The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
ARTICLE ON GREATNESS OF ARCHITECTURE AND ENGINEERING SKILLS OF ANCIENT INDIA
ఇప్పుడు మనం చిత్రంలో చూస్తున్నది.. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా--
ఇది ఒక ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి????.....
ఒక విఫలమైన నిర్మాణం ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి???
ఇది నిజంగా విచిత్రమే కదా!! ఎందుకంటే ఇంతకంటే మనకు ఏకశిలతో నిర్మింపబడి శిల్పకళకే తలమానికమైన
ఎన్నో దేవాలయాలు.. పెద్ద గోపురాలు ఏమాత్రం వంకర లేని నిర్మాణాలు ఉన్నాయి..
అందులో కొన్ని.. తంజావూరు బృహదీశ్వరాలయం(వేయి సంవత్సరాల ఆలయం) .. రాజస్థాన్ చిత్తోర్ ఘర్ లోని
విజయస్థంభం.. కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే... కానీ ఇవేవీ ప్రపంచ వింతలలో చోటు చేసుకోలేదు...
లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అనేది నిర్మాణంలో వైఫల్యం వలన మొత్తం గోపురం ఒక ప్రక్కకు ఒరిగిపోతుంది.. అలాగే
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో దిగువ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయ గోపురం నిర్మించే టపుడు ఇలాగే గోపురం
ఒక ప్రక్కకు వాలి పోయిందట.. కానీ మన వారు దానిని నిలబెట్టేందుకు పునాది దగ్గర తగిని బరువు ఉండేలా అంటే
పూర్తిగా పూర్తి అయిన నిర్మాణాన్ని కూడా సరిచేసారట.. ఇది నిజంగా అలనాటి భారతీయుల ఇంజనీరింగ్
పరిజ్ఞానానికి నిదర్శనం...
మేరా భారత్ మహాన్!!
JOB SELECTION JOKES
వాగ్దానం
ఇంటర్వ్యుకి వచ్చాడు రమాపతి.
" నిన్ని పది తేలికైన ప్రశ్నలు అడగనా ? ఒక అతి కష్టమైన ప్రశ్న అడగనా ?" అన్నాడు అధికారి
రమాపతి అలోచించి "ఒక కష్టమైన ప్రశ్న అడగండి సార్ " అన్నాడు.
"అయితే చెప్పు ! పగలు ముందొస్తుందా ? రాత్రి ముందొస్తుందా ?" అడిగాడు అధికారి.
"పగలు ముందొస్తుంది సార్ " అన్నాడు రమాపతి
" ఎలా ? " అన్నాడు అదికారి
" సార్ ! మీరు రెండో కష్టమైన ప్రశ్న వెయ్యను అన్నారు " రమాపతి చప్పున.
రమాపతి సెలక్షన్ ఖరారు అయ్యింది.
TEMPLES INFORMATION ABOUT DAKSHINA KASI - ALAMPURAM TEMPLES IN TELUGU
అలంపురం (దక్షిణకాశి )ఆలయాల సందర్శనం
మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశం లో తుంగభద్ర ఉత్తరవాహిని గా ప్రవహిస్తున్న పుణ్యతీర్థం అలంపురం. దక్షిణ కాశి గా పేరెన్నిక గన్న పుణ్యభూమి అలంపురం. మాతా జోగులాంబా దేవి ,బాల బ్రహ్మేశ్వరులు వెలసిన దివ్యథామం. నవ బ్రహ్మ ఆలయాలు కొలువు తీరిన దివ్యక్షేత్రం. అష్టాదశ తీర్థాలలో ముఖ్యమైనదిగా చెప్పబడే పాప వినాశినీ తీర్థం వెలసిన చోటు. కూడలి సంగమేశ్వరుడు కొలువు తీరిన భూమి. శ్రీ యోగానంద నరసింహస్వామి, శ్రీసూర్యనారాయణ స్వామి కొలువుతీరిన క్షేత్రం ఈ అలంపురం. ఆలయాల సమూహాలతో అహో! అన్పించిన క్షేత్రం అలంపురం.
