ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTHY ADVANTAGES OF BUDIDHA GUMMADI KAYA - ARTICLE IN TELUGU ON GUMMADIKAYA



ఆరోగ్య బూడిదగుమ్మిడి

”పాదు’కొలిపినగుమ్మడి


ప్రకృతి అందించిన ఫల, పుష్ప, శాకాంబరాది దివ్యౌషధ వనరుల్లో ఎంతో శక్తినిచ్చేది, ఈ బూడిదగుమ్మడికాయ. ఇంచుమించుగా భారతదేశంలో దీని వినియోగం అధికంగానే ఉంటుంది. అంతే కాకుండా చైనా, థైవాన్‌, పాకిస్తాన్‌, జపాన్‌, వియత్నాంల్లో కూడా దీని వాడకం ఎక్కువగానే ఉంది. దీని శాస్త్రీయనామం బెనిన్‌కాసా హిస్పిడా. ఇది కుకుర్‌బిటాసియా కుటుంబానికి చెందిన మొక్క. ఇది నేలమీద పాకుతూ పెరిగే తలలాంటిది. కానీ, దీనికి కాసే గుమ్మడి కాయ చాలా పెద్దగా ఉండి, బూడిద పూసినట్టు ఉంటుంది. ఇంచుమించుగా భారత దేశంలో ఇది ప్రతి ఇంటిలోను, వ్యవసాయక్షేత్రంలోను, అనేక చోట్ల పూరిపాకల కపðల మీద ఎగబ్రాకుతూ పెరుగుతూవుంటుంది. దీనిని వింటర్‌ మిలాన్‌ అని, వైట్‌ గార్డ్‌ అని కూడా వాడుకలో వ్యవహరి స్తారు. చైనాలోను, తైవాన్‌లోను దీని నుండి తయారు చేసిన సూప్‌ని అధికంగా వాడతారు. ముఖ్యంగా చైనీయులు జరుపుకునే చంద్రోత్సవ వేడుకలో ఈ సూపుని తీసుకోడం ఆచారంగా భావిస్తారు. అలాగే చైనా కొత్తసంవత్సర వేడుకల్లో గుమ్మడితో చేసిన స్వీటు ఆరగిస్తారు. చైనా, తైవాన్‌ ప్రజలు చంద్రోత్సవ వేడుకసమయంలో 'మూన్‌ కేక'గా దీనిని తీసుకోవడం వారి ఆనవాయితీ,
ఇక భారతదేశంలో దీనికున్న ప్రాముఖ్యం చెప్పనలవి కాదు. ఇది మేధస్సును పెంచడంలో మహత్తర దివౌషధంగా ఉపయోగపడుతుంది. గుమ్మడికాయని చెట్టు నుంచి కోసిన తరువాత కూడా 12 నెలలపాటు నిలవవుండే శక్తి ఉందంటే నమ్మసఖ్యంగా అనిపించదు. దీనిని రసంగా ప్రతిరోజూ సేవిస్తూ వుంటే, జ్ఞాపకశక్తిని అమితంగా అభివృద్ధిచేస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు.

ఆధ్యాత్మిక పరంగా కూడా దీనిని యజ్ఞ యాగాదుల్లో, నూతన గృహారంభంలో, శుభకార్యాల్లో విరివిగా వినియోగిస్తారన్న విషయం మనందరికీ విధితమే. జంతుబలికి బదులుగా దీనిని పశుపుకుంకు మలతో పూజించి బలిదానం ఇవ్వడం కూడా ఆచారంగా వుంది. దీనిని ఏఏ ప్రాంతా ల్లో ఏ పేర్లతో వ్యవహరిస్తారో తెలుసు కుందాం. ముందుగా దీనిని సంస్కృతంలో కూష్మాంఢం అంటారు. తెలుగులో గుమ్మడికాయ అని, తమిళంలో నీర్‌పూసనికారు అని, మళయాళంలో కుంబలంగా అని, హిందీలో పేటా అని, మరాఠీలో కోు్‌ాటా అని, బెంగాలీ, అస్సాంలో కొమర అని, బర్మాలో క్యూకఫాే ఎన్‌థీ అని, ఇంగ్లీషులో యాష్‌ గార్డ్‌ అని, చైనాలో వింటర్‌ మిలాన్‌, డొంగ్‌వా అని, జపాన్‌లో టూగన్‌ అని, ఇండోనేషియాలో బెలిగో, కుందుర్‌ అని, సింహళంలో పుహుల్‌ అని, ఫ్రెంచ్‌లో కర్జీ సిరస్‌ అని, ఉర్దూలో పేట అని వ్యవహరిస్తారు.

