ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

10 commandments of uses of ginger - USE ALLAM AND YOUR LIFE BECOMES BELLAM - OK





1. అజీర్ణం, మలబద్దకం వంటి కారణాలవల్ల చర్మం మీద దద్దుర్లు ఏర్పడుతుంటే పూటకు టీ స్పూన్‌ అల్లం రసాన్ని సమాన భాగం పాత బెల్లంతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. 

2. అల్లం రసాన్ని కొద్దిగా వేడి చేసి నువ్వుల నూనెను, తేనెను, సైంధవ లవణాన్ని కలిపి 2-4 బిందువుల చొప్పున రెండు చెవుల్లోనూ రోజుకు 3-4 సార్లు నొప్పి తగ్గేవరకూ వేసుకోవాలి. 

3. రెండు టీ స్పూన్ల అల్లం రసంలో టీ స్పూన్‌ తేనె కలిపి ఉదయం, సాయంకాలాలు రెండుపూటలా తీసుకుంటూ ఉంటే జలుబు తగ్గుతుంది. 

4. రెండు చెంచాల అల్లం రసంలో చిటికెడు పిప్పళ్ళు చూర్ణం, చిటికెడు సైంధవ లవణం(రాతి ఉప్పు) కలిపి రాత్రి పడుకునే సమయంలో వారంపాటు తీసుకుంటే ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి.

5. అల్లం రసాన్ని ముక్కు రంధ్రాల్లో నస్యంగావేస్తే తెలివి తప్పిపడిపోయిన వారికి తిరిగి స్పృహ వస్తుంది.

6. అల్లంకు సమాన భాగం బెల్లం కలిపి పూటకు రెండు టీ స్పూన్‌ మోతాదులో రెండుపూటలా తీసుకుంటే మూడు దోషాలు ఏక కాలంలో వికృతి చెందిన సందర్భాల్లో గుణం కనిపిస్తుంది. 

7. అల్లాన్ని ముద్దగా దంచి దంతాల మీద, చిగుళ్ల మీద కొంచెం సేపు ఉంచుకుంటే జలుబులో దంతాలు లాగటం, జివ్వుమనడం వంటి సమస్యలు తగ్గుతాయి.

8. అల్లం రసాన్ని కొద్దిగా వేడి చేసి రెండు చెవుల్లోనూ 4-5 చుక్కలు చొప్పున వేసుకోవాలి. 

9. అల్లం రసాన్ని పూటకు 2 టీ స్పూన్ల మోతాదులో తీసుకొని జీర్ణమైన తరువాత రెండుపూటలా ఉడికించిన బియ్యం, పాలు ఆహారంగా తీసుకోవాలి.

10. అల్లం రసాన్ని ఏడాదిపాటు నిల్వచేసిన నెయ్యిలో కలిపి ముద్దకర్పూరం కలిపి వేడిచేసి ఛాతిమీద పూసుకొని సున్నితంగా మర్ధనచేస్తే న్యుమోనియాలో ఛాతి నొప్పి వంటి సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది.