ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Telugu Lullubys (Lali paatalu)



జీర్నం జీర్నం వాతాపి జీర్నం
గుర్రం తిన్న గుగ్గిల్లు జీర్నమై
ఏనుగు తిన్న యాలక్కయ జీర్నమై
భిముడు తిన్న వంటలు జీర్నమై......

--- 2 ---

పచ్చని చెట్టు ఒక్కటే..
వెచ్చని చిలుకలు రెండూ
పాటలు పాడి జో కొట్టాలి జో జో జో "పచ్చ"

చల్లని పలుకుల తల్లి
చక్కటి నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట్టా
నేనే సుమా...

--- 3 ---




ఓరోరి వెంకన్న - మెట్లపల్లి వెంకన్న
ఎద్దును తెమ్మంటే - ఎలుకను తెచ్చె
కాల్చుకు రమ్మంటే - మాడ్చుకు వచ్చె
పై చూడమంటే - సగం మింగి తెంచె
ఆగాగు మంటే - అయింతా తినె
ఓరోరి వెంకన్న తిండిపోతు వెంకన్న





--- 4 ---


తెలుపు గేయం
అమ్మ మాట తెలుపు - ఆవు పాలు తెలుపు
మల్లె పూలు తెలుపు - మంచి మాట తెలుపు
చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు
మంచి మనసు తెలుపు - పావురాయి తెలుపు
పంచదార తెలుపు - పాలు పెరుగు తెలుపు
గురువుగారి చొక్కా తెలుపు - గోవింద నామము తెలుపు
జాజి పూలు తెలుపు - జాబిల్లి తెలుపు
జాలి గుండె తెలుపు - చల్లని మంచు తెలుపు
వెన్నెలమ్మ తెలుపు - వేప పువ్వు తెలుపు
మంచి ముత్యం తెలుపు - పాపాయి నవ్వు తెలుపు

White like mother's word - White like cow's milk
White like Jasmine - white like good advise
White like moon - white like flower
White like good heart - white like a pigeon
White like sugar - white like curd and milk
White like teacher's shirt - white like 'Govinda namam'
White like flower - white like moon
White like a kind heart - white like snow
White like moonlight - white like neem flower
White like pearl - White like baby's smile.

--- 5 ---


ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపా పప్పు మెంతీ పిండి
తాటీ బెల్లం తవ్వెడు నేయి
గుప్పెడు తింటే కులుకూ లాడి
నడుమూ గట్టె నామాటె చిట్టీ
దూదూపుల్ల దురాయ్ పుల్ల
చూడాకుండాజాడా తీయ్
ఊదకుండా పుల్లా తీయ్
దాగుడు మూత దండాకోర్
పిల్లీ వచ్చె ఎలుకా భద్రం
ఎక్కడి దొంగాలక్కణ్ణే గప్ చిప్

This is a rhyme cum play song just like ringa ringa roses.
Though children usually hold hands crossing them with each other and go round and round.