ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SUMMER COOL TIPS - DRINK NATURAL JUICES - NATURAL WATER FROM COCONUT ETC


సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము

వేసవి రాగానే చల్లని పానీయాల వైపు మనసు మళ్ళుతుంది.శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఈ క్రింది సహజ పోషకాలు ఇచ్చే పానీయాలను సేవిద్దాము.

1) కొబ్బరినీరు: ఇందులో 5 కీలక electrolights పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,సోడియం,కాల్షియం లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.

2) మజ్జిగ: దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును.ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను త్వరగా జీర్ణం చేయును.ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12 లభిస్తాయి.

3) సబ్జా నీరు: మహిళలకు అవసర మయ్యె పాలేట్, నియాసిన్, చర్మాన్నిఅందంగా ఉంచే విటమిన్ E అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

4) పుచ్చకాయ : గుండెజబ్బులు రాకుండా చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే LYKOPIN సూర్యరశ్మి లోని U.V కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

5) తాటి ముంజలు :6 అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

6) నిమ్మరసం: సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది.విటమిన్ సి ఎక్కువ

7) చెరుకు రసం: ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం మూలకాలుంటాయి. ఇవి రొమ్ము ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.

8) రాగి జావ: ఇది మధుమేహం, కీళ్ల నొప్పుల, acidity ని తగ్గిస్తుంది.
ఈ పానీయాలను సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు