. (స్పేర్‌గా ఉండే 1,000 మి.లీ. రక్తంలో మూడవ వంతు మాత్రమే) రక్తాన్ని తీసుకుంటారు. ఒకే సారి 700 మి.లీ. రక్తం ఇచ్చిన దాతలు ఎందరో ఉన్నారు. అందుకు కారణం వాళ్ళల్లో నున్న మనోబలమే.అమెరికాలో స్థిరపడిన కర్నూలు జిల్లాకు చెందిన డా|| సుశీలా రెడ్డి 210 సార్లు, మద్రాసు (రాయపురం) వాస్తవ్యులు రాజశేఖర్‌ 162 సార్లు కడపజిల్లా ప్రొద్దుటూరు నివాసి వర్రా గురివి రెడ్డి 127 సార్లు రక్తదానం చేసినా రంటే కారణం వాళ్ళల్లో వున్న మనోబలమే. రక్తం గురించి ఇతిహాసాలలోను, చరిత్రలోను, కావ్యాలలోను ప్రస్తావించటం జరిగినది. 

భీముడు దుశ్శాసనుని చంపి రక్తం తాగుతానని శపథంచేసి నెరవేర్చుకున్నాడని మహాభారతంలో ఉన్నది. పూర్వం రోమన్లు బలం కొరకు మనుషుల రక్తం త్రాగేవారట. ఈజిప్టు దేశాలలో రాణులు అందం పెరుగుతుందనే నమ్మకంతో బానిసల రక్తం కలిపిన నీళ్ళతో స్నానం చేసేవారట.యూరపు దేశాలలో సత్ప్రవర్తన కలిగిన వారి నుండి రక్తాన్ని తీసి ఖైదీలకు ఎక్కించేవారట. ప్రవర్తనలో మార్పువస్తుందనే నమ్మకంతో. షేక్‌ స్పియర్‌ తన మర్చంట్‌ ఆఫ్‌ వెనీస్‌ కావ్యంలో పతాక సన్నివేశానికి మలుపు తెచ్చేది రక్తపు చుక్కలే. రక్తం త్రాగే డ్రాకులా కథలు కోకొల్లలుగా సృష్టించబడినాయి. రక్త సంబంధపు వ్యాధులకు జలగల ద్వారా రక్తాన్ని తీయడం చికిత్సా విధానాలలో ప్రధానంగా ఉండేది. యుద్ధభూమికి వెళ్ళే వీరులకు రక్తతిలకాలు దిద్దేవారు.

 కొన్ని ఆదివాసి తెగల వధూవరుల అరచేతులకు గాట్లు పెట్టి కరచాలనంతో పెళ్ళి తంతు జరిపేవారు. అతిగా అభిమానించేవా, ప్రేమించేవారు రక్తాక్షరాలతో ఉత్తరాలు వ్రాయడం తరచుగా జరుగుతూ ఉంటాయి. ఆది మానవుడి నుండి నేటి వరకు ప్రతి మనిషి రక్తాన్ని రుచి చూడడం జరిగి ఉంటుంది. చేతి వేలికి చిన్న గాయమై రక్తం కనబడితే వెంటనే నోట్లో పెట్టుకోవడం అసంకల్పిత ప్రతీకారచర్యగా జరుగుతుంది. రక్తం కూడా సందర్భానుచితంగా ఎన్నెన్నో అవతారాలు ఎత్తుతుంది. నేర పరిశోధనలో అంతు చిక్కని ఎన్నెన్నో రహస్యాలను ఛేదించి దోషులకు శిక్షపడేటట్లు చేస్తుంది. కొన్ని రక్తపరీక్షల వలన అంటే ఇక్కడ పత్తేదారు అవతారం. అంతు చిక్కని కొన్ని వ్యాధులను రక్తపరీక్షల ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ వైద్యావతారం .తల్లి వాస్తవం- తండ్రి నమ్మకం'' అని నానుడి అందరికి తెలిసినదే. 

కాని కొన్ని విచిత్ర సంఘటనలలో తల్లికూడా అపనమ్మకమని సందేహించినపుడే డి.ఎన్‌.ఎ పరీక్షల్లో రక్తం వాస్తవాన్ని వెల్లడిస్తుంది. ఇక్కడ జడ్జీ (న్యాయాధిపతి) గా అవతారం. యుక్త వయసు నుండి మోనోపాజ్‌ వరకు స్త్రీ గర్భసంచిలో సంతాన ప్రక్రియ కొరకు ఓవమ్‌ ఏర్పడటం సహజం. గర్భధారణ జరగకపోతే ఆ ప్రాణం ఉన్న ఓవమ్స్‌ చనిపోవడం కూడా అంతే సహజం. ఆ చనిపోయిన ఓవం అలానే గర్భసంచిలోనే ఉంటే ప్రమాదం కావున సుమారు 100మి.లీ. రక్తం ఆ గర్భసంచిని శుభ్రపరుస్తుంది. ఇక్కడ రక్తం సానిటరీ ఇన్‌స్పెక్టరుగా అవతారం. తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పటి నుండి ప్రసవించేంత వరకు తల్లి ఆ బిడ్డకు ఆహారంగా (టవ్‌బర) మూడు లీటర్ల రక్తాన్ని అందిస్తుంది. ఇక్కడ పంచభక్ష పరమాన్నావతారం. సుఖ ప్రసవంలో రక్తమే ప్రధాన పాత్ర వహిస్తుంది. సుమారుగా 700మి.లీ. రక్తం బిడ్డను బయటకు తీసుకొని వస్తుంది. రక్తం తక్కువవున్న గర్భిణీలకు రక్తం ఎక్కిస్తే గాని సుఖ ప్రసవం జరగదు. కావున ఇక్కడ రక్తం గైనకాలజిస్టుగా అవతారం. ఇలా ఎన్నెన్నో అవతారాలెత్తే రక్తంలోని భాగాలను గురించి కూడా కాస్తంత తెలుసుకుందాం. రక్తం చూచేందుకు నీరులాగా ద్రవరూపంలో ఉన్నా నీటి కన్నా ఆరు రెట్లు చిక్కగా ఉంటుంది.

 రక్తంలో ప్రధానంగా నాలుగు భాగాలుంటాయి. 

1.ప్లాస్మా, 2. ఎర్ర రక్త కణాలు (తీbష ) 3. తెల్ల రక్త కణాలు (షbష) 4. రక్తఫలికికలు (జూశ్రీa్‌వశ్రీవ్‌ర) 

భూగోళంలో నీరు మూడువంతులున్నట్లుగానే రక్తంలో కూడా 55శాతం ప్లాస్మా (ద్రవరూపం) ఉంటుంది. అందులో కూడా 92 శాతం నీరు, 8శాతం ఉప్పు మరి కొన్ని పోషక పదార్థాలు వుంటాయి. ''నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు'' అను నానుడి అందరికి తెలిసినదే. రక్తం కూడా ద్రవరూపమే అయినా ఆ నానుడి రక్తానికి వర్తించదు. అయితే రెండు సందర్భాలలో తప్ప. గుండె ఒక మోటారు పంపులాగా నిత్యం పంపు చేస్తుంటుంది. కిందికి పైకి ప్రవహిస్తూనే వుంటుంది.గంటలో 36వేల లీటర్ల రక్తాన్ని 20వేల కిలోమీటర్ల దూరం ప్రవహింపజేస్తుంది.


ఒక రక్తపు చుక్కలో తీbష 25కోట్లు షbష 4లక్షలు. ప్లేట్‌ లెట్సు1 కోటి 50 లక్షలుంటాయి. ఈ మూడింటిలో ఎక్కువశాతం ఎర్రరక్తకణాలే కావున రక్తం ఎరుపు రంగులో వుంటుంది. బండికి పెట్రోలు ఎంత అవసమో మనిషికి తీbష అలా పనిచేస్తుంది. దేశానికి సైన్యం ఎంత అవసరమో మనిషికి షbష అలా పనిచేస్తుంది. గాయం ఏర్పడితే అధిక రక్తస్రావం జరగకుండా గడ్డకట్టుకునేందుకు సాయపడేవి ప్లేట్‌లెట్స్‌. 

SAY GOOD BYE TO PIMPLES WITH HOME MADE ITEMS IN YOUR KITCHEN - TIPS FOR REMOVAL OF PIMPLES IN UR HOUSE ONLY


సాధారణంగా చాలా మంది ముఖంలో మొటిమలతో ఇబ్బంది పడుతుంటారు. మొటిమలు అన్ని వయస్సులవారు ఎదుర్కొంటున్న సాధారణ చర్మ సమస్య. ముఖ్యంగా టీనేజర్స్‌ లోనూ పెద్దవాళ్ళలో ఎక్కువగా కనబడే చర్మ సమస్య. ఈ మొటిమలు సాధారణంగా వాతావరణ కాలుష్యం వల్ల చర్మం మీద దుమ్ము, ధూళి చేరడం వల్ల, జిడ్డు చర్మం, బ్లాక్‌ హెడ్స్‌ మరియు వైట్‌ హెడ్స్‌ వల్ల కూడా మొటిమలు రావడానికి కారణం అవుతుంది. ముఖం మీద కానీ, లేదా శరీరంలో ఏ ఇతర భాగాల్లో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడటానికి వివిధ కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు సెబాసియస్‌ గ్లాండ్స్‌ (నూనె గ్రంథులు ) ఎక్కువగా ఉండడం చేత కూడా ముఖం మీద మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతాయి. ఇంకా హార్మోనుల అసమతుల్యత మరియు అనారోగ్యక రమైన ఆహారం, దుమ్ము మరియు సూర్యరశ్మి వంటి ఇతర సాధారణ కారణాలు కూడా మొటిమలు ఏర్పడటానికి కారణం కావచ్చు.

మొటిమల నివారణకు చాలా చికిత్స పద్ధతులున్నాయి. అయితే మొటిమలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. చాలా వరకూ మొటిమల నివారణలో చికిత్స పద్ధతుల్లో రసాయనాలు అధికంగా వాడడం వల్ల ఒక సమస్యకు మరో సమస్యతోడవుతుంది. కాబట్టి రసాయన క్రీములు వాడటం కంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవి ఖచ్చితంగా మీ వంటగదిలోనే సులభంగా దొరికేటటువంటి వస్తువులతోనే మొటిమలు నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆలివ్‌ ఆయిల్‌, లవంగాలు లేదా తేనె వంటివి ప్రతి ఇంట్లోను నిల్వ ఉంటాయి. కాబట్టి మీరు సహజ పద్ధతుల ద్వారా మొటిమలు నివారించు కోవాలంటే ఇటువంటి కొన్ని వంటింటి వస్తువుల ను ఉపయోగించండి. మొటిమల నివారణలో ఉపయోగపడే కొన్ని వంటగది వస్తువులు....

నిమ్మరసం: మొటిమల నివారణకు సిట్రస్‌ పండ్లు బాగా సహాయపడుతాయి. నిమ్మరసాన్ని కానీ లేదా తాజా నిమ్మ చెక్కతో కానీ మొటిమలున్న ప్రదేశంలో మసాజ్‌ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని స్తుంది. అంతే కాదు మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే ఫేస్‌ ప్యాక్స్‌లో నిమ్మరసాన్ని కూడా కలిపి ఉపయోగించుకోవచ్చు.

తేనె: చర్మ సంరక్షణలో మనం తరచూ తేనెను ఉపయోగిస్తుంటాం. చర్మం నునువుగా, సున్నితంగా, టైట్‌గా మారడానికి మాయిశ్చరైజింగ్‌గా ఉపయో గిస్తుంటాం. తేనెలో యాంటీయాక్సిడెంట్స్‌ కలిగి ఉండటంవల్ల చర్మాన్ని శుభ్రం చేసి మొటిమలను నివారిస్తుంది.

