ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TIPS FOR CLEANING CLOTHES WITH NIMBO - TRADITIONAL WAY IN TELUGU



బట్టలపై మొండి మరకలను వదలగొట్టడానికి మార్కెట్‌లో రకరకాల స్టెయిన్‌ రిమూవర్‌ లిక్విడ్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే అవి ఖర్చుతో కూడినవి అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే
ఉంటుంది. బట్టలపై పడే మరకలను తొలగించడానికి ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి కొన్ని మొండి మరకలు అంత త్వరగా వదలవు. సిరా, రక్తం, కాఫీ మరియు రస్ట్‌ మరకలు మొండి మరకలు. వీటిని తొలగించేటప్పుడు ఈ క్రింది చిట్కాలను పాటించి చూడండి. అయితే ఒకమరకపై పనిచేసిన చిట్కా మరొక రకమైన మరకపై పనిచేయక పోవచ్చు.
ముఖ్యంగా స్త్రీల విషయంలో రుతుక్రమంలో రక్తపు మరకలు కొత్త బట్టలు. లేదా ఇష్టమైన బట్టల మీద పడితే చాలా బాధ పడుతుంటారు. ఇంక వాటిని
ఉపయోగించడానికి వీలు పడదని డిసైడ్‌ అయి పోతారు. రక్తపు మరకలు పసుపు పచ్చ వర్ణంలోనికి తిరిగి మొండి మరకగా ఏర్పడుతుంది. ఈ మరకను వదలగొట్టాంటే సాధ్యపడదు.అటువంటప్పుడు మేము కొన్ని సులభ చిట్కాలు అందిస్తున్నాం.రక్తపు మరక ఏర్పడ్డ వెంటనే వీటిని ఉపయోగించినట్లయితే రక్తపు మరకలు త్వరగా వదిలించుకోవచ్చు. రక్తపుమరకులు తడి ఆరిపోతే వదిలించుకోవడం చాలా కష్టం. మరి ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం.
ఉప్పు: దుస్తులమీద రక్తపు మరకలు ఏర్పడ్డ వెంటనే ఆ దుస్తులను ఉప్పు వేసిన నీటిలో నానబెట్టుకోవాలి.
ఉప్పు రక్తపుమరకను లైట్‌గా మార్చి సులభంగా మరక వదిలేదా చేస్తుంది.
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌: నాన్‌ టాక్సిక్‌ కెమికల్స్‌లో నానబెట్టాలి లేదా హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ రెండు మూడు చుక్కలు నీటిలో వేసి మరకలున్న దుస్తులను అందులో నానబెట్టిన తర్వాత శుభ్రం చేస్తే మరకలు వదిలి పోతాయి.

డిటర్జెంట్‌ బార్‌: డిటెర్జెంట్‌ సోపులను ఉపయోగించడం వల్ల కూడా రక్తపు మరకలు సులభంగా పోగొట్టవచ్చు. మరకలు వదిలించడంలో డిటర్జెంట్‌ పౌడర్లు పని చేయకపోతే డిటర్జెంట్‌ సోపులను ఉపయోగించి, వేడి నీళ్ళ సహాయంతో అతి సులభంగా తొలగించ వచ్చు.

చల్లటి నీళ్ళు: రక్తపు మరకలు అప్పుడే పడిఉంటే, వెంటనే చల్లటి నీటిలో ఆ దుస్తులను నానబెట్టిన తర్వాత మరకల మీద ఉప్పు వేసి బాగా రుద్ది శుభ్రంచేయడం వల్ల మరక వదిలిపోవడమే కాకుండా దుస్తుల యొక్క రంగు మారదు.
బేకింగ్‌ సోడా: చాలా వరకు దుస్తులను శుభ్రపరచడానికి బేకింగ్‌ సోడాను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.కాబట్టి ఫాబ్రిక్‌ క్లోత్స్‌ను ఉతికేటప్పుడు బేకింగ్‌ సోడాను
ఉపయోగించడం వల్ల దుస్తుల మీద మెండి మరకలు వదలడంతో పాటు, కలర్‌మారకుండా సహాయ పడుతుంది.

నిమ్మ:ఇది మరొక క్లీనింగ్‌ ఏజెంట్‌. దీన్ని నేచురల్‌ బ్లీచ్‌గా ఉపయోగిస్తారు. రక్తపు మరకలున్న చోట ఉప్పు మరియు నిమ్మతొక్కతో రుద్దడం వల్ల మరకలు సులభంగా తొలగిపోతాయి.