శివకంచిలోని కైలాసనాధ ఆలయం
ఈనెల రెండవ వారంలో ముంబాయినుంచి రాజమండ్రి వచ్చిన మా అబ్బాయితో
కలసి తిరుమల, కంచి,తిరువణ్ణామలై ,కాణిపాకం చూసి ముంబాయి నాలుగు
రోజులక్రితం వచ్చాము. కంచిలొ కామాక్షి అమ్మవారిని దర్శించుకుని శివకంచిలో
కైలాసనాధ ఆలయానికి వెళ్ళాము. అతి పురాతనమైన ఈ ఆలయం చుట్టూ
చక్కని పచ్చిక బయలు, ఇనుప ఫెన్సింగు రక్షణతో ఆహ్లాదకరంగా పెంచారు.
ఆలయం లోనికి గేటుద్వారా ప్రవేశించగానే పెద్ద నందీశ్వరుడు ప్రత్యక్షమవుతాడు.
ఆలయం మొదలులో ఎన్నో చిన్న చిన్న గుడులలాంటి మందిరాలు అందులో
పలకల శివలింగాలు ప్రతి ఒక్కదానిలో మనకు అగుపిస్తాయి.
ఇక ఆలయంలో మండపాలు శిల్పకళానైపుణ్యంతో అలరిస్తాయి. రాతిపై చెక్కడం
కాకుండా ఒక రకమైన సున్నంతో వీటిని నిర్మించినట్లు తోస్తుంది. ఇక దేవాళయం
గర్భగుడిలోని శివలింగం కూడా పలుకలుగా వుంటుంది. మూల విరాట్టుకు ఇరు
ప్రక్కలా గోడకు రెండు రంధ్రాలు, మనిషి పాకేటంత కైవారంలో వున్నాయి. అందు
లోనుంచి దూరి పాకుతూ బైటకు వెళ్ళాలి! నేను, మా అబ్బాయి కోడలు వెళ్ళాము
కాని మా శ్రీమతి మాత్రం కంగారుపడి వెళ్ళలేకపోయింది.
నేను అక్కడి దేవాళయ దృశ్యాలను ఫోటోలు తీశాను. తమిళనాడులో దేవాళయాల
నిర్వహణ మన రాష్ట్రంలో కంటే చాలా బాగుందనే చెప్పాలి.