loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

STUNNING PEACOCK SILK SAREE


PEACOCK EYE DESIGNED SAREE


PEACOCK FEATHER DESIGNED COLOURFUL SAREE


PEACOCK DESIGNED COTTON SAREE


WHITE PEACOCK SAREE AND BLOUSE


NATURAL OILS AVAILABLE FOR SKIN DISEASES AND SKIN CARE REGULARLY - TIPS FOR SHINY SKIN WITH NATURAL OILS

చర్మ వ్యాధులను ఉపశమింపచేయడానికిగానీ, పూర్తిగా నివారించడానికిగానీ ఆయుర్వేదంలో రెండు రకాల తైలాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఔషధ గింజల నుంచి తీసిన తైలాన్ని చర్మంపైన లేపనంగాగానీ, మర్దన కోసంగానీ వాడేవి మొదటి రకం. వీటిని ఏకమూలికా తైలాలు అంటారు. ఇవి
ఉపశమనానికి ఉపయోగపడతాయి. ఇక చర్మ వ్యాధులను నివారించేందుకు వాడేవి రెండవ రకం. కొన్ని రకాల వనమూలికల బెరడు, ఆకులు, గింజలు, పళ్ల తొక్కలు, పూరేకులు ముద్దగా దంచి పెట్టుకుని వీటికి తగిన నిష్పత్తిలో నువ్వుల నూనె లేక ఆముదం నూనె, కొబ్బరి నూనె తగిన నిష్పత్తిలో తీసుకుని మంచి నీళ్ళుగాని లేక అదే మూలికల కషాయాన్నిగానీ కలిపి అన్నీ ఓ పాత్రలోకి చేర్చి నిపుణులైన ఆయుర్వేద వైద్యులు, ఫార్మాసిస్టులు తయారు చేసేవి. వైద్యుడు ఆయా మూలికల గుణగణాల ఆధారంగా ఫార్ములా ఆయిల్స్‌ తయారు చేస్తాడు. ఆధునికంగా మరో రెండు తైలాలు కూడా వాడుకలోకి వచ్చాయి. వాటిలో ఇగిరే ధర్మం కలిగిన సుగంధ తైలాలు(ఎస్ప్సెన్స్‌ ఆయిల్స్‌/ఓలటైల్‌ ఆయిల్స్‌) 'అర్కం'(డిస్టిలేషన్‌ మెథడ్‌)లో తయారు చేస్తారు. ఇలా మూలికల నుంచే కాకుండా 'ఇము' పక్షులు, కార్డ్‌ చేపల నుంచి కూడా తైలాలను తయారు చేస్తారు. చర్మ వ్యాధులకు ఉపయోగించే తైలాలన్నీ దాదాపు చర్మంపైన పూత లేదా మర్దన రూపంలోనే
ఉపయోగించాలి. ఇలా ఔషధ గుణాలను చర్మం ద్వారా శరీరంలోకి చొప్పించడం ద్వారా, చర్మం సమస్యను శుభ్రపర్చడం, మాన్పడం సాధ్యమవుతుంది. మర్దనతో తైలం రక్తాన్ని చేరి రక్త శుద్ధి లేదా చర్మవ్యాధికి కారణమైన రక్తంలోని సూక్ష్మక్రిములను కూడా చంపేస్తుంది. వీటితో పాటు రక్తశుద్ధిని చేసే ఇతర ఔషధాలను కడుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. ఫలితంగా చర్మ వ్యాధులు సమూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. అన్ని రకాల చర్మవ్యాధులకు ఆయుర్వేదం రక్తదోషాన్ని కారణంగా భావిస్తుంది. అందుకే రక్తశుద్ధి చికిత్సలకు ఆయుర్వేదం ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.

ఏకమూలికా తైలాలు : ఆముదం నూనెలో ఉండే 'అన్‌డిసైలెనిక్‌ యాసిడ్‌' రసాయనం చర్మ వ్యాధుల పైన పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐసోసి ్టయరిక్‌ యాసిడ్‌, సక్సినిక్‌ యాసిడ్‌లు స్కిన్‌ కండిష నింగ్‌కు ఉపయోగ పడ తాయి. ఈ నూనెలో
ఉండే రిసోనిక్‌ యాసిడ్‌ చర్మవ్యాధుల్లో వచ్చేవాపును అరికడుతుంది. ఇప్పుడు వస్తున్న స్కిన్‌ ఆయింట్‌మెంట్లలో ఆముదపు నూనెను వినియోగించడానికి ఇదే కారణం. సాంప్రదాయక గృహవైద్యంలో కూడా ఆముదం వినియోగం ఎక్కువగానే కనిపిస్తుంది. పొడిబారిన చర్మంపైన తేమ నిలవడానికి, వెంట్రుకలు ఏపుగా ఎదగడానికి, నల్లబడటానికి కూడా ఆముదపు నూనెను వాడతారు. కనురెప్పల మీద వచ్చే కురుపులు తగ్గడానికి ఆముదపు చుక్కలు కంట్లో వేయడం గానీ, ఆముదపు దీపంతో ఏర్పడే మసిని కాటుకగా వాడటం కూడా చాలా మందికి అలవాటుగా ఉంది. అలాగే చర్మంపైన ఏర్పడే కురుపులు లేదా పుండ్లకు పూతలా రాయడం కూడా చూస్తూ
ఉంటాం. ఈ చికిత్సలన్నీ ఎంతో ఫలితాన్నిస్తాయి.

కలౌంజీ నూనె : కలౌంజీ గింజలను బ్లాక్‌సీడ్స్‌ లేదా కార్‌వే సీడ్స్‌ అంటారు. ఈ నూనెతో తలపై రోజూ మర్దన చేయడం ద్వారా జుట్టు రాలిపోవడం చాలా వరకు ఆగి పోతుంది. అలాగే ఈ నూనెకు తగినంత వెనెగార్‌ కలిపి మొటిమల మీద పూస్తే తగ్గే అవకాశం ఉంది. పై సమస్యల్లో ఈ నూనెను అరచెంచా చొప్పున కొంచెం తేనెతో కలిపి కడుపులోకి తీసుకుంటే మరింత ప్రయోజనం
ఉంటుంది. చర్మ క్యాన్సర్‌లో కూడా ఈ నూనెతో ఫలితం కనిపిస్తుంది.

నువ్వుల నూనె : ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌ కారణంగా మెలనిన్‌ వర్ణ రసాయనాల కారణంగా నెరసిన జుట్టు నల్లబడుతుంది. జుట్టురాలకుండా ఆగిపోతుంది. ఈ నూనెలో విటమిన్‌ 'ఇ', మెగ్నీషియం, కాపర్‌ ఐరన్‌, జింక్‌ కూడా ఉండడం వల్ల చర్మ రక్షణకు ఈ నూనెతో చేసిన మర్ధన ఎంతో
ఉపయోగపడుతుంది.

ఆలివ్‌ నూనె : పొడిబారే చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఎంతో ప్రసిద్ధమైన తైలమిది. ఫేషియల్స్‌కి గానీ, బాడీ పాలిషింగ్‌లోగానీ ఆయిల్‌ క్లెస్సర్‌గా ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్‌-ఇ సమృద్ధిగా ఉండడం వల్ల చర్మ రక్షణకు బాగా తోడ్పడుతుంది. చర్మ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడే ధర్మం కూడా ఈ నూనెలో ఉంది.

చాల్మోగ్రా నూనె : ఈ నూనెకు 'తువరక తైలం' అనే పేరు కూడా
ఉంది. చర్మవ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కుష్టువ్యాధిలో వచ్చే వ్రణాలకు డ్రెస్సింగ్‌ చేయడానికి బాగా
ఉపయోగపడుతుంది. సిఫిలిస్‌, గనేరియా, సంబంధిత పుండ్లను కూడా ఈ నూనె బాగా తగ్గిస్తుంది. ఇవే కాకుండా రింగ్‌వార్మ్‌, ఎగ్జిమా, స్కైబీస్‌ వంటి చర్మవ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రసవానంతరం జననాంగం నుండి దుర్గంధం వచ్చే సందర్భాల్లో ఈ తైలంలో ముంచిన స్టెరైల్‌ టాంపూస్‌ను

ఉపయోగించవచ్చు. దీర్ఘకాలిక చర్మవ్యాధులన్నిటిలోనూ ఈ తైలాన్ని వైద్య పర్యవేక్షణలో కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.


10 commandments of uses of ginger - USE ALLAM AND YOUR LIFE BECOMES BELLAM - OK

1. అజీర్ణం, మలబద్దకం వంటి కారణాలవల్ల చర్మం మీద దద్దుర్లు ఏర్పడుతుంటే పూటకు టీ స్పూన్‌ అల్లం రసాన్ని సమాన భాగం పాత బెల్లంతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. 

2. అల్లం రసాన్ని కొద్దిగా వేడి చేసి నువ్వుల నూనెను, తేనెను, సైంధవ లవణాన్ని కలిపి 2-4 బిందువుల చొప్పున రెండు చెవుల్లోనూ రోజుకు 3-4 సార్లు నొప్పి తగ్గేవరకూ వేసుకోవాలి. 

3. రెండు టీ స్పూన్ల అల్లం రసంలో టీ స్పూన్‌ తేనె కలిపి ఉదయం, సాయంకాలాలు రెండుపూటలా తీసుకుంటూ ఉంటే జలుబు తగ్గుతుంది. 

4. రెండు చెంచాల అల్లం రసంలో చిటికెడు పిప్పళ్ళు చూర్ణం, చిటికెడు సైంధవ లవణం(రాతి ఉప్పు) కలిపి రాత్రి పడుకునే సమయంలో వారంపాటు తీసుకుంటే ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి.

5. అల్లం రసాన్ని ముక్కు రంధ్రాల్లో నస్యంగావేస్తే తెలివి తప్పిపడిపోయిన వారికి తిరిగి స్పృహ వస్తుంది.

6. అల్లంకు సమాన భాగం బెల్లం కలిపి పూటకు రెండు టీ స్పూన్‌ మోతాదులో రెండుపూటలా తీసుకుంటే మూడు దోషాలు ఏక కాలంలో వికృతి చెందిన సందర్భాల్లో గుణం కనిపిస్తుంది. 

7. అల్లాన్ని ముద్దగా దంచి దంతాల మీద, చిగుళ్ల మీద కొంచెం సేపు ఉంచుకుంటే జలుబులో దంతాలు లాగటం, జివ్వుమనడం వంటి సమస్యలు తగ్గుతాయి.

8. అల్లం రసాన్ని కొద్దిగా వేడి చేసి రెండు చెవుల్లోనూ 4-5 చుక్కలు చొప్పున వేసుకోవాలి. 

9. అల్లం రసాన్ని పూటకు 2 టీ స్పూన్ల మోతాదులో తీసుకొని జీర్ణమైన తరువాత రెండుపూటలా ఉడికించిన బియ్యం, పాలు ఆహారంగా తీసుకోవాలి.

10. అల్లం రసాన్ని ఏడాదిపాటు నిల్వచేసిన నెయ్యిలో కలిపి ముద్దకర్పూరం కలిపి వేడిచేసి ఛాతిమీద పూసుకొని సున్నితంగా మర్ధనచేస్తే న్యుమోనియాలో ఛాతి నొప్పి వంటి సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. 

CAULI FLOWER WITH BATANI HOT RECIPE IN TELUGU


కావలసిన పదార్థములు:

కాలీఫ్లవర్‌ :1
బఠానీ : 100 గ్రాములు
ఉల్లిపాయలు, : 4
పచ్చిమిర్చి : 50గ్రాములు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : 8 రేకులు
లవంగాలు2, యాలకులు, దాల్చిన చెక్క:2
గసగసాలు :1స్పూను
ఉప్పు, కారం, పసుపు, నూనె : తగినంత
కొత్తిమీర : తగినంత
పెరుగు : 1గ్లాసు
సెనగపప్పు : 2స్పూన్లు

తయారు చేయు విధానము: 

ఎండు బఠానీ అయితే రాత్రి నాన బెట్టాలి. కాలీఫ్లవర్‌ చిన్న చిన్న కొమ్మలుగా కట్‌ చేయాలి.
ఉల్లిపాయలు పొడవు ముక్కలు తయారు చేయాలి. బఠానీ
ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వేరుశెనగపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ కలిపి ముద్ద నూరాలి. బాణలిలో నూనె మరిగాక ఆవాలు, కర్వేపాకు వేయించి ఉల్లిపాయల ముక్కలు బ్రౌన్‌ కలర్‌లో వేయించి నూరిన మసాలా ముద్ద వేసి వేయించి కాలీఫ్లవర్‌, ఉప్పు, పసుపు వేసి మగ్గించి బఠానీ వేసి కలియబెట్టి కొద్దినీరు వేసి వుడుకుచుండగా చిలికిన పెరుగు వేసి కలిపి గ్రేవి చిక్కబడ కుండానే దించాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. ఇది అన్నం, చపాతీ, పలావ్‌లకు కూడా బావుంటుంది. 

COMMON MAN'S SUMMER SPECIAL FIRST CHOICE FOR INSTANT DRINK - CHILLED SUGAR CANE JUICE - THE TASTY THUNDER DHAMAKA
ప్రస్తుత కాలంలో పట్టణాలు, నగరాల్లో కూడా షుగర్‌ కేన్‌ స్టాల్స్‌ ఏర్పడ్డాయి. మనం అక్కడ చూస్తుంటాం. చెరకు నుండి రసాన్ని వేరు చేసి అమ్ముతుంటారు. మీకు తెలియాల్సిన ఓ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇందులో ఆరోగ్యానికి సహాయపడే చాలా ఉపయోగాలున్నాయి. ఈ సంక్రాతి రోజుల్లో ప్రతి ఇంటా చెరకు నిల్వ ఉంటుంది. పొంగల్‌ సెలబ్రేషన్స్‌లో చెరుకు అతి ముఖ్యంగా ఉపయోగిస్తారు. పండుగ తర్వాత ఈ చెరుకు గడలను పారవేయడం కంటే వాటిలో నుండి రసం తీసి మీ ఆరోగ్యానికి కావాల్సిన కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చెరుకు రసం లో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్‌, విటమిన్స్‌, మరియు యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. పిల్లలు, పెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చెరకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది.ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత.కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన జబ్బులను ఇది నివారిస్తుంది. అవేంటో చూద్దాం... 1. కామెర్లకు విరుగుడు: సుగర్‌ కేన్‌ జ్యూస్‌(చెరకు రసం) కామెర్లను సహజంగా నయం చేసే ఒక ఔషధం. రక్తంలోని బిల్లిరుబిన్‌ కారణంగా కామెర్లు ఏర్పడి చర్మం పొరలుగా పసుపు రంగులోకి మారుతుంది. ఇది కాలేయ పనితీరు సరిగ్గా లేకపోవడం మరియు పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు కారణం అవుతుంది.కాబట్టి దీని నుండి బయటపడటానికి ఒక గ్లాసు చెరకు రసంకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజు తీసుకోవాలి. 2. ఇన్ఫెక్షన్‌(వ్యాధులు): అనేక రకాల వ్యాధులు ఉదా: డయోరియా, మూత్ర మార్గ అంటువ్యాధులు, కడుపు(జీర్ణ) లేదా గుండె సంబంధిత వ్యాధులు, లైంగిక సంక్రమణ, వాపు ఇటువంటి వ్యాధులకు చెరకు రసం తో బాగా నయం చేయవచ్చు.bవఅఱళ్‌ర సతీఱఅసఱఅస్త్ర రబస్త్రaతీషaఅవ jబఱషవ 3. కిడ్నీ(మూత్రపిండం)లో రాళ్ళు: చెరకు రసంతో ఇది చాలా ప్రభావంతమైన ఆరోగ్యప్రయోజనం. డీహైడ్రేషన్‌ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ లో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ ద్రవాలను మరియు చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవటానికి చెరకు రసం ఉపయోగపడుతుంది. 4. మధుమేహానికి: మధుమేహం ఉన్నవారికి షుగర్‌ కేన్‌ బాగా సహాయపడుతుంది. ఇది ముడి షుగర్‌ కన్నా లేదా ఆర్టిఫిషియల్‌ షుగర్‌ కన్నా ఈ షుగర్‌ కేన్‌ జ్యూస్‌ చాలా మంచిది. మీరు బరువు తగ్గించే పనిలో ఉన్నా లేదా డయాబెటిక్‌ షుగర్‌ కేన్‌ జ్యూస్‌ తాగడం చాలా ఆరోగ్యకరం. ఈ జ్యూస్‌ శరీరంలో రక్తంలోని గ్లూకోజ్‌ లెవల్స్‌ ను క్రమబద్దీకరిస్తుంది. 5. న్యూట్రిషియన్‌ బెనిఫిట్స్‌: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటుగా బి2(రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీ షియం, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్‌లు సమృద్ధిగా ఉం టాయి.కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బో హైడ్రేట్లు అపారం. 6. జలుబు, జ్వరం మరియు గొంతునొప్పి: మీరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్‌ తీసుకోవడం హానికరం అని భావిస్తే అది తప్పే.ఇటువంటప్పుడు ఒక గ్లాసు షుగర్‌ కేన్‌ జ్యూస్‌ తాగడం వల్ల ఈ జబ్బుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. 7. క్యాన్సర్‌ నివారిణి: ఇందులో ఆల్కలీన్‌ కలిగి ఉండటం వల్ల, చెరకు రసం ముఖ్యంగా ప్రొస్టేట్‌, కోలన్‌,ఊపిరితిత్తుల లేదా రొమ్ముక్యాన్సర్‌, క్యాన్సర్‌ కారకాలను నిరోధిస్తుంది. 8. డీహైడ్రేషన్‌: సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువగా నీరు త్రాగరు. దాంతో డీహైడ్రేషన్‌ గురి అవుతుంటారు. కాబట్టి శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది. ఇంకా వేసవి కాలంలో చెరకు రసం త్రాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. 

