ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SAMOSA CHICKEN CURRY

సమోసా చికెన్ కర్రీ

కావాల్సినవి:
చికెన్ బ్రెస్ట్ పీస్లు -రెండు
పనీర్-50 గ్రా
జీడిపప్పు- 20 గ్రా
కొత్తిమీర-ఒక కట్ట
పచ్చి మిర్చి-మూడు
నిమ్మకాయ-ఒకటి
నూనె-వేయించడానికి సరిపడా
గ్రేవీ తయారీకి:
గసగసాలు- 25 గ్రా
జీడిపప్పు- 25 గ్రా
కారం-ఒకటిన్న టీ స్పూన్
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు- 50 గ్రా
పెరుగు- 100 గ్రా
గరం మసాల- 1గ్రా
పచ్చి మిర్చి-రెండు
టమోటాలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా
పసుపు-చిటికెడు
తయారు చేసే విధానం:
1 )ముందుగా ఒక బాణలిలో కొంచెం నూనె పోసి కాచాక -సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేయించండి.తరువాత అందులో అల్లంవెల్లుల్లిముద్ద,కారంపసుపు,రుబ్బిన మసాలముద్దను చేర్చి వేయించండి.ఆ తరువాత దానిలో పెరుగు,టమోటాముక్కలు ,పచ్చిమిర్చి వేసి మరిగిస్తే గ్రేవీ రెడీ అవుతుంది.
2)తురిమిన పనీర్ లో జీడిపప్పు,కొత్తిమీర,పచ్చి మిర్చి ,నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి.
3 )చికెన్ బ్రెస్ట్ పీస్లను ఆకు ఆకారం లో రెక్క జాయింట్ దగ్గర కోసి చేతితో లాగితే ఎముక మిగిలి చర్మం విడిపోతుంది.
4)ఈ చర్మంలో -పైన తయారు చేసిన మిశ్రమాన్ని కూరి ,సమోసా ఆకారంలో చికెన్ పీస్ ను మదచండి.చివరలు విడిపోకుండా దారం తో కట్టి-వాటిని బాణలిలో మరుగుతున్న నూనె లో వేయించి తీయండి.
5)ఇలా తయారైన సమోసాలను పైన సిద్ధం చేసిన గ్రేవీలో వేసి,పైన కొత్తిమీర జల్లి అతిధులకు అందించండి.