ఓట్‌ మీల్‌: ఓట్‌ మీల్‌ చర్మం పెలుసుబారకుండా చేస్తుంది. డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ను తొలగిస్తుంది. ముఖ్యం గా మొటిమలతో వచ్చిన మచ్చలను తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసే ముందు ఓట్‌ మీల్‌ను పాలతో కలిపి పేస్ట్‌ లా చేసి ముఖానికి పట్టించాలి.

బేకింగ్‌ సోడా: ఇది నేచురల్‌ క్లీనర్‌గా పనిచేస్తుంది. బేకింగÊ సోడాతో మొటిమల మీద మసాజ్‌ చేయడం వల్ల మంచి ఫలితాన్నిస్తుంది. ఇది మొటిమలను నివారించడమే కాకుండా ముడతల ను తొలగిస్తుంది.
టమోటో: టమోటోలో విటమిన్‌ ఎ మరియు సిట్రిక్‌ యాసిడ్‌ అధికంగా ఉండటం వల్ల సెరమ్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సీరం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కూడా మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ వంటింటి వస్తువు టమోటోతో ముఖాన్ని మసాజ్‌ చేయండి.

సీ సాల్ట్‌: మొటిమల నివారణకు నిమ్మరసం, సీసాల్ట్‌ బెస్ట్‌ ఫేస్‌ స్క్రబ్‌ . సీ సాల్ట్‌ చర్మాన్ని శుభ్రపరిచి, మొటిమలను పోగొడుతుంది.

అలోవెరా: ఇది వంటింటి వస్తువు కాదు. అయిన ప్పటికీ దీన్ని సాధారణంగా మన ఇళ్ళల్లో పెంచు కుంటుంటాం. కాబట్టి దీన్ని ఉపయోగించి మొటిమలను నయం చేసుకోవచ్చు. అలోవెరా జెల్‌ల్లో యాంటీఇన్ల్పమేటర్‌ గుణాలు మెండుగా ఉండటం వల్ల మొటిమల నివారణకు బాగా సహాయపడుతుంది.


TOMATO URAGAYA PICKLE - SUMMER SPECIAL


టమోటా అంటే ఇష్టం లేదని ఎవ్వరంటారు. ఎర్రగా దోరగా నిగనిగలాడుతూ చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. కొందరు వండేదాక ఆగడమా అంటూ అలాగే తినేస్తారు. దీనితో చేయని వంటకం లేదు. కూర, చారు, పప్పు, పచ్చడి , జామ్‌, జ్యూసు, కెచప్‌, సాస్‌-ధరకూడా అందుబాటులోనే ఉంటుంది. మరీ టమోటో ఊరగాయతో కొంచెం వెరైటీ టేస్ట్‌ రుచి చూద్దాం. టమోటోను తీసుకోవడం వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం.. టమోటాల్లో క్యాల్షియం, పాస్పరస్‌, విటమీన్‌ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్త్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాలో సిట్రిక్‌ ఆమ్లం ఉండడంతో ఎసిడిటీ దూరమౌతుంది.

టమోటాల్లో విటమిన్‌ ఎ అధికంగా ఉండడంతో కంటి జబ్బులు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్‌ తగ్గుతుంది. రోగ నిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమన్‌ ఏ, విటమిన్‌ సి రోగ నిరోధక శక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగుతెచ్చిపెట్టే లైకోపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌, ఇది ఊపిరి తిత్తులు,రొమ్ము, ఎండో మెట్రియల్‌ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంతో సాయం చేస్తుంది.

