ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CHEESE MURUGULU

వెన్న మురుకులు












కావలసినవి 

బియ్యప్పిండి - 3 కప్పులు

సెనగపిండి - 1/2కప్పు
వేయించిన సెనగపప్పు పొడి (పుట్నాల పౌడర్)- 1 టేబుల్ స్పూన్ 
వెన్న - 1 టేబుల్ స్పూన్ 
ఉప్పు - తగినంత 
వాము - 1/2 టీ స్పూన్
నూనె -వేయించడానికి సరిపడా 












తయారుచేసే పద్దతి
1 )పైన చెప్పిన మూడురకాల పిండులను కలిపి జల్లించి పక్కన వుంచండి.
2 )పిండి లో ఉప్పు ,వెన్న ,వాము వేసి రెండు చేతులతో కలుపుతూ -నీళ్లు చేర్చి ముద్దలా చేయండి.
3 )మురుకులు(జంతికలు)గొట్టం తీసుకుని ,లోపల నూనె పూయండి. ఇప్పుడు పిండిముద్దను గొట్టం లో పెట్టి , కాగుతున్న వేడి నూనె లో మురుకులు గాతిప్పండి.వీటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. వేయించిన మురుకుల్ని పేపర్ మీద పరిస్తే ఎక్కువైనా నూనె ను పీల్చుకుంటాయి.
4)ఇప్పుడు వేడి వేడి వెన్న మురుకులు తయారు..........