ఇక దీని ఆయుర్వేద వైద్యశాస్త్ర పరంగా అనేక విధాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల మంచి ఔషధం అని చెప్పవచ్చు. అల్సర్‌లని నివారిస్తుంది. ప్రతినిత్యం గుమ్మడికాయరసాన్ని సేవిస్తూవుంటే కడుపులో అల్సర్‌ని పూర్తిగా నివారిస్తుందని ఆయుర్వేద వైద్యులు 
చెప్తున్నా రు. శరీరంలో సూక్ష్మక్రిము ల్ని సంహరించి మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. దీనిని కొబ్బరిపాలతో కలిపి సేవిస్తే మరింత శక్తిని అందిస్తుంది. ఉదరసంబంధిత వ్యాధుల్ని అరికడుతుంది. అంతేకాక బూడిదగుమ్మడి రసం, నిమ్మరసంతో కలిపి సేవిస్తే రక్తశుద్ధిని కలిగించడమేకాక, ఊపిరితిత్తుల్లోను, మూత్ర విసర్జనలోను, రక్తశ్రావాన్ని అరికడుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడేవారు గుమ్మడికాయ రసం తీసుకుంటే, ఎంతో ఉపశమనాన్నిస్తుంది. ఆయుర్వేద పరంగా దీనిని ఎపిలెప్సీ, ఆస్మా, ఊపిరి తిత్తుల వ్యాధికి, అనేక వాతాల నివారణకి, పాము కాటుకి విరివిగా వినియోగిస్తారు. ప్రతినిత్యం గుమ్మడి రసాన్ని పుక్కిట పట్టి కొంత సేపు ఉంచితే పంటి ఇగుళ్ళ నుంచి వచ్చే రక్తశ్రావాన్ని అరికట్టడమే కాకుండా పళ్ళు మంచి ఆరోగ్యవంతంగా చేస్తుంది. శరీరంలోని ముఖ్యమైన కఫ, పిత్త, వాత దోషాల్ని నివారిస్తుంది. గుమ్మడికాయ గుజ్జు కాలిన శరీరానికి, చర్మవాధులకీ పైపూతగా రాస్తే తక్షణ నివారణ అవుతుంది. గుమ్మడి ఆకుల రసం పొడిచర్మం వల్ల వచ్చే చికాకుల్ని పైపూతగా రాస్తే, నివారిస్తుంది. గుమ్మడి గింజలు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో వయోభేదంలేకుండా ఇది అందరికీ ఎంతగానో అవెూఘ ఔషధంగా ఉపయోగపడుతుంది. పిల్లలకి చిన్నతనం నుండి గుమ్మడి రసాన్ని తాగిస్తూవుంటే వారు అత్యంత మేధావులుగా మారే అవకాశంవుంది. కిడ్నీలో రాళ్ళు కరిగించి ఉపశమింపజేయడంలో గుమ్మడికాయ గుజ్జుగాని, రసంగాని ఎంతో తోడ్పడతాయి. దేహ ధారుఢ్యాన్ని పెంచడంలోను, మంచి శక్తిని ప్రసాదించడంలోను గుమ్మడికాయకి సాటి మరొకటి లేదనే అనాలి.