జాతీయ రహదారి పై కన్పించే తోరణ ద్వారము
మహామహులచే నిర్మించబడుతున్న ఆలయాలతో అలా, అలా పెరిగి పోతున్న ఈ క్షేత్రాన్ని చూచి ఒక మహానుభావుడు అలం – పురం అన్నాడట. సంస్కృతంలో అలం అంటే చాలు అని అర్థం. పురం అలం (ఇక పట్టణం పెరగటం చాలు) అప్పటినుండి ఈ పట్టణానికి అలం పురం అ పేరు వచ్చిందని ఒక పండిత కవి చమత్కరించారు.
శ్రీ జోగులాంబా ఆలయ రాజగోపురం
అలంపురం గా పిలవబడుతున్న ఈ గ్రామం ప్రాచీన శాసనాలలో “హలంపురం,” “హతంపుర,” “అలంపురం” అనీ, స్థలపురాణం లో “హేమలాపురం” అని వ్యవహరించబడింది. గ్రామదేవత ఎల్లమ్మ పేరున “ఎల్లమ్మ పురం” గా ఉండి.క్రమం గా హేమలాపురమై ఉండవచ్చు నని కూడ కొందరు భావిస్తున్నారు
క్రీ.శ 6.7 శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన బాదామి చాళుక్యులు అలంపురం లోని నవబ్రహ్మఆలయాలను కట్టించారు. “పరమేశ్వర “బిరుదు నామం తో పరిపాలన కొన సాగించిన రెండవ పులకేశి కాలం లో ఈ ఆలయాల నిర్మాణం ప్రారంభమై రెండు వందల సంవత్సరాల పాటు నిర్మాణ కార్యక్రమం కొనసాగింది. క్రీ.శ 566- 757 లో మథ్యకాలం లో అలంపురం ఆలయాల నిర్మాణం జరిగినట్లు పరిశోథకులు భావిస్తున్నారు. అర్క బ్రహ్మ ఆలయం లోని మండప స్థంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య వేయించిన దాన శాసనం లభిస్తోంది.
అనంతరం రాష్ట్ర కూటులను జయించిన కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని క్రీ.శ 973-1161 వరకు పాలించారు. వీరి కాలంలో అలంపుర క్షేత్రం లో యోగ నారసింహాలయం, సూర్య నారాయణ స్వామి ఆలయం, నదీ తీరఘట్టాలు, పాపానాశినీ తీర్థం లోని ఆలయాలు నిర్మించబడ్డాయి. గర్భగుడి చిన్నదిగా, దాని ముందు అంతరాళ మండపం, మెట్ల వరుసల్లా ఆలయ విమానం, ద్వారబంథాలు నల్లరాతితో చెక్కబడటం అనేవి వీరి ఆలయ నిర్మాణ శైలి గా పరిశోథకులు గుర్తించారు.
కాకతీయుల కాలం లో” వీరపూజ ‘అనే కొత్త ఆచారం వాడుక లోకి వచ్చింది. దేశానికి అరిష్టాలు వచ్చినప్పుడో, రాజు క్షేమం కోసమో శైవ వీరులు ఆత్మార్పణ చేసుకోవడం అలవాటుగా మారింది. అటువంటి వీరులకు గుడులు కట్టించేవారు. వీటినే “వీరశిల“లని పిలుస్తారు. ఇవి అలంపురం ప్రాంతంలోనే కాదు. ఆంధ్ర రాష్ట్ర మంతటా కూడ కన్పిస్తున్నాయి.
శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ 1521 లో రాయచూరు ను ఆక్రమించుకొని చెన్నిపాడు మీదుగా అలంపూరు కు వచ్చాడు. ఇక్కడి బాలబ్రహ్మేశ్వర స్వామికి, యోగానంద నరసింహస్వామికి పూజలు చేసి దానాలు సమర్పించినట్లు శాసనాలున్నాయి.
