ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DEVI PRASADAM -

దేవి ప్రసాదం

కావలసినవి:
గోధుమ రవ్వ - 250 గ్రా 
బెల్లం -350 గ్రా 
నెయ్యి - 100 గ్రా 
యాలకులు-5 గ్రా
జీడి పప్పు - 25 గ్రా
కిస్ మిస్ - 25 గ్రా 
పచ్చి కోవా - 50 గ్రా 
తయారు చేసే విధానం
1)ముందు గా సన్నని గోధుమ రవ్వను ,జీడిపప్పు ,కిస్ మిస్ లను కలిపి ఒక గిన్నె లోవేయండి.ఆ తరువాత యాభయ్ గ్రాముల నెయ్యి ని చేర్చి గోధుమ నూక ను ఎర్రగా వేయించండి.
2 ) ఆ తరువాత ఆ నూక లో రెండున్నర గ్లాసుల నీళ్లు పోసి బాగా కలియబెట్టి గిన్నె మీద మూత పెట్టి నూకను ఉడికించండి.
3 )గిన్నె లో నీళ్లు ఇంకిపోయిన తరువాత ముందు గానే తయారు చేసిన బెల్లం పాకాన్నివేసి ,సన్నని మంట మీద కలుపుతూ నూక ను ఉడికించండి. 
4 )ఇప్పుడు బెల్లం పాకం,రవ్వలో బాగా ఇంకి ముద్ద గా తయారయ్యాక గ్ర పొడి,మిగిలిననెయ్యి,ఎయ్యిచ్చి కోవాలు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాక దించి ,అతిధులకుఅందించండి........