తొమ్మిది నెలలు మోసి కంటి రేపల్లె మాకు కావలుంటూ,
కట్టుకున్నవాడు కంట తడి పెట్టిస్తున్న,ఇంటికి చేరిన పిల్లలకు
ఎక్కడ తన బాధ తెలియునోనని పుట్టెడు దుక్కం దిగ మింగుతూ
మేమే నీ లోకంగా బ్రతుకుతున్నావా అమ్మా,...!!
నీ కష్టాలను చూసి ఓదార్పునివ్వక, ఒక్క కన్నీటి బొట్టు
కార్చలేని కొడుకు కోసం నీవు తల్లడిల్లి పోవద్దమ్మా,...!!
ఆడపిల్లగా పుట్టానని సమాజం నన్ను అలుసుగా
చుస్తుందేమోనని, నాకోసం దిగులు పడకమ్మా,....!!
మరో అయ్య చేతిలో నన్ను ఎలా అప్పగించాలని
ప్రతి నిమిషం నీవు కలత చెందకమ్మా,...!!
నీ జీవితం మా ఆనందానికి ధారపోసి ,పగలు రాత్రిళ్ళు
అలసి పోకుండా సేవలు చేస్తున్న అమ్మ,
పేగు బంధానికి కృతజ్ఞతగా నా కడుపునా నిన్ను
మోసి ఋణం తీర్చుకోవాలని ఉందమ్మా, .