ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SLIMNESS SOME FOOD ITEMS TIPS


నాజూకు గా ఉండడానికి కొన్ని ఆహారపదార్ధాలు

                                   
  ఆహారంలో ఎన్ని వర్ణాలుంటే అంత మంచిదంటారు! ముదురు రంగు ఆహారం, ముఖ్యంగా నలుపు వర్ణంలో ఉండే పదార్థాల్లో పోషకాలు అధికమనీ.. అవి బరువు తగ్గి, నాజూగ్గా మారడానికి ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు.

1.బ్లాక్‌ టీ: శరీరానికి తగిన పోషకాలు అందిస్తూనే, 'సన్న'జాజిలా మారేందుకు దోహదం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఐసోఫ్లవనాల్స్‌, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో పుష్కలం. తేయాకులని పులియబెట్టి ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసే దీనివల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు. శరీరంలోని ఒత్తిడి కలిగించే హార్మోన్లని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే ఓ కప్పు బ్లాక్‌టీ తాగితే ఈ సత్ఫలితాలు పొందవచ్చు.

2.నువ్వులు, 3.మిరియాలు: మాంసకృత్తులు, ఇనుము అధికంగా ఉండే నల్ల నువ్వులు అల్సర్లలని నివారించి, అతిసారాన్ని అదుపులో ఉంచుతాయి. క్యాల్షియం అధికంగా ఉండే నువ్వులని ఆరోగ్యం కోసం ఉదయాన్నే వేడి నీటితో కలిపి తీసుకోవడం చైనీయుల సంప్రదాయం. ఇక, నల్ల మిరియాల పొడి ప్రయోజనం చెప్పాలంటే... చర్మ, శిరోజ ఆరోగ్యాలకు పెట్టింది పేరు. చారు, ఫ్రైడ్‌రైస్‌, సలాడ్ల రూపంలో మిరియాల పొడిని తీసుకొంటే జీర్ణశక్తి పెరుగుతుంది. గుండె జబ్బులు, దంత సమస్యలు, కాలేయ ఇబ్బందుల నుంచి మిరియాలు సాంత్వననందిస్తాయి. వీటి నుంచి తీసిన నూనెను చర్మానికి, శిరోజాలకు వాడితే మంచిది.

4.నల్ల ద్రాక్ష: క్యాన్సర్‌తో పోరాడే శక్తి ఉంది. వీటిని దీర్ఘకాలం ఆహారంగా తీసుకుంటే, క్యాన్సర్‌ కణాలు తగ్గుముఖం పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, చర్మానికి కొత్త నిగారింపునివ్వడంలోనూ నల్ల ద్రాక్షలు ఉపయోగపడతాయి. గింజలు లేని ద్రాక్షలో కన్నా గింజలున్న వాటిని తీసుకోవడం వల్ల ఎక్కువ యాంటీ ఆక్సిండెంట్లు అందుతాయి. నల్ల ద్రాక్ష, మిరియాల పొడి, నల్ల నువ్వుల కారం.. వీటిని తరచూ తీసుకునే వారిలో దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు పెద్దగా ఉండవని, లైంగిక సామర్థ్యం పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

5.నల్లుప్పు: పచ్చళ్లలో వాడే నల్ల ఉప్పుకి శరీర జీవక్రియలని వేగవంతం చేసే శక్తి ఉంది. సైనస్‌తో బాధపడుతున్నప్పుడు ఇది మంచి సాంత్వన. అలాగే కీళ్లనొప్పులతో బాధపడేవారు ఓ వస్త్రంలో వేడి చేసిన ఈ ఉప్పుని ఉంచి సమస్య ఉన్న చోట పెడితే కాసేపటికి సాంత్వన లభిస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

6.వెనిగర్‌: బియ్యం, గోధుమలు, జొన్నలు మేళవించి చేసిన బ్లాక్‌ వెనిగర్‌ని ఉపయోగించడం వల్ల రక్తప్రసరణ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. 
7. నీరు : రోజువారీ తగినంత మంచినీరు సుమారుగా 3 లీటర్లు త్రగాలి . 
8. పాలు : రోజూ పడుకునేటప్పుడు ఒక గ్లాసు వెన్నతీసిన పాలు త్రగితే శరీరము గాజూకుగా తయార్గును. 
9.తేనె : రొజూ రెండు స్పూనుల తేనె ఉదయానే ఒక స్పూను అల్లం రసములో కలిపి తీసుకుంటే చర్మానికి మంచి రంగు వస్తుంది. ఆంబపైత్యము పోయి, విరోచనము సాఫీగా అవుతుం
ది.