ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SUMMER SPECIAL THATI MUNJA JUICE - HEAT REDUCER


తాటి ముంజల్ జ్యూస్


వేసవిలో విరివిగా దొరికి, దాహాన్ని తీర్చే తాటిముంజెలు ఎప్పుడైనా రుచి చూసారా??  వేసవిలో ఎంతో చల్లదనాన్ని ఇచ్చే ఈ ముంజలను సామాన్య మానవుని నుండి ధనికవర్గాల ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఓపిగ్గా  పైన పొట్టు తీసి మధ్యలో నీరు తాగేసి ముంజలు తినడంలో ఎంతో మజా ఉంటుంది.. అది అనుభవించినవాళ్లకే అర్ధమవుతుంది కూడా.. మరి ఈ ముంజలు అలాగే తినకుండా మంచి జ్యూస్ చేసుకుందాం..


కావలసిన వస్తువులు:
తాటి ముంజెలు – 4
కొబ్బరినీళ్లు – 2 కప్పులు
పంచదార -  3 tsp
ఐస్ – 1/2 కప్పు

తాటి ముంజులు  చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పంచదార, ఐసు ముక్కలు, కొబ్బరి నీళ్లు కలిపి మిక్సీలో బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి సర్వ్ చేయాలి.  అంతే చల్లటి జ్యూస్ రెడీ..  రెంఢు మూడు పుదీనా ఆకులు వేసుకుంటే రుచి, సువాసన హెచ్చుతుంది..:)