ARTICLE OF PNEUMONIA - HOW IT EFFECTS - ITS REMEDIES - TIPS TO PUT CHECK TO PNEUMONIA - SPECIAL CARE IS NECESSARY TO KIDS/OLD AGE PEOPLE - DOCTOR'S ADVISE IS 100% NECESSARY - SO DON'T NEGLECT PNEUMONIA

పసికందుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే అతి ప్రమాద కర వ్యాధి న్యుమోనియా(శ్వాసకోశ వ్యాధి). పట్టుమని ఐదేళ్లయినా నిండక ముందే ఎంతో మంది పిల్లలు దీని బారిన పడుతూ ఉంటా రు. పారిశ్రామిక ప్రదేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు, యాంటీబ యాటిక్‌ మందులు ద్వారా పిల్లలను రక్షించునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆ స్థాయి చైతన్యమే కొరవడింది. ప్రపంచ న్యుమో నియా నివారణదినోత్సవం సందర్భంగా ఆ చైతన్యానికి శ్రీకారం చుడదాం. జీవితకాలమంతా హాయిగా సాగిపోవలసిన శ్వాసక్రియ బాల్యంలోనే మారాం చేస్తే ఏమైపోవాలి? న్యుమోనియా వ్యాధి బారిన పడిన పిల్లలు ఆటపాటల సంగతి అలా ఉంచి శ్వాసతీసుకోవడానికే నానా అవస్థలు పడుతుంటారు. ఈ వ్యాధి సోకిన విషయం తెలియ డంలో కొంత మందికి చాలా సమయం పడుతుంది. దాని వల్ల వ్యాధి తాలూకు దుష్ప్రభావాలు ఎక్కువవుతాయి.

ఏమిటీ సమస్య? :- న్యుమోనియా ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే ఒక శ్వాసకోశ వ్యాధి. శ్వాసనాళాల్లో వాపు మొదలయి వాటిలో కొన్ని రకాల ద్రవాలు నిండిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ ద్రవాలు కారణంగా శ్వాసకోశాలు తమ విధులను సక్రమంగా నిర్వ ర్తించలేవు. ఫలితంగా శరీరానికి అందవలసిన ఆక్సిజన్‌ సక్రమంగా అందకుండా పోతుంది.
ఎక్కడివి ఈ ఇన్‌ఫెక్షన్లు? :- వాతావరణంలో ఉండే పలురకాల సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశించి న్యుమోనియా కలిగిస్తాయి. ఈ క్రిముల కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లే శ్వాసకోశాలను దెబ్బతీ స్తాయి. అలాగే న్యుమోనియాకు గురైన వారు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు అవి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. సహజంగానే మన గొంతులో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. మామూలుగా అయితే దీనివల్ల కలిగే హాని ఏమీ ఉండదు. కానీ, వైరస్‌ల కారణంగా శరీరం బలహీనపడినప్పుడు ఇది కొంత అనారోగ్యానికి దారి తీయ వచ్చు. సక్రమంగా లేని ఎయిర్‌కండీషన్‌లు, వాటర్‌షవర్‌ల వల్ల కుడా ఈ సమస్య రావచ్చు. అలాగే కొన్ని రకాల పక్షుల ద్వారా కూడా మనుషులు న్యుమోనియాకు గురయ్యే ప్రమాదం ఉంది.
ఎవరిలో ఎక్కువ? :- న్యుమోనియా వయోభేదం లేకుండా అందరికీ సోకుతుంది. కాకపోతే ఐదేళ్లలోపు పసిపిల్లలు, వృద్ధులు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతుంటారు. పొగ తాగే వారు కూడా ఈ సమస్యకు ఎక్కువగానే గురవుతారు. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు, రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన వారు కూడా న్యుమోనియాకు గురయ్యే ప్రమాదం ఉంది. వైరస్‌లే ప్రధాన కారణంగా వచ్చే ఈ సమస్య కొద్ది రోజుల్లోనే తన దుష్ప్రభావాన్ని చూపుతుంది. అన్ని సార్లు కేవలం యాంటీబయోటిక్‌స్‌తోనే ఈ సమస్య ను నయం చేయడం సాధ్యం కాదు. కొన్ని సార్లు ప్రత్యేక చికిత్సలు కూడా అవసరమవుతాయి.

లక్షణాలు :- న్యుమోనియా సోకిన వారిలో ఆకలి బాగా తగ్గిపోతుంది. నిరంతరం జ్వరంతో బాగా నీరసించిపోతారు. ఫ్లూ వ్యాధి లక్షణాలు, న్యుమోనియా లక్షణాలు దాదాపు ఒకేలా వుంటాయి. కాకపోతే న్యుమోనియాలో తరుచుగా దగ్గుతూ ఉంటారు.ఉమ్మి ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటుంది. కొన్నిసార్లు కడుపులో ఒక పక్క నొప్పి కూడా రావచ్చు. బలంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈ నొప్పి ఎక్కువవుతుంది. ఈ స్థితిలో డాక్టర్‌ను సంప్రదించడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు.

చికిత్స ఏమిటి? :- ఈ వ్యాధి చికిత్సలో యాంటీబయాటిక్స్‌దే ప్రధాన పాత్ర. కాకపోతే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్‌ కిల్లర్స్‌ కూడా అవసరమవుతాయి. పొగ తాగే అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలి. ఆహారంలో ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. ఈ చికిత్సతో న్యుమోనియా త్వరగానే తగ్గిపోతుంది. కాకపోతే నీరసం, నిస్సత్తువ మాత్రం ఆరు వారాలదాకా ఉంటాయి. ఈ స్థితి నుంచి తేరుకోవడానికి కొంత కాలం పూర్తి విశ్రాంతి అవసరం.
నివారణ ఎలా? :- పొగతాగడం ఈ వ్యాధి రావడానికి ఒక ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో పొగ తాగే అలవాటు ఉంటే అది పిల్లలకు న్యుమోనియా రావడానికి కారణమవుతుంది. కొన్ని సార్లు ఫ్లూ వ్యాధి కూడా న్యుమోనియాకు దారి తీస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ కాలంగా ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న వారు పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరమే. ఈ వ్యాధి రాకుండా నివారించే నూమోకాకల్‌ న్యుమోనియా అనే టీకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మున్ముందు న్యుమోనియా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ALTERNATIVES FOOD ITEMS WHO ARE HAVING HIGH BLOOD PRESSURE -TIPS
ఉప్పులేని కూరలు రుచిం చకపోవచ్చు. కానీ తప్పదు.. జీవితంలో కొన్నింటికి అల వాటు పడాల్సిందే! ప్రతి ఇంట్లో ముఖ్యంగా నిల్వ ఉండే వస్తువు ఉప్పు వంటకాల్లో తప్ప నిసరిగా ఉపయోగిస్తుంటారు. ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి హైపోథైరాయిడ్‌ మొదలుకొని హై బ్లడ్‌ ప్రెజర్‌ వరకూ దారితీస్తుంది.ఉప్పులో ముఖ్యంగా సోడియం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో సోడియం లోపిస్తే తలనొప్పి. తలతిరగడం, శరీర బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అదే సోడియం ఎక్కువైతే, హైబీపి, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సోడియంను ఉప్పులో మాత్రమే కాక మనం ప్రతిరోజూ వంటలకు ఉపయోగించే మరికొన్ని మూలికల్లో కూడా కనుగొనబడింది. చాలా ఆహారాల్లో సోడియం కంటెంట్‌ చాలా తక్కువగా ఉంటుంది. మనం సాధారణంగా ఉపయోగించే చాలా మసాలా దినుసుల్లో మరియు మూలికలను ఉపయోగించడం వల్ల రుచి మాత్రమే కాదు, ఈ నేచురల్‌ హెర్బ్స్‌లో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయని మనకు తెలుసు. అవి కూడా సాల్ట్‌కు ప్రత్యామ్నాయంగా పనికొస్తాయి. లేదా ఉపయోగించుకోవచ్చు. మూలి కలు మరియు మసాలా దిను సులు అంటే పెప్పర్‌, వెల్లుల్లి, అల్లం, తులసి మరియు యా లకులు వంటి వాటిని ఉపయోగించి రుచికరమైన వంటలను వండటం వల్ల మన నోట్లో నీరు ఊరా ల్సిందే. ఇవి మసాల దినుసులు మాత్రమే కాదు, ఉప్పుకు ప్రత్యామ్నాయాలు కూడా. హైబీ పి ఉన్నవారు కొన్ని వ్యాధులు రాకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ సాల్ట్‌ ఆల్టర్నేటివ్స్‌(ఉప్పు నిల్వ ఉన్న మసాల దినుసులు మరియు హెర్బ్స్‌)ను ఉపయోగించి ఆనందమయిన జీవితాన్ని గడపవచ్చు. ఈ మసాలా దినుసులు మరియు మూలికల్లో సోడియం తక్కువగా ఉండటమే కాదు, ఇది ఆరోగ్యానికి మరియు మంచి టేస్ట్‌ను అందించడంలో కూడా మంచివి.మరి ఉప్పుకు ప్రత్యామ్నాయాలైన మసాల మరియు మూలికలు ఏంటో ఒకసారి చూద్దాం.


