ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MY DREAM COMES TRUE TELUGU KAVITHA


నా కలకో రూపం వస్తే...




ఎప్పుడూ విరహమేనా అంటున్నారని... కాస్త విరహానికి విరామం ఇచ్చి ;)
సరదాగా రాసిన మొదటి సినిమా స్టైల్ పాట,
జీవితాన అన్నిటికీ స్ఫూర్తి అయిన "చిట్టి" కి అంకితం ఇస్తూ... 

(పల్లవి)

నా కలకో రూపం వస్తే
అది ఎదురుగ నడిచొస్తే
ఇలలోనే నేనుంటానా
గగనంలో దూసుకు పోనా

ప్రియురాలే నవ్వుతు చూస్తే
ఆ నవ్వులొ నే కనిపిస్తే
నిజమే కలయను కోనా
తన ఒడిలో నే పడి పోనా

(చరణం-1)

ఆ రూపం ఆ వదనం
నా కళ్ళల్లోనే కదిలెనే
ఆ నవ్వులు ఆ నడకలు
నా గుండెల్లోనే నిండెనే

ఇక వాటితొ నే బ్రతికేయనా
నలు దిక్కులు పడిపోతున్నా
ఈ జన్మా...
 ఈ ఆత్మా...
 ఇక నీవే అంటున్నా   || నా కలకో ||

(చరణం-2)

నీ పలుకుల పదసరిగమలు
నీ పిలుపుల తియ్యని రుచులు
నా చెవులకు మురళీ గానం
నా మదిలో మోహన రాగం

ఎప్పటికీ నిను ప్రాణంగా
నా గుండెల్లో దాచేయనా
మనసారా...
 బ్రతుకంతా...
 నీతోనే గడిపేయనా    || నా కలకో ||