కావలసిన పదార్థాలు: 

టమోటాలు -1/2కెజీ నూనె : 1/4 టీ స్పూను,కారం : 1/2 కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, మెంతులు -1/2 టీస్పూను, నూనె : సరిపడా, ఆవాలు: 3 టేబుల్‌ స్పూన్లు, చింతపండు: కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు :8-10

తయారు చేయు విధానము : 

ముందుగా టమోటాలు నీటిలో వేసి శుభ్రం చేసి, ప్లేటులోనికి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత పొడిబట్టతో తుడిచి తేమను పూర్తిగా తొలగించి, సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత పాన్‌లో నూనెవేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి చితగ్గొట్టి దోరగా వేయించుకోవాలి. వెంటనే అందులో టమోటో ముక్కలు,చింతపండును వేయాలి. తక్కువ మంట మీద టమోటాల్లోని తేమంతా పూర్తిగా పోయేదాకా బాగా మగ్గించాలి.ఇప్పుడు మెంతుల్ని దోరగా వేయించి, మెత్తగా పొడిచేసుకోవాలి. మెంతి పొడి తగినంత
ఉప్పుకారం, కలిపి మరో ఐదు నిమిషాలుంచాలి. వాటితో టమోటో బాగా గట్టి పడుతూ మగ్గిన తర్వాత దింపి ముందు ఆవపిండిని కలిపితేసరిపోతుంది. నోరూరించే ఇన్‌స్టెండ్‌ టమోటో ఊరగాయ రెడీ. ఇది ఒక వారం రోజులు పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పదిహేను రోజులు కూడా నిల్వ ఉంటుంది. 


FOR KIDS INFORMATION - WHAT IS A COMPUTER AND HOW DOES IT WORKS AND WHAT ARE PARTS IN A COMPUTER ETC INFORMATION IN TELUGU

మీరు పిండి పట్టించటానికి పిండి మిషన్‌ ఉన్న అంగడికి వెళతారు కదా? (అది జొన్నే కావచ్చు, గోధుమలే కావచ్చు, ఇతర పప్పు ధాన్యాలే కావచ్చు) అక్కడ ఏం చూస్తారు? యంత్రపు ఒక భాగంలో దినుసులు వేస్తే మరో భాగం నుంచి అది పిండిరూపంలో బయటకు వస్తుంది. కంప్యూటర్‌ కూడా ఇదే మాదిరిగా పనిచేస్తుంది. యంత్రపు ఒక భాగంలో పప్పుదినుసులు వెయ్యటం లాంటిదే. దీనిలో సమాచారాన్ని (వివరాలు, డేటా)
ఉంచడం. దీన్ని ఇంగ్లీషులో 'ఇన్‌పుట్‌' అంటారు.

యంత్రపు మరోభాగం పప్పు దినుసుల్ని పిండిగా మార్చటం వంటిదే. ఇచ్చిన డేటాని జ్ఞాపకంలో పెట్టుకుని, విభాగాలు చేసి మనకు అవసరమయ్యే రూపంలో తీర్చిదిద్దటం.

పిండి యంత్రపు మరో భాగం నుంచి బయటకి రావడం లాంటిదే. సమాచారాన్ని అవసరానికి తగ్గట్టుగా మనం పొందటం. దీన్నే ఇంగ్లీషులో 'ఔట్‌పుట్‌' అంటారు.

కంప్యూటర్‌ వివిధ విభాగాలు :

సాధారణంగా మనం ఏదైనా కొత్త సామాను కొన్నామనుకోండి. వాటిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం.వాటి వివిధ భాగాలను పరిశీలిస్తాం. అలాగే ఇప్పుడు కంప్యూటర్‌ గురించి తెలుసుకుందాం.

స్థూలంగా నాలుగు కంప్యూటర్లు ఉన్నాయి.

1. డెస్క్‌ టాప్‌: డెస్క్‌/ టేబుల్‌/ మేజ్‌ వీటిపై పెట్టే కంప్యూటర్లు.

2.టావర్‌ టాప్‌: ఇక్కడి నుంచి మెమొరీ, డ్రైవ్‌ అన్ని లేచి నిలబడ్డ స్ధంభంలా ఉన్నచోటే ఉంటుంది.

3.ల్యాప్‌టాప్‌ :ఒళ్ళో, లేక తొడపై పెట్టుకుని ఉపయోగించవచ్చు.