తులసి: సాధారణంగా చెప్పుకొనే మూలికల్లో తులసి కూడా ఒకటి. మన భారతదేశంలో చాలా వంటకాల్లో తులసి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులు అధిక రుచిని కలిగి ఉంటాయి. మరియు కొద్దిగా తీపిగా కూడా ఉంటాయి. ఇది కేవలం ఒక వైద్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉండటమే.
రెడ్‌ చిల్లి: వీటిని రెడ్‌ చిల్లి పెప్పర్‌ అంటారు. ఇది ఉప్పుకు ఒక వర్ణనాత్మక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. స్పానిష్‌, మెక్సికన్‌ మరియు ఇండి యన్‌ వంటకాల్లో ఉప యోగిస్తారు. ఇవి ఎక్కువ కారం కలిగి ఉండి మరియు పెప్పర్‌ ప్లేవర్స్‌ తో ఉండి ఉప్పుకు మంచి ప్రత్యామ్నాయం.
బే లీఫ్‌: బే లీఫ్‌ను బిర్యాని ఆకు అంటారు.దీన్ని అధికంగా మసాల వంటకాలకు మరియు బిర్యానీ, మాంసాహార వంటలకు తప్పనిసరిగా
ఉపయోగిస్తుంటారు. ఈ స్వీట్‌ మరియు సువాసన కలిగించే ఆకులు ఎండిన తర్వాత మంచి సువాసన కలిగిస్తాయి. ఆహారాలను రుచిగా చేసే మసాల దినుసుల్లో ఇది కూడా ఒకటి.
వెల్లుల్లి పేస్ట్‌: వెల్లుల్లి పౌడర్‌ను ఉప్పుకు ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. ఇది వంటలను రుచిగా మార్చడమే కాదు ఇందులో ఔషధగుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి పొడిన మాంసా హారాల్లోనూ, ఫిష్‌ వంటకాల్లోనూ మరియు పాస్తా వంటకాల్లోనూ ఉపయోగిస్తారు.


బ్లాక్‌ పెప్పర్‌ (మిరియాలు) : బ్లాక్‌ పెప్పర్‌ మరియు ఉప్పుకు పెద్ద వ్యత్యాసం ఉండదు. బ్లాక్‌ పెప్పర్‌ సాల్ట్‌కు ప్రత్యామ్నాయంగా చాలా బాగా సహాయపడుతుంది. అంతే కాదు ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది.
సోయాసాస్‌: సాస్‌ కూడా ఉప్పుకు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో అధికంగా సాల్ట్‌ కలిగి ఉండటం వల్ల ఆహారాల్లో ఉపయోగించడం వల్ల మంచి రుచిని అందిస్తుంది. అంతేకాదు ఇందులో అధిక పోషకాలున్నాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి సోయాను మన డైలీ డయట్‌లో చేర్చడం వల్ల ఎక్కువ కాలం జీవించగలుగుతాం.
ఉల్లిపాయ పేస్ట్‌: ఉల్లిపాయను వెజిటబుల్‌గా వర్ణిస్తారు. ఇది అద్భుతమైన రుచికి చాలాప్రసిద్ధి. అయితే ఇది ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేది అద్భుతమైన రుచి మరియు పోషకాహారాల్లో ఒకటైన సల్ఫర్‌ అధికంగా ఉం డటం చేత దీన్ని తగు మోతాదులో ఉపయోగించాలి.
నిమ్మకాయ: తాజాగా ఉన్న నిమ్మరసం ఒక సహజ సంరక్షణకారిని అంటారు. మరియు ఒక అద్భుతమైన ఉప్పు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు

M - F


April 2013 / USAPDF | 134 pages | 105.6 Mb | English

D LINK

280 Crochet Shell Patterns


280 Crochet Shell Patterns

 

ISBN: 1601402066 | edition 2006 | JPG | 160 pages | 57.60 Mb

Freedom of creativity and plenty of choices: You'll enjoy both while using this compendium of shell stitches to fashion your own crochet designs. Choose from 280 pattern stitches by Darla Sims to make blankets, placemats, bedspreads, rugs--whatever you can imagine. From easy to intricate, you'll find dozens of pattern stitches to suit your skill level. The photo models were created using worsted weight yarn and a size H crochet hook, but you can use any yarn or hook you wish. This publication is the latest volume in our library of crochet stitches.

Download:

http://longfiles.com/lplmqwk3xf6y/1601402066.rar.html

http://onmirror.com/hetktin51yiy/1601402066.rar.html

EGG PICKLE FOR ALL THE YEAR SPECIAL ITEM ALSO PARTY DISHEGG TIPS IN TELUGUPUMPKIN SPECIAL CUSTARD RECIPE IN ELUGURAJANI KANTH AND MUMMATI - MANIRATNAM'S DALAPATHI MOVIE SONG LYRIC IN TELUGU


RAJANI KANTH AND MUMMATI - MANIRATNAM'S DALAPATHI MOVIE SONG LYRIC IN TELUGU

M W


 March 2013
English | 238 pages | PDF | 65.69 Mb
loading...