ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HOT HOT WINTER SPECIAL - EGG MASALA DOSA

కావలసినవి...

దోశెల పిండి - అరకేజి
ఉల్లిపాయ - ఒకటి
ఉడకబెట్టిన గుడ్లు - 4
వెల్లుల్లి రెమ్మలు- 4 లేక 5
అల్లం ముక్క - చిన్నది
ధనియాల పొడి-అర టీస్పూన్‌ 
పచ్చిమిర్చి - 2
పసుపు - చిటికెడు
టమాటో గుజ్జు - కొద్దిగా
గరం మసాలా పొడి - ముప్పావు టీస్పూన్‌
క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు - సన్నగా తరిగినవి అరకప్పు
నెయ్యి లేక నూనె - సరిపడినంత
కొత్తిమీర ఆకులు - కొన్ని
ఉడకబెట్టిన పచ్చి బఠాణీ - 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడ


మసాలా తయారు చేసే విధానం...
ఉడకబెట్టిన గుడ్డు పై పెంకు తీసి, మీడియం సైజు ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఉల్లిపాయను ముక్కలుగా చేసుకుని, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఈ ముద్దను వేసి కొద్ది సేపు వేయించుకోవాలి. దీనికి మిగతా మసాలా సామాను కూడా కలిపి మరి కొద్ది సేపు వేగనివ్వాలి. తరువాత టొమాటో ప్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు కూరగాయల ముక్కలు, పచ్చిబఠాణీలు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న గుడ్లు కూడా వేసి కప్పు నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. దించే ముందు కొత్తిమీర ఆకులు చల్లి పక్కన పెట్టుకోవాలి. కూర గట్టిపడేంత వరకూ పొయ్యిమీద వుంచుకోవాలి. 

దోశ వేసే విధానం: పాన్‌ మీద తక్కువ నూనె వేసి దోశను పలుచగా పోసి దోరగా కాల్చుకోవాలి. దీనిపైన రెడీ చేసుకున్న ఎగ్‌ మసాలా కూర పలుచగా పరిచి, మధ్యకి మడచి కిందకి దింపేయాలి. దీనికి కొబ్బరి చట్నీ, సాంబారు మంచి కాంబినేషన్‌.