4. పామ్‌ టాప్‌: అరచేతిలో పెట్టుకుని ఉపయోగించగల సైజు కంప్యూటర్‌ ఇది.

ముఖ్యంగా మనం కంప్యూటర్‌ని మూడు భాగాలుగా విభజించవచ్చు.

1.మానిటర్‌ ఙసబ లేక మానిటర్‌ (టి.వి. స్క్రీన్‌లాగా, కనిపిస్తుంది- ఉంటుంది.)

2. కీ బోర్డు:మానిటర్‌: టైప్‌ రైటర్‌ కీ బోర్డులా ఉంటుంది.

3. సిస్టం: కే ంద్రీయ సంస్కరణా విభాగం.

మానిటర్‌: ఇది కలర్‌లో గాని, బ్లాక్‌ అండ్‌ వైట్‌లో గాని ఉంటుంది. ఇందులో మ్యాగ్జిమమ్‌ ఇరవై ఐదు లైన్లు, లైనుకు ఎనభై చొప్పున అక్షరాలు ఉంటాయి. మానిటర్‌ నాణ్యత, ధరను బట్టి కనిపించే చిత్రాలపై ఆధారపడి ఉంటుంది.

'కీ' బోర్డు: టైప్‌ రైటర్‌ 'కీ' బోర్డులాగానే ఉంటుంది. అంతే గాక దీనిలో ప్రత్యేకంగా కీ ఉంటుంది.

ఉదా : ట1 నుంచి ట12 వరకు గల పన్నెండు ప్రత్యేక(విశేష) ''కీ'' లను ''ఫంక్షన్‌ల కీ '' అంటారు. ఇది కాక క్యాప్స్‌ లాక్‌ 'కీ' డిలిట్‌ (డాటాను తీసేసే) 'కీ, కంట్రోల్‌ 'కీ' ఇలా అనేక వేర్వేరు 'కీ'లుంటాయి. ప్రతి కీ పని విధంగా వుంటుంది. 'కీ' బోర్డు మరియు మానిటర్‌ రెండూ చేరిన దాన్ని సామాన్యంగా ఒక్కో ''టెర్నినల్‌ '' అంటారు.

సిస్టం : ఇది కంప్యూటర్‌కు హృదయం లాంటిది. ఇందు లో అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాలతో కూడిన బోర్డులుంటాయి.

ఉదా : మదర్‌ బోర్డు. ఇది అతిముఖ్యమైన ఎలక్ట్రానిక్‌ పరికరాలతో కూడిన బోర్డు సౌండ్‌ బోర్డ్‌, తదితరాలు దీనిలో 'హార్డ్‌ డిస్క్‌' అనే ప్రముఖ డిస్క్‌ లుంటాయి. దీనిని 'విం చెష్టర్‌' వింబెష్టర్‌ అని కూడా అంటారు. దీన్ని ప్రముఖ వైజ్ఞానికుడైన ''వింబెష్టర్‌'' కనుగొన్నాడు. అందుకే దీన్ని అతడి పేరుతో కూడా పిలుస్తారు.

ప్లాపి డ్రైవ్‌: ప్లాస్టిక్‌తో చేయబడిన ఈ పైభాగంలో మ్యాగటిక్‌ యుక్తమై, పలుచగా గ్రామఫోను రికార్డులా
ఉన్న ప్లేటునే ఇంగ్లీలో ప్లాపి అంటారు. దీని వ్యాసం సుమారు 3'' ఉంటుంది. దీనిలో సమాచారాన్ని పొందుపరుస్తారు.
హార్డ్‌డిస్క్‌లో అనేక డిస్కెట్‌లు స్థిరంగా ఉంటాయి. దీని జ్ఞాపశక్తి అధికం. సాధారణంగా హార్డ్‌డిస్క్‌.40 మెగాబైట్‌, 80 మెగాబైట్‌లలో దొరుకుతాయి. జ్ఞాపకశక్తి బట్టి వీటి ధరలు ఉంటాయి. ఈ ఫ్లాపిని కంప్యూటర్‌ సిస్టంలో పెట్టి ఉపయోగించే పరికరమే ''ప్లాపిడ్రైవ్‌''

మౌస్‌: దీన్ని తెలుగులో 'మూషికం' అంటారు. దీనికి రెండు బటన్లుంటాయి.కంప్యూటర్‌ 'ఆన్‌'అయిన తరువాత ఒక ప్రత్యేక గుర్తు (చిహ్నం), తెరపైకి వస్తుంది. దీన్నే''కర్సర్‌'' అంటారు. ఈ 'కర్సర్‌'' కంప్యూటర్‌ తెరపై ఎక్కడికి వెళ్ళాలన్నా మౌస్‌ ద్వారా ఆ స్థలానికి 'కిక్‌' చేస్తే అది అటువెళుతుంది.

ప్రింటర్‌: ప్రింటర్‌లో అనేక రకాలున్నాయి.

ఉదా: డాట్‌ మ్యాట్రిక్స్‌ , లైన్‌ ప్రింటర్‌, లేసర్‌ తదితరాలు. సామాన్యంగా అన్నిచోట్లా ఉపయోగించేది. ''డాట్‌ మ్యాట్రిక్స్‌'' లేసర్‌ ప్రింటర్‌ ధర అధికమైనా ఉత్తమ రకంగా ఉంటుంది.

స్కానర్‌: సమాచారాన్ని చిత్రాల రూపంలో సంగ్రహించేదే స్కానర్‌.

ఉదా: స్కానర్‌ ద్వారా గ్రాఫిక్‌, ఫొటో లన్నింటినీ చిత్రాల రూపంలో కంప్యూటర్‌పై ఉంచవచ్చు.
సాఫ్ట్‌వేర్‌:కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ను సాఫ్ట్‌వేర్‌ అంటారు.

హార్డ్‌వేర్‌: కంప్యూటర్‌ తయారీకి అవసరమయ్యే సామాగ్రి హార్డ్‌వేర్‌ అంటారు. ఉదా: కీ బోర్డు , మానిటర్‌, సిపియు. మొదలైనవి.
ఆపరేటింగ్‌ సిస్టం: సాధారణంగా ప్రత్యేక(విశేష) కంప్యూటర్‌ ప్రోగ్రాం సమూహాన్ని 'ఆపరేటింగ్‌ సిస్టం' అనిపిలుస్తారు. అంటే ఇది కొన్ని ప్రోగ్రాములు సమూహం.

మీరు ఒక ద్వీపపు బయట తీర ప్రదేశంలో నిలబడ్డారనుకుందాం. మీరు ద్వీపం లోపలికి ఎలా వెళతారు? ద్వీపానికి మీకు మధ్య వంతెన(సేతువు) ఉంటేనే ఇదిసాధ్యం.

ఇదే విధంగా కంప్యూటర్‌ ఒక ద్వీపం లాంటిది. సేతువు అంటే ''ఆపరేటింగ్‌ సిస్టం'' అంటే ఆపరేటింగ్‌ సిస్టం .డాస్‌, విన్‌డో,యూనిక్స్‌ తదితరాల సమాహారం.

ఆపరేటింగ్‌ సిస్టం లేకుండా మీరు కంప్యూటర్‌ను ఉపయోగించలేరు.

ప్రోగ్రాంలో రకాలు: సాధారణంగా రెండు రకాల ప్రోగ్రాంలు మనకు కనిపిస్తాయి.(1) సిస్టం ప్రోగ్రాం, (2) ఆప్లికేషన్‌ ప్రోగ్రాం.
''సిస్టం ప్రోగ్రాం'' కంప్యూటర్‌కి సంబంధించింది. అప్లికేషన్‌ ప్రోగ్రాం' 'కంప్యూటర్‌ ద్వారా చేసే అనేక కార్యక్రమాలకు సంబంధించింది.

మానవుడి బుద్ధిశక్తి ఫలితమే సాఫ్ట్‌వేర్‌.
loading...