ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ADRAK KII JINGA

అధ్రక్-కి -జింగా

కావాల్సినవి :
రొయ్యలు- 500 గ్రా
ఉల్లిపాయలు- 150 గ్రా
పచ్చి మిర్చి-ఆరు
అల్లం- 30 గ్రా
వెల్లుల్లి- 15 గ్రా
కారం- ఒకటిన్నర టీ స్పూన్
సోయా సాస్-2 టీ స్పూన్స్
అజినమోతో - 1 టీ స్పూన్
మిరియాల పొడి -పావు టీ స్పూన్
నూనె- 75 గ్రా
ఉప్పు-తగినంత
రెడ్ ఆరెంజ్ కలర్-చిటికెడు

తయారు చేసే విధానం:
1)ఒక్కో ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కోసి ,ఉప్పు కలిపిన నీటిలో పది నిమిషాల పాటు ఉడికించండి.పిదప నీళ్లు వార్చి ముక్కల్ని చల్లబర్చండి.
2 )ఈ ముక్కల్ని పచ్చిమిరపకాయలు కలిపి ముద్ద గా నూరండి.అలాగే అల్లం,వెల్లుల్లిముక్కల్ని ముద్ద గా నూరండి.
3 )బాణలిలో నూనె పోసి వేడి చేసాక శుభ్రం చేసిన రొయ్యలు వేసి వేయించండి.వీటిని తీసేసిన పిమ్మట ఉల్లిపాయ ముద్ద వేసి ఎర్రగా ఫ్రై చేయండి.
4)ఇందులో అల్లం-వెల్లుల్లి ముద్ద ,కారం,మిరియాలపొడి ,రెడ్ ఆరెంజ్ కలర్ కలిపి ఐదు నిమిషాలు వేయించండి.ఆ పైన రొయ్యలు ,ఉప్పు వేసి కలియబెట్టండి.కూర కాస్త దగ్గర పడిన తరువాత అజినమోతో ,సోయాసాస్ లను చేర్చండి. ఐదు నిమిషాలు అయ్యాక అధ్రక్ కి జింగాను దించండి......