ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CAULIFLOWER PLUS GREEN PEAS FRY



కావలసిన పదార్థములు:

కాలీఫ్లవర్‌ :1
బఠానీ : 100 గ్రాములు
ఉల్లిపాయలు, : 4
పచ్చిమిర్చి : 50గ్రాములు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : 8 రేకులు
లవంగాలు2, యాలకులు, దాల్చిన చెక్క:2
గసగసాలు :1స్పూను
ఉప్పు, కారం, పసుపు, నూనె : తగినంత
కొత్తిమీర : తగినంత
పెరుగు : 1గ్లాసు
సెనగపప్పు : 2స్పూన్లు


తయారు చేయు విధానము:

 ఎండు బఠానీ అయితే రాత్రి నాన బెట్టాలి. కాలీఫ్లవర్‌ చిన్న చిన్న కొమ్మలుగా కట్‌ చేయాలి.
ఉల్లిపాయలు పొడవు ముక్కలు తయారు చేయాలి. బఠానీ
ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వేరుశెనగపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ కలిపి ముద్ద నూరాలి. బాణలిలో నూనె మరిగాక ఆవాలు, కర్వేపాకు వేయించి ఉల్లిపాయల ముక్కలు బ్రౌన్‌ కలర్‌లో వేయించి నూరిన మసాలా ముద్ద వేసి వేయించి కాలీఫ్లవర్‌, ఉప్పు, పసుపు వేసి మగ్గించి బఠానీ వేసి కలియబెట్టి కొద్దినీరు వేసి వుడుకుచుండగా చిలికిన పెరుగు వేసి కలిపి గ్రేవి చిక్కబడ కుండానే దించాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. ఇది అన్నం, చపాతీ, పలావ్‌లకు కూడా బావుంటుంది.