యోగనరసింహ ఆలయం లోని శాసనాలు
స్థలపురాణం లో అలంపురం క్షేత్రాన్ని” భాస్కర క్షేత్రమని”,”పరశురామ క్షేత్రమని”, “దక్షిణ కాశి” యని వర్ణించారు. కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి చాలా పోలిక లున్నాయి. కాశీలో గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, 64 ఘట్టాలున్నాయి. దగ్గర్లోనే త్రివేణీ సంగమం ఉంది. అలంపురం లో తుంగభద్ర ,బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని,మణికర్ణిక మొదలైన 64 ఘట్టాలున్నాయి. దగ్గర్లోనే కృష్ణా,తుంగభద్ర సంగమ ప్రదేశ ముంది. అంతేకాదు ఔరంగజేబు మసీదు కాశీ ఆలయాన్ని ఆనుకొని ఉంటే షాఅలీ పహిల్వాన్ దర్గా అలంపురం ఆలయానికి ఆనుకొని ఉంది.
శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయ తోరణ ద్వారం
ఈ క్షేత్రం లో బ్రహ్మదేవుడు ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. శంకరుడు బాలుని రూపం లో బ్రహ్మధేవునకు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు బాల ఈశ్వరుని దర్శించి, శివ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామికి బాలబ్రహ్మేశ్వరుడని పేరు వచ్చిందని ఒక ఐతిహ్యం. అందుకే ఈ క్షేత్రం లో బ్రహ్మ విగ్రహాలు ఎక్కువగా కన్పిస్తాయి.
బ్రహ్మేశ్వర స్వామి ఆలయ శిఖరం, ధ్వజస్థంభము
స్థలపురాణం లో ఈ లింగము జ్యోతిర్ జ్వాలామయం గా వర్ణించబడింది.దీన్ని అర్చించిన, స్పృశించినా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పబడింది.ఈ ఆలయ ప్రదక్షిణ పథాన్ని, ప్రాకార, ముఖమండపాలను క్రీ.శ 702 లో చాళుక్య విజయాదిత్యుడు కట్టించాడు. బాల బ్రహ్మేశ్వరుని ఆలయ మండపం లో వివిథ దేవతామూర్తుల విగ్రహాలెన్నో మనకు దర్శన మిస్తాయి. రససిద్ధి వినాయకుడు, ఉమామహే శ్వరులు, ద్విసింహ వాహిని యైన దుర్గాదేవి, షోడశ భుజ ఉగ్ర నరసింహుడు, మొదలైనవి తప్పక చూడవలసిన అపురూప శిల్పాలు. ఆలయ విమానం పై మహా ఆమలక శిఖరంచాళుక్య నిర్మాణ శైలికి దర్పణం గా నిలుస్తోంది
బాలబ్రహ్మేశ్వరుని దివ్యరూపం
పూర్వం ఇక్కడే జమదగ్ని ఆశ్రమం ఉండేదట. పరశురాముని చేత నరకబడిన రేణుకాదేవి శిరస్సు నుండి వేరు పడిన మొండెము భూదేవి గా ఇచ్చట కొలువు తీరి సంతానం లేని స్త్రీలచే పూజ లందుకొని సంతానం ఇచ్చే దేవత గా సేవించబడుతోంది.
అష్టాదశ తీర్థాలలో ముఖ్యమైనది గా చెప్పబడుతున్న పాపవినాశినీ తీర్థం సర్వపాపాలను హరింపచేస్తుందని భక్తుల విశ్వాసం.
షోడశ భుఙ నారసింహుడు
అలంపురం ఆలయాలను రససిద్ధుడు కట్టించాడట. కాశీవిశ్వేశ్వరుని ప్రేరణ తో ఈ క్షేత్రానికి వచ్చి క్షేత్రపాలకులను గూర్చి సిద్ధుడు తపస్సు చేశాడు.బ్రహ్మేశ్వరుడు శిరస్సు నుండి, జోగులాంబ నోటినుండి,గణపతి బొడ్డు నుండి రసాన్నిఇచ్చారట. ఆ రసం తో సిద్ధుడు పరుసవేదిని తయారుచేసి, ఆలయాలను ప్రారంభించాడట. విలసద్రాజు అనే వాడు ఆ పరుసవేది ని దోచుకోవడానికి దండెత్తి రాగా సిద్ధుడు ఆలయనిర్మాణం పూర్తికాకుండానే బ్రహ్మేశ్వరునిలో లీనమై పోయాడు. ఈ గాథ ప్రవేశద్వారం ముందు వేయబడిన తోరణస్థంభం పైన చెక్కబడివుంది.
ఇక్కడ నవ బ్రహ్మ ఆలయాలలో కన్పించేవన్నీ శివలింగాలే. వాటి పేర్లు ఏవీ పురాణ ప్రసిద్ధమైన నవ బ్రహ్మలవి కావు. ఆ పేర్లు వరుసగా బాల బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ,విశ్వ బ్రహ్మ,గరుడ బ్రహ్మ,స్వర్గ బ్రహ్మ,తారక బ్రహ్మ,పద్మ బ్రహ్మ. ఈ పేర్లు సిద్ధుడు పరుసవేది కోసం వాడిన మూలికల పేర్లని కొందరి భావన. అందుకే దీనిని బ్రహ్మేశ్వర క్షేత్రం అని కూడ పిలుస్తారు. నవబ్రహ్మ ఆలయాలలో తారకబ్రహ్మ ఆలయం ముష్కరులచేత ఏనాడో నాశనం చేయబడింది.
ఈ ఆలయ మహాద్వారం కారణాంతరాల వల్ల మూసివేయబడింది. ప్రాకార ద్వారమే ఇప్పుడు ప్రవేశ ద్వారం గా వాడబడుతోంది. మహాద్వారానికి క్రిందభాగం లో ఉన్న రెండు చిన్నగుళ్లల్లో కుడి ఎడమలు గా కంచి కామాక్షి, ఆమెకు ఎదురుగా ఏకాంబరేశ్వరుడు దర్శనమిస్తారు. శ్రీ కామాక్షి విగ్రహాన్ని పెర్మాడి రాయని మంత్రి అయితరాజు ప్రథాని క్రీ.శ 1353 వ సం.లో ప్రతిష్ఠించాడు.
ల
శ్రీ కామాక్షీ దేవి
పదునెనిమిది శక్తిపీఠాలలో నాలుగు మన రాష్ట్రం లోనే ఉన్నాయి.ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబా మాత ఆలయం క్రీ.శ 7వ శతాబ్దం లో నిర్మించబడింది. అయితే 14 వ శతాబ్దం లో ముష్కరుల దండయాత్ర ల్లో అమ్మవారి ఆలయం థ్వంసం చేయబడింది. స్థానికులచే అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వర ఆలయంలోని చిన్నగుడిలోనికి చేర్చబడింది. అదే సమయం లో ఈ ప్రాచీన ఆలయం తో పాటు మిగిలిన ఆలయాలు నాశనం కాకుండా విజయనగరచక్రవర్తి రెండవ హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు, తండ్రి ఆజ్ఞానుసారం సైన్యం తో వచ్చి ముస్లిం సైన్యాన్ని తరిమికొట్టి అలంపురం క్షేత్రాన్ని కాపాడాడు. 600 సంవత్సరాల తర్వాత అమ్మవారికి ప్రాచీన ఆలయమున్న ప్రదేశం లోనే మరలా ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీ జోగులాంబా మాత దివ్యమంగళ విగ్రహం
" లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం !
ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం !!"
అలంపురం కోట లోపల శ్రీ యోగానంద నరసింహ ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయాలున్నాయి. క్రీ.శ 9-10 శతాబ్దాల్లో నిర్మించబడిన ఈ ఆలయాలు శిథిలం కాగా త్రిభువనమల్లుని కాలం లో పునరుద్ధరణ జరిగినట్లు ఇక్కడి శాసనం వలన తెలుస్తోంది.
నృసింహ ఆలయ ప్రదాన ద్వారం
శ్రీ నరసింహస్వామిని ఆ రోజుల్లో “మాథవ దేవర “ అని పిలిచేవారు. ప్రవేశద్వారం ప్రక్కనే ఎత్తైన ఆంజనేయ విగ్రహం కన్పిస్తుంది. ఈ విగ్రహం పై శంఖ చక్రాలున్నాయి. ఈ సంప్రదాయం విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణరాయల వారి గురువైన వ్యాసరాయల వారిదని ఇంతకు ముందు చెప్పుకున్నాం. అంటే ఈ విగ్రహం 15 వ శతాబ్దం లో ప్రతిష్ఠించ బడిందన్నమాట.( చూ. బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం )
ఈ ఆలయంలో మూడు గర్బగుడులున్నాయి. ఇలాంటి ఆలయాన్ని “త్రిక దేవాలయం” అని పిలుస్తారు. మథ్య ఆలయం లో యోగ నరసింహస్వామి, ఆయనకు కుడివైపు మాథవీశక్తి, ఎడమవైపు చాకమ్మ విగ్రహాలున్నాయి. కళ్యాణమండపం, ప్రథానగోపురం ప్రత్యేకశైలి లో నిర్మించబడ్డాయి.ఈ ఆలయం లో రెండు శాసనాలు కూడ మనకు కన్పిస్తాయి.
శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం నరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారిలోనే కన్పిస్తుంది. ఇది కూడ త్రిక దేవాలయమే. రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట లో అక్కన్న- మాదన్నలు కట్టించిన ఆలయం కూడ ఇదే నిర్మాణ శైలిలో ఉండటాన్ని మనం ఇంతకు ముందే గమనించాము
శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్యరూపం
ఈ ఆలయం మూడువైపులా మూసి,ఒక వైపు మాత్రమే ప్రవేశముంది. మథ్య ఉన్న గర్భాలయం లో శ్రీ సూర్యనారాయణస్వామి, ఇరువైపులా ఆలయాల్లో శివలింగాలున్నాయి. ప్రవేశద్వారం ప్రక్కనే ఆంజనేయ విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం లో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి పాదుకలు థరించి ఉండటం విశేషం..
శ్రీ జోగులాంబా ఆలయదృశ్యం
పాపావినాశినీ తీర్థం అలంపురం క్షేత్రం లోకి ప్రవేశిస్తుంటే కుడివైపు మార్గం లో ½ కి మీ లోపలికి ఉంటుంది. ఇవి కూడ 9-10 శతాబ్దాల్లో నిర్మించబడిన ప్రాచీన ఆలయ సముదాయాలే. ఇక్కడ ప్రథానదైవం పాపనాశేశ్వరుడు .ఈ లింగం ఆకుపచ్చ రంగులో ఉండటం ఒక ప్రత్యేకతగా చెపుతారు. అష్టాదశ తీర్థాలలో చాల ముఖ్యమైనదిగా ఈ పాపవినాశినీ తీర్థాన్ని చెప్పుకుంటారు. విద్యాగణపతి, అష్టభుజ మహిషాసురమర్ధిని చూడదగ్గ శిల్పాలు.
పాపవినాశినీ తీర్థం
కూడలి సంగమేశ్వర ఆలయం పాపవినాశినీ తీర్థానికి తూర్పు గా ఉంటుంది. ఇది కూడ పాపవినాశినీ ఆలయాల వలెనే శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నుంచి రక్షించడానికి ఇక్కడకు తరలించి, పునర్నిర్మించారు. ఈ ఆలయం గోడలు, పైకప్పు పైన ఉన్నఅద్భుతమైన శిల్పవిన్యాసం ఈ ఆలయ ప్రత్యేకత.
నందిమండపం
ప్రాకార శిల్పాలు
అర్థ నారీశ్వర శిల్పం
ఆలయానికి సమీపం లోనే మ్యూజియం కూడ ఉంది. ఆం.ప్ర.పర్యాటక శాఖ వారి “హరిత” హోటల్ తో పాటు దేవస్థానం వసతి గదులు కూడ ఉన్నాయి. శ్రీ అమ్మవారి ఆలయం లో సాయంత్రం 7.00 గం.లకు, శ్రీ స్వామి వారి ఆలయం లో సాయంత్ర 7.30గం.లకు మహా మంగళహారతి ఉంటుంది. భక్తులు తప్పనిసరిగా దర్శించి, తరించవలసిన దృశ్యమది. ఒక రోజు ఉండేటట్లుగా ప్రణాళిక వేసుకొని,ఉండి చూడవలసిన దివ్యక్షేత్రం అలంపురం.
బాలబ్రహ్మేశ్వరాయాస్తు భక్తకల్పద్రుమాయ చ
కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళమ్.
