ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BANANA VADA

అరటికాయ వడలు

కావాల్సినవి
అరటికాయలు -రెండు
అల్లం-చిన్న ముక్క
పచ్చి మిర్చి -అరడజను
ఉల్లిపాయలు - 50 గ్రా
కొత్తిమీర -ఒక కట్ట
కరివేపాకు -అయిదు రెబ్బలు
ఉప్పు -తగినంత
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం

1)అరటికాయలను నీటిలోబాగాఉడికించుకోవాలి.తరువాత తొక్క వలిచి ముద్ద గా చేసుకోవాలి.
2 )తరువాత ఆ ముద్ద లో సన్నగా తరిగిన అల్లం,పచ్చిమిర్చి ,ఉల్లిపాయముక్కలు,కరివేపాకు,కొత్తిమీర,తగినంత ఉప్పు కలపండి.
3)ఇప్పుడు ఇలా చేసిన అరటికాయ ముద్ద ను చిన్న చిన్న ఉండలు గా చేసి,తడి చేతి తో వత్తి ,వడలు మాదిరిగా చేసి మరుగుతున్న నూనె లో వేసి ఎర్రగా ఫ్రై చేయాలి.
4)వీటిని సాస్ తో గాని ,పుదిన చెట్నీ తో గాని తింటే చాలా రుచి గా ఉంటాయి.