GODDESS SHASTI DEVI PUJA / PRAYER IN TELUGU FOR WANT OF CHILDREN
సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం
సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తూ వుంటే శుభలక్షణవంతుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః
ధ్యానం :
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే
షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే
షష్టిదేవి స్తోత్రం :
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః
కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః
శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః
ఫలశృతి :
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే
శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం
Slokas in Praise of Lord Anjaneya Swamy in English
Slokas in Praise of
Lord SRI Anjaneya SWAMY
yathra yathra raghunatha keerthanam
thathra thathra kruthamasthakanjalem |
pashpavari paripurna lochanam
maruthim namatha rakshasanthagam ||
Sri Maruthi (Son of Wind God), the terror to demons (Rakshasas) is present wherever praise of Sri Rama is sung, with joyous tears in His eyes and folded hands over His head. To Him we offer our salutation (Namaskarams).
Manojavam maaruta tulya vegam
Jitendriyam budhimataam varishtam |
Vaataatmajam Vaanarayootha mukhyam
Sri Rama dootam sirasa namaami ||
Lord Rama's emmisary,(sri Rama dootam) the foremost among the intelligentsia, (budhimataam varishtam) is swift as thought and equal to wind-God in speed (monojavam maaruth tulya vegam). I bow reverently my head (s'irasa namassmi) to that wind God's great son (vaaataatmajam)Hanuman, who keeps his sense organs ever under control (jitendriyam) and a leader of the army of the monkeys (vaanarayootha mukhyam).
Anjanaanandanam veeram
Jaanaki soka naasanam |
Kapeesam Aksha hanthaaram
Vande Lanka bhayankaram ||
Anjaneya, the delight of his mother Anjana Devi (Anjanaanandanam) and the destroyer of the demon king Ravana's son Aksha, dispeller of the grief of the daughter of king Janaka (Jaanaki s'oka naas'anam), I salute(Vande) that heroic (veeram) monkey-leader Hanuman (Kapees'am), the source of terror to Lanka (Lanka bhaankaram).
Ullangya sindhoh salilam saleelam
yah soka vanhim janakatmajaayaah |
Aadhaya tenaiva dhadaaha lankaam
Namaami tam praanjaliraanjaneyam ||
My obeisance to Anjaneya with palms joined (tam praanjaliranjaneyam), who having leapt across the deep sea (salilam) in a playful manner (sa leelam) and picking up the fire of grief of Jankakumari (janakatmajaayaah s'oka vanhim), burnt Lanka with the very same (tenaiva) fire of grief.
Goshpathy kritha vaaraasim
mas(h)akee kritha raakshasam |
Ramayana mahaa maalaa Ratnam
vande anilaathmajam ||
Sri Anjaneya sprang across the ocean effortlessly, as if crossing a Cow's hoof (goshpathy) and crushed many ogres, like mosquitoes. My obeisance(vande) to Son (aathmajam) of wind God (Anila) who shines as a pendent on great Ramayana necklace (Mahamaala).
Aanajeyam atipaatalaananam
kaanchanaadri Kamaneeya vigraham |
Paarijaatatarumoola Vaasinam
Bhaavayaami pavamaana nandanam ||
Son of Anjanadevi (Aanajeyam) and the wind God (pavamaana nandanam) who is deep red-faced (ati paatala aananam) and who's body radiates like that of the golden mountain (kaanchanaadri Kamaneeya Vigraham) and has the Paarijaata celestial tree as His abode, I bow down with reverence (Bhaavayaami) Thee.
budhdirbalam yaso dhairyam nirbhayatva-marogata |
ajadatyam vakpatutvam ca hanumatsmaranadbhavet ||
Wisdom (budhi), physical strength (balam), fame (yashas), courage, valor (fearlessness), good health, vigilance, eloquence, (all these) are bestowed upon meditating on the Lord Hanuman.
Atulita-bal-shamam, hemshailabhadeham
Danuja-vana-krishanam, gyaninamagraganyam
Sakalagunanidhanam, vanaranamadheesham |
Raghupativardootam, Vatajatam namami ||
He who is the repository of immense power with a body glittering like a mountain of gold; who is verily the jungle-fire to incinerate the jungle of demons; the exalted scholar, the mine of all virtue and the master of apesand monkey(vanaramam)- I bow in reverence to such of the wind god, Lord Hanuman, the nenowed ambassador of Lord Rama.
Aamushi krutha marthaandam
goshpathi krutha sagaram ||
thrunee krutha dasagreevam
Anjaneyam namamyaham ||
He, who tried to devour the rays of the Sun in one stroke, who crossed the sea as if it is the distance between the front and back legs of the cow , who considered Ravana (Dasagriva) as trifle like grass and ignored him, - I pay obeisance to that Anjaneya.
asaadhya sadhaka swamin
asaadhyam thavakim vadha ||
ramadootha krupasindho
mathkaryam sadhaya prabho ||
He, who could achieve that which is impossible, who could do even the most difficult things- Swamin! Hey Swami- Please tell me: Is there anything that you cannot do? You are the ambassador of Lord Rama, you are the ocean of ompassion; Prabho (Prabhu in Sanskrit has the meaning - One who can do, undo and do in another way) please help me in discharging my duties and responsibilities.
sarva kalyana thaatharam sarvaapadhgana vaarakam ||
apara karuna murthim anjaneyam namamyaham ||
Hey Anjaneya ! who is the giver of all good things, who protect from all adversaries, who is the repository of immeasurable love and compassion, I pay my obeisance to you.
doorikirutha sitarthi prikateekirutha
rama vaibhava spurithi: ||
dharita dasamukha kirthi: puratho
mama pathu hanumato murti: ||
May Lord Hanuman, who got rid of the sufferings of Sita, who brought out succinctly the character and special qualities of Lord Rama, who brought down the fame of Ravana, standing before me, protect me.
Khyatah: SriRamaduth: Pavanatanubhavah:
Pingalaksah: Sikhavan
Sita Sokapahari dasamukhavijayi
Lakshmanapranadata |
Aneta Bhesajadreh: Lavanajalanidheh
Langane Diksito yah:
Virasriman Hanuman mama
manasi Vasan Karyasidhmadhim tanotu ||
Let veera Sriman Hanuman lives in my mind and guide me in every aspect and lead me to victory. This Hanuman, known as the Ramadootha - the messenger of Sri Rama - was born to the Wind God Pavana, the Vayu, his eyes are light yellow in colour, has long hair. He is the one who helped Sita to get rid of her sorrow by conquering the Dasamuka rakshasa, Ravana; gave life to Lakshmana when he was lying unconscious bringing the herbal mountain itself for this purpose (as he had no time to search and select the proper medicinal herbs) and this is the same Hanuman who showed that he has the capability of crossing the Ocean.
Sarvarista nivarakamam subhakaram
Pingaksamaghapaham
Sitanveshana tatparam kapivaram
Kotindu Surya prabham |
Lankadvipa Bhayankaram sakaladam
Sugriva sammanitam
Devendradi samasta Deva vinutam
Kakustha dutam Bhaje ||
My salutations to this Hanuman who always brings subham - everything that is good - for his devotees and eliminates the bad and the evil. He removes even the traces of bad thoughts and deeds from his devotees. i.e he makes them pure in words, thought and deed. With eyes yellow in colour, he is said to be the best among the kapi- the monkeys. He is the one as bright as koti Suryas and koti Chandras (million Suns and Moons) who went in search of Sita. He was a threat to the island of Lanka, but for his devotees he is the one who bestows everything. He was praised by Sugriva. Being the messenger of Rama (the descendent of Kakusth dynasty) he is revered by all Devas including Indra.
SRI RUDRA PANCHAMUKHA DYANA SLOKALU - THATHPARYAMU - SLOKAS AND MEANING IN TELUGU
శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు,తాత్పర్యము
రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.
తత్పురుష ముఖ ధ్యానమ్
సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః
తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)
అఘోర ముఖ ధ్యానమ్
కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం
తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)
సద్యోజాత ముఖ ధ్యానమ్
ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః
వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం
తాత్పర్యము: హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)
వామదేవ ముఖ ధ్యానమ్
గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం
భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం
వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం
తాత్పర్యము: గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)
ఈశాన ముఖ ధ్యానమ్
వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం
తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు, సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు, తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)
శ్రీరుద్రధ్యానమ్
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం
తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!
ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి, నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించాలి.
Subscribe to:
Posts (Atom)